Prateik Babbar About Break Up with Amy Jackson: I Was In Depression - Sakshi
Sakshi News home page

Prateik Babbar: రోబో బ్యూటీతో బ్రేకప్‌ తర్వాత నాకు బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయింది

Published Wed, Mar 16 2022 2:33 PM | Last Updated on Wed, Mar 16 2022 5:00 PM

Prateik Babbar About Break Up with Amy Jackson: I Was In Depression - Sakshi

Amy Jackson: 'ఏక్‌ దీవానా తా' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ప్రతీక్‌ బాబర్‌. ఇందులో 'రోబో'[ బ్యూటీ అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించింది. ఆన్‌స్క్రీన్‌ మీద ఈ జంటను చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు, 2012లో డేటింగ్‌ మొదలుపెట్టారు. కానీ వీరి ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రతీక్‌ బాబర్‌ మాట్లాడుతూ.. అమీ జాక్సన్‌తో బ్రేకప్‌ తర్వాత తన జీవితంలో బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయిందని పేర్కొన్నాడు.  25 ఏళ్ల వయసులో లవ్‌ ఫెయిల్యూర్‌ కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానన్నాడు. ఆ తర్వాత కనుమరుగైపోయానని తెలిపాడు. కాగా అతడు ఓ ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం 'బచ్చన్‌ పాండే' మార్చి 18న విడుదలవుతోంది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఈ  సినిమా గురించి ప్రతీక్‌ మాట్లాడుతూ.. టీనేజీలో ఉన్నప్పుడు అక్షయ్‌, అర్షద్‌ వార్సి తన ఫేవరెట్‌ హీరోలని చెప్పుకొచ్చాడు.

చదవండి: జనం పిచ్చోళ్లు కాదు నిన్ను నమ్మడానికి.. హీరోయిన్‌పై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement