ది కేరళ స్టోరీ సినిమాపై వివాదం ముసురుకుంటోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ నుంచి ఏకంగా ఇందులో నటించినవాళ్లు బయట కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరింపుల దాకా వచ్చింది వ్యవహారం. ఓపక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సినిమాపై ఆ రాష్ట్రంలో నిషేధం విధించగా మరో పక్క ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ కల్పించడం గమనార్హం.
ప్రశంసలు, విమర్శల మధ్య ది కేరళ స్టోరీ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.45.72 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందని ఆరా తీస్తున్నారు అభిమానులు. ది కేరళ స్టోరీ ఓటీటీ హక్కులను జీ5 ఇదివరకే సొంతం చేసుకుంది. థియేటర్‌లో సక్సెస్‌గా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు. ది కేరళ స్టోరీని జీ5లో చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే!
హీరోయిన్ అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్‌లాల్ నిర్మించారు. కేరళలో తప్పిపోయిన 32వేల మంది యువతలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
చదవండి: బాలీవుడ్ నటి సోదరుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment