
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో కట్టదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇవ్వడం, పోలింగ్‌కు రెండు రోజుల ముందు బీజేపీ ఎమ్మెల్యే భీమా మాందవి, నలుగురు పోలీసు సిబ్బందిని మావోలు హతమార్చడంతో బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో 80,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు.
మావోల దాడి జరిగిన దంతెవాడ బస్తర్ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నియోజకవర్గంలో 1879 పోలింగ్ కేంద్రాలకు గాను 741 పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యసాత్మకంగా, 606 సమస్యాత్మక బూత్‌లుగా గుర్తించారు. మావోల హెచ్చరికల నేపథ్యంలో 289 పోలింగ్ కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా డ్రోన్‌లను సైతం వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment