
రజనీకాంత్
జైపూర్‌లో పని పూర్తి చేసుకొచ్చారు ఆఫీసర్ రజనీకాంత్. మకాం మళ్లీ ముంబైకి షిఫ్ట్ అయిందని తెలిసింది. ఇంకొన్ని రోజులైతే ఆపరేషన్ పూర్తయిపోతుందట. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు రజనీకాంత్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అంతకుముందు ముంబైలో భారీ షెడ్యూల్ జరిగింది.
ప్రస్తుతం జరుగుతున్నది చివరి షెడ్యూల్ అని సమాచారం. ఇటీవలే జైపూర్‌లో ఓ గ్రాండ్ సాంగ్‌ను రజనీ, నయనతారపై చిత్రీకరించారట. షూటింగ్ లొకేషన్‌లో ఓ స్టిల్ ఇటీవలే రిలీజ్ అయింది. సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా విలన్లుగా నటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రజనీ సోదరుడు సత్యనారాయణ రావ్ మోకాలికి ఆపరేషన్ జరిగింది. ‘దర్బార్’ షూటింగ్ నుంచి కొన్ని గంటలు బ్రేక్ తీసుకుని, ఆస్పత్రికి వెళ్లి అన్నయ్యను పరామర్శించారు రజనీ.
Comments
Please login to add a commentAdd a comment