ట్రాన్స్‌జెండర్‌గా స్టార్ హీరో.. ఓటీటీలో సినిమా డైరెక్ట్ రిలీజ్ | Nawazuddin Siddiqui Transgender Role Played Haddi Movie Trailer And OTT Release Date, Deets Inside - Sakshi
Sakshi News home page

Haddi Movie Trailer, OTT Release: స్టార్ హీరో హిజ్రా గెటప్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్

Published Wed, Aug 23 2023 4:31 PM | Last Updated on Wed, Aug 23 2023 4:44 PM

Haddi Movie Trailer And OTT Release Date - Sakshi

ఈ మధ్య హిందీలో 'తాలీ' అనే వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్, హిజ్రాగా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరో ట్రాన్స్‌జెండర్ సినిమాతో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో స్టోరీ ఏంటనేది రివీల్ అయింది.

ట్రైలర్ టాక్?
సాధారణంగా హిజ్రా గెటప్‌తో సినిమా అనగానే సెంటిమెంట్ లేదా రివేంజ్ స్టోరీలే దాదాపుగా ఉంటాయి. 'కాంచన', 'తాలీ' ఇవన్నీ కూడా ఇలాంటివే. అయితే బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్దిఖీ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న 'హడ్డీ' మాత్రం గ్యాంగస్టర్ తరహా మూవీలా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఇదే వైబ్స్ వచ్చాయి.

(ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!)

స్టోరీ ఏంటి?
హరి(నవాజుద్దీన్) అనే కుర్రాడు అమ్మాయిగా మారాలనుకుంటాడు. అలానే ఔరంగబాద్‌లో చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేసుకుంటూ బతుకుతుంటాడు. అక్కడ నుంచి దిల్లీకి వచ్చిన హరి.. ట్రాన్స్‌జెండర్‪‌గా మారతాడు. కానీ అతడికి అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. దీంతో తనకు ఆశ్రయమిచ్చిన హిజ్రా కమ్యూనిటీపై రివేంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. చివరకు ఏమైందనేదే 'హడ్డీ' మెయిన్ స్టోరీ.

ఓటీటీలోకి అప్పుడే
ఇకపోతే నవాజుద్దీన్ హీరోగా నటిస్తున్న 'హడ్డీ' సినిమా.. జీ5లో సెప్టెంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీలో డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. వెంకటేశ్ 'సైంధవ్' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా.. డిసెంబరు 23న థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: రిస్క్ చేస్తున్న 'ఖుషి'.. ఆ ఒక్కటి మాత్రం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement