
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. సినిమాల కంటే డేటింగ్ వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ ప్రేమపక్షలు పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తలపై అర్జున్ కపూర్ ఆసక్తికర రీతిలో స్పందించారు.
పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్‌గా వచ్చిన అర్జున్ కపూర్ మలైకాతో ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించాడు. 'నేను మలైకాను ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేను. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక అలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరీర్ మీద దృష్టిపెట్టాలని అనుకుంటున్నా.
నా పని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే నా భాగస్వామిని సంతోషపెట్టగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేవు' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment