పేదల అవసరాలు అవినీతి
కాంగ్రెస్‌కు ఏనాడూ కనిపించలేదు
ఛత్తీస్‌గఢ్ ర్యాలీలో మోదీ ధ్వజం
రాయ్‌పూర్/జగ్‌దల్‌పూర్/చంద్రాపూర్: దశాబ్దాలు గా పేదల అవసరాలు, వారి బాధలు అవినీతి కాంగ్రెస్‌కు పట్టలేదని ప్రధాని మోదీ విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ఛోటే అంబాల్ గ్రామంలో సోమవారం బీజేపీ ‘విజయ్ సంకల్ప్ శంఖనాదం’ ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘‘ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో అవినీతిని దేశ గుర్తింపుగా మార్చేశాయి.
అధికారంలో ఉండటమంటే లూటీ చేయడానికి లైసెన్స్ సంపాదించినట్లుగా కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి పేదల బాధను కాంగ్రెస్ ఏనాడూ అర్ధంచేసుకోలేదు. అలాంటి పేదలు కోవిడ్ విలయకాలంలో ఏమైపోతారో అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. వాళ్లకేమీ కాదు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ఆహారధాన్యాలు అందిస్తానని ఆనాడే చెప్పా. మా ప్రభుత్వ కృషి కారణంగానే దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం కోరల నుంచి బయటపడ్డారు’’ అని చెప్పారు.
పేదల హక్కులను కాంగ్రెస్ హరించింది
‘‘పేదల హక్కులను అవినీతి కాంగ్రెస్ మింగేసింది. 2014కు ముందు పలు కుంభకోణాలతో లక్షల కోట్ల ప్రజాధనం నొక్కేశారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించే ప్రతి రూపాయిలో లబ్ధిదారునికి కేవలం 15 పైసలే చేరుతున్నాయని స్వయంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీయే ఒప్పుకున్నారు. మిగతా 85 పైసలను ఎవరు కొట్టేశారు?. కాంగ్రెస్ కొనసాగించిన ఈ లూటీ లైసెన్స్ విధానానికి నేనే చరమగీతం పాడా. గత పదేళ్లకాలంలో బీజేపీ సర్కార్ లబ్దిదారుల ఖాతాలకు నేరుగా రూ.34 లక్షల కోట్ల మొత్తాలను బదిలీచేసింది. హస్తిన నుంచి విడుదలైన ప్రతి రూపాయి 100 శాతం పేదల చెంతకు చేరింది. ఇప్పటికీ కాంగ్రెస్సే అధికారంలో ఉండి ఉంటే ఈ రూ.34 లక్షల కోట్లలో 85 పైసలు అంటే రూ.28 లక్షల కోట్ల స్వాహా చేసేవారు’ అని మోదీ ఆరోపణలు గుప్పించారు.
దేశంలో అన్ని సమస్యలకూ కాంగ్రెస్సే కారణం
దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాకరకాయతో పోలి్చన ఆయన..నెయ్యిలో వేయించినా, చక్కెర కలిపినా కాకర రుచి మాత్రం మారదన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సోమవా రం ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఆయన స్థిరత్వానికి, అస్థిరతకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేందుకే ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకుంటున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment