The Kerala Story Actress Adah Sharma Says Will Come On OTT Soon - Sakshi
Sakshi News home page

Adah Sharma: 'ది కేరళ స్టోరీ ' హిట్.. మాకు మాత్రమే కాదు: ఆదాశర్మ

Published Tue, Jun 27 2023 4:21 PM | Last Updated on Tue, Jun 27 2023 5:01 PM

The Kerala Story Actress Adah Sharma Says will come on OTT soon - Sakshi

ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ 50 రోజులు పూర్తి కావడంతో ఆదాశర్మ స్పందించింది. ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడం మొత్తం సినిమా ఇండస్ట్రీకే మంచిదని తెలిపారు. ఈ మూవీ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి తీయలేదని చెప్పుకొచ్చింది.

(ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడబోతున్న బుల్లితెర నటి..!)
 

నటి అదా శర్మ మాట్లాడుతూ.. 'ఈ విజయం నటీనటులకు, నిర్మాతలకు మాత్రమే కాదు.. మొత్తం పరిశ్రమకు కూడా వేడుక లాంటిది. ఈ రోజుకు మేము బిగ్ స్క్రీన్‌పై 50 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ సినిమా త్వరలోనే ఓటీటీకి వస్తుందని భావిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం జూన్ 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగాఈ వార్తలపై హీరోయిన్ ఆదా శర్మ స్పందించారు. నిర్మాతలు ఈ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇవ్వాలనే విషయంపైనే ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ కావడంతో.. ఓటీటీ విడుదలలో కూడా ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. కాగా.. కేరళలోని బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించారనే నేపథ్యంలో సుదీప్తో సేన్ తెరకెక్కించారు. 

(ఇది చదవండి: ఆ సూపర్‌ హిట్‌ సినిమాకు పార్ట్‌-2 ఉంది: వెట్రిమారన్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement