'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది' | Shyam Benegal about smita patil | Sakshi
Sakshi News home page

'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది'

Published Sat, Nov 28 2015 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది'

'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది'

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సినీ దిగ్గజాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేదిక మీదనుంచి రోజుకో వార్త సంచలనం సృష్టిస్తుండగా తాజాగా... లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనగల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన సినిమాలలో కథానాయికగా నటించిన స్మితాపాటిల్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు బెనగల్.

స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది అంటూ కితాబిచ్చాడు. స్మిత, శ్యాం బెనగల్ రూపొందించిన మండీ, భూమిక, మంతన్, నిశాంత్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. శ్యాం మాటల్లో చెప్పాలంటే 'కెమరా ఆమెను ప్రేమించింది, ఆమె సహజ నటి, ఏ పాత్రలోకైన సునాయాసంగా ఒదిగిపోతుంది. మన ప్రేమేయం లేకుండానే ఆమె మన కథలో భాగమైపోతుంది.'

స్మితతో పాటు తన సినిమాల్లో కథానాయికగా నటించిన షబానా అజ్మీని కూడా ప్రశంసించాడు శ్యాం బెనగల్. ' తొలిసారిగా క్యారెక్టర్ కోసం ఆమె తన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్యర్యపోయా, షబానా అజ్మీ ప్రొఫైల్ కూడా చూడటం మానేసి ఆమెనే చూస్తూ ఉండిపోయా. ఆ సమయంలోనే అంకుర్ సినిమాలో లక్ష్మీ నా కళ్లకు కనిపించింది.' అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement