ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా అయినా.. ఓటీటీల్లోకి రావడానికి పెద్దగా టైమ్ పట్టట్లేదు. కొన్నిసార్లు థియేటర్ లో ఉండగానే ఓటీటీల‍్లో రిలీజ్ చేస్తున్నారు. 'బలగం' చిత్రానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అలాంటిది దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన 'ద కేరళ స్టోరీ'ని మాత్రం ఓటీటీలు పట్టించుకోవట్లేదు. విడుదలై దాదాపు రెండు నెలలు కావస్తున్న.. ఇప్పటికీ స్ట్రీమింగ్ కి నోచుకోవట్లేదు. దీనికి కారణమేంటి?
'ద కేరళ స్టోరీ' కథేంటి?
కేరళలోని కాసర్‌గాడ్ ఊరిలో షాలినీ(అదాశర్మ), గీతాంజలి(సిద్ది ఇద్నానీ), నిమా(యోగితా భిహాని) నర్సింగ్ చదువుతుంటారు. అసిఫా(సోనియా బలానీ)తో హాస్టల్ రూమ్ షేర్ చేసుకుంటారు. ఐసిస్ లో అండర్‌కవర్ గా చేస్తున్న అసిఫా.. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఇస్లాంలోకి మార్చే మిషన్ కోసం పనిచేస్తుంటుంది. ప‍్లాన్ లో భాగంగా ఇద్దరబ్బాయిలనీ రంగంలోకి దించి.. షాలినీ, గీతాంజలిని లవ్ జిహాద్ లోకి లాగుతుంది. ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)
ఇంతకీ గొడవేంటి?
'ద కేరళ స్టోరీ' ట్రైలర్ విడుదలైనప్పుడు.. లవ్ జిహాద్ ఉచ్చులోకి దాదాపు 32వేల మంది అమ్మాయిలని దింపినట్లు చూపించారు. థియేటర్లలో సినిమా వచ్చేసరికి ఆ సంఖ్యని ముగ్గురు అమ్మాయిలుగా మార‍్చారు. అయినాసరే గొడవలు ఆగలేదు. సినిమా కాస్త రాజకీయం అయిపోయింది. పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. అలా దాదాపు మేలో 10-20 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది.
ఓటీటీ గందరగోళం
'ద కేరళ స్టోరీ'.. జూన్ 23న జీ5లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తేదీ వచ్చి వెళ్లిపోయినా సరే ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. కారణం ఏంటా అని ఆరా తీస్తే.. నిర్మాతలు డిమాండ్ చేస్తున్న మొత్తానికి కొనేందుకు ఓటీటీలు ముందుకు రావట్లేదని, అందుకే స్ట్రీమింగ్ ఆలస్యమవుతుందని సమాచారం. డీల్ కుదిరన వెంటనే ఓటీటీలో ఈ చిత్రం విడుదలైపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడొస్తుందో?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!)
Comments
Please login to add a commentAdd a comment