ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం రిలీజై నెలలు గడుస్తున్నా ఓటీటీలో రాలేదు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో ఈ చిత్రం ఓటీటీ రానున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ మూవీ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారు మేకర్స్. చిన్న సినిమాగా వచ్చిన ది కేరళ స్టోరి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. వివాదాలు ఎదురైనప్పటికీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగాా ఈ చిత్రాన్ని జనవరి 12న లేదా జనవరి 19న స్ట్రీమింగ్ వచ్చే అవకాశమున్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రలలో నటించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా 2023 మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment