Smita Patil
-
గుండెలపై ఆమె పేరు టాటూ వేయించుకున్న నటుడు
ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. ఎంత ఎదిగినా, ఎన్ని సాధించినా, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మ ముందు మాత్రం చంటిపిల్లల్లా మారిపోతుంటారు అందరూ. మన జీవితం కోసం తన జీవితాన్ని ధారపోసే అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, కేవలం ఆ మాతృమూర్తిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం తప్ప. అయితే బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ తన తల్లిని గుండెల మీద శాశ్వతంగా ఉండేలా చూసుకున్నాడు. తన తల్లి, దివంగత నటి స్మిత పాటిల్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇతడికి తన తల్లి చేత గోరుముద్దలు తినే భాగ్యం కూడా కలగలేదు. 31 ఏళ్ల వయసులో ప్రతీక్‌కు జన్మనిచ్చిన రెండు వారాలకే ఆమె కన్నుమూసింది. తల్లి ప్రేమకు నోచుకోలేని అతడు ఇప్పటికీ అమ్మ కోసం పరితపిస్తూనే ఉంటాడు. అందుకే ఆమె పేరును శాశ్వతంగా తన ఎదరపై ఉండేలా టాటూ వేయించుకున్నాడు. View this post on Instagram A post shared by prateik babbar (@_prat) స్మిత పేరు కింద ఆమె పుట్టిన సంవత్సరం వేయించుకున్న అతడు మరణ సంవత్సరాన్ని మాత్రం రాయించుకోలేదు. దానికి బదులుగా ఆమె ఇంకా తనతోనే ఉందన్నట్లుగా అనంతం అన్న పదాన్ని సూచించే గుర్తు వేసుకున్నాడు. అతడు చేసిన పనికి అభిమానులు, స్నేహితులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా ఇమ్రాన్ హష్మీ, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రల్లో నటించిన ముంబై సాగాలోని ఓ పాత్రలో ప్రతీక్ బాబర్ కనిపించాడు. జానే తు యా జానేనా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు. చదవండి: సోనూసూద్ ఔదార్యం.. పసిబిడ్డకు ప్రాణం పోశాడు! ఎనిమిదోసారి మిస్.. లైట్ తీస్కో భయ్యా..! -
రాజ్ జీవితంలో స్మిత ఓ కల
నదీరా జహీర్... కొన్ని హిందీ సినిమాల్లో కనిపించినా థియేటర్తోనే ఆమెకు ఎక్కువ అనుబంధం. నదీరాకు రాజ్‌తో పరిచయం అయిందీ ఆ వేదిక మీదే. ఈ ఇద్దరూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విద్యార్థులు. నదీరా గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే ఆమె అతనికన్నా నాలుగేళ్లు సీనియర్. నదీరా నాటకాలు రాసి, దర్శకత్వం వహించే నాటికి రాజ్ బబ్బర్ గుర్తింపు కోసం తాపత్రయం పడ్తున్నాడు. అప్పుడే రాజ్ లీడ్‌రోల్‌గా ఓ నాటకాన్ని రచించి దర్శకత్వం వహించింది నదీరా. ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి సందర్భమూ అదే అయింది. నదీరాలోని స్నేహ స్వభావం, నిర్మొహమాటత్వం రాజ్‌ను ఆమెకు దగ్గర చేస్తే రాజ్‌లోని పట్టుదల నదీరా అతణ్ణి ఇష్టపడేలా చేసింది. ఆ ప్రేమ ఆ ఇద్దరినీ పెళ్లితో ఒక్కటి చేసింది. వాళ్ల బసను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా క్యాంపస్ నుంచి ఢిల్లీలోని నదీరా వాళ్ల తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు చేర్చింది. ఆమె తల్లిగారింట్లో ఒక గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారిద్దరూ. ముంబై ఏడాది దాటేసరికి(జుహీ బబ్బర్‌కు) తల్లిదండ్రులయ్యారు. రాజ్ బబ్బర్ యాక్టింగ్ కెరీరే ముందుకు సాగలేదు. ఆర్థిక ఇబ్బందులూ తొలగలేదు. ఆ సమయంలో నదీరా సహనం, సంయమనమే రాజ్‌లో ధైర్యాన్ని పెంచింది. సినిమాల్లో రాణించాలనే కలను వీడకుండా చేసింది. తన స్కూటర్ అమ్మేసి.. వచ్చిన ఆరువేల రూపాయలను నదీరా చేతిలో పెట్టి ముంబై చేరుకున్నాడు రాజ్. అక్కడతను అవకాశాల కోసం చాలానే పోరాడాల్సి వచ్చింది. కుటుంబ భారాన్ని భర్త మీద వేయకుండా థియేటర్ పనితో ఆ బాధ్యతను తీసుకుంది నదీరా. నాలుగేళ్లు గడిచాయి. బాలీవుడ్లో బ్రేక్ సాధించాడు రాజ్. ‘కూతురిని తీసుకొని ముంబై వచ్చేయ్’ అని నదీరాకు చెప్పాడు. వెళ్లింది. తర్వాత యేడాదికి ఆ జంట కొడుకు (ఆర్య బబ్బర్)ను కన్నది. ఏక్జుట్ ఒక్కసారికే ఇరవై నాలుగు సినిమాలను సైన్ చేసేంత స్టార్ అయిపోయాడు రాజ్ బబ్బర్. నదీరా కూడా పని కల్పించుకుంది ‘ఏక్జుట్’ అనే థియేటర్ గ్రూప్ పెట్టి. ఆ బిజీ షెడ్యూల్లోనే రాజ్‌ను ఆకర్షించి.. అతని మదిని ఆక్రమించింది స్మితా పాటిల్. ఆ ప్రేమ సహజీవనమూ మొదలుపెట్టింది. ఆ కబుర్లను మీడియా మోస్తున్నా భర్త మీదున్న నమ్మకంతో వాటిని వదంతులుగానే వదిలేసింది నదీరా. కాని స్మిత, రాజ్‌ల పెళ్లి వార్తతో మాత్రం షాక్ అయింది, షేక్ అయింది నదీరా. లేమి కూడా తెప్పించని కన్నీళ్లని ఆ కలత తెప్పించింది. భర్తను నిలదీసింది. ‘నిజమే’ అని ఒప్పుకున్నాడు రాజ్. మౌనంగా పక్కకు తప్పుకుంది నదీరా. ఆ ఇంట్లోంచి, ఆ కుటుంబంలోంచి వెళ్లిపోయాడు రాజ్ బబ్బర్. హోమ్ బ్రేకర్.. డోర్‌మ్యాట్ ‘అమ్మా..’ అంటూ రెండూ కాళ్లను పట్టేసుకున్న ఆ పిల్లలే ఆమె నవ్వులయ్యారు. వాళ్ల సహాయంతోనే మనసులోని శూన్యాన్ని పూరించుకుంది. వాళ్ల కోసం నిలబడింది. రాజ్ బబ్బర్‌ను పెళ్లి చేసుకున్నందువల్ల కాపురం కూల్చేసిన స్త్రీగా స్మితను ఎలా ముద్రేశారో.. కాపురం నిలబెట్టుకోలేని బలహీనురాలిగా నదీరానూ చూశారు. ‘ఆ టైమ్‌లో ఆ కామెంట్లను తట్టుకోవడానికి నాకు ఊరటగా, ఓదార్పుగా పిల్లలైనా ఉన్నారు. స్మితకు అదీ లేకుండింది’ అని చెప్పింది నదీరా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. నదీరా అన్నట్టుగా స్మితకు ఆ ఊరట దొరొకలేదు. ప్రాణంలా ఆమెను రాజ్ ప్రేమించనైతే ప్రేమించాడు కాని ఓదార్పు కాలేకపోయాడు. దాంతో స్మితను అభద్రత చుట్టముట్టేసింది. ఆ ప్రభావం తమ దాంపత్యం మీద పడకుండా చూసుకోవడం స్మితకు పెద్ద సవాలుగా మారింది. అందుకే ఓ బిడ్డను కని ఆ బంధాన్ని భద్రం చేసుకోవాలనుకుంది. బిడ్డను భర్తకు అందించి శాశ్వతంగా సెలవు తీసుంది. రాజ్ జీవితంలో స్మిత ఓ కలగా మిగిలిపోయింది. మళ్లీ చెంతకు.. రెండు వారాల పసిగుడ్డు ప్రతీక్‌ను స్మిత తల్లిదండ్రుల ఒళ్లో పెట్టి మళ్లీ నదీరా ఇంటి తలుపు తట్టాడు రాజ్ బబ్బర్. ఆహ్వానించింది నదీరా. ఆ చర్యే అందరినీ నిర్ఘాంతపరిచింది. ఇటు సంప్రదాయవాదులను, అటు స్త్రీవాదులనూ. నదీరా మీద విమర్శల వర్షం మళ్లీ మొదలైంది. ‘స్మిత మరణంతో ఒంటరైన రాజ్‌ను నేను యాక్సెప్ట్ చేస్తానని ఎవరూ ఊహించలేదు. ఫెమినిస్ట్‌లు నన్ను డోర్‌మ్యాట్ అన్నారు. ఆయనలా చేశాడని నేనూ అలాగే చేసి ఉంటే వాళ్లంతా నన్ను పొగిడేవాళ్లు. ఈ దశాబ్దపు మహిళ అంటూ నా మెడలో బంగారు పతకం వేసేవారేమో! కాని ఆ పొగడ్తలు, ఆ గోల్డ్‌మెడల్స్ నా సమస్యలను తీరుస్తాయా? పిల్లల మనసుకు అయిన గాయాలను మాన్పిస్తాయా? ఉన్నవాటిల్లో ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకున్నాను’ అంటూ స్పందించింది నదీరా. రాజ్ బబ్బర్ నటించిన ‘ప్రేమ్ గీత్’ సినిమాలో జగ్జీత్ సింగ్ ఆలపించిన గజల్ ఉంటుంది ‘హోఠోంసే ఛూలో తుమ్ .. మేరా గీత్ అమర్ కర్ దో’ అని. ఇందులో చివరగా ‘తుమ్ హార్ కే దిల్ అప్నా మేరీ జీత్ అమర్ కర్ దో.. ’ అని వస్తుంది. నదీరా చేసింది అదే.. ప్రేమించిన రాజ్ బబ్బర్ కోసం.. తన మనసును ఓడించి.. అతణ్ణి గెలిపించింది. ∙ఎస్సార్ ∙మొహబ్బతే -
ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా
భూమిక ‘అర్థ్’ (1982) తన జిందగీకి ప్రేరణే అంటాడు దర్శకుడు మహేశ్ భట్ (ఆ సినిమాకూ అతనే దర్శకుడు). కాని ఈ సినిమా స్మితాపాటిల్ జీవితం కూడా. అందులో ఆమెది పెళ్లయిన సినిమా దర్శకుడిని ప్రేమించే హీరోయిన్ భూమిక. తన లైఫ్‌ను పోలిన పాత్ర. అయితే ఆమె భర్త రాజ్‌బబ్బర్ మాత్రం దర్శకుడు కాదు కథానాయకుడు. స్మిత పాటిల్‌తో రాజ్‌తో ప్రేమలో పడేనాటికి అతను ఇద్దరు పిల్లల తండ్రి. ఈ జంట ప్రేమకథే నేటి మొహబ్బతేకి అంశం. కాని దీన్ని ముక్కోణంలో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్‌బబ్బర్ మొదటి భార్య నదీరా కూడా నటే. ఆ ఇద్దరిదీ ప్రేమ వివాహమే. కమర్షియల్ హిందీ సినిమాతోపాటు పారలెల్ సినిమాతో పరిచయం ఉన్న ప్రేక్షకులకు రాజ్‌బబ్బర్, స్మితా పాటిల్‌లు తెలిసే ఉంటారు. థియేటర్ అభిమానులకు నదీరా తెలియకపోయే ప్రసక్తే లేదు. ముందుగా స్మిత, రాజ్‌ల ప్రేమ ప్రయాణం.. గొడవతో మొదలైన స్నేహం.. రాజ్‌బబ్బర్, స్మితా పాటిల్ కలిసి నటించిన తొలి సినిమా ‘తజుర్బా’. అయితే ఒకరికొకరు అపరిచితులుగానే ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ ఇద్దరే కలిసి నటించిన తర్వాత చిత్రం ‘భీగీ పల్కే’. ఆ షూటింగ్లో ఒకరితో ఒకరికి పరిచయం అయింది. అది కూడా చిన్న గొడవతో. ‘ఆ సినిమా సెట్స్ మీద స్మితా పాటిల్ ఎవ్వరినీ లెక్కచేయనట్టుగా కొంచెం గర్వంగా కనిపించేది. ఆ ఆటిట్యూడ్‌కే ఆమెతో ప్రేమలో పడ్డా’ అని చెప్పాడు రాజ్‌బబ్బర్ ఓ ఇంటర్వ్యూలో. గొడవతో మొదలైన ఆ పరిచయం స్నేహంగా మారింది. భీగీ పల్కే షూటింగ్ పూర్తయ్యేలోపు వీళ్ల మధ్య ప్రేమా ఖరారైంది. మీడియాకు నిప్పందాలి కాని రాజేయడం ఎంతసేపు? అలా ఆ జంట ప్రేమను పేజీల్లో కాలమ్స్‌గా నింపేసుకుంది. అది రాజ్‌బబ్బర్ భార్య నదీరా కంటా పడింది. కాని భర్త మీదున్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. ‘స్మిత నా భర్తతో చాలా క్లోజ్‌గా ఉందన్న విషయం నాకు తెలుసు. ఆమె రాజ్ సాహచర్యాన్ని కోరుకుంటోందనీ అర్థమైంది. ఒకవేళ్ల అది అఫైరే అయినా నాకు, పిల్లలకు రాజ్ దూరమవడనే నమ్మకంతో ఉన్నా’ అని చెప్పింది నదీరా ఒక ఇంటర్వ్యూలో. హోమ్ బ్రేకర్ నదీరా అనుకున్నట్లు జరగలేదు. రాజ్ పట్ల ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. స్మితను విడిచి ఉండలేని స్థితికి వచ్చాడు రాజ్. స్మితా అంతే రాజ్‌కు జీవితభాగస్వామి కావాలనుకుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు రాజ్.. నదీరాకు విడాకులు ఇవ్వకుండానే. ఆ ఇంటిని విడిచి స్మితాతో వచ్చేశాడు. హతాశురాలైంది నదీరా. సామాజిక స్పృహ ఉన్న నటిగా, అలాంటి పాత్రలకు పెట్టింది పేరుగా ఉన్న స్మితా పాటిల్ మీద బాలీవుడ్ కుటుంబాలు ‘హోమ్ బ్రేకర్’ అనే ముద్రవేశాయి. ఆ రోజుల్లో ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద స్పందిస్తూ ‘కొన్ని విషయాలు అవతలివాళ్లకు అంత తేలికగా అర్థం కావు. అర్థం చేయించలేం కూడా. అందుకే సొసైటీ నన్నెట్లా చూస్తోంది.. ద్వేషిస్తోందా? శత్రువులా ట్రీట్ చేస్తోందా అని పట్టించుకోవట్లేదు’ అని చెప్పింది. విడాకులివ్వకుండా స్మితాపాటిల్ను పెళ్లి చేసుకోవడం పట్ల రాజ్‌బబ్బర్ కూడా స్పందించాడు... ‘స్మితాను ప్రేమించాను అంటే నదీరాతో నాకు స్పర్థలున్నాయని కాదు. ఇద్దరినీ ఇష్టపడ్డాను.. ఇద్దరినీ పెళ్లిచేసుకున్నాను. స్మిత పట్ల నాకున్న ఫీలింగ్స్‌ను నదీరా అర్థం చేసుకుంది. అది చాలు నాకు’ అని. అయితే.. ఆ ఇద్దరి దాంపత్య జీవితం ఊహించినంత సాఫీగా, సంతోషంగా సాగలేదు. బయట నుంచి పరుషమైన కామెంట్లను ఎన్ని ఎదుర్కొన్నా చిరునవ్వును చెదరనివ్వలేదు స్మితా. అభద్రత వెంటాడుతున్నా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఒక బిడ్డను కని రాజ్‌తో ఉన్న తన ప్రేమ బంధాన్ని మరింత భద్రం చేసుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే కొడుకును కన్నది కాని మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోయింది. అటు రాజ్బబ్బర్కూ కలకాలం తోడు కాలేకపోయింది. ప్రతీక్ పుట్టిన రెండు వారాలకు బ్రెయిన్ హ్యామరేజ్‌తో 31 ఏళ్లకే కన్ను మూసింది స్మతాపాటిల్. ఆ నిష్క్రమణ స్మిత తల్లిదండ్రులు, రాజ్బబ్బర్నే కాదు నదీరానూ షాక్ గురిచేసింది. ‘స్మిత మరణం జీర్ణించుకోలేని విషాదం. మా అందరన్నీ కుప్పకూల్చింది. ప్రతీక్‌తో పాటు తను కన్న కలలనూ వదిలేసి అర్ధంతరంగా వెళ్లిపోయింది. తను లేని లోటు పూడ్చలేనిది’ అని చెప్తుంది నదీరా. ‘తను లేని ఈ లోకంలో నేను జీవచ్ఛవాన్నే. పనిలో పడి ఆ వేదనను మరిచిపోయే ప్రయత్నం చేశా. మనసుకైన గాయాన్ని మాత్రం మాన్చుకోలేకపోయా’ అంటాడు రాజ్‌బబ్బర్. కాని గాయపడిన ఆ మనసుకు సాంత్వననిచ్చి.. మళ్లీ అండగా నిలబడింది నదీరానే. -ఎస్సార్ -
ఆమె స్పెషల్ లేడీ: మెగాస్టార్
ముంబై: అలనాటి బాలీవుడ్ నటి స్మితా పాటిల్ 'స్పెషల్ లేడీ' అంటూ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు. స్మితా 61వ జయంతి సందర్భంగా అమితాబ్ ఆమెను స్మరించుకున్నారు. స్మితాతో కలసి శక్తి, నమక్ హలల్ సినిమాల్లో నటించానని అమితాబ్ పేర్కొన్నారు. స్మితా స్పెషల్ లేడీ, వివేకవంతమైన స్నేహితురాలు.. అంటూ ట్వీట్ చేశారు. 1980ల్లో స్మితా అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. కేవలం దశాబ్దకాలం కెరీర్లో 80కి పైగా సినిమాల్లో నటించారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లో నటించారు. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు పద్మశ్రీ అందుకున్నారు. మంతన్, భూమిక, ఆక్రోశ్, చక్ర, చిదంబరం, మిర్చ్ మసాలా వంటి హిట్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రాజ్బబ్చర్ను వివాహం చేసుకున్న స్మితా 31వ ఏట అనారోగ్యంతో మరణించారు. ఆమె కుమారుడు ప్రతీక్ నటుడు. -
'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది'
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సినీ దిగ్గజాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేదిక మీదనుంచి రోజుకో వార్త సంచలనం సృష్టిస్తుండగా తాజాగా... లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనగల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన సినిమాలలో కథానాయికగా నటించిన స్మితాపాటిల్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు బెనగల్. స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది అంటూ కితాబిచ్చాడు. స్మిత, శ్యాం బెనగల్ రూపొందించిన మండీ, భూమిక, మంతన్, నిశాంత్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. శ్యాం మాటల్లో చెప్పాలంటే 'కెమరా ఆమెను ప్రేమించింది, ఆమె సహజ నటి, ఏ పాత్రలోకైన సునాయాసంగా ఒదిగిపోతుంది. మన ప్రేమేయం లేకుండానే ఆమె మన కథలో భాగమైపోతుంది.' స్మితతో పాటు తన సినిమాల్లో కథానాయికగా నటించిన షబానా అజ్మీని కూడా ప్రశంసించాడు శ్యాం బెనగల్. ' తొలిసారిగా క్యారెక్టర్ కోసం ఆమె తన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్యర్యపోయా, షబానా అజ్మీ ప్రొఫైల్ కూడా చూడటం మానేసి ఆమెనే చూస్తూ ఉండిపోయా. ఆ సమయంలోనే అంకుర్ సినిమాలో లక్ష్మీ నా కళ్లకు కనిపించింది.' అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. -
అక్టోబర్ 17 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు స్మితా పాటిల్ (నటి) అనిల్ కుంబ్లే (మాజీ క్రికెటర్) ప్రణీత (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శని సంఖ్య. వీరు పుట్టిన తేదీ 17. ఇది కూడా శనిసంఖ్య కావడం వల్ల వీరిపై శని ప్రభావం బలంగా ఉంటుంది. దీనిమూలంగా పనులు కొంచెం ఆలస్యంగా జరిగినప్పటికీ శని వృత్తి కారకుడు, ఆయుఃకారకుడు కావడం వల్ల ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉత్సాకరంగా నడుస్తాయి. తగిన ప్రోత్సాహం లభించడం వల్ల స్థిరత్వాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా బలపడతారు. మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. సామాజికపరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. లక్కీ డేస్: 1,3,6, 8,9; లక్కీకలర్స్: ఎల్లో, గోల్డెన్, శాండిల్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించడం, కుక్కలకు ఆహారం పెట్టడం, వృద్ధులను ఆదరించడం, మాటలలో సంయమనం పాటించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
'స్మితాపాటిల్ అద్భుతమైన వ్యక్తి'
'ఆమె ఎవరో నాకు తెలియదు. ఎలా ఉంటుందో కూడా ఊహించలేను. ఆమె గురించి ఇతరులు అందించిన సమాచారం ద్వారానే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తి. గొప్ప విశాల హృదయం ఉన్న వ్యక్తి అని కూడా తెలుసుకున్నాను' అని ఓ తనయుడు గుండెల్లోంచి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఇటీవల బాలీవుడ్ తెరకు పరిచయమైన రాజ్ బబ్బర్ కుమారుడు ప్రతీక్ బబ్బర్. ఇక ప్రతీక్ బబ్బర్ మాట్లాడింది... ఎంతోమంది అభిమానులను చూరగొన్న స్మితాపాటిల్ గురించి అని అర్ధమై ఉంటుంది. అమ్మను నేను ఎంతగా ఇష్టపడతాననే విషయం ఇక్కడకు రావడం వల్లనే అర్థమవుతోంది. గతంలో ఇక్కడికి వచ్చి ఎంతో మంది పిల్లల్ని ఇక్కడ కలుసుకునేదని తెలిసింది. నేను కూడా ఓ మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను అని ప్రతీక్ బబ్బర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తాను, ఇతరులు కూడా సంతోష పడతారన్నారు. జీవితంలో స్పూర్తి పొందాలనుకునే ప్రతిసారీ తాను స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ లనే అనుసరిస్తానని ప్రతీక్ తెలిపారు. స్మితాపాటిల్, రాజ్ బబ్బర్ కుమారుడినని చెప్పుకొవడం తనకు గొప్పగా ఉంటుందని, తన జీవితానికి తల్లితండ్రులే సూర్తి అని అన్నారు. తన తల్లి తండ్రులకు మరింత పేరు తెచ్చేలా నటిస్తానని ప్రతీక్ తెలిపారు. దోభీ ఘాట్, అరక్షన్, మై ఫ్రెండ్ పింటూ చిత్రాల్లో ప్రతీక్ బబ్బర్ నటించాడు. భారత చిత్ర పరిశ్రమ అందించిన కళాకారుల్లో బాలీవుడ్ నటి స్మితాపాటిల్ ఓ అరుదైన ఆణిముత్యం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురువారం స్మితాపాటిల్ 58వ జన్మదిన కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ఘనంగా నిర్వహించింది. 'భూమిక', 'అర్థ్' లాంటి చిత్రాలతో అభిమానుల హృదయాలను దోచుకున్న స్మితాపాటిల్ తన 31 ఏట ప్రసూతి సమయంలో తలెత్తిన సమస్యతో 1986 లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.