దర్బార్‌ విలన్‌ | prateik babbar villain role in rajinikanth darbar | Sakshi
Sakshi News home page

దర్బార్‌ విలన్‌

Published Fri, Apr 19 2019 12:35 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

prateik babbar villain role in rajinikanth darbar - Sakshi

ప్రతీక్‌ బబ్బర్‌

‘దర్బార్‌’లో రజనీకాంత్‌కు విలన్‌ పాత్రలో సవాల్‌ విసరడానికి సిద్ధం అవుతున్నారు బాలీవుడ్‌ యాక్టర్‌ ప్రతీక్‌ బబ్బర్‌. ఏఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దర్బార్‌’. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ఈ చిత్రంలో నటించడం గురించి ప్రతీక్‌ మాట్లాడుతూ – ‘‘రజనీసార్‌ లాంటి లెజెండ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించబోతున్నాను. ఈ చాన్స్‌ని వినియోగించుకోవడం కోసం 200 శాతం కష్టపడతాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు జీవితంలో ఎప్పుడూ రావు’’ అన్నారు. ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ కొడుకు పాత్రలో ప్రతీక్‌  కనిపిస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement