'స్మితాపాటిల్ అద్భుతమైన వ్యక్తి'
'స్మితాపాటిల్ అద్భుతమైన వ్యక్తి'
Published Fri, Oct 18 2013 3:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
'ఆమె ఎవరో నాకు తెలియదు. ఎలా ఉంటుందో కూడా ఊహించలేను. ఆమె గురించి ఇతరులు అందించిన సమాచారం ద్వారానే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి. గొప్ప విశాల హృదయం ఉన్న వ్యక్తి అని కూడా తెలుసుకున్నాను' అని ఓ తనయుడు గుండెల్లోంచి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఇటీవల బాలీవుడ్ తెరకు పరిచయమైన రాజ్ బబ్బర్ కుమారుడు ప్రతీక్ బబ్బర్. ఇక ప్రతీక్ బబ్బర్ మాట్లాడింది... ఎంతోమంది అభిమానులను చూరగొన్న స్మితాపాటిల్ గురించి అని అర్ధమై ఉంటుంది.
అమ్మను నేను ఎంతగా ఇష్టపడతాననే విషయం ఇక్కడకు రావడం వల్లనే అర్థమవుతోంది. గతంలో ఇక్కడికి వచ్చి ఎంతో మంది పిల్లల్ని ఇక్కడ కలుసుకునేదని తెలిసింది. నేను కూడా ఓ మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను అని ప్రతీక్ బబ్బర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తాను, ఇతరులు కూడా సంతోష పడతారన్నారు. జీవితంలో స్పూర్తి పొందాలనుకునే ప్రతిసారీ తాను స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ లనే అనుసరిస్తానని ప్రతీక్ తెలిపారు.
స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ కుమారుడినని చెప్పుకొవడం తనకు గొప్పగా ఉంటుందని, తన జీవితానికి తల్లితండ్రులే సూర్తి అని అన్నారు. తన తల్లి తండ్రులకు మరింత పేరు తెచ్చేలా నటిస్తానని ప్రతీక్ తెలిపారు. దోభీ ఘాట్, అరక్షన్, మై ఫ్రెండ్ పింటూ చిత్రాల్లో ప్రతీక్ బబ్బర్ నటించాడు.
భారత చిత్ర పరిశ్రమ అందించిన కళాకారుల్లో బాలీవుడ్ నటి స్మితాపాటిల్ ఓ అరుదైన ఆణిముత్యం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం స్మితాపాటిల్ 58వ జన్మదిన కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ఘనంగా నిర్వహించింది. 'భూమిక', 'అర్థ్' లాంటి చిత్రాలతో అభిమానుల హృదయాలను దోచుకున్న స్మితాపాటిల్ తన 31 ఏట ప్రసూతి సమయంలో తలెత్తిన సమస్యతో 1986 లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement