‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్‌గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు.
దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్‌గా మార్చేసింది.
అదే జోష్‌లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్‌తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్‌గా నటించింది.
An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.
#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024
Comments
Please login to add a commentAdd a comment