గతేడాది 'ది కేరళ స్టోరీ' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఆదా శర్మ. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వివాదానికి దారితీసింది. కేరళలోని ముగ్గురు అమ్మాయిల కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్‍షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్‍లాల్ షా నిర్మించారు. అయితే ఈ చిత్రంపై విమర్శలు వచ్చినప్పటికీ.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ సినిమా తర్వాత ఆదా శర్మ నటిస్తోన్న మరో కాంట్రవర్సీ చిత్రం బస్తర్. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ది కేరళ స్టోరీ ఫేమ్ సుదీప్తో సేన్ బస్తర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో 76 మంది జవానులు ప్రాణాలు కోల్పోయిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు.
టీజర్ చూస్తే ఆదా శర్మ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బోర్డర్‌లో పాకిస్థాన్‌తో పోరాడి కన్నుమూసిన జవాన్ల కంటే.. నక్సలైట్లతో పోరులో మరణించిన జవాన్ల సంఖ్యే ఎక్కువగా ఉందంటూ అదాశర్మ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బస్తర్‌లో జరిగిన మారణహోమంలో 76 మంది జవానులను నక్సలైట్లు పొట్టన పెట్టుకుంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారంటూ టీజర్‌లో వివాదాస్పద డైలాగ్స్ కనిపిస్తోన్నాయి. ది కేరళ స్టోరీ మూవీ టీమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment