bastar
-
మాజీలు X మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బస్తర్ అడవుల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్పీఎఫ్–కోబ్రా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, దంతేశ్వరి ఫైటర్స్ తదితర సాయుధ బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేస్తూ బస్తర్ అడవుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అయితే భద్రతా దళాలపై మావోయిస్టులు జరిపే దాడుల్లో ఎక్కువగా స్థానికులతో కూడిన డీఆర్జీ యూనిట్ జవాన్లే హతమవుతున్నారు. తాజా ఘటనలో బస్తర్ ఫైటర్స్ కూడా ఉన్నారు. బలగాలకు భారీ నష్టం దేశంలోని విప్లవ శక్తులన్నీ కలిసి 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పడ్డాయి. నేపాల్ నుంచి శ్రీలంక వరకు రెడ్ కారిడార్ లక్ష్యంగా ముందుకు కదిలాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం 2005లో స్థానిక యువతతో సల్వాజుడుం (శాంతి దళం) పేరుతో సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. 2007లో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏకంగా 55 మంది పోలీసులు చనిపోయారు. ఇందులో 31 మంది సల్వాజుడుం వారే ఉన్నారు. 2008లో ఒడిశా బలిమెల వద్ద జరిగిన దాడిలో 37 మంది గ్రేహౌండ్స్ పోలీసులు హతమయ్యారు. 2007 ఏప్రిల్ 25న చింతల్నార్ దగ్గర బాంబుదాడితో పాటు అంబూష్ ఎటాక్ జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సల్వాజుడుం, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ ఇలా ఏ రూపంలో బలగాలు దండకారణ్యంలోకి వెళ్లినా చేదు ఫలితాలే వచ్చాయి. దీంతో జనంలో జనంలా కలిసిపోయి గెరిల్లా యుద్ధతంత్రంతో మావోలు జరిపే దాడులను సమర్థంగా ఎదుర్కోవడం ప్రభుత్వ భద్రతా దళాలకు తప్పనిసరిగా మారింది. మాజీలతో డీఆర్జీ.. గతంలో సల్వాజుడుంలో పనిచేసిన వారికి జంగిల్ వార్ఫేర్లో శిక్షణ ఇచ్చి డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) పేరుతో 2008లో కాంకేర్ తొలి యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో మావోయిజం వైపు ఆకర్షితులై జనమిలీషియా నుంచి దళాల్లో వివిధ హోదాల్లో పనిచేసి లొంగిపోయిన మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే సంస్థగా డీఆర్జీ రూపాంతరం చెందింది. జిల్లాకు ఒకటి వంతున 2015 నాటికి బస్తర్, నారాయణ్‌పూర్, కాంకేర్, దంతెవాడ, కొండెగావ్, బీజాపూర్, సుక్మా మొత్తం ఏడు డీఆర్జీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ప్రతీ యూనిట్లో 500 మంది జవాన్లు పని చేస్తున్నారు. ముందుండేది వీరే.. గతంలో అడవుల్లో నక్సల్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం, స్థానిక అడవులపై అవగాహన, వాగులు దాటడం, గుట్టలు ఎక్కడంలో నేర్పరితనం, అడవుల్లో దొరికే ఆకులు, దుంపలు, కాయల్లో ఆహార పదార్థాలను గుర్తించడం తదితర విషయాల్లో డీఆర్జీ జవాన్లు ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో అడవుల్లో చేపట్టే గాలింపు చర్యల్లో డీఆర్జీ యూనిట్లు కీలకంగా మారాయి. అంతేకాదు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ లేక విద్యావకాశాలకు దూరంగా ఉన్న స్థానిక యువతకు వెంటనే లభించే ఉపాధి మార్గంగా డీఆర్జీ యూనిట్లు మారాయి. అయితే జవాన్ల వయోభారం, ఫిజికల్ ఫిట్నెస్ డీఆర్జీ యూనిట్లకు మైనస్‌గా మారింది.బస్తర్ ఫైటర్స్..డీఆర్జీతో వచ్చిన సానుకూల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని లోకల్ యంగ్ టీమ్‌తో బస్తర్ ఫైటర్స్‌ను 2022లో అందుబాటులోకి తెచ్చారు. 300 మందితో కూడిన మొదటి యూనిట్‌కు నోటిఫికేషన్ ఇస్తే ఏకంగా 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు 300 మంది జవాన్లతో కూడిన ఏడు యూనిట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇదే ఊపులో కేవలం మహిళలతో దంతేశ్వరీ ఫైటర్స్ అనే యూనిట్ కూడా మొదలైంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో స్థానికేతర దళాలకు సాయమందించే పనిలో ఉన్న ఈ లోకల్ జవాన్లే ఎక్కువగా మావోలు జరిపే దాడుల్లో చనిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
జర్నలిస్ట్ దారుణ హత్య
-
‘బస్తర్’లో మావోయిజం ఖాళీ!
ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ తమ పట్టును కోల్పోయారని కేంద్రం పేర్కొంది. ప్రాభల్యం తగ్గిపోవడం, పోలీసుల ముమ్ముర ఏరివేత కార్యక్రమాలు, మరోవైపు పునరవాస కల్పనా చర్యలు, ఇంకోవైపు అభివృధ్ధి కార్యక్రమాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిజం పూర్తిగా కనిపించకుండా పోయిందని వెల్లడించింది. కేంద్ర చర్యలతో .. బస్తర్ డివిజన్లో బస్తర్, దంతెవాడ, బీజాపూర్, కంఖేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా మొత్తంగా ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాగా బస్తర్ పేరొందింది. ముఖ్యంగా 2013 ఏడాది మే నెలలో కాంగ్రెస్ నేతలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 27 మందితో పాటు 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలోనే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి మహేంద్ర కర్మ చనిపోయారు. ఆ తర్వాత సైతం ఈ జిల్లా పేరు చెబితేనే పోలీసు బలగాల్లోనూ వణుకు పుట్టేంతస్థాయిలో మావోల మెరుపుదాడులు కొనసాగాయి. 2014 తర్వాత మావోల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకింది. ఈ జిల్లావ్యాప్తంగా భద్రతా బలగాల సంఖ్యను విపరీతంగా పెంచింది. లొంగుబాట్లను ప్రోత్సహించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గడిచిన రెండేళ్లుగా పోలీసులు, మావోలకు మధ్య పరస్పర కాల్పుల ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. పైగా జిల్లాలో ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ కాగా, మరో 13 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ ఏడాదిలో మావో సంబంధ ఘటన ఒక్కటి కూడా నమోదుకాలేదు. సమీప కొండగావ్ జిల్లాలోనూ ఒక్క ఘటన నమోదుకాలేదు. రెండు జిల్లాలకు పొరుగునే ఉన్న బీజాపూర్ జిల్లాలో 465 మంది, సుక్మా జిల్లాలో 253 మంది మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో రెండేళ్లలో 100 మందికి పైగా మావోలు పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు దశాబ్దాలుగా మావోల కదలికలతో నిత్యం వార్తలో ఉండే బస్తర్ జిల్లాలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించిన ఘటనలు జరగకపోవడం విశేషం. కొండగావ్లోనూ మావోల ఉనికి లేదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోలకు మధ్య జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో 208మంది మావోలు చనిపోయారు. బస్తర్, కొండగావ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగకపోవడం విశేషం. 802 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బహుముఖ వ్యూహంతో ముందుకు 2026 నాటికి పూర్తిస్థాయిలో మావోలను ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం ఈ లక్ష్యసాధన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఓపక్క భద్రతా చర్యలను పటిష్టం చేస్తూనే, మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టింది. చౌక ధరల దుకాణాలను పెంచడం, సమాచార వ్యవస్థల పటిష్టం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, రహదారులకు భారీగా నిధుల కేటాయింపు, లొంగిపోయే మావోలకు తక్షణ పునరావాస కార్యక్రమాలతో వారి ఉనికిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
వెళ్లినంత తేలిక కాదు.. వెనక్కి రావడం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సైన్యంగా పేర్కొనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 24వ వారోత్సవాలు ఈనెల 8తో ముగియనున్నాయి. ఒకప్పుడు పీఎల్జీఏ వారోత్సవాలంటే ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఉద్రిక్తత నెలకొనేది. ఒకవైపు పటిష్ట పోలీసు నిఘా, మరోవైపు ఆ నిఘా నేత్రాల కళ్లుగప్పి మావోయిస్టులకు మద్దతు పలికేవారు కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. పదేళ్లుగా తెలంగాణపై పట్టు కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణ నుంచి బస్తర్ వెళ్లిన మావోయిస్టులు.. తిరిగి తెలంగాణలో ప్రభావం చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కష్టతరమవుతున్నాయి.బస్తర్ వైపు అడుగులుశ్రీకాకుళం జిల్లాలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం 80వ దశకంలో ఉత్తర తెలంగాణ జిల్లాలను ఊపు ఊపింది. అప్పటి ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్న జనాలు అన్నలకు అండగా నిలిచారు. యువకులు అడవుల బాట పట్టేందుకు ఉత్సాహం చూపారు. వందలు, వేలుగా వస్తున్న యువతరానికి దళాలుగా శిక్షణ ఇస్తూ భవిష్యత్ లక్ష్యాల దృష్ట్యా తెలంగాణ సరిహద్దులో ఉన్న బస్తర్ అడవులకు పీపుల్స్‌వార్ గ్రూపు పంపింది. జనతన సర్కార్ పేరుతో బస్తర్‌లో అన్నలు సమాంతర పాలన స్థాపించారు. దీంతో మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను 2009లో కేంద్రం చేపట్టింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, కోబ్రా దళాలు నలువైపులా బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులకు కొత్త స్థావరం అవసరమైంది.తెలంగాణ వైపు..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తే మావోయిస్టులు పాగా వేస్తారంటూ ఆం«ధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. అందుకు తగినట్టుగానే తెలంగాణ వచ్చాక మావోయిస్టులు ఇటువైపు దృష్టి సారించారు. ఈ క్రమాన తొలి ఎన్కౌంటర్ భద్రాచలం సమీపాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలో 2015 జూన్ 15న జరిగింది. ఆ తర్వాత అప్పటి వరంగల్ జిల్లా ములుగులో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, బ్యానర్లు రావడం మొదలైంది. అనంతరం నిర్మాణ పనుల్లో ఉన్న భారీ యంత్రాలను మావోయిస్టులు తగలబెట్టారు. ముందుగా తమ ఉనికి చాటుకుని.. ఆ తర్వాత దాన్ని సుస్థిరం చేసుకునే యత్నంలో ఉండగా 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం రంగాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. దీంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలు నెమ్మదించాయి.పదేళ్లలో 98 మంది..తెలంగాణ వచ్చాక 2015లో జరిగిన రంగాపూర్ ఎన్కౌంటర్ మొదలు నిన్నమొన్నటి కరకగూడెం, ఏటూరునాగారం ఎన్కౌంటర్ల వరకు మొత్తం 98 మంది మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 సార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పట్టుమని ఆరు నెలలు కూడా దళాలు ఇక్కడ ఆయుధాలతో సంచరించే పరిస్థితి లేదు. పోలీసుల నిఘా పటిష్టంగా ఉండడం ఒక కారణమైతే.. ఏజెన్సీలు, అడవి సమీప గ్రామాల ప్రజల నుంచి గతంలో లభించిన స్థాయిలో మావోయిస్టులకు ఇప్పుడు మద్దతు దొరకడం లేదు. ఫలితంగా తెలంగాణలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీనికి తోడు వారు కోవర్టుల పేరుతో సృష్టిస్తున్న రక్తపాతం మరింత చేటు తెచ్చింది. చివరకు మావోయిస్టులు తమ గ్రామాల వైపు రావొద్దంటూ ప్రజలు ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.కాళేశ్వరం మీదుగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2016లో మొదలైన తర్వాత రెండు రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యాన ముందుగా మావోయిస్టు సానుభూతిపరులు, ఆ తర్వాత దళాలు మహదేవపూర్ అడవుల్లోకి రాకపోకలు సాగించడం మొదలైంది. అయితే, మహదేవపూర్ – ఏటూరునాగారం ఏరియా పరిధిలో పెద్దగా హింసాత్మక ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో తరచూ కరపత్రాలు పంచడం, మందుపాతరలను అమర్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఈ క్రమాన 2017 డిసెంబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌లో చర్లలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు. -
నెత్తురోడుతున్న బస్తర్ అడవులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాకులు దూరని కారడవిగా పేరున్న బస్తర్ జంగిల్లో నెత్తురు ఏరులై పారుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం తలపెట్టిన పోరు కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌తో మొదలు..దేశ భద్రతకు మావోయిస్టులను ముప్పుగా పేర్కొంటూ 2009లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేసింది. అయితే తొలినాళ్లలోనే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు ఎక్కువగా చెడ్డపేరు వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గ్రీన్‌హంట్‌కు మరింత పదునుపెట్టి ఆపరేషన్ ప్రహార్ పేరుతో ఉధృతంగా దాడులు చేసింది. దీంతో ఛత్తీస్‌గఢ్ హింసపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆ తర్వాత 2018లో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. హస్తం పార్టీ సీఎంగా భూపేష్ బఘేల్ ఎన్నికయ్యారు. ఆయన హయాంలో మావోయిస్టులపట్ల కరుణ చూపారు. మరోవైపు కరోనా మహమ్మారి రావడంతో మావోయిస్టు ఆపరేషన్లలో తక్కువ స్థాయిలో హింస చోటుచేసుకుంది.సూర్యశక్తి, జల్‌శక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓటమిపాలై తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరిట ఉక్కుపాదంతో విరుచుకుపడుతోంది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను రూపుమాపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలను బస్తర్ అడవుల్లోకి పంపిస్తోంది. వేసవి కాలంలో మావోయిస్టుల అడ్డాలపై సమర్థంగా దాడి చేసేందుకు వీలుగా ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేసింది. దీంతో జనవరి నుంచి జూన్ మధ్య 150 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులకు పట్టుండే వర్షాకాలంలో కూడా వేడి తగ్గకుండా ఉండేందుకు ఆపరేషన్ జల్‌శక్తి పేరుతో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తోంది. ఫలితంగా అడవులు దట్టంగా పరుచుకున్నా ఎన్కౌంటర్లు ఆగడం లేదు. దీంతో బస్తర్ అడవులు అట్టుడికిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు చనిపోగా 212 మంది అరెస్టయ్యారు. మరో 201 మంది లొంగిపోయారు. దీనికి ప్రతిగా ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు పదుల సంఖ్యలో అడవి బిడ్డలను చంపుతున్నారు. ఆర్మీ క్యాంపులపైనా దాడులకు తెగబడుతున్నారు.నాడు భారీగా ఏకే–47లు.. నేడు తూటాలకే కటకట.. పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీగా మారాక విస్తృతమైన ‘నెట్వర్క్’ అందుబాటులోకి రావడంతో ఆధునిక ఆయుధాలు మావోయిస్టుల చేతికి అందాయి. సల్వాజుడం, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఎన్కౌంటర్లకు పాల్పడేందుకు రంగంలోకి దిగిన భద్రతా బలగాలపై తొలినాళ్లలో మావోయిస్టులు పైచేయి సాధించారు. ఈ క్రమంలో పలుమార్లు భద్రతా దళాల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ముఖ్యంగా 2007 మార్చి 15న సుక్మా జిల్లా తాడిమెట్ల దగ్గర జరిగిన దాడిలో భద్రతా దళాలకు చెందిన 145 ఆయుధాలను మావోయిస్టులు పట్టుకుపోయారు. అందులో ఏకంగా 125 ఏకే–47లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2001 నుంచి 2024 ఆగస్టు వరకు భద్రతా దళాలకు చెందిన 516 ఆటోమెటిక్ రైఫిల్స్‌ను మావోయిస్టులు ఎత్తుకుపోయారు. కానీ ఆపరేషన్ గ్రీన్‌హంట్, ఆపరేషన్ ప్రహార్, కగార్‌లతో తీవ్ర నిర్బంధం, దాడులు పెరగడం వల్ల మావోయిస్టు దళాల్లో రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి. దీంతో దళాల్లో సభ్యుల సంఖ్య కూడా కుచించుకుపోతోంది. దీంతో భద్రతా బలగాలను ఒత్తిడిలోకి నెట్టేందుకు వీలుగా తమ వైపు నుంచి ఎటాక్ తీవ్రంగా ఉండేలా డివిజన్ కమిటీ స్థాయి సభ్యులకు సైతం ఆధునిక ఆయుధాలు ఇచ్చేందుకు మావోయిస్టులు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ«టోమేటిక్ రైఫిల్స్ కలిగి ఉండే విషయంలో మావోలకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ వాటి కోసం ఉపయోగించే తూటాల విషయంలో కొరత ఎదురవుతున్నట్లు తెలిసింది. గతంతో పోలిస్తే తూటాల సరఫరాకు మార్గాలు చాలావరకు మూసుకుపోవడమే ఇందుకు కారణం. అందువల్లే గత నెలలో బస్తర్‌లో నాలుగైదుసార్లు భద్రతా దళాల క్యాంపులపై దాడులకు పాల్పడినా మావోలు భారీస్థాయిలో కాల్పులు చేపట్టలేదు. కేవలం అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్లతోనే దాడులు చేశారు.తెలంగాణలో నిలదొక్కుకోలేక..ఛత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో తెలంగాణలో తిరిగి నిలదొక్కుకోవడానికి మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఏడుగురు నక్సల్స్ చనిపోయారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇటీవల జరిగిన కరకగూడెం ఎన్కౌంటర్ అతిపెద్దదిగా పేర్కొంటున్నారు. అక్కడ ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. -
మావోయిస్టుల ఏరివేతకు ‘జల్‌శక్తి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు చెప్పుకునే బస్తర్ అడవుల్లో ఎండాకాలంలో సహజంగానే పోలీసు బలగాలది పైచేయి అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో వంద మందికి పైగా మావోయిస్టులు హతమవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, వానాకాలానికి వచ్చేసరికి అడవులు చిక్కబడటం.. వాగులు, వంకలు ఉప్పొంగడంతో పోలీసుల కూంబింగ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అడవుల్లోకి సులభంగా చొచ్చుకెళ్లేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రోప్ వేను అందుబాటులోకి తెచ్చాయి. బేస్ క్యాంపుల ఏర్పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు, ధర్మారం, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం, బాసగూడ ప్రాంతాలు మావోయిస్టులకు అడ్డాలుగా ఉన్నాయి. అతికష్టంపై భద్రతా దళాలు చింతవాగుకు ఇరువైపులా ఉన్న పామేడు, ధర్మారంలో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 16న రాత్రి 600 మందికి పైగా మావోయిస్టులు ఈ రెండు క్యాంపులను చుట్టుముట్టి భీకరంగా దాడి చేశారు.సుమారు మూడు గంటల పాటు సాగిన దాడిలో ఆరు వందలకు పైగా గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో భద్రతా దళాలకు చెందిన నలభై మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. అప్పటికే చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టినా సకాలంలో పూర్తి కాలేదు. దీంతో ఏటా వానాకాలంలో మూడు నెలల పాటు ఉప్పొంగే చింతవాగు భద్రతా దళాలకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా దళాలు వంతెనకు ప్రత్యామ్నాయంగా యుద్ధప్రాతిపదికన రోప్‌వేను నిర్మించాయి. ఈ రోప్‌వే ద్వారా రెండు క్యాంపుల మధ్య రాకపోకలకు ఆటంకాలు ఉండవని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ జల్‌శక్తి వేసవిలో మావోయిస్టు ప్రభావిత అడవుల్లోకి చొచ్చుకెళ్లిన భద్రతా దళాలు అక్కడ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలాంటి క్యాంపులకు వానాకాలంలో భద్రత కరువైపోతోంది. భద్రతా దళాల రక్షణ వ్యవస్థను చీల్చుకుంటూ క్యాంపుల మీద మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. దీంతో వానాకాలంలో కూడా బస్తర్ అడవులపై పట్టు సాధించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ జల్‌శక్తి పేరుతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. వరదలు ఎదుర్కొని, దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించడంపై భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రాకపోకలకు వీలుగా వంతెనలు, రోప్‌వేల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.120 మంది హతంకేంద్రం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఇప్పుడు తుదిదశ (ఆపరేషన్ కగార్ – ది ఫైనల్ మిషన్)కు చేరింది. బస్తర్ అడవుల్లో ఏర్పాటైన వందలాది క్యాంపుల్లో 10 వేల మంది పారామిలిటరీ దళాలు పాగా వేశాయి. వేసవి ఆరంభంలో భద్ర తా దళాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మావోయిస్టు పార్టీ టెక్నికల్ కౌంటర్–అఫెన్సివ్ క్యాంపెన్(టీసీ–ఓసీ) పేరుతో దాడులు మొదలెట్టింది. దీనికి ప్రతిగా భద్రతా దళాలు ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రతి వ్యూహాన్ని రూపొందించుకుని దాడులకు దిగాయి. అందువల్లే ఈ ఏడాది మావోయిస్టు పార్టీ నుంచి భద్రతా దళాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇదే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడులు, ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇక ఇప్పుడు జల్‌శక్తి పేరుతో వానాకాలంలోనూ దూకుడు పెంచేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అదాశర్మ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో హార్ట్ అటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినా.. అదా శర్మను మాత్రం స్టార్ హీరోయిన్గా చేయలేకపోయింది. దీంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు లేడి ఓరియెంటెండ్ చిత్రాల్లో నటించినా.. ఫేమ్ రాలేదు. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ది కేరళ స్టోరీ’తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో పాటు అదా శర్మను పాన్ ఇండియా హీరోయిన్గా మార్చేసింది. అదే జోష్‌లో ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ సుదీప్తోసేన్తోనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే సినిమా చేసింది. ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే నెగెటివ్ టాక్ సంపాదించుకొని అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందు ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో కేవలం మావోయిస్టుల హింసనే ఎక్కువ చూపించారని, సంచలనం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. విడుదల తర్వాత ప్లాప్ టాక్ రావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మే 17 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ 5 సంస్థ ఎక్స్(ట్విటర్) వేదికగా తెలియజేస్తూ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో అదాశర్మ మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్గా నటించింది. An internal war that has the country divided into two fractions. Watch the gruesome story of Naxal violence.#Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/IUFXrNnkqq— ZEE5 (@ZEE5India) May 8, 2024 -
Rahul Gandhi: వాళ్లది దాడి తంత్రం.. మాది పరిరక్షణ మంత్రం
జగ్దల్పూర్/భండారా: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పాటుపడుతుంటే దానిని నచ్చినట్లు సవరించే కుట్రకు బీజేపీ బరితెగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. లోక్‌సభ సమరంలో విజయం సాధించి అధికారం చేపట్టగానే దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుడతామని రాహుల్ పునరుద్ఘాటించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని బస్తర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈసారి జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసక సిద్ధాంతాల మధ్య పోరాటం. ఓవైపు కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’కూటమి రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క మోదీ, అదానీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. గిరిజన మహిళ అని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది బీజేపీ ఆలోచనాధోరణికి అద్దంపడుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. షెడ్యూల్ తెగలకు కేటాయించిన బస్తర్ ఎంపీ స్థానంలో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాకు మద్దతుగా రాహుల్ ఈ సభకు వచ్చి మాట్లాడారు. ఆదివాసీ.. వనవాసీ ‘‘ ఆదివాసీ పదాన్నే ప్రధాని వాడుక నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఆదివాసీ అంటే బీజేపీ వాళ్లు వనవాసీ అంటున్నారు. రెండు పదాల అర్ధాల్లో చాలా బేధముంది. ఆదివాసీ అంటే అడవితో మమేకమైన వాళ్లు అని అర్థం. ఆ పదం మీకు జలం, జంగిల్(అడవి), జమీన్(భూమి)పై మీకున్న హక్కులను ఎలుగెత్తి చాటుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనప్రాంతాల్లో స్వయంపాలనకు బాటలువేస్తూ గ్రామసభలకు అనుమతినిస్తూ పంచాయతీ చట్టాన్ని తెచ్చాయి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గిరిజనుల మత విశ్వాసాలు, సిద్ధాంతాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటవీ భూములను అదానీ లాంటి వాళ్లకు బీజేపీ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అడవులు కుచించుకుపోతున్నాయి’’ అని రాహుల్ అన్నారు. మేమొస్తే రైతు రుణమాఫీ మహారాష్ట్రలోని భండారా జిల్లా సకోలీ పట్టణంలో పార్టీ ర్యాలీలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘‘అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీచేస్తాం. నిరుద్యోగం, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ జనం జీఎస్టీ కడుతున్నారు. కోట్లు గడిస్తున్న వాళ్లూ అంతే జీఎస్టీ కడుతున్నారు. మోదీ హయాంలో 22 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద పోగుబడిన సంపద 70 కోట్ల మంది భారతీయుల ఆస్తితో సమానం. ఈ విషయం వదిలేసి మోదీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు’’ అని రాహుల్ అన్నారు. -
