ప్రియా జోరు.. మాములుగా లేదుగా! | Interesting Facts About Priya Banerjee | Sakshi
Sakshi News home page

ప్రియా జోరు.. మాములుగా లేదుగా!

Published Sun, Nov 21 2021 9:29 AM | Last Updated on Sun, Nov 21 2021 3:04 PM

Interesting Facts About Priya Banerjee - Sakshi

వివిధ రంగాల్లో స్థిరపడాలనుకున్న ఎంతోమంది సినిమా రంగంలో రాణించడం కామన్‌. అనుకోకుండా వచ్చిన అవకాశం, వారిని స్టార్స్‌గానూ మారుస్తోంది. అలాంటి వారిలో ఒకరే.. డాన్సర్‌ కావాలనుకొని యాక్ట్రెస్‌గా.. వెబ్‌స్టార్‌గా ఎదిగిన ప్రియా బెనర్జీ.. 

కెనడాలో పుట్టిన బెంగాలీ అమ్మాయి ప్రియా.

► ఆమె తండ్రి.. సింగర్‌ కావాలనే తన కలను కూతురి ద్వారా నిజం చేసుకోవాలనుకున్నాడు. ఆరేళ్ల వయసు నుంచే ప్రియకు సంగీతం, నాట్యంలో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు.

► తండ్రి కోరిక మేరకు సింగర్‌ కాకపోయినా.. డాన్సర్‌గా స్థిరపడాలనుకుంది ప్రియ. అయితే, 2011లో ‘మిస్‌ వరల్డ్‌ కెనడా’ అందాల పోటీల్లో పాల్గొనడం, ‘మిస్‌ ఫొటోజెనిక్‌’ టైటిల్‌ గెలుచుకోవడం, వెంటనే ఓ యాడ్‌ షూట్‌లో నటించే అవకాశం రావడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోవడంతో డాన్సర్‌ కంటే ముందు యాక్ట్రెస్‌ అయింది. 

►  2013లో ‘కిస్‌’ సినిమాతో తెలుగు వెండితెరపై మొదటిసారి మెరిసి, వెంటనే ‘జోరు’, ‘అసుర’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టినా.. తను మాత్రం బాలీవుడ్‌లో నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. 

► 2015లో ‘జజ్బా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, వరుస చాన్స్‌లతో  బిజీ అయిపోయింది.  

►  ఇదే జోరు.. వెబ్‌ ప్రపంచంలోనూ చూపించింది . 2017లో ‘సోషల్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో పాపులర్‌ అయి, ‘రెయిన్‌’, ‘లవ్‌ బైట్స్‌’, ‘బేకాబూ–2’లతో దూసుకుపోయింది.  

  ►  ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘లెవన్త్‌ అవర్‌’తో ప్రేక్షకులను అలరిస్తోంది. 

సోల్‌ లేని కథలో లీడ్‌ రోల్‌ చేయడం కంటే, ఖాళీగా కుర్చోవడం మంచిది. నా దృష్టిలో కథ, కథనం అనేవి చాలా ముఖ్యం. అవి నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తా.
– ప్రియా బెనర్జీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement