'ద కేరళ స్టోరీ' ఓటీటీలో రికార్డ్
అప్పుడప్పుడు కొన్ని సినిమాలు కాంట్రవర్సీ అవుతుంటాయి. ఎంతలా అంటే వాటి గురించి దేశమొత్తం మాట్లాడుకునేలా! అలాంటి చిత్రాల్ని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చూస్తుంటారు. వచ్చిన తర్వాత మాత్రం అస్సలు విడిచిపెట్టరు. అలా రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఓ మూవీ.. ట్రెండింగ్‌లో ఉండటంతో పాటు రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఏ సినిమా? ఏంటా రికార్డ్?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
పైన చెప్పినదంతా కూడా 'ద కేరళ స్టోరీ' సినిమా గురించే. కేరళలో జరిగిన అమ్మాయిలు అక్రమ రవాణా, మత మార్పిడి, విదేశాల్లో ఉగ్రదాడులు.. ఇలా చాలా కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తో తీశారు. గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలైంది. పలు వివాదాలు ఏర్పడినప్పటికీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
పలు వివాదాల వల్ల 'ద కేరళ స్టోరీ' సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 15న జీ5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గత 15 రోజుల నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ చిత్రం.. 300 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయ్యి రికార్డ్ సృష్టించినట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)
The world is tuning in to hear their stories! 💯
— ZEE5 (@ZEE5India) March 2, 2024
With 300 million watching minutes, have you seen it yet?#TheKeralaStory streaming now, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah #TheKeralaStory #SaveOurDaughters@sudiptoSENtlm @Aashin_A_Shah @sunshinepicture… pic.twitter.com/150BhPCpKc
Comments
Please login to add a commentAdd a comment