PM Narendra Modi: లూటీ లైసెన్స్ రద్దు చేశా
రాయ్‌పూర్/జగ్దల్పూర్/చంద్రాపూర్: దశాబ్దాలు గా పేదల అవసరాలు, వారి బాధలు అవినీతి కాంగ్రెస్‌కు పట్టలేదని ప్రధాని మోదీ విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ఛోటే అంబాల్ గ్రామంలో సోమవారం బీజేపీ ‘విజయ్ సంకల్ప్ శంఖనాదం’ ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘‘ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో అవినీతిని దేశ గుర్తింపుగా మార్చేశాయి. అధికారంలో ఉండటమంటే లూటీ చేయడానికి లైసెన్స్ సంపాదించినట్లుగా కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి పేదల బాధను కాంగ్రెస్ ఏనాడూ అర్ధంచేసుకోలేదు. అలాంటి పేదలు కోవిడ్ విలయకాలంలో ఏమైపోతారో అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. వాళ్లకేమీ కాదు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ఆహారధాన్యాలు అందిస్తానని ఆనాడే చెప్పా. మా ప్రభుత్వ కృషి కారణంగానే దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం కోరల నుంచి బయటపడ్డారు’’ అని చెప్పారు. పేదల హక్కులను కాంగ్రెస్ హరించింది ‘‘పేదల హక్కులను అవినీతి కాంగ్రెస్ మింగేసింది. 2014కు ముందు పలు కుంభకోణాలతో లక్షల కోట్ల ప్రజాధనం నొక్కేశారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించే ప్రతి రూపాయిలో లబ్ధిదారునికి కేవలం 15 పైసలే చేరుతున్నాయని స్వయంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీయే ఒప్పుకున్నారు. మిగతా 85 పైసలను ఎవరు కొట్టేశారు?. కాంగ్రెస్ కొనసాగించిన ఈ లూటీ లైసెన్స్ విధానానికి నేనే చరమగీతం పాడా. గత పదేళ్లకాలంలో బీజేపీ సర్కార్ లబ్దిదారుల ఖాతాలకు నేరుగా రూ.34 లక్షల కోట్ల మొత్తాలను బదిలీచేసింది. హస్తిన నుంచి విడుదలైన ప్రతి రూపాయి 100 శాతం పేదల చెంతకు చేరింది. ఇప్పటికీ కాంగ్రెస్సే అధికారంలో ఉండి ఉంటే ఈ రూ.34 లక్షల కోట్లలో 85 పైసలు అంటే రూ.28 లక్షల కోట్ల స్వాహా చేసేవారు’ అని మోదీ ఆరోపణలు గుప్పించారు. దేశంలో అన్ని సమస్యలకూ కాంగ్రెస్సే కారణం దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాకరకాయతో పోలి్చన ఆయన..నెయ్యిలో వేయించినా, చక్కెర కలిపినా కాకర రుచి మాత్రం మారదన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సోమవా రం ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఆయన స్థిరత్వానికి, అస్థిరతకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేందుకే ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకుంటున్నాయన్నారు. -
‘కొడుక్కి పిల్లను అడిగితే నాకు ఇచ్చారు’.. టికెట్ గురించే!
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బస్తర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు లోక్‌సభ టికెట్ దక్కిన వైనం గురించి హాస్యభరితంగా చెప్పారాయన. "ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తోంది. నాకు టిక్కెట్ ఎందుకు వచ్చింది.. నేను అడగలేదు. అంతగా అయితే నా కొడుక్కి నా ఇవ్వమన్నాను. నేను నా కొడుక్కి వధువును (టికెట్) అడిగాను. కానీ వారు నాకు ఇచ్చారు" అని హాస్యోక్తులు పూయించారు. అలాగే మోదీ పాలనను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు మన దేశం అమ్ముడవుతోందని, మన రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కవాసీ లఖ్మాపై జగదల్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దంతేశ్వరి ఆలయం ముందు నోట్లు పంచినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నోట్ల పంపిణీ సమాచారం అందిన వెంటనే మంత్రి కేదార్ కశ్యప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఇదివరకే మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. #WATCH | Lok Sabha elections 2024 | Congress candidate from Bastar (Chhattisgarh), Kawasi Lakhma says, "I am not contesting the elections, Congress party will contest the elections...Why did I get a ticket? I had not asked for one...If it is being insisted, give the ticket to my… pic.twitter.com/WSPUJ17I9O — ANI (@ANI) March 28, 2024 -
'ది కేరళ స్టోరీ మేకర్స్'.. మరో సెన్సేషనల్ మూవీ వచ్చేస్తోంది!
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుదీప్తో సేన్. అదా శర్మ ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వివాదాలు చుట్టుముట్టినప్పటీకి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రిలీజైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. ప్రస్తుతం జీ5 స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కేరళలో అమ్మాయిలను బలవంతంగా విదేశాలకు తరలించారన్న నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. ది కేరళ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మేకర్స్ మరో కాంట్రవర్షి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదాశర్మ- సుదీప్తో సేన్ కాంబినేషన్లో బస్తర్ అనే మరో చిత్రం వస్తోంది. నక్సలిజం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన మారణహోమం ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ చిత్రంలో ఆదాశర్మ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. -
బస్తర్ మూవీ టీజర్ రిలీజ్
-
పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?
గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఆదా శర్మ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదానికి దారితీసింది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తోన్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్లో పాకిస్థాన్‌తో పోరాడి కన్నుమూసిన జవాన్ల కంటే.. నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువగా ఉందంటూ అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్‌లో జరిగిన మారణహోమంలో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. -
మావోల బంకర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్మించిన బంకర్‌ను భద్రతాబలగాలు గుర్తించారు. బస్తర్ డివిజన్లో మావోయిస్టులు బంకర్లను నిర్మించి వినియోగిస్తున్న విషయం బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బస్తర్‌లో ఇలాంటివి ఉండొచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉందిగానీ ఇన్నాళ్లలో ఎన్నడూ ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు. బీజాపూర్–దంతెవాడ జిల్లాల మధ్య ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను గుర్తించేందుకు జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజాపూర్ జిల్లాలోని తోడోపాట్–ఉస్పారీ గ్రామ సమీప అడవిలో మంగళవారం ఈ బంకర్‌ను భద్రతా బలగాలు గుర్తించాయని దంతేవాడ అదనపు ఎస్పీ బర్మన్ చెప్పారు. ఈ సొరంగం 130 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో ఉంది. బంకర్ కనపడకుండా ప్రవేశమార్గాన్ని మట్టితో కూడిన కర్రలను కప్పి వాటిపైన చెట్ల పొదలను పరిచారు. మావోలు డంపింగ్ ప్రాంతంగానూ దీనిన వినియోగించినట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. జనవరి 9న మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. మైదాన ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తే డ్రోన్ల సాయంతో జాడ కనిపెట్టే అవకాశం ఉండటంతో ఇటీవలే ఈ బంకర్ నిర్మించి సమావేశం జరిపి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇంద్రావతి నదిఒడ్డున ఏర్పాటు చేసిన ఈ బంకర్లో 100 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా దాక్కునేందుకు వీలుగా ఉంది. ఇలాంటి బంకర్లు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరిన్ని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు, వాటిని గుర్తించేందుకు అడవుల్లో సోదాలు గాలింపు ముమ్మరం చేశారు. అబూజ్మడ్ అడవుల్లో ఇలాంటివి ఎన్ని బంకర్లు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై భద్రతాదళాలకు కొత్త సవాల్‌గా మారినట్టయ్యింది. వచ్చే వేసవిలో విస్తృతంగా కూంబింగ్ చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న భద్రతాదళాలకు కనిపించని బంకర్లతో మరిన్ని చిక్కులు వచ్చి పడే అవకాశముంది. గాలి, వెలుతురు సోకేలా ఏర్పాట్లు బైరాంఘర్ పోలీస్‌స్టేషన్, భద్రతాదళాల బేస్ క్యాంప్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ బంకర్ ఉంది. బంకర్లోకి వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. గాలి, వెలుతురు సోకేలా ప్రతీ ఆరు మీటర్లకు ఒకటి చొప్పున ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే, ఇవి బయటకు కనిపించకుండా చెట్ల పొదలు అడ్డుపెట్టారు. మావో అగ్రనేతలు తలదాచుకునేందుకు ఉపయోగించుకోవడంతో పాటు మెరుపు దాడులకు వీలుగా దీనిని నిర్మించారని వార్తలొచ్చాయి. అయితే దీని నిర్మాణ వివరాలను భద్రతా బలగాలు ఇంకా అధికారికంగా బహిర్గతంచేయలేదు. -
ఛత్తీస్‌గఢ్: గిరిజన ప్రాంతాల్లో స్వీప్
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న పోల్ పండితుల అంచనాలను, ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ తలకిందులు చేసింది. సునాయాసంగా మెజారిటీ మార్కు దాటేసి భూపేశ్ బఘేల్ సర్కారును గద్దె దించింది. ఐదు సంవత్సరాల విరామం అనంతరం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 54 సీట్లు నెగ్గింది. రాష్ట్రంలో బీజేపీకి ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. గిరిజన ప్రాంతాలైన సర్గుజా, బస్తర్‌లను ఏకపక్షంగా కొల్లగొట్టడమే బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. బస్తర్, సర్గుజాలో హవా ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు షాకివ్వడం నిజమే అయినా బీజేపీని కూడా ఒకింత విస్మయపరిచాయనే చెప్పాలి. ఎందుకంటే బఘేల్ సర్కారు ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు ప్రధానంగా ఆయన పక్కాగా అమలు చేసిన పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలే కారణంగా నిలిచాయి. ముఖ్యంగా 2018లో రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో అధికారంలోకి రాగానే బఘెల్ ప్రవేశపెట్టిన వరికి బోనస్ పథకం రాష్ట్రంలో సూపర్‌హిట్టయింది. వరికి దేశంలోనే అత్యధిక బోనస్ ఇస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. పారీ్టలకతీతంగా అర్హులందరికీ పథకం ఫలాలు అందేలా బఘేల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఈసారి బీజేపీ గెలుపు అందరినీ ఆశ్చర్యపరిచిన పరిణామమే. గిరిజన ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలన్నింటినీ ఈసారి బీజేపీ ఏకపక్షంగా ఒడిసిపట్టడమే దాని మెజారిటీకి ప్రధాన కారణంగా నిలిచింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఉత్తరాదిన ఉన్న సర్గుజా రెండూ బీజేపీకి జైకొట్టాయి. బస్తర్‌లోని 12 స్థానాలకు గాను బీజేపీకి 9 స్థానాలు దఖలుపడ్డాయి. సర్గుజాలోనైతే మొత్తం 14 సీట్లను గాను బీజేపీ ఏకంగా 13 స్థానాలను దక్కించుకుంది. ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్ కంచుకోట కావడం విశేషం. రాజవంశీకుడైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావంతో సర్గుజా ప్రాంతంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆనాడు 14 స్థానాలకుకుగాను కాంగ్రెస్‌కు 12 సీట్లు దక్కాయి. ఈసారి పరిస్థితి దాదాపుగా తారుమారవడం విశేషం. ఇక్కడ బీజేపీ హవా దెబ్బకు చివరికి సింగ్‌దేవ్ సైతం ఓటమి చవిచూశారు. బస్తర్‌లో మాత్రం 3 స్థానాలతో కాంగ్రెస్ ఉనికి నిలుపుకోగలిగింది. రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్‌కు మొగ్గు ► గిరిజన ప్రాంతాలతో పోలిస్తే రాజధాని రాయ్‌పూర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శనే చేసింది. ►ఇక్కడి 20 స్థానాల్లో ఆ పార్టీ 11 సీట్లు నెగ్గింది. బీజేపీకి 9 స్థానాలు దక్కాయి. ►బిలాస్పూర్ ప్రాంతంలో బీజేపీ 13, కాంగ్రెస్ 10 చోట్ల గెలిచింది. పాలి తనఖర్లో గోండ్వానా గణతంత్ర పార్టీ గెలిచింది. ►దుర్గ్ ప్రాంతంలోనూ 20 స్థానాలుండగా బీజేపీ, కాంగ్రెస్ చెరో పదింటిని గెలుచుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిడ్మా చనిపోలేదు.. సేఫ్‌గా ఉన్నాడు
బస్తర్: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్కౌంటర్లో పోలీసుల ప్రకటనపై ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ ప్రకటించింది. బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడు.దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయి. గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా గగనతలం ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు, ప్రకటనలు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాల’’ని లేఖ ద్వారా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దండకారణ్యంలో దాక్కున్న ఈ మావోయిస్టు అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. హిడ్మా: చిక్కడు దొరకడు.. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? -
కృషి: ఇప్పపూల లడ్డు పసుపు మసాలా పానీయం
అడవి నుంచి దూరమయ్యాం.. పల్లె నుంచి పట్టణవాసంలో కరెన్సీ కోసం నిత్యం కసరత్తులు చేస్తున్నాం. కానీ, అడవి పంచే ఔషధం.. పల్లె ఇచ్చే పట్టెడన్నమే మనకు అమ్మ చేతి గోరుముద్దంత ప్రేమను అందిస్తుంది. అలాంటి ప్రేమకు వారధిగా నిలుస్తున్నారు గుంటూరు వాసి షేక్ రజియా. ఛత్తీస్‌గడ్‌లోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్థావరాలను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుని, ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’ పేరుతో సంస్థను నెలకొల్పి అక్కడి మహిళల చేత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. వాటికి పట్టణాల్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ విలువనూ.. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలనూ పెంచుతున్నారు. ఆరేళ్లుగా రజియా చేస్తున్న ఈ కృషి గురించి అడిగితే ఆమె ఎన్నో అడవి ముచ్చట్లను ఆనందంగా పంచుకున్నారు. ‘‘జగ్దల్పూర్లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ మెయిన్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి దంతెవాడ, బస్తర్‌లోనూ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆదివాసీలున్న చోటును వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడి ఒక యూనిట్‌ని తయారు చేస్తాను. అలా ఇప్పటివరకు పదికి పైగా యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదివాసీల ఆహార ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయిస్తుంటాను. వాటిని పట్టణవాసులకు మార్కెటింగ్ చేస్తుంటాను. వీటిలో.. మహువా (ఇప్పపూల) లడ్డూ, టీ పొడి, కుకీస్, పసుపు మసాలా, చింతపండు సాస్, ఇన్స్టంట్ చింతపండు రసం పౌడర్, చాక్లెట్స్, తేనె, సేంద్రియ బియ్యం, కారం, బెల్లం.. ఇలా 22 ఉత్పత్తులు ఉన్నాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్గడ్ మా నాన్నగారు గుంటూరులో ఉండేవారు. వ్యాపారరీత్యా ఛత్తీస్‌గడ్‌లో స్థిరపడ్డారు. అమ్మ, ఇద్దరు తమ్ములు, బాబాయ్ కుటుంబ సభ్యులు ..అందరం కలిసే ఉంటాం. అలా నా చదువు అంతా అక్కడే సాగింది. మైక్రోబయాలజీలో డిగ్రీ చేశాను. స్వచ్ఛమైన అడవి సౌందర్యం గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ అడవి బిడ్డల జీవనశైలి మీద నా చూపు ఉండేది. నా చదువులో భాగంగా మొక్కల పరిశోధనకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి, గిరిజనులను కలిశాను. అప్పుడు అక్కడి గ్రామాల్లో కొంతమంది మహిళలు మహువా (ఇప్పపూల) లడ్డూలను తయారుచేస్తున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇప్పపూలలో ఉండే పోషకాలను అడిగి తెలుసుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఇప్పపూలలో తలనొప్పి, విరేచనాలు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. చర్మ, కంటి సమస్యలతో సహా చాలా వ్యాధులకు ఔషధంగా వాడచ్చు. వంటకాలకు సహజమైన తీపిని అందిస్తాయి. దీంతో పోషకాహార నిపుణులు, మరికొంత మంది సాంకేతి నిపుణులు, ఆరుగురు గిరిజన మహిళలతో కలిసి అన్ని అనుమతులతో 2017లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ ప్రారంభించాను. సవాళ్లను ఎదుర్కొంటూ... ముందు ఈ బిజినెస్‌కి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘ఎందుకు కష్టం. ఉద్యోగం చూసుకోక’ అన్నారు. బ్యాంకులను సంప్రదిస్తే లోన్ ఇవ్వలేదు. మహువా లడ్డూలను రుచిగా తయారు చేయడంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. చాలా మంది ‘ఎందుకు ఇదంతా వృథా... ఇది ఫెయిల్యూర్ బిజినెస్’ అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. చాలాకాలంగా మన దేశంలో ఇప్పపూలను మద్యం తయారీలోనే వాడతారని తెలుసు. ఆదివాసీలే వీటిని ఉపయోగిస్తారు మనకెందుకు అనే అభిప్రాయమే ఉంది. వీటిలోని సానుకూల కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. అనుమతి కోసం చాలా మంది అధికారులను సంప్రదించాను. 2018లో ఒక ఐఎఎస్ ఆఫీసర్ రెండు నెలల ప్రోగ్రామ్‌కు అనుమతి ఇచ్చారు. లడ్డూల నాణ్యత పెంచడానికి చాలా ప్రయోగాలు చేశాం. మహువా లడ్డూల తయారీ మార్కెటింగ్ చేస్తే రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేర్చుకునేవారికి శిక్షణాలయం బస్తర్ ఫుడ్ ఫర్మ్ని ఇన్స్టిట్యూట్లా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆదివాసీల ఆహారాలు ఏవున్నాయో వాటిని బయటి ప్రపంచానికి చూపించాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం లండన్ కంపెనీతో కలిసి పని చేయబోతున్నాం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్ మోడల్‌గా రాబోయే తరానికి తెలియాలి. ఈ ఆలోచనతోనే ఆసక్తి గలవారు ఒక ఏడాది పాటు ఈ కోర్సు ప్రత్యక్షంగా నేర్చుకునేలా రూపొందించాను. నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా పని ఉంది. మరో రెండేళ్లలో ఇన్స్టిట్యూట్ సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టూడెంట్స్ గ్రూప్స్‌గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తిగలవారు నేర్చుకోవడానికి మా సంస్థను సంప్రదిస్తున్నారు’’ అని ఆనందంగా వివరించారు రజియా. పల్లెవాసుల మధ్య పని చేయాలని, కొత్త మార్గాలను అన్వేషించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, అనుకున్నంతగా ఆచరణలో పెట్టలేరు. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ పల్లెకు–పట్టణానికి వారధిగా నిలుస్తున్న రజియా లాంటివారు యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ! ‘ఈ కన్సల్టెన్సీ మీద కొంత ఆదాయం వస్తుంది. దానిని పని చేస్తున్న మహిళలకే పంచుతాం. ఇక్కడి మహిళలకు పని వచ్చు కానీ మార్కెటింగ్ తెలియదు. ఊరు దాటి బయటకు వెళ్లలేరు. చదువుకున్న వారికి పట్టణ వాతావరణం గురించి తెలియదు. వారి ప్రతిభకు మేం సపోర్ట్‌గా ఉన్నాం. నక్సలైట్స్ సమస్యలూ వస్తుంటాయి. అడవుల్లోని మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి ఫుడ్ దొరకదు. అక్కడి ఆదివాసీలు త్వరగా అర్థం చేసుకోరు. వారి భాష మనకు రాదు. వాళ్ల భాషల్లోనే విషయం చెప్పాలన్నా కొంచెం సమస్యే. కానీ, వాటిని అధిగమిస్తేనే ఏదైనా చేయగలం. ఒక్కసారి వారికి అర్థమైతే మాత్రం మనమంటే ప్రాణం పెట్టేస్తారు. అంతబాగా చూసుకుంటారు. వాళ్లదగ్గర ఉన్న ప్రతిభను పట్టణానికి పంచే పనిని చేస్తున్నాను.’ పల్లెకు–పట్టణానికి వారధి ‘ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్‌కి అనుకూలంగా ఉందనుకుంటే అక్కడకు మా యూనిట్ కూడా మారుతూ ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ పది మంది ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెట్రో సిటీస్‌లో ప్రమోషన్స్ కోసం చురుగ్గా ఉండాలి. అందరికీ పల్లె ఉత్పత్తులు ఇష్టమే. కానీ, అందరికీ అవి లభించేదెలా? అందుకే, నేను పల్లెకు–పట్టణానికి వారధిగా మారాను. నేను చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల యుఎస్ వెళ్లడానికి ఫెలోషిప్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి పని చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఉత్పత్తులకు మరింత ఎక్స్పోజర్ పెరిగింది. మంచి పేరు వచ్చింది.’ – నిర్మలారెడ్డి -
రాముడు మా ఊరొచ్చాడు.. 14 ఏళ్ల వనవాసం ఇక్కడే
ప్రకృతి పచ్చదనం మధ్య అచ్చంగా అడవి బిడ్డల ఆనందడోలికలలో సాగే వేడుక ఇది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్‌లో దసరా రెండున్నర నెలల పండగ. విజయదశమికి 75 ముందే మొదలవుతుంది. ఈ దండకారణ్య వేడుకలో ఆదివాసీలు ఆనందంగా పాల్గొంటారు. ఈ పండగకు దంతేశ్వరీ దేవిని పూజిస్తారు. ఆదివాసీలు రాముడిని తమ అతిథిగా భావిస్తారు. పద్నాలుగేళ్ల వనవాసం చేసింది తమ దగ్గరే అని చెబుతారు. జాతికులమతాల పరిధులేవీ లేని వేడుకలివి. రథయాత్ర కోసం ఏటా అడవిలో కలపను సేకరించి ఎనిమిది చక్రాల కొత్త రథాన్ని తయారు చేస్తారు. రథం కోసం కలప సేకరణ ఈ వేడుకలో తొలి ఘట్టం. ఆ వేడుకను పత్ జాతర అంటారు. చదవండి: Beauty of Nature: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! పదవ రోజు మురియా దర్బార్తో వేడుకలు ముగుస్తాయి. బస్తర్ ప్రజలు దర్బారులో తమ సమస్యలను రాజుకు విన్నవించుకునే ఘట్టం అది. బస్తర్ దసరా వేడుకల్లో ఘోతుల్ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది యువతీయువకులకు తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పించే వేడుక. గుజరాత్ నవరాత్రి వేడుకలో గర్భా నాట్యంలాగ అన్నమాట. దసరా వేడుకల సమయంలో బస్తర్ యాత్రకు వెళ్తే ఆదివాసీ సంగీతవాద్యాలు, నాట్యరీతులు, వస్త్రధారణను చూడవచ్చు. ఆదివాసీ మహిళలు ఎర్రటి సంప్రదాయ దుస్తులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహించే వేడుకలో రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు. చదవండి: Chowmahalla Palace: ప్యాలెస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?! -
ఆకాశంలో యుద్ధం మొదలైందా?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తమపై డ్రోన్ల సాయంతో బాంబు వేశారని ఆరోపించారు. ఏప్రిల్ 19వ తేదీని చీకటి దినంగా లేఖలో అభివర్ణించారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొత్తలంక, పాలగూడెం గ్రామాల సరిహద్దులో డ్రోన్ల సాయంతో 12 బాంబులు జారవిడిచారని పేర్కొన్నారు. మావోయిస్టులపై ఆకాశమార్గం ద్వారా జరిగిన ఈ దాడిని అన్ని వర్గాలవారు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ మేరకు దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. ఈ దాడిలో పశుపక్షాదులు, వృక్షాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఏప్రిల్ 3న బీజాపూర్‌లో భద్రతా బలగాలపై తాము జరిపిన దాడికి ఇది ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఆ దాడితో నీరుగారిపోయిన స్థానిక పోలీసులు, ఇక్కడ మైనింగ్ చేపట్టాలనుకుంటున్న కార్పొరేట్ శక్తుల్లో తిరిగి మనోధైర్యం కూడగట్టేందుకే ఈ వాయుదాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ చర్యలు వదిలి మావోల ఏరివేతపై దృష్టి సారించడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. ఆకాశ యుద్ధం మొదలైందా? ఈ పరిణామాలు చూస్తుంటే మావో–భద్రతా బలగాల మధ్య ఆకాశయుద్ధం మొదలైందా అన్న చర్చ మొదలైంది. డ్రోన్ దాడి జరిగిందని మావోలు, తాము చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే దేశ చరిత్రలో మావోలు, భద్రతా బలగాల పోరులో జరిగిన తొలి వాయుదాడి ఇదే అవుతుంది. మావోల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ ప్రహార్’మొదలుపెట్టిందని మావోలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే వాయు దాడులు జరిగాయంటున్నారు. అయితే స్థానిక ఎస్పీ కశ్యప్ ఈ విషయంపై స్పందించలేదు. మరోవైపు బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాత్రం మావోల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మావోల కేడర్‌లో ఉన్న ఆధిపత్య పోరులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు. తాము స్థానిక ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వారు అమర్చిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్)లతో మహిళలు, చిన్నారులు సహా వేలాది మంది మరణాలకు మావోలే కారణమని ఆరోపించారు. బుధవారం కూడా ఐఈడీ కారణంగా ఓ ఐటీబీపీ జవాను గాయపడగా, ఓ ఆవు మరణించిందని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. స్థానికంగా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వాడే డ్రోన్ల సామర్థ్యం చాలా తక్కువని, అవి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతాయని, 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణిస్తాయని చెబుతున్నారు. అందులోనూ అవి నిఘా సంబంధిత సమాచారం మాత్రమే సేకరిస్తాయని, వీటికి బాంబులు మోసుకెళ్లే శక్తి లేదని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ డ్రోన్ దాడి జరిగి ఉంటే అవి బీజాపూర్‌కు సమీపంలో ఉన్న బిలాయ్ (389 కి.మీ.), జగదల్పూర్ (189 కి.మీ.), హైదరాబాద్ (301 కి.మీ.) నుంచి వచ్చి ఉండాలని స్థానికంగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నగరాల్లో మాత్రమే దాడి చేసే డ్రోన్లను నియంత్రించగలిగే సాంకేతికత అందుబాటులో ఉందన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఎందుకీ ఘర్షణ.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని బస్తర్ డివిజన్లో ‘జనతన సర్కార్’ పేరిట సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టు పార్టీకి, పోలీసు బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. సాధారణ పౌరులకు హాని కలగకుండా, ఆస్తులకు నష్టం జరగకుండా బలగాలు పోరు చేస్తుండగా.. ఆదివాసీల మద్దతు తీసుకుంటూ మావోయిస్టులు యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, బస్తర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లాల్లో బలగాలు, మావోల మధ్య పోరుతో దండకారణ్యం రక్తసిక్తం అవుతోంది. ఈ పోరులో వేలాది మంది మావోయిస్టులు, బలగాలు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 3న బీజాపూర్ జిల్లా తెర్రెం–జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోల వ్యూహాత్మక దాడిలో 23 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వియత్నాం తరహా గెరిల్లా యుద్ధతంత్రాన్ని మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్జీఏ దండకారణ్య ఆర్మీ కమాండర్ మడవి హిడ్మా ఆధ్వర్యంలో అమలు చేశారు. హిడ్మా ఫిలిప్పీన్స్‌లో ఈ తరహా శిక్షణ పొంది వచ్చాడు. -
నెత్తురోడిన బస్తర్
నిరంతరం ఉద్రిక్తతలతో నిండివుండే మధ్య భారతంలో మరోసారి అత్యంత విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్–సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో శనివారం మావోయిస్టులు జరిపిన దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 31మంది గాయ పడగా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక జవాన్‌ను వారు అపహరించుకెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో 20 మంది మావోయిస్టులు కూడా మరణించారని అంటు న్నారు. ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యంగానీ, ఆపరేషన్ సంబంధమైన వైఫల్యంగానీ లేదని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కులదీప్ సింగ్‌లు చెబుతున్నా... దాడి జరిగిన జరిగిన తీరుపై వెలువడుతున్న కథనాలు గమనిస్తే మావోయిస్టులు ఒక పథకం ప్రకారం జవాన్లను పక్కదోవపట్టించి, తాము కోరుకున్న చోటుకు వారిని రప్పించి, ఒక్కుమ్మడిగా దాడిచేసి హతమార్చారని అర్థమవుతుంది. 2010లో చింతల్నార్ ప్రాంతంలో ఇదే తరహాలో దాడిచేసి 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు బలితీసుకున్నారు. 2017లో 25 మంది, 2018లో తొమ్మిదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ తరహా దాడుల్లోనే మరణించారు. మొత్తంగా ఇంతవరకూ దాదాపు 180 మంది భద్రతా సిబ్బందిని వారు హతమార్చారని గణాంకాలు చెబుతున్నాయి. పది పదిహేనేళ్లక్రితంతో పోలిస్తే మావోయిస్టుల ప్రాబల్యం దేశంలో క్రమేపీ తగ్గుతూ వస్తోంది. గతంలో వారి ప్రభావం వున్న తెలుగు రాష్ట్రాలు, ఒడిశా వంటిచోట్ల ఇప్పుడు దాదాపు శూన్యం. ఒకప్పుడు మావోయిస్టులదే పైచేయిగావున్న మధ్యభారతంలో కూడా ఇప్పుడు పరిస్థితి మారిందనే చెప్పాలి. వారు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మారుమూల ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. అడపా దడపా జరిగే ఎన్కౌంటర్లలో మావోయిస్టులు చనిపోతుండటంతో భారీ సంఖ్యలో శ్రేణులు పాల్గొనే దాడు లను వారు ఎంచుకుంటున్నారు. ఈ దాడుల్లో అవతలి పక్షానికి భారీగా నష్టం కలిగిస్తే తమ ప్రాబల్య ప్రాంతాల్లో ఆత్మసై్థర్యం నింపవచ్చని వారు భావిస్తున్నట్టు కనబడుతోంది. ఇలాంటి దాడులకు అవకాశం వుందని తెలిసినప్పుడు సీఆర్పీఎఫ్ బలగాలు మరింత అప్రమత్తంగా మెలగాల్సింది. కానీ ఛత్తీస్‌గఢ్ ఉదంతం గమనిస్తే తగిన ముందుజాగ్రత్తలు లోపించాయన్న సంశయం కలుగుతుంది. భౌగోళికంగా మధ్యభారతం చాలా దేశాలతో పోలిస్తే ఎంతో పెద్దది. ముఖ్యంగా బస్తర్, కంకేర్, నారాయణ్‌పూర్, కొండగావ్, దంతేవాడ, సుక్మా, బీజాపూర్లతోకూడిన బస్తర్ డివిజన్ దట్టమైన అడవులతోవుంటుంది. దండకారణ్యంగా పిలిచే ఆ ప్రాంతంలోకి ప్రవేశించటం అన్యులకు అంత సులభం కాదు. అక్కడ పాలనాధికార వ్యవస్థ దాదాపు వుండదు. పక్కా రోడ్లుగానీ, పకడ్బందీ కమ్యూనికేషన్ల వ్యవస్థగానీ లేవు. గతంలో మావోయిస్టుల్లో పనిచేసి వెనుదిరిగిన ఆదివాసీల్లో కొందరిని పోలీసులు సల్వా జుడుం పేరుతో చేరదీసి, వారితో దాడులు చేయించేవారు. అయితే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆదివాసీ గ్రామాలు నిలువునా చీలి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది. సల్వాజుడుం బాధితులు మావోయిస్టులను ఆశ్రయించే స్థితి ఏర్పడింది. అదృష్టవ శాత్తూ సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకుని చట్టవిరుద్ధమైన సల్వాజుడుంను వెంటనే రద్దు చేయమని ఆదేశా లిచ్చింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నక్సల్ సమస్య భద్రతాపరంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో అతి పెద్దదని వ్యాఖ్యానించారు. తాము ఇకపై కఠిన వైఖరి అవలంబించబోతున్నామని 2014లో అధికారంలోకొచ్చాక ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రకటించారు. కానీ ఆ సమస్యను ఎదుర్కొనటంలో, దానికొక పరిష్కారాన్ని సాధించటంలో ఇన్నే ళ్లుగా వరస వైఫల్యాలు ఎదురుకావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి ఎన్డీఏ ప్రభుత్వం కూడా మావోయిస్టుల సమస్యలో ఇమిడివున్న ఆదివాసీ హక్కులు తదితరాలపై దృష్టి పెట్టింది. మొదట్లో కేంద్ర హోంమంత్రిగా వున్న రాజ్‌నాథ్ సింగ్ మావోయిస్టులను ఎదుర్కొ నడానికి ప్రకటించిన నాలుగంచెల వ్యూహంలో భద్రతతోపాటు ఆదివాసీ హక్కులు, అభివృద్ధి కూడా వున్నాయి. కానీ అది సక్రమంగా అమలు కాలేదు. ఆదివాసీల హక్కుల కోసం ఆయుధం పట్టామని చెబుతున్న మావోయిస్టులు తమ చర్యల్లోని నిరర్థకత గురించి ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించటానికి, ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేవనుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడటానికి ఎప్పుడూ అవకాశం వుంటుంది. అలాంటి ఉద్యమాలకు ప్రజానీకం మద్దతు కూడా లభిస్తుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రైతు ఉద్యమం అందుకు ఉదాహరణ. ఆ ఉద్యమం తీసుకొచ్చిన ఒత్తిడి పర్యవసానంగా సాగు చట్టాల అమలును సైతం కేంద్రం వాయిదా వేసుకోకతప్పలేదు. ఆమధ్య సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన ముస్లిం మహిళల ఉద్యమం కూడా అటువంటిదే. ఈ ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కాదు. కానీ జాతీయంగా, అంతర్జాతీయంగా ఆ ఉద్యమాలకు విశాల ప్రజానీకం మద్దతు లభిం చింది. అందుకు భిన్నంగా సాయుధ పోరాట పంథాను ఎన్నుకుని హింసకు పాల్పడటం వల్ల మరిన్ని బలగాలు రంగంలోకి దిగుతాయి. కూంబింగ్ పేరుతో వారు చేపట్టే చర్యల వల్ల సాధారణ పౌరుల జీవనం దుర్భరమవుతుంది. కనుక మావోయిస్టులు ఇటువంటి హింసాత్మక విధానాలకు స్వస్తి పలకాలి. చదవండి: ఇక సన్యాసమే శరణ్యమా! -
వింత వివాహం: ఓ వరుడు.. ఇద్దరు వధువులు
రాయ్‌పూర్ : ఓ వ్యక్తి ఇద్దరు యువతుల వివాహ ఉదంతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ సమీపంలో ఉన్న 'తిక్రాలొహంగా' అనే గ్రామంలో ఇటీవల వివాహం జరిగింది. వివాహం జరిగితే వింతేముంది అనుకుంటున్నారా? వింతే మరి. ఒక వరుడు, ఇద్దరు వధువులు. ఒకే కళ్యాణ మండపంలో ఇద్దరు యువతులకు తాళి కట్టి 7 అడుగులు వేశారు. వరుడి పేరు చందు మౌర్య, వధువులు హసీనా (19), (సుందరి) 21. వీరిద్దరూ ఇంటర్ వరకు చదవివారు. వరుడికి గతంలో ఈ ఇద్దరు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి విషయం వచ్చే సరిగి వరుడికి ఎవరిని వదులుకోవాలో తట్టలేదు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడుకుని ఇద్దరి యువతుల్ని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి గ్రామ పెద్దలందరూ అంగీకారం తెలిపారు. ఒకే వేదికపై ఒక యువకుడు ఇద్దరు యువతులతో వివాహం చేసుకోవటం ఛత్తీస్‌గఢ్ లో మొదటి ఘటనగా స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని పోలీసులు తెలిపారు. అయితే రెండో వివాహం తమ ఆచారమని *ఇందులో వింతేముందని గిరిజనులు అనటం కొసమెరుపు. -
మావోయిస్టుల ఊచకోత.. 25 మంది హత్య
బస్తర్ : ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా 25 మంది గిరిజనులు హతమార్చి ఊచకోతకు పాల్పడ్డారు. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీస్ అధికారులు నియమించిన 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8 మంది ఇన్ఫార్మర్లను ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మద్దతుతో ప్రజా కోర్టులో శిక్షించామని పేర్కొంది. ఉద్యమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, విప్లవోద్యమాన్ని కాపాడేందుకు ఈ చర్యకు ఉపక్రమించామని తెలిపింది. ఈ ఘటనకు బస్తర్ పోలీస్ ఐజీ సుందర్ రాజ్, బీజాపూర్ ఎస్పీలే అని మావోయిస్ట్ పార్టీ తన ప్రకటన ద్వారా వెల్లడించింది. గతకొంతకాలంగా వీరు మావోయిస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. ‘ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు వస్తున్నారని, పోలీసులే బాంబులు పెట్టి అమాయకులు చంపి తమపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 8 మంది పార్టీ నేతలను ఎన్కౌంటర్ చేశారు. కార్యకర్తలను హత్య చేశారు. డీజీపీలు, ఐజీలు హెలికాప్టర్లలతో తిరుగుతూ, కూంబింగ్ చేస్తూ ప్రజలను భయకంపితులకు గురిచేస్తున్నారు. ఈ పాశవిక దామనకాండను ఖండిస్తూ 25 మంది ఏజెంట్లను ప్రజాకోర్టులో శిక్షించాం’ అని మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేర్కొంది. -
ఒకే నియోజకవర్గం..80,000 మంది పోలీసులు..
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో కట్టదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇవ్వడం, పోలింగ్‌కు రెండు రోజుల ముందు బీజేపీ ఎమ్మెల్యే భీమా మాందవి, నలుగురు పోలీసు సిబ్బందిని మావోలు హతమార్చడంతో బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో 80,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. మావోల దాడి జరిగిన దంతెవాడ బస్తర్ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నియోజకవర్గంలో 1879 పోలింగ్ కేంద్రాలకు గాను 741 పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యసాత్మకంగా, 606 సమస్యాత్మక బూత్‌లుగా గుర్తించారు. మావోల హెచ్చరికల నేపథ్యంలో 289 పోలింగ్ కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా డ్రోన్లను సైతం వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. -
‘బస్తర్’ మే సవాల్
మహారాష్ట్రలోని గడ్చిరోలి.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్.. గిరిజన నియోజకవర్గాలు. అటవీ హక్కుల చట్టంపైనే అన్ని కళ్లూ పెట్టుకున్నారు ఇక్కడి ఆదివాసీలు. భూమి హక్కులు కాపాడే వారికే ఓటేస్తామంటున్నారు. మరోవైపు మావోయిస్టులు ఇక్కడ ఎన్నికల్ని అడ్డుకునేందుకు బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం బస్తర్‌లోని దంతేవాడకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి జరిపి, ఆయనతో సహా నలుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. దీంతో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం బస్తర్‌లో 80 వేల భద్రతా బలగాలను, డ్రోన్లను మోహరించింది. భారీ ఏర్పాట్ల మధ్య నేడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గడ్చిరోలిలో అటవీ హక్కుల చట్టం ప్రభావం మహారాష్ట్రలోని గడ్చిరోలి చిముర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఢీకొంటున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అశోక్ నేతే, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ నామ్‌దేవ్ ఉసెంది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. మోదీకి వున్న జనాకర్షణ తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని బీజేపీ భావిస్తుండగా, ఎన్సీపీ, సీపీఐ పొత్తుతో తాము గట్టెక్కగలమని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎటపల్లి – భమ్రాగర్ మైనింగ్ బెల్ట్‌లో పెసా, అటవీ హక్కుల చట్టాలు అమలు చేయకపోవడంపై ఇక్కడ ఆదివాసీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అంశం ఎన్నికల్లో కీలకం కానున్నదని గడ్చిరోలి మారుమూల ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గిరిజనుల అటవీ హక్కులు పరిరక్షించకపోవడమనేది బీజేపీకి నష్టదాయకంగా పరిణమించగలదన్న అభిప్రాయం వినపడుతోంది. గడ్చిరోలిలో 90.85 శాతం మంది గ్రామీణులు. 30.50 శాతం మంది ఆదివాసీలు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడిన గడ్చిరోలి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై నేతే 2014లో ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవడం, దీనికి తోడు ఆయన ఓ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకోవడం అనే అంశాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. 42 శాతం ఓబీసీల ఓట్లు ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. తమ రిజర్వేషన్ కోటాను 19 నుంచి 6 శాతానికి తగ్గించడంపై వీరు ఆగ్రహంతో వున్నారు. కోటాను పునరుద్ధరింపచేస్తామని రెండు ప్రధాన పార్టీల నేతలూ హామీలిచ్చారు. భూమి హక్కులే ‘బస్తర్’ ఎజెండా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భూమి హక్కే ప్రధాన ఎజెండా. అటవీ హక్కుల చట్టం కింద అడవులపై ఆధారపడి జీవించే హక్కు తమకు ఉందంటున్న ఆదివాసీలు.. తమ భూముల జోలికి రాబోమని ప్రకటించే వారికే ఓటు వేస్తామంటున్నారు. ‘జాతీయవాదం ఇక్కడ ఓట్లు రాల్చదు. జీవనాధారమైన భూమే మాకు అతి ముఖ్యం’ అంటున్నారు స్థానికులు. అడవుల్లో నివసించేందుకు అనర్హులైన ఆదివాసీలను దురాక్రమణదారులుగా గుర్తించి జూలై లోపు ఖాళీ చేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇక్కడి ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇటీవల నిరసన ప్రదర్శనలు జరిపి, కరపత్రాలు పంచారు. ఏ ఒక్కరినీ అడవుల నుంచి ఖాళీ చేయించబోమని ముఖ్యమంత్రి భాగెల్ హామీ ఇచ్చిన తర్వాతే వారు శాంతించారు. మోదీ ప్రభుత్వం కోర్టులో ఆదివాసీల తరఫున తన వాదన సరిగా వినిపించలేకపోయిందని, వారి హక్కులకు రక్షణ కల్పించలేకపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కొంటా, బస్తర్, చిత్రకూట్, కొండగావ్, జగదల్పూర్, దంతేవాడ, బీజీపూర్, నారాయణపూర్ అనే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్టీ జనాభా 70 శాతం. బీజేపీ తరఫున ఆ పార్టీ బస్తర్ జిల్లా నేత బైదురామ్ కశ్యప్.. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ లీడర్ దీపక్ బైజ్‌తో తలపడుతున్నారు. 1998 నుంచి బీజేపీ ఖాతాలో వున్న బస్తర్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్.. ఈసారి చిత్రకూట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దీపక్‌కు టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి కంటే ఈ యువకుడికే ప్రజాదరణ ఎక్కువ వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో టాటా గ్రూప్ కోసం బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగిచ్చేయడమనేది ఆదివాసీల్లో కాంగ్రెస్ ఆదరణకు దోహదపడగలదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బస్తర్ సిట్టింగ్ ఎంపీ దినేశ్ కశ్యప్‌పై స్థానికుల్లో చోటుచేసుకున్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుంది. పలు సమస్యలతో సతమతమవుతున్న నియోజకవర్గాన్ని ఎంపీ ఏనాడూ సందర్శించలేదని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత మూడు మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరచడం, ప్రత్యేకించి రుణమాఫీ అమలు చేయడం, బీజేపీ సర్కారు స్వాధీనం చేసుకున్న గిరిజనుల భూములను తిరిగివ్వడం వంటి చర్యలు తమకు లాభిస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ నేత కవసి లక్మా. మరోవైపు కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ లోక్‌సభ స్థానంలో దంతేవాడ మినహా మిగిలిన సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు దంతేవాడలో మావోయిస్టులు పేల్చిన మందు పాతరలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. బీఎస్పీకి చెందిన ఆయుతు రామ్ మండవి, సీపీఐకి చెందిన రాము రామ్ మౌర్య సహా మొత్తం ఏడుగురు అభ్యర్థులు ఇక్కడ బరిలో వున్నారు. మొబైల్ ఫోన్లు వాడుకోగల పరిస్థితి కూడా ఈ నియోజకవర్గంలో అంతగా లేదు. రహదారులకు దగ్గరగా వుండే కొన్ని ఇళ్లలోనే ఇక్కడ టీవీలుంటాయి. బీజేపీ, కాంగ్రెస్లంటే ఇక్కడ పువ్వు, చేతి గుర్తులే. మావోయిస్టుల ఆదేశాల ప్రభావమే ఎక్కువ. మావోల బెదిరింపులు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు కొన్ని ప్రాంతాల్లో తొలగించి, దగ్ధం చేశారు. మరోవైపు మావోల భయంతో అభ్యర్థులు భమ్రాగర్, సిరోంచ, అహేరి, ధనోరా, ఎటపల్లి సహా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారానికి దూరంగా వున్నారు. బెదిరింపుల నేపథ్యంలో జనం ఎన్నికల సభలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు నేతే. ఉసెంది మారుమూల ప్రాంతాల్లో కొద్ది మేర ప్రచారం జరిపారు. మావోయిస్టుల హింసకు సంబంధించి ఇక్కడ 2014లో 15 కేసులు, 2009లో 18 కేసులు నమోదయ్యాయి. 2004లో ఎదురు కాల్పుల ఘటనలు సహా మొత్తం 23 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మందు పాతర పేలుళ్లలో ఇద్దరు పోలీసులు మరణించారు. గత ఏప్రిల్‌లో భద్రతా దళాలు కస్నాసుర్ గ్రామం వద్ద 40 మంది అనుమానిత మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగా మావోలు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేసి, అరడజను మంది గ్రామస్తులను చంపేశారు. -
అక్కడ ‘హక్కుల’ ఊసెత్తితే జైలే గతి!
-
అక్కడ ‘హక్కుల’ ఊసెత్తితే జైలే గతి!
‘బస్తర్’లో పోలీసుల జబర్దస్తీ - ఛత్తీస్‌గఢ్ జైలులో తెలంగాణ హక్కుల నేతల బృందం - ఎన్కౌంటర్లు, అత్యాచారాలపై నిజనిర్ధారణ కోసం పయనం - భద్రాచలంలోనే అరెస్ట్.. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగింత! - మావోయిస్టులకు సాయం చేస్తున్నారంటూ అభియోగాలు - 13 ఏళ్ల బాలుడి ‘ఎన్కౌంటర్’ నిజనిర్ధారణను అడ్డుకున్న వైనం - ఆ ఎన్‌కౌంటర్‌పై కేసు వేసిన న్యాయవాదికీ బెదిరింపులు - అంతకుముందు నందినీ సుందర్‌పైనా హత్య కేసు నమోదు - ఇద్దరు పాత్రికేయుల అరెస్టులు.. మరికొందరికి వేధింపులు (సాక్షి నాలెడ్జ్ సెంటర్) తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు హక్కుల కార్యకర్తలు గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్ జైలులో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదికకు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24వ తేదీన ఛత్తీస్‌గఢ్ బయలుదేరింది. అయితే.. 26వ తేదీన వారిని నిర్బంధించిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు.. మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న ఆరోపణలతో కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండు విధించి సుకుమా జైలుకు పంపించింది. బెయిల్ దరఖాస్తులనూ తిరస్కరించింది. జనవరిలో కూడా వారి బెయిల్ దరఖాస్తులను దంతెవాడ జిల్లా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఎఫ్ఐఆర్ నకలు కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న వస్తువల వివరాలు, పంచనామా నివేదికలు కానీ డిఫెన్స్ న్యాయవాదులకు ఇవ్వలేదు. ప్రస్తుతం హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ (36), ఆదివాసీ తుడుం దెబ్బ ఖమ్మం కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య (45), హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయులు బి.ప్రభాకర్ రావు (52), రాజేంద్రప్రసాద్ (28), హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్‌రావు (48), బి.రవీంద్రనాథ్ (42), ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మొహమ్మద్ నిజామ్లు ఉన్నారు. నిజానికి.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఈ బృందాన్ని 25వ తేదీన భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం గ్రామంలో తెలంగాణ పోలీసులే నిర్బంధించారని, తర్వాత వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించారని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. వీరు ఏడుగురూ మావోయిస్టు పార్టీకి సాయం చేస్తున్నారని, వాళ్లు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, రూ. లక్ష విలువైన రద్దు చేసిన నోట్లు, మొబైల్ ఫోన్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆరోపించారు. నక్సలైట్ల కోసం పాత కరెన్సీని మార్చి ఇస్తున్నారని, మావోయిస్టులకు సాయం చేయాలని స్థానికులపై ఒత్తిడి తెస్తున్నారని అభియోగాలు మోపారు. నిజానికి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముఖ్యంగా బస్తర్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బూటకపు ఎన్కౌంటర్లు, పోలీసుల దౌర్జన్యాలు, గిరిజన మహిళలపై అత్యాచారాల ఉదంతాలపై గళమెత్తుతున్న హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులపై ఏడాది కాలంగా పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయని వివిధ ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హక్కుల గురించి మాట్లాడినా, అత్యాచారాల గురించి కథనాలు రాసినా.. హక్కుల నేతలు, పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపడం పరిపాటిగా మారిందని పలు సంఘటనలను ఉదహరిస్తూ కేంద్ర మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టులకు కూడా లేఖలు రాశాయి. 13 ఏళ్ల బాలుడి ‘ఎన్కౌంటర్’ కేసు: వాస్తవానికి 2016 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాల ‘ఎన్కౌంటర్’లలో 134 మంది చనిపోయారు. ఆ బలగాలు లైంగిక హింసకు పాల్పడిన మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బృందం నిజనిర్ధారణ పర్యటనలో భాగంగా.. బీజాపూర్ జిల్లా మెటపల్ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు సోమారు పొట్టం ‘ఎన్కౌంటర్’ మరణానికి సంబంధించి కూడా పరిశీలించనుంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు డిసెంబర్ 16న 13 ఏళ్ల బాలుడు సోమారును పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్పూర్ హైకోర్టులో బాలుడి తండ్రి పిటిషన్ వేశారు. అతడిని పోలీసులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, గ్రామస్తులందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని బిలాస్పూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించారు. న్యాయవాదల అరెస్టులు, బెదిరింపులు: ఈ కేసులో నిజనిర్ధారణ చేయనున్న టీడీఎఫ్ బృందాన్ని ముందుగానే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతేకాదు.. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే.. జగదల్పూర్ న్యాయ సహాయ బృందానికి చెందిన శాలినీ గేరా అనే న్యాయవాది.. మావోయిస్టులకు రూ. 10 లక్షల కొత్త నోట్లు మార్చినట్లు, ఆమె దంతెవాద అడవుల్లో మావోయిస్టులను కలిసినట్లు తమకు ఫిర్యాదు అందిందంటూ.. బస్తర్ ఎస్పీ ఆర్.ఎన్.దాష్ ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. డిసెంబర్ 26వ తేదీన ఒక ఎస్ఐ ఆమె బసచేసిన ప్రాంతానికి వెళ్లి ఆమె గదిని సోదా చేయాలని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారు. ఆమె ఎవరో కాదు.. పోలీసుల చేతుల్లో హతమైన 13 ఏళ్ల బాలుడి ఎన్‌కౌంటర్‌పై అతడి తల్లిదండ్రుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవ్యాది. ఆ బాలుడి మృతదేహానికి మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహిస్తుండగా దానిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రభుత్వ అధికారులతో కలిసి ఉన్న ఆమెకూ బెదిరింపులు తప్పలేదు. ప్రముఖ ప్రొఫెసర్లకూ కేసుల వేధింపులు: అంతేకాదు.. డిసెంబర్ మొదటి నెలలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ అర్చనాప్రసాద్ తదితరుల మీద సుక్మా జిల్లాలో హత్య కేసు నమోదు చేశారు. నవంబర్ 4వ తేదీన రాష్ట్రంలో హత్యకు గురైన ఒక గిరిజనుడి భార్య ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బస్తర్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నందినీ సుందర్ ఎంతో కాలంగా హక్కుల విషయాలపై పని చేస్తున్నారు. ఆమె వేసిన పిటిషన్ వల్లనే మావోయిస్టు వ్యతిరేక సాల్వాజుడుంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కృషికి ప్రతీకారంగా తనను వేధించడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని నందినీ ఆరోపించారు. దానికి ముందు సామాజిక కార్యకర్త డాక్టర్ బినాయక్సేన్ను కూడా ఇదే విధంగా వేధించారు. డిసెంబర్ 19వ తేదీన దంతెవాడ జిల్లాలో సమావేశం నిర్వహించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త సుకుల్ ప్రసాద్ బార్సేను కూడా పోలీసులు వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత నెలలో గిరిజన కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన సోనీ సోరి.. ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నారు. అంతకుముందు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాలినీ సుబ్రమణ్యం స్థానిక పోలీసుల వేధింపులు తట్టుకోలేక బస్తర్ నుంచి వెళ్లిపోయారు. గత ఏడాది ఒక టీవీ విలేకరి ప్రభాత్సింగ్, మరో పత్రిక విలేకరి దీపక్ జైశ్వాల్‌లను వివిధ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. మరికొందరు పాత్రికేయులు పోలీసుల కేసులు, వేధింపులకు భయపడి ఆ ప్రాంతాలను విడిచి వెళ్లిపోయారు. -
ఖాకీలు చింపిన బస్తర్
-
ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి
భద్రాచలం: సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పోలీసులు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. జగదల్పూర్ జిల్లా బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్తర్ సమీపంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం మేరకు పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు గంటపాటు కాల్పుల అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన అనంతరం గాలించగా ఆ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. సంఘటన స్థలంలో ఒక తుపాకి, ఒక రైఫిల్‌తో పాటు పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని బస్తర్ ఎస్పీ రాజేంద్ర నారాయణ్ దాస్ తెలిపారు. -
నక్సలిజానికి విరుగుడు క్రీడా అకాడమీలు!
ఛత్తీసగడ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లాలో యువత క్రీడా ప్రతిభాన్వేషణకు త్వరలో అర్చరీ, షూటింగ్ అకాడమీలు ఏర్పాటుకానున్నాయి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) సామాజిక బాధ్యత కార్యక్రమం(సీఎస్ఆర్) తోడ్పాడుతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. గిరిజన ప్రాబల్యమున్న ప్రాంతాల్లో యువతను నక్సలిజం వైపు మరలకుండా నిరోధించి వారిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ చొరవ తీసుకుందని అధికారి చెప్పారు. సెప్టెంబర్ 14న సెయిల్ చైర్మన్ పీకే సింగ్, ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ శర్మతో సీఎం రమణ్‌సింగ్ సమావేశమైనపుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అకాడమీల తొలిదశ పనులు 2018 మార్చి నాటికి మొదలయ్యే అవకాశం ఉంది. బస్తర్ లో ప్రపంచస్థాయి అథ్లెటిక్ ట్రాక్‌ను నిర్మించాలని కూడా సీఎం ఎన్ఎండీసీని ఆదేశించారు. సెయిల్ అధీనంలోని భిలాయి ఉక్కు ప్లాంటు దుర్గ్ జిల్లా భిలాయ్‌లో టెన్నిస్ అకాడమీ, బాస్కెట్ బాల్ అకాడమీని ఏర్పాటుచేస్తుందని కూడా సమావేశంలో నిర్ణయించారు. వీటికి అదనంగా అక్కడే భిలాయ్ సామాజిక బాధ్యతా కార్యక్రమం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్‌ను కడతారు. -
బస్తర్‌లో ఎన్కౌంటర్
చత్తీస్ గఢ్: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మిగితావారు పారిపోయారు. బస్తర్ లోని తులసీ డోంగ్రీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఘటనా స్థలి వద్ద భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
లొంగిపోయిన 40 మంది మావోయిస్టులు
రాయ్ పూర్: మావోయిస్టు ఉద్యమంలో ఒక పెద్ద కుదుపు. ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ కు చెందిన 40 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. వీరిలో రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు కూడా ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. 40 మంది నక్సల్స్ బస్తర్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. దర్భా డివిజన్ కు చెందిన 19 మంది, కాంగెర్ వాలీ కమిటీకి చెందిన ఇద్దరు, దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన 19 మంది ఉన్నారు. దక్షిణ బస్తర్ డివిజన్ కు చెందిన సుబ్లి కష్యప్ తలపై రూ.8 లక్షల రివార్డు ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్లు, ఆయధాలను దొంగిలించారనే ఆరోపణ వీరిపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వీరికి రూ.10 వేల చొప్పున బస్తర్ జిల్లా కలెక్టర్ ఇవ్వనున్నారు. -
బస్తర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
ఛత్తిస్‌గఢ్ లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈనెల 13న బస్తర్ జిల్లా కాటేకళ్యాణ్ రైల్వే స్టేషన్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. వీరికి మావోయిస్టులు ఎదురయ్యారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో.. బస్తర్ జిల్లా మొదనార్ అటవీ ప్రాంత దళ డిప్యూటీ కమాండర్ సుఖ్ రామ్ మృతి చెందినట్లు వివరించారు. మృతి చెందిన మావోయిస్టు పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులు ఉన్నాయి. మృతుని వద్ద నుంచి రైఫిల్, టిఫిన్ బాంబు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఎస్పీ ఆర్. ఎన్ దాస్ తెలిపారు. -
ఇంద్రవెల్లి నుంచి బస్తర్ దాకా
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన పోలీసు కాల్పుల్లో 60 మంది ఆదివాసులు అమరులయ్యారు. అయితే 13 శవాలు మాత్రమే దొరికి వారి వివరాలు తెలిశాయి. ఆ మారణకాండ ఆ ఒక్కరోజే జరిగినట్లు కనిపిం చినా ఇరువైపులా దానికి పూర్వరంగం ఉంది. ఇంద్రవెల్లి కాల్పులు జరిగి 35 ఏళ్లయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సారి కేవలం రెండు వందల మంది ఆదివాసులను, వాళ్ల ఎంఎల్ఏను మాత్రమే స్థూపం దగ్గరికి వెళ్లి స్మరించుకోవడానికి అనుమతించింది. ఈ సందర్భంలో పేరు చెప్పడా నికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి, ‘ఆ రోజు ఏపీ స్పెషల్ పోలీసు బెటాలియన్‌కు చెందిన మహమ్మద్ గౌస్‌ను ఆదివాసీలు చంపి ఉండకపోతే అంతటి మారణకాండ జరిగి ఉండేది కాదు’ అన్నాడు. కానీ ఆ ఘటనపై పీయూడీఆర్ నాయకుడు మనోరంజన్ మహంతి నేతృత్వంలో నిజనిర్ధారణ బృందం ప్రకటించిన నివేదికలో ‘పోలీసుల నిష్కా రణ కవ్వింపు చర్యల ఫలితంగా ఉద్రిక్తులైన జనా నికి, పోలీసులకు మధ్యన జరిగిన దొమ్మీలో ఒక పేద కానిస్టేబుల్ ప్రాణాలు పోగొట్టుకోవడం దుర దృష్టకరం’ అని పేర్కొన్నారు. అసలు ఆరోజు ఏం జరిగిందో తెలుసుకుంటే దీనికి మూలం అర్థమవుతుంది. ఆదివాసులు పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరలివ్వాలని గిరిజన రైతుకూలి సంఘం పెట్టుకున్న సభకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు 1980 ఏప్రిల్ 19 సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష జరిపి అనుమతి రద్దు చేసి 144 సెక్షన్ విధించారు. దూర ప్రాంతాల నుంచి కాలినడకన బయలుదేరిన ఆదివాసులకు 144వ సెక్షన్ అంటే ఏమిటో తెలీదు. ఒక విధంగా వాళ్లు పక్షులను పట్టడానికి పన్నిన వలలో అవి చిక్కు కున్నట్లుగా వచ్చి కాల్పులకు గురయ్యారు. ఇంద్రవెల్లి ఆవల ఇంత కథ ఉంటే గత 35 ఏళ్ల కాలంలో దండకారణ్యం అంతటా విప్లవోద్యమం జల్, జంగిల్, జమీన్లతోపాటు ఇజ్జత్, సత్తా (అధి కారం) కోసం కూడా పోరాటంగా ప్రజాయుద్ధంగా గుణాత్మకంగానే పరిణతి చెందింది. అప్పుడు కానీ, నేడు కానీ ఆదివాసీలపై మారణకాండ, స్త్రీలపై పోలీ సులు సామూహిక లైంగిక అత్యాచారాలు వంటి వాటిని తటస్థంగా ఉంటూనే రిపోర్టు చేస్తున్న సంద ర్భంలో జర్నలిస్టులపై త్రీవ దాడులు జరుగుతు న్నాయి. సంతోష్ యాదవ్, సోమార్ నాగు, ప్రభా త్సింగ్తో పాటు మాలినీ సుబ్రహ్మణ్యంను బస్తర్ నుంచి వెళ్లగొట్టడమే కాకుండా వీరిని నక్సల్స్ సాను భూతి పరులని చిత్రీకరిస్తున్నారు. బీబీసీ కరస్పాం డెంట్ అలోక్ పుతుల్ ఐజీ కల్లూరితో మాట్లాడాలని ప్రయత్నిస్తే ‘నాకు దేశద్రోహులైన రిపోర్టర్లతో మాట్లాడేందుకు సమయం లేద’ని నిరాకరించాడు. హిందూ, బీబీసీ రిపోర్టర్లయినా సరే కోల్‌కతా నుంచి బస్తర్ వెళ్లి రిపోర్టు చేయాల్సిందే తప్ప బస్త ర్లో తిరిగి రిపోర్టు చేసే పరిస్థితి లేదు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లి రిపోర్టు చేసే పరిస్థితి కూడా తమకు లేదని జగదల్పూర్ పత్రికా సంఘం అధ్య క్షుడు కరీముద్దీన్ చెప్పారు. పోలీసుల అధికార ప్రక టనలను మాత్రమే ప్రకటించి నోరుమూసుకో కుండా స్వతంత్రంగా వ్యవహరిస్తే వారిని మావో యిస్టు సానుభూతిపరులుగా చిత్రీకరించి వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తున్నారు. ఇక సోనీ సోరీ అక్కడి సమాజంలో భాగమై పోరాటం చేస్తు న్నందువల్ల ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపుతా మని ఐజీ కల్లూరి నియోగించిన మాఫియా బెదిరి స్తోంది. దాని ఫలితమే ఆమెపై ఆసిడ్ దాడి. ఇండియా టుడే బృందం వెళ్లి చేసిన పరిశోధనలో, సామాజిక ఏక్తా మంచ్ పేరుతో పనిచేస్తున్న సంస్థ సల్వాజుడుం రెండో రూపమని, అది ఐజీ కల్లూరి ఏర్పాటు చేసిందేనని బయటపడటంతో దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పోలీసు ఆధికారులే ఒప్పుకున్నా రు. బస్తర్ మాడ్‌లో ఉన్న ప్రకృతి సంపదను, ఖనిజా లను ఎంఎన్సీలకు, మైనింగ్ మాఫియాకు కట్టబెట్ట డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ రహిత విమానంలో క్షిపణి దాడులు కూడా చేస్తున్నట్లు తేలుతున్న నేపధ్యంలో మీడియా తన సమస్త పరిమితులను అధిగమించి నిష్పాక్షిక రిపోర్టింగ్ ఇవ్వడమే క్షేత్రస్థాయిలో వారెదుర్కొంటున్న ముఖ్య మైన సమస్యగా ఉంటోంది. (నేడు కో-ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ సదస్సు సందర్భంగా) వ్యాసకర్త: వరవరరావు (విరసం వ్యవస్థాపక సభ్యులు) -
వాట్సాప్ లో మెసేజ్, జర్నలిస్ట్ అరెస్ట్
దంతెవాడ: బస్తర్ ప్రాంతాన్ని పోలీస్ రాష్ట్రంగా మారుస్తున్నారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దంతెవాడకు చెందిన జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. సీనియర్ పోలీసు అధికారి గురించి వాట్సాప్ లో అభ్యంతకర మెసేజ్ పోస్టుచేశారనే ఆరోపణలతో జర్నలిస్ట్ ప్రభాత్ సింగ్ ను జగదల్ పూర్ లో సోమవారం అరెస్ట్ చేశారు. మంగళవారం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో పోలీసులు తనను కొట్టారని కోర్టుకు అతడు తెలిపాడు. అతడికి కోర్టు మార్చి 31 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రభాత్ సింగ్ పై పోలీసులు గతేడాది నుంచి మూడు కేసులు నమోదు చేశారు. దంతెవాడలో ఆధార్ సెంటర్ నడుపుతున్న అతడు పలువురిని మోసం చేసినట్టు ఆరోపించారు. తాజా కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని సింగ్ తరపు లాయర్ తెలిపారు. సింగ్ అరెస్ట్ ను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బాగ్ హెల్ మంగళవారం అసెంబ్లీలో లేవనెత్తారు. బస్తర్ ప్రాంతంలో జర్నలిస్టులపై పోలీసు కేసులు పెరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు కలిసివున్నారనే ఆరోపణలతో ఇంతకుముందు ఇద్దరు స్థానిక జర్నలిస్టులు సంతోష్ యాదవ్, సమరు నాగ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. స్ర్కాల్ డాన్ నిన్ వెబ్ సైట్ లో పనిచేసే ఓ కంట్రిబ్యూటర్ ను బస్తర్ ప్రాంతం వదిలి పెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. -
23 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో 23 మంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారు. 23 మంది మావోయిస్టులు ఆదివారం జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు. -
మావోయిస్టుల ఏరివేతకు మరిన్ని కేంద్ర బలగాలు
న్యూఢిల్లీ: మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం మరింత దృష్టిసారిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో భద్రత దళాలపై మావోయిస్టులు పంజా విసిరిన నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. మావోయిస్టుల అరికట్టడానికి మరో 11 వేలమంది పారా మిలటరీ బలగాలను కేటాయించాలని నిర్ణయించింది. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి కేంద్ర బలగాలను పంపనున్నారు. ఇటీవల ఇక్కడ మావోయిస్టులు చేసిన దాడిలో 14 సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోల పంజా
ముగ్గురు జవాన్ల మృతి ఎన్నికలకు ఒక రోజు ముందు దాడులు చింతూరు, ఛత్తీస్‌గఢ్‌లోని తొలి దశ ఎన్నికలకు ఒక రోజు ముందు బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు పంజా విసిరారు. బుధవారం రెండు జిల్లాల్లో జవాన్లపై దాడులకు తెగబడ్డారు. బుధవారం ఉదయం జరిగిన దాడుల్లో సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌కు చెందిన ముగ్గురు కమాండోలు మృతి చెందగా.. ఇద్దరు అధికార్లతో సహా ఐదుగురు గాయపడ్డారు. సుకుమా జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో గురువారం ఎన్నికలు జరగనున్న సందర్భంగా సిబ్బందిని చింతగుహ పోలీస్‌స్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని బుర్కాపాల్‌లో దిగబెట్టి కాలినడకన వస్తున్న కోబ్రా బెటాలియన్‌పై మావోయిస్టులు భారీ ఎత్తున కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కోబ్రా బెటాలియన్‌కు చెందిన నరసింహ, చంద్రకాంత్ ఘోష్, రణ్‌వీర్‌సింగ్ మృతిచెందగా డిప్యూటీ కమాండెంట్ రమేష్ కుమారిసింగ్, అలోక్, కల్మాడీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు. వీరంతా జగ్దల్పూర్ 206 కోబ్రా బెటాలియన్‌కు చెందిన వారు. కాగా, ఈ దాడిలో వంద మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నారని అంచనా. వారు మూడు పక్కల నుంచి వచ్చి జవాన్లపై కాల్పుల జరిపారని, దీనికి జవాన్లు కూడా దీటుగానే స్పందించారని అధికారులు చెప్పారు. మరోవైపు, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ప్రెషర్‌బాంబులు పేల్చడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. పోలింగ్‌బూత్ చుట్టూ 15 మందుపాతరలు! ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు బస్తర్ లోక్‌సభ పరిధిలో గల ఓ పోలింగ్‌బూత్ చుట్టూ ఏకంగా 15 మందుపాతరలను పాతిపెట్టారు. ముందే గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వాటిని వెలికితీసి నిర్వీర్యం చేశారు. నారాయణ్‌పూర్ జిల్లా నేలనార్‌లో గల ఈ 29వ నెంబర్ పోలింగ్‌బూత్‌లో గురువారం ఓటింగ్ జరగనుంది. -
మావోల కోట.. బస్తర్!
బస్తర్ (ఛత్తీస్‌గఢ్): బస్తర్.. నక్సలైట్ల కంచుకోట. వారి రెడ్ కారిడార్‌లో కీలక ప్రాంతం. మావోలు స్వేచ్ఛగా సంచరించగలిగే ఆదివాసీల గడ్డ. వారికి రక్షణ కల్పించేలా అడవులు, కొండలతో నిండిన నేల. దక్షిణ బస్తర్‌లోని 70 శాతం పూర్తిగా మావోల అధీనంలోనే ఉంది. సుక్మా, అబూజ్‌మఢ్, కాంకేర్, నారాయణపూర్.. తదితర ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు చేరగలిగే ప్రాంతాలు దాదాపు శూన్యం. అదీకాక స్థానిక గిరిజనుల్లో మావోలకు మంచి పట్టుంది. అటవీ అధికారులతో చేతులు కలిపి కాంట్రాక్టర్లు ఆదివాసీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న సమయంలో.. వారి బారినుంచి గిరిజనులను మావోయిస్టులు కాపాడారు. స్థానిక భూస్వాముల నుంచి భూములను లాక్కొని భూమిలేని ఆదివాసీలకు పంచిపెట్టారు. బీడీ ఆకులు సేకరించే గిరిజనులకు కనీస వేతనాల కోసం పోరాడుతున్నారు. వారు స్థానికుల్లో ఒకరుగా ప్రవర్తిస్తారు. ఈ కారణాలతో స్థానికులు మావోలకు బాగా దగ్గరయ్యారు. అంతేకాకుండా, ఎదిరించిన వారిని చంపేస్తారన్న భయం కూడా స్థానిక గిరిజనుల్లో ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ‘ఓటేస్తే చేతులు నరికేస్తామని నక్సలైట్లు బెదిరిస్తున్నారు కాబట్టి ఓటేసిన తరువాత వేలిపై చుక్క పెట్టకపోతేనే ఓటేస్తా’మని స్థానికులు అధికారులకు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్తర్‌లో నేటి తొలివిడత ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సోమవారం ఎన్నికలు జరగనున్న 18 స్థానాల్లో 12 ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. నేపాల్ నుంచి నక్సలైట్లు: మావోయిస్టులు పోలింగ్ రోజు ఇక్కడ భారీ దాడులకు దిగే సన్నాహకాల్లో ఉన్నారని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. మావోయిస్టుల దళపతి గణపతి బస్తర్ డివిజన్లోని అబూజ్‌మఢ్‌లో మకాం వేసి దాడుల కోసం కేడర్‌ను సిద్ధం చేశారని తెలిపాయి. దాడుల కోసం నేపాల్ సహా పలు ప్రాంతాల నుంచి నక్సలైట్లు అబూజ్‌మఢ్ చేరుకున్నారని వెల్లడించాయి. -
బస్తర్ మే సవాల్