
గతేడాది జనవరిలో వైవాహిక బంధంతో ఒక్కటైన బాలీవుడ్ నిర్మాత సన్యా సాగర్, నటుడు ప్రతీక్ బబ్బర్‌లు విడిపోయారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సన్యా సాగర్ మూవీ కార్యక్రమాలకు భర్త ప్రతీక్‌ను ఆహ్వానించకపోవడం ఒకటైతే, ప్రతీక్ కుటుంబంలో జరిగే వేడుకలకు సన్యాను పిలువక పోవడం ఈ రూమర్లకు మరింత బలంగా చేకూరుస్తోంది. దాంతో వీరిద్దరూ విడిపోయారంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరొకవైపు వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినోకరూ ఫాలో కాకపోవడం, అలాగే వారిద్దరికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా నుంచి తొలగించడం చూస్తుంటే వస్తున్న వార్తల్లో నిజం ఉండొచ్చని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ వార్తలను భర్త ప్రతీక్ ఖండించాడు. తామిద్దరం బాగానే ఉన్నామని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు. (అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి)
కాగా, గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ జంట గతేడాది లక్నోలో వివాహం చేసుకున్నారు. ప్రతీక్ తల్లీ మహరాష్ట్రీయన్ కావడంతో మరాఠి సంప్రదాయంలోనే వీరి పెళ్లిని ఘనంగా జరుపుకున్నారు. ప్రతీక్ ఇటీవల విడుదలై సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘దర్భార్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంజయ్ గుప్తా రాబోయే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 19న విడుదల కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment