Sudipto Sen
-
'ది కేరళ స్టోరీ మేకర్స్'.. మరో సెన్సేషనల్ మూవీ వచ్చేస్తోంది!
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సుదీప్తో సేన్. అదా శర్మ ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వివాదాలు చుట్టుముట్టినప్పటీకి ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం రిలీజైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. ప్రస్తుతం జీ5 స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కేరళలో అమ్మాయిలను బలవంతంగా విదేశాలకు తరలించారన్న నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు. ది కేరళ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మేకర్స్ మరో కాంట్రవర్షి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆదాశర్మ- సుదీప్తో సేన్ కాంబినేషన్లో బస్తర్ అనే మరో చిత్రం వస్తోంది. నక్సలిజం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన మారణహోమం ఆధారంగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ చిత్రంలో ఆదాశర్మ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. -
పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?
గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఆదా శర్మ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదానికి దారితీసింది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తోన్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్లో పాకిస్థాన్‌తో పోరాడి కన్నుమూసిన జవాన్ల కంటే.. నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువగా ఉందంటూ అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్‌లో జరిగిన మారణహోమంలో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. -
ఓటీటీకి 'ది కేరళ స్టోరీ'.. ఆలస్యం అందుకేనన్న ఆదాశర్మ!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ 50 రోజులు పూర్తి కావడంతో ఆదాశర్మ స్పందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడం మొత్తం సినిమా ఇండస్ట్రీకే మంచిదని తెలిపారు. ఈ మూవీ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి తీయలేదని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడబోతున్న బుల్లితెర నటి..!) నటి అదా శర్మ మాట్లాడుతూ.. 'ఈ విజయం నటీనటులకు, నిర్మాతలకు మాత్రమే కాదు.. మొత్తం పరిశ్రమకు కూడా వేడుక లాంటిది. ఈ రోజుకు మేము బిగ్ స్క్రీన్‌పై 50 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ సినిమా త్వరలోనే ఓటీటీకి వస్తుందని భావిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగాఈ వార్తలపై హీరోయిన్ ఆదా శర్మ స్పందించారు. నిర్మాతలు ఈ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇవ్వాలనే విషయంపైనే ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ కావడంతో.. ఓటీటీ విడుదలలో కూడా ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్)