nawazuddhin siddiqui
-
ఓటీటీలో నెంబర్‌వన్ సిరీస్.. కానీ దారుణమైన ట్రోల్స్: నటి
బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. 2018లో ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఐఎండీబీ ప్రకటించిన ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సిరీస్ తర్వాతే మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్-5లో నిలిచాయి. అయితే ఈ సిరీస్‌లో నటించిన మరో నటి రాజశ్రీ దేశ్‌పాండే. 'సేక్రెడ్ గేమ్స్'లో సుభద్ర పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో భార్యగా నటించింది. అయితే ఈ సిరీస్‌లో చాలా ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంతో విమర్శలకు గురైంది. గతేడాది ట్రయల్ బై ఫైర్ అనే వెబ్ సిరీస్‌తోనూ అభిమానులను అలరించింది. అయితే తాజాగా ఆమె నటించిన మరాఠీ చిత్రం సత్యశోధక్ జనవరి 5న థియేటర్లలో రిలీజైంది. నీలేష్ జలంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె సావిత్రి జ్యోతిబాయి పూలే పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాజశ్రీ.. సేక్రెడ్ గేమ్స్ రిలీజయ్యాక వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌పై స్పందించారు. రాజశ్రీ దేశ్‌పాండే మాట్లాడుతూ..''సేక్రెడ్ గేమ్స్‌లో నా సీన్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతే కాకుండా మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేశారు. ఆ సిరీస్ తర్వాత నాపై వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నన్ను పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. నేను రైతులు, సామాజిక సమస్యల గురించి చాలాసార్లు మాట్లాడా. కానీ వాటి గురించి ఎవరూ రాయలేదు. ఇలాంటి వాటికే మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ విషయం నాకు చాలా బాధేసింది' అని తెలిపింది. Victory!🌟#RajshriDeshpande shares some beautiful words after winning big at the #FilmfareOTTAwards2023, co-powered by Hyundai Motor India, Ajio and Film Bandhu - Government of Uttar Pradesh, in association with Fura Gems and ITC Fiama.@AJIOLife @FiamaIndia pic.twitter.com/lhwmUSWpo9 — Filmfare (@filmfare) November 27, 2023 View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) -
ట్రాన్స్‌జెండర్‌గా స్టార్ హీరో.. ఓటీటీలో సినిమా డైరెక్ట్ రిలీజ్
ఈ మధ్య హిందీలో 'తాలీ' అనే వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్, హిజ్రాగా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరో ట్రాన్స్‌జెండర్ సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో స్టోరీ ఏంటనేది రివీల్ అయింది. ట్రైలర్ టాక్? సాధారణంగా హిజ్రా గెటప్‌తో సినిమా అనగానే సెంటిమెంట్ లేదా రివేంజ్ స్టోరీలే దాదాపుగా ఉంటాయి. 'కాంచన', 'తాలీ' ఇవన్నీ కూడా ఇలాంటివే. అయితే బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్దిఖీ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న 'హడ్డీ' మాత్రం గ్యాంగస్టర్ తరహా మూవీలా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఇదే వైబ్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!) స్టోరీ ఏంటి? హరి(నవాజుద్దీన్) అనే కుర్రాడు అమ్మాయిగా మారాలనుకుంటాడు. అలానే ఔరంగబాద్‌లో చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసుకుంటూ బతుకుతుంటాడు. అక్కడ నుంచి దిల్లీకి వచ్చిన హరి.. ట్రాన్స్‌జెండర్‌గా మారతాడు. కానీ అతడికి అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. దీంతో తనకు ఆశ్రయమిచ్చిన హిజ్రా కమ్యూనిటీపై రివేంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. చివరకు ఏమైందనేదే 'హడ్డీ' మెయిన్ స్టోరీ. ఓటీటీలోకి అప్పుడే ఇకపోతే నవాజుద్దీన్ హీరోగా నటిస్తున్న 'హడ్డీ' సినిమా.. జీ5లో సెప్టెంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీలో డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. వెంకటేశ్ 'సైంధవ్' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా.. డిసెంబరు 23న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: రిస్క్ చేస్తున్న 'ఖుషి'.. ఆ ఒక్కటి మాత్రం!) -
పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ క్వీన్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోన్న బాలీవుడ్ భామ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేసే కంగనా బీ టౌన్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూస్తే కంగనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!) కారులో వచ్చిన కంగనాను మీడియా ప్రతినిధులంతా చుట్టుముట్టి ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు వేశారు. దీంతో వెంటనే స్పందించిన కంగనా వెడ్డింగ్ కార్డు చూపిస్తూ వారికి శుభవార్త చెప్పింది. మీరందరూ కూడా పెళ్లికి హాజరు కావాలని వారిని ఆహ్వానించింది. అయితే వెడ్డింగ్ కార్డులో ఆమె పేరు లేకపోవడంతో వారంతా షాక్ తిన్నారు. దీంతో కంగనా పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఇదంతా కంగనా నిర్మిస్తున్నా చిత్రం 'టిక్కు అండ్ షేరు' మూవీ ప్రమోషన్లలో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. తొలిసారిగా కంగనా ప్రొడక్షన్ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కబీర్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఈనెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది. ( ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
వెంకటేశ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?
వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. శుక్రవారం (మే 19) నవాజుద్దీన్ సిద్ధిఖీ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న వికాస్ వలిక్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో నవాజుద్దీన్ది పవర్ఫుల్ విలన్ రోల్. ‘‘హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. వెంకటేశ్ కెరీర్లో 75వ లాండ్ మార్క్ మూవీ ఇది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా (మనోజ్ఞ పాత్రలో) నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహానీ శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ కాగా ‘సైంధవ్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహనిర్మాత: కిశోర్ తాళ్లరు, కెమెరా: ఎస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్) -
ఇక విడాకులే ఫైనల్.. ఇప్పటికే ప్రక్రియ మొదలైంది: ఆలియా
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్య ఆలియాతో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దుబాయ్ నుంచి పిల్లలతో సహా ఇండియాకు తిరిగొచ్చిన ఆలియా.. నవాజుద్దీన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనను, పిల్లలను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపించింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్యపై బాంబే హైకోర్టులో రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఆలియా విడాకుల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఆలియా మాట్లాడుతూ.. 'విడాకుల ప్రక్రియ కచ్చితంగా జరుగుతుంది. నా పిల్లల సంరక్షణ కోసం నేను పోరాడతా. నా పిల్లలిద్దరూ నాతో ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడరు' అని అన్నారు. ఇదే విషయంపై ఆలియా తరఫున లాయర్ రిజ్వాన్ ఇప్పటికే కోర్టుకు వాంగ్మూలం సమర్పించినట్లు తెలిపారు. నవాజుద్దీన్ న్యాయవాదులు తనకు సెటిల్మెంట్ కోసం కొన్ని నిబంధనలు పంపారని తెలిపారు. ఇప్పుడు ఆలియాతో అదే విషయమై చర్చిస్తున్నట్లు రిజ్వాన్ సిద్ధికీ పేర్కొన్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం వివాదం ముగిసిపోయేలా ప్రయత్నిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రూ. 100 కోట్ల పరువునష్టం దావాను ఉపసంహరించుకోవాలని సిద్దిఖీని కోరతామని రిజ్వాన్ పేర్కొన్నారు. అయితే మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాకు కాపీని మాకు ఇంకా అందజేయలేదని అన్నారు. -
'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'
ముంబై : ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ ఎంజాయ్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్న సంగతి తెలిసిందే. హాలీడే ట్రిప్పుల పేరుతో ప్రేమపక్షులు మాల్దీవుల బీచుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇటీవలె అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా విషయంపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ స్పందించారు. ఇప్పడు ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. మన దేశంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం తమ జల్సాల కోసం డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. ఓ వైపు దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంటే...వీరు మాత్రం వెకేషన్ ట్రిప్పులను ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి. వీళ్లు యాక్టింగ్ గురించి తప్పా ఇంకేమీ మాట్లాడలేరు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒక తన వెకేషన్ గురించి మాట్లాడుతూ..తాను బుధానాలోని తన కుటుంబంతో సమయం గడుపుతున్నానని, ఇదే తనకు మాల్దీవులు అని చెప్పుకొచ్చారు. చదవండి : అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ -
వివాదస్పద వెబ్ సిరీస్‌పై పోలీస్ కంప్లెంట్
ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ నెట్‌ఫ్లిక్స్ తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన ‘సాక్రెడ్ గేమ్స్’కు ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రీమియర్ షో విడుదలైన ఐదు రోజుల్లోనే ‘సాక్రెడ్ గేమ్స్’పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు నమోదయ్యింది. రాజకీయాలతో పాటు ఎదిగిన నేర ప్రపంచం ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ సిన్హా అనే వ్యక్తి ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌లో ‘గణేష్ గైతొండే’ పాత్రలో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని దూషించారని.. ఆయన కాలంలో వచ్చిన ‘షాబానో కేస్’కు (ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన కేసు) సంబంధించిన వివరాలను వక్రీకరించారని కోల్‌కతా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. విక్రమ్ చంద్రా రచించిన ‘సాక్రెడ్ గేమ్స్’ పుస్తకాన్ని అదే పేరుతో వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వాని. ఈ పుస్తకంలో విక్రమ్ చంద్రా స్వాతంత్యానంతరం దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలు, వాటికి సమాంతరంగా ఎదిగిన అండర్ వరల్డ్ నేర ప్రపంచం వంటి పలు అంశాలను చర్చించారు. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వాని మొత్తం పుస్తకాన్ని 8 భాగాల వెబ్ సిరీస్‌గా తీసుకోస్తున్నారు. ఈ ఎనిమిది భాగాల్లో 1975లో ఇందిరా హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి.. అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారని సమాచారం. ఇప్పటికే ఈ సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో మితిమీరిన హింస, అశ్లీలతను చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. -
కాల్ డేటా స్కాంలో నటుడి లాయర్ అరెస్ట్
ముంబై : కాల్ డేటా రికార్డు స్కామ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజ్ద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది రిజ్వాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ ఇంతకు ముందు ప్రముఖ సెలబ్రిటీలకు న్యాయవాదిగా వ్యవహరించడంతో ఈ కేసుకు మరింత ప్రధాన్యత సంతరించుకుంది. కాగా కాల్ డేటా రికార్డు స్కాం కేసు నగరంలో కలకలం రేపుతోంది. నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్ అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న రిజ్వాన్ ను థానే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. చట్ట విరుద్దంగా ఇతరుల కాల్ డేటాను రికార్డ్ చేస్తోన్న నలుగురు ప్రవేటు డిటెక్టివ్స్‌ను జనవరి 24న అరెస్ట్ చేశాం. లాయర్ రిజ్వాన్ వారి నుంచి నవాజుద్దీన్ తన భార్య కాల్ డేటాను పొందినట్లు అరెస్ట్ అయిన ప్రశాంత్ పాలేకర్ విచారణలో అంగీకరించాడు. కాల్ డేటా కోసం 50వేల రూపాయలు వారికి చెల్లించినట్టు తెలిసింది. ఇదే అంశంపై రిజ్వాన్‌తోపాటు నవాజుద్దీన్ దంపతులకు నోటిసులు పంపాం. శుక్రవారం విచారణకు హాజరైన రిజ్వాన్ కాల్ డేటా పొందినట్టు రుజువు కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. నవాజుద్దీన్ దంపతులు దీనిపై విచారణకు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. -
'ఆయనతో నటించటం నా అదృష్టం'
బాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న నవాజుద్దీన్ సిద్ధికీ.. అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశంపై స్పందించారు. అంతటి లెజెండరీ యాక్టర్‌తో కలిసి నటించటం తన అదృష్టం అన్నారు. సుజయ్ ఘోష్ కథతో విభుపూరి డైరెక్ట్ చేస్తున్న 'కేరళ' సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, అమితాబ్ బచ్చన్లు కలిసి నటిస్తున్నారు. 'ఎప్పటి నుంచో అమితాబ్ తో కలిసి నటించాలన్నది నా కల. నా తర్వాతి సినిమాలోనే ఆయనతో కలిసి నటించబోతున్నాను. ఇది నిజంగా నా అదృష్టం' అని తన అభిమానాన్ని చాటుకున్నారు. అమితాబ్ స్వయంగా తన సినిమాలో నవాజ్‌కు ఓ క్యారెక్టర్ ఇవ్వమని కోరటంతో మరింత ఆనందంలో ఉన్నారు ఈ విలక్షణ నటుడు. ఇప్పటికే ఈ ఏడాది 'భజరంగీ బాయ్‌జాన్', 'మాంఝీ' లాంటి సినిమాల్లో నటించిన నవాజుద్దీన్ ప్రస్తుతం షారుఖ్‌తో కలిసి 'రాయిస్' సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్, నవాజ్‌ల కాంబినేషన్ లో రూపొందనున్న 'కేరళ' వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.