'ది కేరళ స్టోరీ మేకర్స్'.. మరో సెన్సేషనల్‌ మూవీ వచ్చేస్తోంది! | The Kerala Story Fame Adah Sharma Acts as IPS Neerja Madhvan Rolle | Sakshi
Sakshi News home page

Adah Sharma: ది కేరళ స్టోరీ మేకర్స్ మరో కాంట్రవర్షియల్ చిత్రం.. ఈ సారి మ్యాటర్ ఏంటంటే?!

Published Tue, Mar 5 2024 5:10 PM | Last Updated on Tue, Mar 5 2024 5:37 PM

The Kerala Story Fame Adah Sharma Acts as IPS Neerja Madhvan Rolle - Sakshi

ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుదీప్తో సేన్. అదా శర్మ ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వివాదాలు చుట్టుముట్టినప్పటీకి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రిలీజైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. ప్రస్తుతం జీ5 స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కేరళలో అమ్మాయిలను బలవంతంగా విదేశాలకు తరలించారన్న నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. 

ది కేరళ స్టోరీతో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టిన మేకర్స్‌ మరో కాంట్రవర్షి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదాశర్మ- సుదీప్తో సేన్ కాంబినేషన్‌లో బస్తర్ అనే మరో చిత్రం వస్తోంది. నక్సలిజం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన మారణహోమం ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ చిత్రంలో ఆదాశర్మ  ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement