పనాజి : భాగీ 2, దోభీ ఘాట్, జానే తు యా జానే నా సినిమాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌పై గోవాలో కేసు నమోదైంది. ర్యాష్‌గా డ్రైవ్ చేసి యువకుడిని గాయపరిచినందుకు ప్రతీక్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఉత్తర పనాజిలోని పోర్వోరిమ్ పట్టణంలో బస చేసిన ప్రతీక్ బుధవారం రాత్రి తన కారుతో యువకుడిని ఢీకొట్టాడు. అంతేకాకుండా కారుకు అడ్డం వచ్చావంటూ గొడవ పడుతూ అతడిని కొట్టాడు. ఈ ఘటనలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడి ఫిర్యాదు మేరకు మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
కాగా ఆ యువకుడు కావాలనే తన కారుకు అడ్డు వచ్చాడని, అంతేకాకుండా కారు అద్దాలు కూడా పగులగొట్టాడని ప్రతీక్ కూడా అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రతీక్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment