Prateik Babbar
-
'ఆ హీరోయిన్‌తో బ్రేకప్ తర్వాత కనుమరుగైపోయాను'
Amy Jackson: 'ఏక్ దీవానా తా' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ప్రతీక్ బాబర్. ఇందులో 'రోబో'[ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్గా నటించింది. ఆన్‌స్క్రీన్ మీద ఈ జంటను చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు, 2012లో డేటింగ్ మొదలుపెట్టారు. కానీ వీరి ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రతీక్ బాబర్ మాట్లాడుతూ.. అమీ జాక్సన్‌తో బ్రేకప్ తర్వాత తన జీవితంలో బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని పేర్కొన్నాడు. 25 ఏళ్ల వయసులో లవ్ ఫెయిల్యూర్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయానన్నాడు. ఆ తర్వాత కనుమరుగైపోయానని తెలిపాడు. కాగా అతడు ఓ ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం 'బచ్చన్ పాండే' మార్చి 18న విడుదలవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి ప్రతీక్ మాట్లాడుతూ.. టీనేజీలో ఉన్నప్పుడు అక్షయ్, అర్షద్ వార్సి తన ఫేవరెట్ హీరోలని చెప్పుకొచ్చాడు. చదవండి: జనం పిచ్చోళ్లు కాదు నిన్ను నమ్మడానికి.. హీరోయిన్‌పై ట్రోలింగ్ -
వారి పెళ్లి పెటాకులేనా?!
గతేడాది జనవరిలో వైవాహిక బంధంతో ఒక్కటైన బాలీవుడ్ నిర్మాత సన్యా సాగర్, నటుడు ప్రతీక్ బబ్బర్లు విడిపోయారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సన్యా సాగర్ మూవీ కార్యక్రమాలకు భర్త ప్రతీక్‌ను ఆహ్వానించకపోవడం ఒకటైతే, ప్రతీక్ కుటుంబంలో జరిగే వేడుకలకు సన్యాను పిలువక పోవడం ఈ రూమర్లకు మరింత బలంగా చేకూరుస్తోంది. దాంతో వీరిద్దరూ విడిపోయారంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరొకవైపు వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినోకరూ ఫాలో కాకపోవడం, అలాగే వారిద్దరికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా నుంచి తొలగించడం చూస్తుంటే వస్తున్న వార్తల్లో నిజం ఉండొచ్చని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ వార్తలను భర్త ప్రతీక్ ఖండించాడు. తామిద్దరం బాగానే ఉన్నామని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు. (అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి) కాగా, గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న ఈ జంట గతేడాది లక్నోలో వివాహం చేసుకున్నారు. ప్రతీక్ తల్లీ మహరాష్ట్రీయన్ కావడంతో మరాఠి సంప్రదాయంలోనే వీరి పెళ్లిని ఘనంగా జరుపుకున్నారు. ప్రతీక్ ఇటీవల విడుదలై సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘దర్భార్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ గుప్తా రాబోయే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 19న విడుదల కానున్నట్లు సమాచారం. -
‘విజయగర్వం నా తలకెక్కింది’
తన చివరి శ్వాసదాకా నటిస్తూనే ఉంటానని ‘జానే తూ యా జానే నా’ ఫేం ప్రతీక్ బబ్బర్ పేర్కొన్నాడు. 2008లో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ స్టార్ కిడ్..ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న.. ‘దర్బార్’ సినిమాలో విలన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. ఈ విషయం గురించి ప్రతీక్ మాట్లాడుతూ..‘ గొప్ప దర్శకులతో పని చేయడం, మంచి క్యారెక్టర్లు దక్కించుకోవడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. బయట ఎంతో మంది వ్యక్తులు ఇటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉంటేనే అవకాశాలు దక్కుతాయి’ అని పేర్కొన్నాడు. తన కెరీర్ తొలినాళ్ల గురించి గుర్తు చేసుకుంటూ.. ‘ 19 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పుడు అసలు నటన అంటే ఏంటో తెలియదు. సెట్స్‌కి వెళ్లినపుడు ఒక పెయిడ్ హాలీడేలా అనిపించేది. నటిస్తే పాకెట్ మనీ వస్తుంది... దాంతో స్నేహితులతో సరదాగా గడుపవచ్చని అనుకునేవాడిని తప్ప నటనను సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చిన్నతనంలో సెలబ్రిటీ కావడంతో గర్వం నా తలకెక్కింది. కానీ ఇప్పుడు నటనే నా ప్రాణంగా మారింది. సక్సెస్‌కు ఉన్న విలువ తెలిసింది. ఇన్నాళ్ల ప్రయాణంలో వ్యక్తిగా కూడా ఎంతో పరిణతి చెందాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది తన స్నేహితురాలు సన్యా సాగర్‌తో ప్రతీక్ పెళ్లి జరిగింది. లక్నోలో మరాఠీ- హిందూ సంప్రదాయ పద్ధతుల్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. -
దర్బార్ విలన్
‘దర్బార్’లో రజనీకాంత్‌కు విలన్ పాత్రలో సవాల్ విసరడానికి సిద్ధం అవుతున్నారు బాలీవుడ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో నటించడం గురించి ప్రతీక్ మాట్లాడుతూ – ‘‘రజనీసార్ లాంటి లెజెండ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాను. ఈ చాన్స్‌ని వినియోగించుకోవడం కోసం 200 శాతం కష్టపడతాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు జీవితంలో ఎప్పుడూ రావు’’ అన్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ కొడుకు పాత్రలో ప్రతీక్ కనిపిస్తారట. -
‘ఛీ.. పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారుతారా?!’
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇంతటి నీచానికి దిగజారుతావా అంటూ మండిపడుతున్నారు. భార్యతో కలిసి ఉన్న అభ్యంతరకర ఫొటోను ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ విషయమేమిటంటే... వాలైంటెన్స్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ప్రతీక్, తన భార్య సన్యా సాగర్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారిద్దరు టాప్‌లెస్‌గా ఉండటాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ‘ఛీ.. పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారుతావా.. ఇలాంటి అభ్యంతరకర ఫొటో ఎందుకు పెట్టావు.. వెంటనే దానిని తొలగించు’ అంటూ ట్రోల్ చేశారు. దీంతో ప్రతీక్ ఈ ఫొటోను డెలీట్ చేశాడు. కాగా ప్రతీక్- సన్యా సాగర్ గత నెలలో పెళ్లి చేసుకున్నారు. లక్నోలో మరాఠీ- హిందూ సంప్రదాయ పద్ధతుల్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. -
ర్యాష్ డ్రైవింగ్; నటుడిపై కేసు నమోదు
పనాజి : భాగీ 2, దోభీ ఘాట్, జానే తు యా జానే నా సినిమాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌పై గోవాలో కేసు నమోదైంది. ర్యాష్‌గా డ్రైవ్ చేసి యువకుడిని గాయపరిచినందుకు ప్రతీక్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఉత్తర పనాజిలోని పోర్వోరిమ్ పట్టణంలో బస చేసిన ప్రతీక్ బుధవారం రాత్రి తన కారుతో యువకుడిని ఢీకొట్టాడు. అంతేకాకుండా కారుకు అడ్డం వచ్చావంటూ గొడవ పడుతూ అతడిని కొట్టాడు. ఈ ఘటనలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడి ఫిర్యాదు మేరకు మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా ఆ యువకుడు కావాలనే తన కారుకు అడ్డు వచ్చాడని, అంతేకాకుండా కారు అద్దాలు కూడా పగులగొట్టాడని ప్రతీక్ కూడా అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రతీక్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
13 ఏళ్ల వయసులోనే డ్రగ్స్ తీసుకున్నా : యంగ్ హీరో
ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న ప్రదానాంశం డ్రగ్స్. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ విషయంలో విచారణను ఎదుర్కొనగా మరికొంత మందికి ఈ విషయంలో ప్రమేయం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటుడు డ్రగ్స్ వినియోగం పై స్పందించాడు. లెజెండరీ యాక్టర్స్ రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ ల కుమారుడు ప్రతీక్ బబ్బర్ ఏక్ దివానా థా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతీక్ ' రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ లాంటి లెజెండ్ కడుపున పుట్టానే గాని, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందరికీ నేను ప్రతీక్ బబ్బర్లాగే తెలుసు. కానీ నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను. కానీ ఇప్పుడు మనిషిగా వాటన్నింటినీ జయించాను. డ్రగ్స్ జీవితం ఎలా నాశనమవుతుంది? వాటి నుంచి ఎలా బయటపడాలి? అన్న విషయాలు మీతో పంచుకుంటున్నా... 13 ఏళ్ల వయసులో ఏదో తెలియని బాధతో ఇబ్బంది పడేవాడిని. సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు వేదించేవి. దీంతో నా మనసు డ్రగ్స్‌వైపు మళ్లింది. ఎలాంటి డ్రగ్ అయినా ఆలోచించకుండా వాడేవాడిని. ఒక దశలో పూర్తిగా డ్రగ్ ఎడిక్ట్ గా మారిపోయా. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను వేలెత్తి చూపుతారిని భయపడేవాడిని, నన్ను నేను కూడా చూసుకునేందుకు భయపడేవాడిని. మానేయాలన్న ఆలోచన వచ్చినా.. నా వల్ల అయ్యేది కాదు. చివరకు డాక్టర్లు నా సమస్యకు పరిష్కారం చూపించారు. జీవితం నాశనం చేసుకోవటం కన్నా.. కష్టపడి డ్రగ్స్ వాడకాన్ని మానేయటం కరెక్ట్' అంటూ తన అనుభవాలను అభిమానులకు వివరించాడు ప్రతీక్ బబ్బర్. -
'స్మితాపాటిల్ అద్భుతమైన వ్యక్తి'
'ఆమె ఎవరో నాకు తెలియదు. ఎలా ఉంటుందో కూడా ఊహించలేను. ఆమె గురించి ఇతరులు అందించిన సమాచారం ద్వారానే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి. గొప్ప విశాల హృదయం ఉన్న వ్యక్తి అని కూడా తెలుసుకున్నాను' అని ఓ తనయుడు గుండెల్లోంచి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఇటీవల బాలీవుడ్ తెరకు పరిచయమైన రాజ్ బబ్బర్ కుమారుడు ప్రతీక్ బబ్బర్. ఇక ప్రతీక్ బబ్బర్ మాట్లాడింది... ఎంతోమంది అభిమానులను చూరగొన్న స్మితాపాటిల్ గురించి అని అర్ధమై ఉంటుంది. అమ్మను నేను ఎంతగా ఇష్టపడతాననే విషయం ఇక్కడకు రావడం వల్లనే అర్థమవుతోంది. గతంలో ఇక్కడికి వచ్చి ఎంతో మంది పిల్లల్ని ఇక్కడ కలుసుకునేదని తెలిసింది. నేను కూడా ఓ మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను అని ప్రతీక్ బబ్బర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తాను, ఇతరులు కూడా సంతోష పడతారన్నారు. జీవితంలో స్పూర్తి పొందాలనుకునే ప్రతిసారీ తాను స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ లనే అనుసరిస్తానని ప్రతీక్ తెలిపారు. స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ కుమారుడినని చెప్పుకొవడం తనకు గొప్పగా ఉంటుందని, తన జీవితానికి తల్లితండ్రులే సూర్తి అని అన్నారు. తన తల్లి తండ్రులకు మరింత పేరు తెచ్చేలా నటిస్తానని ప్రతీక్ తెలిపారు. దోభీ ఘాట్, అరక్షన్, మై ఫ్రెండ్ పింటూ చిత్రాల్లో ప్రతీక్ బబ్బర్ నటించాడు. భారత చిత్ర పరిశ్రమ అందించిన కళాకారుల్లో బాలీవుడ్ నటి స్మితాపాటిల్ ఓ అరుదైన ఆణిముత్యం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం స్మితాపాటిల్ 58వ జన్మదిన కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ఘనంగా నిర్వహించింది. 'భూమిక', 'అర్థ్' లాంటి చిత్రాలతో అభిమానుల హృదయాలను దోచుకున్న స్మితాపాటిల్ తన 31 ఏట ప్రసూతి సమయంలో తలెత్తిన సమస్యతో 1986 లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.