ఓటీటీలోకి వచ్చేసిన సంచలన సినిమా.. అప్పుడే ట్రెండింగ్‌! | The Kerala Story Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

OTT: 9 నెలల తర్వాత ఓటీటీలో రిలీజైన వివాదాస్పద సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Feb 16 2024 10:12 AM | Updated on Feb 16 2024 11:31 AM

The Kerala Story Streaming On This OTT Platform - Sakshi

గతేడాది మేలో రిలీజైన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఫిబ్రవరి 16న జీ5లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

కొన్ని సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌నే కాదు ఇన్‌ఫర్మేషన్‌నూ ఇస్తాయి. అలాంటి కోవలోకే వస్తుంది ది కేరళ స్టోరీ. కేరళలో ఓ వర్గానికి చెందిన యువతులను మతం మార్చి ఉగ్రవాదులుగా తయారు చేసిన ఉదంతాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమా ప్రకటించిననాటి నుంచే ఎన్నో విమర్శలు చుట్టుముట్టాయి. రిలీజైనప్పుడు కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది.

మే నెలలో రిలీజ్‌..
అయినప్పటికీ అన్నింటినీ దాటుకుంటూ ప్రేక్షకాదరణ పొందింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించాడు. గతేడాది మేలో రిలీజైన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఫిబ్రవరి 16న జీ5లో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

అప్పుడే ట్రెండింగ్‌లో..
ముందుగా చెప్పినట్లుగానే శుక్రవారం నాడు ది కేరళ స్టోరీని జీ5లో రిలీజ్‌ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అలా ఓటీటీలో విడుదలైందో లేదో ఇలా ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోందీ సినిమా. థియేటర్‌లో చూడటం మిస్‌ అయినా లేదంటే మరోసారి చూడాలనిపించినా ఆలస్యం చేయకుండా వెటనే ఓటీటీలో ది కేరళ స్టోరీపై ఓ లుక్కేయండి..

చదవండి:  హీరోయిన్‌ కన్నడ సీరియల్‌ నటి.. త్వరలోనే అక్కడ కూడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement