poling
-
Jharkhand Assembly Election 2024: ప్రాంతాల పోరులో... పైచేయి ఎవరిదో!
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అస్థిరతకు మారుపేరైన జార్ఖండ్ మరోసారి అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. ప్రజాకర్షక పథకాల సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి ఆశపడుతోంది. జనాభాలో మెజారిటీ అయిన గిరిజనులతో పాటు ముస్లిం మైనారిటీల్లో సీఎం హేమంత్ సోరెన్‌కు ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందని నమ్ముతోంది. ఎన్డీఏ సారథి బీజేపీ మాత్రం ఐదేళ్లనాడు చేజారిన అధికారాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని ఉవి్వళ్లూరుతోంది.హేమంత్ తదితరుల అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుంది. గత ఎన్నికల్లో ముఖం చాటేసిన గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. వలసలు తదితరాలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడింది. 81 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. మిగతా 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలెన్ని ఉన్నా జనాభాలో 35 శాతంగా ఉన్న గిరిజనులే మరోసారి ఫలితాన్ని నిర్దేశించనున్నారు.ప్రాంతాలవారీగా చూస్తే గిరిజనులు ఏకంగా 60 శాతముండే కొల్హన్, సంథాల్ పరగణాల్లో జేఎంఎంకు తిరుగులేని పట్టుంది. 25 అసెంబ్లీ స్థానాలున్న కీలకమైన నార్త్ చోటానాగపూర్తో పాటు ఎస్సీ ప్రాబల్య పాలము ప్రాంతంపై బీజేపీ ఆధిపత్యం సాగుతోంది. ఐదో ప్రాంతమైన సౌత్ చోటానాగపూర్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడ్డాయి. సంథాల్ పరగణా అత్యంత వెనకబడ్డ జిల్లాలున్న ఈ ప్రాంతం ఇటు బిహార్, అటు పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడి 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడు ఎస్టీ, ఒకటి ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఎస్సీలు 8 శాతముంటే ఎస్టీలు 28, ముస్లింలు 23 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి ఏకంగా 13 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 5 మాత్రమే దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో: 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిపత్యం సాగగా 8 బీజేపీని ఆదరించాయి. కొల్హాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకునే ఈ ప్రాంతంలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ఒక ఎస్సీ, 9 ఎస్టీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 42 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమే ఉంటారు. ముస్లింలు 6 శాతమున్నారు. ఈసారి అధికారం దక్కాలంటే నార్త్ చోటానాగ్‌పూర్‌లో ఆదరణను నిలబెట్టుకుంటూ సంతాల్, కొల్హాన్ ప్రాంతాల్లో పాగా వేయడం ఆ పారీ్టకి తప్పనిసరి. ఇందుకోసం ఇటీవలే జేఎంఎం నుంచి వచ్చిన మాజీ సీఎం చెంపయ్ సోరెన్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్రమ వలసల అంశం ఈ ప్రాంతంలో తమకు బాగా కలిసొస్తుందని అంచనా వేస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి 13 స్థానాలు దక్కగా బీజేపీ పూర్తిగా చతికిలపడింది లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఆదరణ దక్కింది. పాలము ఇటు బిహార్, అటు ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దులున్న ప్రాంతం. 9 అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎస్సీ, ఒక ఎస్టీ సీట్లున్నాయి. 25 శాతం ఎస్సీలుండటం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి ఐదు సీట్లు దక్కగా బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ సీట్ల పరిధిలో బీజేపీ ఆధిపత్యమే సాగింది. నార్త్ చోటానాగ్పూర్ 25 అసెంబ్లీ స్థానాలున్న అతి కీలక ప్రాంతం. బిహార్, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులున్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వుడు స్థానం కూడా లేకపోవడం విశేషం. ఇక్కడ బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచి్చన వాళ్లు ఎక్కువ. 17 శాతం ఎస్సీలు, 16 శాతం ముస్లింలుంటే ఎస్టీలు కేవలం 9 శాతమే ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: బీజేపీ 10, ఇండియా కూటమి 11 సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ హవాయే సాగింది. ఈ పరిణామం కమలనాథుల్లో హుషారు పెంచింది. సౌత్ చోటానాగ్పూర్ ఛత్తీస్‌గఢ్, ఒడిషాలతో సరిహద్దులున్న ఈ ప్రాంతం 15 అసెంబ్లీ స్థానాలకు నిలయం. 11 ఎస్టీ, ఒకే ఒక్క ఎస్సీ స్థానమున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 51 శాతముంటారు. ముస్లింలు 11 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి 8, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో: బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ 4 అసెంబ్లీ స్థానాల పరిధిలోనే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా 11 చోట్లా ఇండియా కూటమి హవాయే సాగింది.67 శాతం రెడ్ అలర్ట్ స్థానాలే! 174 మందిపై కేసులు 235 మంది కోటీశ్వరులుసాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో బుధవారం తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి! బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
Association of Democratic Reforms: ఈ వ్యత్యాసాలు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని భారత ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) గురువారం డిమాండ్ చేసింది. ఓట్లలో వ్యత్యాసానికి కారణాలను వివరించాలని కోరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని ఏడీఆర్ సోమవారం తమ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారని తెలిపింది. మరో 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే 35,093 ఓట్లను అదనంగా లెక్కించారని పేర్కొంది. ఏడీఆర్ సోమవారం నివేదిక వెలువరించినప్పటికీ ఈసీ ఇప్పటిదాకా ఓట్లలో వ్యత్యాసంపై స్పందించలేదు. ఏపీలోనే అత్యధికం పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓట్లలో తేడా ఎలా వచి్చందో చెప్పాలని.. ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూలకు లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది. -
Britain general elections: బ్రిటన్‌లో ప్రశాంతంగా ఎన్నికలు
లండన్: పధ్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చరమగీతం పాడనున్నారన్న విశ్లేషణల నడుమ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం గురువారం ప్రశాంతంగా పూర్తయింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, వలసల కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెల్సిందే. ఉదయాన్నే భార్య అక్షతామూర్తితో కలిసి సునాక్ నార్త్ఆలెర్టన్ సిటీ దగ్గర్లోని కిర్బీ సిగ్స్టన్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో ఫేవరెట్‌గా నిలిచిన విపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ సైతం భార్య విక్టోరియాతో కలిసి ఉత్తర లండన్‌లోని క్యామ్‌డెన్ విల్లింగ్‌హామ్ హాల్ పోలింగ్‌కేంద్రంలో హుషారుగా ఓటేశారు. బ్రిటిష్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటలకే 40,000 పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ మొదలైంది. బ్రిటన్‌లో 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటలదాకా అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ఉన్న మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు. సాధారణ మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు గెలవాలి. ప్రధానమైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతోపాటు లిబరల్ డెమొక్రాట్స్, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ, సిన్ ఫియెన్, ప్లెయిడ్ సిమ్రూ, ది యాంటీ ఇమిగ్రేషన్ రిఫామ్ పార్టీలతోపాటు స్వతంత్రులు బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్‌పోల్స్ వెలువడే అవకాశముంది. కన్జర్వటివ్ పార్టీ కేవలం 53–150 సీట్లు సాధిస్తుందని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓపీనియన్స్ పోల్స్ వెల్లడయ్యాయి. -
Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం ఆరో విడతలో 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 61.11 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు, ఢిల్లీలో ఒకట్రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఈ విడతలో కూడా బెంగాల్లోనే అత్యధికంగా 79.40 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో 63.76 శాతం, ఒడిశాలో 69.32, హరియాణాలో 60.06, ఢిల్లీలో 57.67, బిహార్‌లో 55.24, యూపీలో 54.03 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ లోక్‌సభ స్థానంలో 54.15 శాతం పోలింగ్ జరగడం విశేషం. అక్కడ గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యధికం. దీంతో జమ్మూ కశీ్మర్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడి 5 లోక్‌సభ స్థానాల్లో కలిసి 58 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత 40 ఏళ్లలో అత్యధికమని ఈసీ పేర్కొంది. అక్కడి బారాముల్లా (59 శాతం), శ్రీనగర్ (34.4 శాతం) స్థానాల్లోనూ ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. శనివారంతో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఓటేసిన ప్రముఖులు రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. దాంతో ప్రముఖులంతా ఓటింగ్‌కు తరలివచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్సింగ్ పురి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వద్రా దంపతులు, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ తదితరులు ఓటు వేశారు. ప్రియాంక కూతురు మిరాయా తొలిసారి ఓటేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆప్‌కు ఓటేయగా... ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దంపతులు కాంగ్రెస్‌కు ఓటేయడం విశేషం. సోనియా, రాహుల్ ఓటేసిన న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఆప్, కేజ్రీవాల్‌కు ఓటున్న చోట చాందినీచౌక్ స్థానంలో కాంగ్రెస్ బరిలో ఉండటమే ఇందుకు కారణం. ఢిల్లీలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తుండటం తెలిసిందే.బెంగాల్లో బీజేపీ అభ్యరి్థపై దాడి! బెంగాల్‌లోని ఝార్గ్రాంలో తృణమూల్ కార్యకర్తలు తన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడు ఆరోపించారు. తనతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు తెలిపారు. బీజేపీ ఖుర్దా అసెంబ్లీ అభ్యర్థి, చిలికా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ తన అనుచరులతో పాటు ఓ పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టారు. పోలింగ్ అధికారిని తీవ్రంగా గాయపరిచారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. -
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు. -
Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
ఒడిశాలో ఇప్పటిదాకా 9 లోక్‌సభ సీట్లకు, వాటి పరిధిలోని 63 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో 6 లోక్‌సభ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. అధికార బిజూ జనతాదళ్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... సంభాల్పూర్... తొలిసారి కాషాయ జెండా 2019లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నేత నరేశ్ గంగదేవ్ కేవలం 9,162 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి నళినీకాంత ప్రధాన్‌ను ఓడించారు. ఈసారి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి నాగేంద్ర ప్రధాన్, బీజేడీ నుంచి ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.కటక్... బీజేడీ కంచుకోటస్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జన్మస్థలమిది, హొయలొలికించే మహానదీ తీరాన 900 ఏళ్లు కళింగ రాజధానిగా వెలిగింది. బీజేడీ దిగ్గజం భర్తృహరి మహతాబ్ 1998 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగారు. బీజేడీ నుంచి సంతృప్త్ మిశ్రా, కాంగ్రెస్ నుంచి సురేశ్ మహాపాత్ర రేసులో ఉన్నారు. కంచుకోటను కాపాడుకునేందుకు సీఎం నవీన్ పట్నాయక్ గట్టిగా ప్రయతి్నస్తున్నారు. కాంగ్రెస్‌కూ మంచి ఓటు బ్యాంకు ఉండటంతో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.పూరి.. నువ్వా నేనా! సుందరమైన బీచ్‌లు, జగన్నాథుడి సన్నిధితో కళకళలాడే పూరిలో బీజేడీకి 2019లో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర చుక్కలు చూపించారు. చివరిదాకా గట్టి పోటీ ఇచ్చి కేవలం 11,714 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక బీజేడీ సిట్టింగ్ ఎంపీ పినాకీ మిశ్రాకు బదులు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి జయనారాయణ్ పటా్నయక్ పోటీలో ఉన్నారు. ఆ పారీ్టకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకుంది.భువనేశ్వర్... నవీన్‌కు సవాల్ ఈ టెంపుల్ సిటీలో గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. బీజేడీ అభ్యరి్థ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పటా్నయక్ను బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అపరాజితా సారంగి ఓడించారు. ఈసారీ ఆమే బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మన్మథ రౌత్రే, కాంగ్రెస్ నుంచి యాసిర్ నవాజ్ పోటీలో ఉన్నారు. దాంతో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం కూడా పోటీలో ఉండటం కొసమెరుపు!కియోంజర్.. పోటాపోటీ ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం 2009 నుంచీ బీజేడీ గుప్పెట్లోనే ఉంది. 2019లో బీజేడీ నుంచి గెలిచిన చంద్రానీ ముర్ము యంగెస్ట్ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈసారి ధనుర్జయ సిద్దుకు బీజేడీ టికెటిచ్చింది. బీజేపీ నుంచి అనంత నాయక్, కాంగ్రెస్ నుంచి బినోద్ బిహారీ నాయక్ రేసులో ఉన్నారు. కియోంజర్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీజేడీ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణా జిల్లా
-
మొరాయిస్తున్న ఈవీఎంలు.. భారీ వర్షంతో పోలింగ్‌కు అంతరాయం
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 130 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీకి దిగారు.లఖీమ్‌పూర్ ఖీరీ జిల్లాలోని ఫూల్బెహడ్ పరిధిలోని భూఢ్ గ్రామంలో వర్షం కారణంగా బూత్ నంబర్ 259లో పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటల వరకూ ఈ బూత్‌లో కేవలం 40 మంది మాత్రమే ఓటు వేశారు. భారీ వర్షం కారణంగా పోలింగ్ బూత్ ఖాళీగా కనిపిస్తోంది. మరోవైపు బహరాయిచ్ పరిధిలోని కార్త్నియాఘాట్ అటవీ ప్రాంతంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. కాగా ఓటరు గుర్తింపు కార్డు సరిపోలని కారణంగా నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.కాన్పూర్‌లో పోలింగ్ ప్రారంభానికి ముందే ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా గంగా గంజ్, బిఠూర్, కల్యాణ్‌పూర్ తదితర ప్రాంతాల్లో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. కల్యాణ్‌పూర్‌లో ఈవీఎంలు మొరాయించిన విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రాజారామ్ పాల్ ఒక ట్వీట్ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేశారు. -
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
భారత ఎన్నికల సంఘం టైమ్‌టేబుల్ ప్రకారం ఏడు దశల లోక్‌సభ 2024 ఎన్నికల నాలుగో రౌండ్ మే 13న (సోమవారం) జరగనుంది. అయితే ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా నియోజకవర్గాలలోని స్కూల్స్, ఇతర సంస్థలకు ఈసీ సెలవు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం ఓటింగ్ జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు మే 13న 4వ దశ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ- కాశ్మీర్లో బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. -
పోలింగ్ బూత్‌లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మద్దతు దారులు పోలింగ్ బూత్‌లను లూటి చేస్తున్నారంటూ ఉత్తర్ ప్రదేశ్ సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న 10 లోక్‌సభ స్థానాల్లో మూడో విడతలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో తన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మైన్‌పురి నియోజకవర్గంలో ఎటావాలో ఓటు వేశారు.రైతులు ప్రాణాలు కోల్పోయారనిఅనంతరం బీజేపీపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. బీజేపీలో అధికార పోరు నడుస్తోందని, అందుకే ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతికేరంగా వెయ్యి మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.లఖింపూర్ ఖేరీ హింసాకాండపైఈ సందర్భంగా 2021లో జరిగిన లఖింపూర్ ఖేరీ హింసాకాండను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో ఉన్న ఓ నలుగురు అగంతకులు రైతులను ఢీకొట్టారని ఆరోపించారు. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ద్వజమెత్తారు. ఐదు లక్షల ఓట్లతో డింపుల్ యాదవ్ కాగా, సైఫాయిలో ఓటు వేసిన ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని కాపాడే పోరాటమని, మైన్‌పురి స్థానంలో డింపుల్ యాదవ్ ఐదు లక్షల ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
Lok sabha elections 2024: కన్నడిగుల తొలి ఓటెవరికో!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నాటకలో 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా ఈసారి బీజేపీ–జేడీ(ఎస్) కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతోంది. జేడీ(ఎస్) పోటీ చేస్తున్న హసన్, మండ్య, కోలార్ స్థానాలకు రెండో విడతలోనే పోలింగ్ ముగియనుంది. ఆ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టడం విశేషం! ఈసారి పలు స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది... బెంగళూరు నార్త్బీజేపీ నేత సదానంద గౌడ 2014 నుంచీ ఇక్కడ గెలుస్తున్నారు. ఈసారి మాత్రం కేంద్ర సహాయ మంత్రి శోభ కరంద్లాజె పోటీ చేస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెస్ నేత ఎంవీ రాజీవ్గౌడను ఆమె ఢీకొడుతున్నారు. గౌడ బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సభ్యుడు. ఈ స్థానం 1999 దాకా కాంగ్రెస్ కంచుకోట. 2004 నుంచీ బీజేపీ జైత్రయాత్రే సాగుతోంది. దీనికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.బెంగళూరు సౌత్1996 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోట. బీజేపీ దివంగత నేత అనంతకుమార్ ఇక్కడినుంచి ఏకంగా 28 ఏళ్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు! 2019 ఎన్నికల్లో యువ నేత తేజస్వి సూర్య బీజేపీ తరఫున 3.31 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారీ ఆయనకే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారీ విజయం తనదేనని తేజస్వి ధీమాగా ఉన్నా పోరు హోరాహోరీగా సాగవచ్చంటున్నారు.హసన్మాజీ ప్రధాని దేవెగౌడ ఐదుసార్లు నెగ్గిన స్థానమిది. 2019లో మనవడు ప్రజ్వల్ రేవణ్ణను బరిలో దింపారు. బీజేపీ నేత ఎ.మంజుపై ఆయన 1.41 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా జేడీ(ఎస్) నుంచి ప్రజ్వలే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన నేతగా పేరున్న జి.పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్ పటేల్ పోటీలో ఉన్నారు. ఒకప్పుడు దేవెగౌడ, పుట్టస్వామి పోటీకి వేదికైన హసన్ వారి మనవళ్ల పోరుకు కేంద్రంగా మారింది!కోలార్ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన పట్టున్న కోలార్‌లో ఈసారి గట్టి పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన హామీలు ఇక్కడ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత ఎస్.మునిస్వామి 2.1 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ నేత కె.హెచ్.మునియప్పపై నెగ్గారు. ఈసారి పొత్తులో భాగంగా జేడీ(ఎస్) అభ్యర్థి ఎం.మల్లేశ్‌బాబు పోటీ చేస్తున్నారు. అంతర్గత విభేదాలు కూడా ఇక్కడ కాంగ్రెస్‌కు చేటు చేసేలా ఉన్నాయి. ఇక్కడ ఆరుసార్లు గెలిచిన మునియప్ప ఇటీవలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లోక్‌సభ టికెట్‌ను తన అల్లుడికి ఇప్పించుకునేందుకు ప్రయతి్నంచగా సొంత పార్టీ నేతలే మోకాలడ్డారు. సామాజిక వర్గాల ప్రభావం..రెండో దశలో భాగంగా ఎన్నికలు నిర్వహించే 14 స్థానాలకు గాను మెజారిటీ చోట్ల వొక్కళిగ సామాజిక వర్గం ఓటర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుంటారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనా బీజేపీ దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లను ఆకర్షించడంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది.కరవు కోరలుకర్ణాటకలోని అధిక ప్రాంతాలు ప్రస్తుతం చరిత్రలోనే అతి తీవ్రమైన కరువును చూస్తున్నాయి. దాదాపు అధిక శాతం పట్టణాలను కరువు ప్రాంతాలుగా ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కరువు కోరల్లోనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలతో నెగ్గుకొచి్చన కాంగ్రెస్‌కు.. లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ గ్యారంటీల ప్రభావం ఇప్పుడు అంతగా పనిచేయకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. మండ్యవొక్కళిగ ఆధిపత్యమున్న స్థానమిది. గత ఎన్నికల్లో నటి సుమలత బీజేపీ మద్దతుతో 1.26 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. ఈ స్థానం పొత్తులో భాగంగా ఈసారి జేడీ(ఎస్)కు వెళ్లింది. కుమారస్వామే బరిలో ఉన్నారు. సుమలత బీజేపీలో చేరడం ఆయనకు మరింత కలిసి రానుంది. కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ (స్టార్ చంద్రు) బరిలో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జేడీ(ఎస్) విజయం సాధించడం కూడా కుమారస్వామికి కలిసొచ్చే అంశాల్లో ఒకటి.బెంగళూరు రూరల్2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానమిది. ఈసారి కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు, సిట్టింగ్ ఎంపీ డీకే సురేశ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేడీ(ఎస్) నేత కుమారస్వామి గెలిచారు. కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండటంతో దేవెగౌడ అల్లుడు, ప్రముఖ వైద్యుడు సి.ఎన్.మంజునాథను బీజేపీ బరిలో దింపింది. ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. చారిత్రకంగా ఇక్కడ హస్తానిదే ఆధిపత్యం. ఆ పార్టీ ఏకంగా 13 సార్లు నెగ్గగా మూడుసార్లు జేడీ(ఎస్) గెలిచింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: బెంగళూరు సిటీ... రిజర్వుడ్!
నాలెడ్జ్ కేపిటల్. ఐటీ హబ్. దిగ్గజ శాస్త్ర సాంకేతిక సంస్థల నిలయం. కాస్మోపాలిటన్ సంస్కృతి. చెప్పుకుంటూ పోతే బెంగళూరు నగర ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు నగర ఓటర్లు. అన్నిచోట్లా ఉన్నట్టే కులం, మతం, పార్టీ విధేయతలకే ఓటేస్తున్నారు!బెంగళూరు నగర పరిధిలో 4 లోక్‌సభ సీట్లకూ శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2008లో లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన జరిగినప్పటి నుంచీ ఆ స్థానాల్లో ఓటర్లు ఎప్పుడూ ఒకే పారీ్టకో, అభ్యరి్ధకో పట్టం కడుతుండటం విశేషం... బెంగళూరు పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన అభ్యర్థే గెలవడం, ఒకే పార్టీకి ఓటర్లు జై కొట్టడానికి నియోజకవర్గాల పునరి్వభజన జరిగిన తీరే కారణమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. నేతలు తమకు అనుకూలమైన కులాలు, మతాల ఓటర్లు ఒకే నియోజకవర్గంలోకి వచ్చేలా జాగ్రత్త పడటం వల్లే ఈ ట్రెండ్ కొనసాగుతోందనే వాదనలు బలంగా ఉన్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి ప్రతిఫలిస్తోంది. 2008 నుంచి బెంగళూరులోని మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో 57 శాతం సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుస్తూ వస్తున్నారు. మరో 18 శాతం సీట్లను ఒకే ఎమ్మెల్యే లేదా పార్టీ కనీసం రెండుసార్లు గెలవడం విశేషం. ఆ లెక్కన చూస్తే నగరంలోని 75 శాతం స్థానాలు ఒకే అభ్యరి్థకో, ఒకే పారీ్టకో ‘రిజర్వ్’ అయిపోయాయన్నమాట! రాజకీయాల్లో తరచూ వినిపించే ఓటర్ల వ్యతిరేకత, సిట్టింగ్ ప్రజాప్రతినిధిపై అసంతృప్తి వంటివి బెంగళూరుకు వర్తించవు!నగర పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో బీజేపీ నుంచి, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులే మళ్లీ గెలిచారు. శివాజీనగర్‌లో 2008 నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్ 2019లో బీజేపీలోకి దూకారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ చేతిలో ఆయన చిత్తుగా ఓడటం విశేషం! అర్షద్‌కు ఎమ్మెల్యేగా అది రెండో విజయం. చామరాజ్‌పేట్ నుంచి మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాత్రం రెండుసార్లు జేడీ(ఎస్) టికెట్‌పైనా గెలిచారు.వొక్కళిగలే కీలకం...బెంగళూరులో ఇలా ఒకే పార్టీ, ఒకే అభ్యర్థి వరుసగా గెలుస్తున్న ట్రెండ్ వెనక పలు ఇతర కారణాలూ ఉన్నా కులమే కీలక ఫ్యాక్టర్‌గా నిలుస్తోంది. పార్టీ ఓటు బ్యాంకుతో పాటు పారీ్టలు, నేతల మధ్య లోపాయకారీ అవగాహన, తటస్థ ఓటర్ల మొగ్గు కూడా ప్రభావం చూపుతున్నాయి.► బెంగళూరులోని 28 అసెంబ్లీ స్థానాల్లో 4 ఎస్సీ రిజర్వుడు సీట్లు. వాటిని బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు చొప్పున తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాయి.► బెంగళూరు పరిధిలోని 28 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది వొక్కళిగ కులానికి చెందినవారే. మిగతా సీట్లలో కూడా వారి ప్రభావం గట్టిగా కనబడుతుండటం నగరంలో కులాలవారీ ఓటింగ్ కీలకంగా నిలుస్తోందనేందుకు తిరుగులేని నిదర్శనం.► పునరి్వభజన తర్వాత పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి బెంగళూరు నగర పరిధిలోని నియోజకవర్గాలకు ఓటర్ల వలస కూడా ఈ ధోరణికి మరింత దోహదపడుతోంది.► వొక్కళిగ, ఎస్సీ రిజర్వుడ్‌తో పాటు ముగ్గురు ముస్లిం, ఒక క్రిస్టియన్ అభ్యర్థులు శివాజీనగర్ శాంతిగనర్, చామరాజ్‌పేట్, సర్వజ్ఞనగర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.► రాజాజీనగర్, గాం«దీగనర్, బసవనగుడి, చిక్పేట్ నియోజవర్గాల్లో ఎప్పుడూ బ్రాహ్మణ సామాజిక వర్గమే గెలుస్తోంది.► ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో టికెట్ల కేటాయింపులోనూ వొక్కళిగల ఆధిపత్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. నాలుగు సీట్లలో మూడింటిని కాంగ్రెస్ ఆ సామాజికవర్గానికే కట్టబెట్టింది. బెంగళూరు నార్త్ నుంచి రాజీవ్ గౌడ, సౌత్ నుంచి సౌమ్యా రెడ్డి, రూరల్‌లో డీకే సురేశ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభ కరంద్లాజె, రూరల్ నుంచి సీఎన్ మంజునాథ కూడా వొక్కళిగలే. ► బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చాలావరకు మైనారిటీల ఆధిపత్యమే కావడంతో మన్సూర్ అలీకి కాంగ్రెస్ టికెటిచి్చంది.లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగళూరు పరిధిలోని స్థానాల్లో దాదాపు ఒకే పార్టీ, లేదా అభ్యర్థే గెలిచారు.► బెంగళూరు రూరల్ 2013 ఉపఎన్నిక నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. నాలుగో విజయం కోసం మళ్లీ బరిలో దిగారు. ఆయనదీ వొక్కళిగ కులమే. ఇక్కడ బీజేపీ కూడా అదేసామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథను బరిలో దింపింది.► బెంగళూరు సెంట్రల్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ కూడా హ్యాట్రిక్ వీరుడే. ఈసారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం అభ్యరి్థని మార్చి మన్సూర్ అలీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.► బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 1991 నుంచీ కాషాయ జెండానే ఎగురుతుండటం విశేషం! దాంతో ఈసారి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.► బెంగళూరు నార్త్‌లో మాత్రం 2014 నుంచీ గెలుస్తున్న సదానంద గౌడను బీజేపీ ఈసారి పక్కనబెట్టింది. ఉడుపి–చిక్మగళూరుఎంపీ, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజెను బరిలో దింపింది. ఆమె కోస్తా వొక్కళిగ కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ గౌడ స్థానిక వొక్కలిగ కావడం విశేషం.బెంగళూరు నగర పరిధిలోని లోక్‌సభ స్థానాలుబెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్ నోట్: ‘గతం’ శీర్షికన అందిస్తున్న లోక్‌సభ ఎన్నికల సిరీస్‌కు రెండో విడత పోలింగ్ కవరేజీ కారణంగా ఈ రోజు విరామం. ఆ సిరీస్ రేపటినుంచి యథావిధిగా కొనసాగుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీహార్ లోక్‌సభ ఎన్నికలు.. పోలింగ్ సమయం పెంపు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం, బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. అయితే వేడిగాలుల దృష్ట్యా పోలింగ్ శాతాన్ని పెంచేలా ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పొడిగించాలని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ సమయాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ లోక్‌సభ స్థానాలకు చెందిన వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం ఇప్పుడు పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగేలా నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల పరిధిలోని ఇతర పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. సాధారణ పోల్ సమయాలు ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు ఉంటాయి. అయితే అవి భూభాగం, సూర్యాస్తమయం సమయం, భద్రతా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. -
Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే!
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది (మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలావి మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది). రెండో దశలో 1,210 మంది పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడార్) విశ్లేíÙంచగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి...► రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతమే ఉన్నారు!► పట్టభద్రులు, ఆపై చదువులు చదివిన వారు 43 శాతం.► 21 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 167 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ (35), తర్వాత బీజేపీ (31), సీపీఎం (14) టాప్‌లో ఉన్నాయి.► 390 మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 105 మంది ఇండిపెండెంట్లు. తర్వాతి స్థానాల్లో బీజేపీ (64), కాంగ్రెస్ (62), బీఎస్పీ (24) నిలిచాయి. ఇద్దరికి 500 కోట్ల పైగా ఆస్తి ఉంది!► టాప్–10 సంపన్న అభ్యర్థుల్లో కర్నాటక టాప్‌లో ఉంది. మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంటకరమణే గౌడ రూ.623 కోట్లతో ‘టాప్’ లేపారు. బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. హేమమాలినికి రూ.279 కోట్ల ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ (రూ.233 కోట్లు), మండ్యలో జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి (రూ.217 కోట్లు), యూపీలో అమ్రోహా బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ (రూ.215 కోట్లు) టాప్–10లో నిలిచారు.► రెండో విడత అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.2 కోట్లు. ఆరుగురు తమకు చిల్లిగవ్వ కూడా లేదని ప్రకటించడం విశేషం!► అభ్యర్థుల్లో ఎక్కువ మంది 40–50 ఏళ్ల మధ్యవారే. సగటు వయసు 49 ఏళ్లు. 70–80 ఏళ్ల మధ్య వయసు్కలు 49 మంది ఉండగా ఇద్దరు 80 ఏళ్లు పైబడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Elections 2024: 20 ఏళ్ల తర్వాత ఓటు
న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత జార్ఖండ్‌లోని సింగ్భూమ్ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు రెండు దశాబ్దాల అనంతరం మొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం మావోయిస్టులకు కంచుకోటల్లాంటి మారుమూల ప్రాంతాల్లో 118 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కుల్దీప్ చౌదరి చెప్పారు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అడవుల్లో ఉన్న సరండా వంటి 118 గ్రామాల్లోకి మే 13వ తేదీన జరిగే పోలింగ్‌కు సిబ్బందితోపాటు సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా పంపుతామన్నారు. నుగ్డి గ్రామంలోని మిడిల్ స్కూల్, బొరెరో గ్రామంలోని మధ్య విద్యాలయలో మొదటిసారిగా పోలింగ్ బూత్‌లను నెలకొల్పామన్నారు. కొన్ని ప్రాంతాల్లోకి సిబ్బంది నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. ఏ ప్రాంతాన్నీ వదలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ఆపరేషన్ అనకొండ’ ద్వారా భద్రతా బలగాలు తల్కోబాద్ వంటి 25 వరకు గ్రామాల్లో 15 కొత్త క్యాంపులను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశాయని పేర్కొన్నారు. 121 పోలింగ్ బృందాలను రైళ్ల ద్వారా పంపించామన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి ఇళ్ల వద్దే ఓటు వేసే సదుపాయం కలి్పంచినట్లు చెప్పారు. ఎస్టీ్ట రిజర్వుడు స్థానమైన సింగ్భూమ్లో బీజేపీ నుంచి మాజీ సీఎం మధు కోడా భార్య, సిట్టింగ్ ఎంపీ గీతా కోడా రంగంలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యరి్థని ప్రకటించాల్సి ఉంది. -
లోక్‌సభ ఎన్నికలు.. పలు పోలింగ్ కేంద్రాల్ని మహిళలే నిర్వహించేలా
సాక్షి, కోల్‌కతా : ఉత్తర్‌ప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా మహిళలతో కొన్ని పోలింగ్ కేంద్రాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మహిళా భద్రతా సిబ్బందిని మోహరించడానికి మేము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. #WATCH | Kolkata, West Bengal: Chief Election Commissioner Rajiv Kumar says, "There will be a few polling stations which will be run entirely by women. We will try to deploy female security personnel in those polling stations... Similarly, some polling stations will be… pic.twitter.com/vVQpgQ706o — ANI (@ANI) March 5, 2024 అదే విధంగా, కొన్ని పోలింగ్ కేంద్రాలు పూర్తిగా వికలాంగులే నిర్వహిస్తారని, తద్వారా ఇతరులకన్న వారు తక్కువగా కాదని నిరూపిస్తారని అన్నారు. -
ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం!
బాపట్ల: సాధారణ ఎన్నికలు అత్యంత పారదర్శకతతో నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఫొటోలు డబల్ ఎంట్రీలు, మృతుల ఓట్లు తొలగింపులో నిర్లిప్తంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించలేదని వస్తున్న ఆరోపణలను సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులపై 2,08,740 దరఖాస్తులు అందినట్లు వివరించారు. వాటిలో 32,056 దరఖాస్తులను తిరస్కరించగా, 906 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలినవన్నీ పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో ప్రతిరోజు 500 దరఖాస్తులు ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా సుమారుగా 500 దరఖాస్తులు నమోదు అవుతున్నాయని చెప్పారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అన్ని సూచనలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు ముందు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సవరణ చేసిన తుది జాబితా ప్రచురిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు వాటిని అందిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల చిరునామాల మార్పు అంశాన్ని నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ అనుమతుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకే పోలింగ్ కేంద్రంలో 1,500ల మందికి మించి ఓటర్లు ఉంటే అలాంటి ప్రాంతాల్లో ఓటర్ల సౌలభ్యం కొరకు రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ, కలెక్టరేట్ ఏఓ కృష్ణకాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ నాయకులు మాల్యాద్రి, షేక్ మహమ్మద్ గౌస్ బాషా, రామకృష్ణ, డి.రవి, జి.నాగరాజు, ఏ బాలాజీరెడ్డి, ఎన్.కోటేశ్వరరావు, పాల్గొన్నారు. -
పాక్‌లో ఎన్ని సీట్లకు ఎన్నికలు? బరిలో పార్టీలేవి? అభ్యర్థులెందరు?
ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. విపరీతమైన ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. దేశంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ పాక్ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. పాకిస్తాన్ ద్విసభ పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో జాతీయ అసెంబ్లీలోని పలువురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వాటిలో 266 స్థానాలకు ప్రజలు ఓటు వేస్తారు. 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు ముస్లిమేతరులకు రిజర్వ్ చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 141 సీట్లు, సింధ్‌లో 75, ఖైబర్ పఖ్తుంక్వాలో 55, బలూచిస్థాన్‌లో 20, ఇస్లామాబాద్‌లో మూడు సీట్లు ఉన్నాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం 12.85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో సగానికి పైగా ఉంది. 6.9 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా, 5.9 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నమోదైన ఓటర్లలో కూడా 44 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. 2018 నుండి, దేశంలో ఓటర్ల సంఖ్య 2.25 కోట్లు పెరిగింది. అందులో 1.25 కోట్ల మంది మహిళలు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 52 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాకిస్తాన్ ఎన్నికల్లో 5,121 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 4,806 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు లింగమార్పిడి అభ్యర్థులు ఉన్నారు. 167 నమోదిత రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మొత్తం 5,121 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల విషయానికొస్తే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ). ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. ఫలితంగా పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగారు. ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం మొత్తం 90,582 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో దాదాపు 17,500 ‘అత్యంత సున్నితమైన’ పోలింగ్ స్టేషన్లు. పాక్ ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయనున్నారు. -
ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు!
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. వీటితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల వివరాల సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం ట్రేజరీస్ డీడీ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నివేదికకు సిద్ధం ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండడానికి సమాయత్తం అవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను నియమించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల వివరాలు సేకరణ కోసం ఏర్పాటు చేసిన మ్యాన్‌పవర్ కమిటీ తన విధులను ప్రారంభించింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, జూనియర్ , సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్ఈలు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, జేసీలు, కలెక్టర్ వరకు ఇలా అన్ని స్థాయిలా అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒకటి, రెండు రోజుల్లో దాదాపు 33 శాఖల్లో పనిచేసే అధికారుల వివరాలను నివేదించేందుకు మ్యాన్ పవర్ కమిటీ సిద్ధమవుతోంది. 18 వేల మంది సిబ్బంది అవసరం.. ఎన్నికల విధుల్లో ప్రధానంగా పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలతోపాటు ఇతర విధుల్లో పాల్గొనేందుకు జిల్లాకు 18 వేల మంది సిబ్బంది అవసరం అవుతారు. జిల్లాలో 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రైసెడింగ్ ఆఫీసర్, ఒక అడిషినల్ ప్రైసెడింగ్ ఆఫీసర్, నలుగురు అదర్ ప్రైసెడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఈ లెక్కన దాదాపు 13,116 మంది సిబ్బంది అవసరం అవుతారు. అంతేగాక మరో 2 వేల మంది వరకు రిజర్వ్‌లో ఉండేందుకు అవసరం. వీరితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ తోపాటు ఇతర విధులకోసం మరో 3 వేల వరకు సిబ్బంది అవసరం అవుతారు. పోలీసులు కాకుండానే జిల్లాలో మొత్తంగా దాదాపు 18 వేల మంది వరకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో సెక్టోరల్, నోడల్ ఆఫీసర్లు ఇప్పటికే 20 మందిని నోడల్ అధికారులుగా నియమించగా.. వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో 234 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. వీరంతా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు సంబంధించి 234 మంది పోలీసు సెక్టోరల్ అధికారులను నియమించారు. వీరు పోలింగ్ కేంద్రాల భద్రత అంశాలపై పరిశీలన చేస్తున్నారు. వీరంతా కూడా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎంపికై న ఉద్యోగులకు శిక్షణ ఇస్తాం సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాం. సిబ్బంది ఎంపిక కోసం మ్యాన్ పవర్ కమిటీని నియమించాం. ఒకటి, రెండు రోజుల్లో నివేదికలు వస్తాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తాం. – డాక్టర్ జి.సృజన, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికార ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా మంగళవారం రాత్రి మొదలు నిరంతర పర్యవేక్షణ పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాం. ప్రతి ఫిర్యాదుపై దగ్గర్లోని వీడియో సర్వేలన్స్ బృందాలు వెళ్లి విచారణ చేస్తాయి.’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకల పంపిణీని కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా 24్ఠ7 పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్ రూమ్స్ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. స్థానికేతరులందరూ వెళ్లిపోవాలి... ఎన్నికల ప్రచారానికి తెరపడిందని, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందని వికాస్ ప్రకటించారు. రాజకీయ, ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలతో పాటు 114 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులందరూ నియోజకవర్గాలను విడిచి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు ప్రతి పార్టీ నిషేధాజ్ఞలు పాటించాలి నిషేధాజ్ఞలను అనుసరించాలనీ, టీవీ, సినిమా, రేడియో వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదనే నిబంధనలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు వికాస్‌రాజ్ సూచించారు. ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధ గంట వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదన్నారు. మీడియా సర్విఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆమోదంతోనే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజేస్లపై నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీల స్టార్ క్యాంపైనర్లు పత్రికా సమావేశాలు పెట్టరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు ఈవీఎంల తరలింపును ఫాలో కావచ్చు.. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించడం, మొబైల్ ఫోన్స్, కార్డ్‌లెస్ ఫోన్లు, వాహనాలతో రావడంపై నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకుని రావడం, తీసుకెళ్లడం కోసం వాహనాలను సమకూర్చడం నేరమని హెచ్చరించారు. ఈవీఎంల మూడో ర్యాండమైజేషన్ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేందాలకు బుధవారం ఉదయం పోలింగ్ సిబ్బంది వచ్చాక వారికి ఈవీఎంలను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ఈవీఎంలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో అభ్యర్థుల ఏజెంట్లు తమ వాహనాల్లో ఫాలో కావచ్చని సూచించారు. నిర్దేశిత రూట్లలోనే ఈవీఎంలను రవాణా చేయాల్సి ఉంటుందని, మధ్యలో ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు అభ్యర్థి ఒక వాహనం వాడడానికి మాత్రమే అనుమతిస్తామని, ఏజెంట్‌కు మరో వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్ స్లిప్పుల్లో అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ గుర్తు ఉండరాదన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదు.. పోలింగ్ రోజు మాక్ పోల్ కోసం అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోల్ నిర్వహించిన తర్వాత వీవీ ప్యాట్ కంపార్ట్మెంట్ను ఖాళీ చేయాల్సి ఉంటుందని, కంట్రోల్ యూనిట్ మెమోరీని సైతం డిలీట్ చేయాలన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదని, లేనిపక్షంలో ప్రిసైడింగ్ అధికారులు వారిని బయటికి గెంటివేస్తారన్నారు. పోస్టల్ బ్యాలెట్లో విఫలం కాలేదు.. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పనలో విఫలమైనట్టు వచ్చిన ఆరోపణలను వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి సదుపాయం కల్పించామన్నారు. 27,178 మంది ఇంటి నుంచే ఓటేయగా, వారిలో 15,999 మంది 80ఏళ్లుపైబడినవారు, 9459 మంది దివ్యాంగులు, 1720 మంది అత్యవసర సేవల ఓటర్లున్నారని వెల్లడించారు. మరో 10,191 మంది సర్విసు ఓటును ఎల్రక్టానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్నారని, డిసెంబర్ 3న ఉదయం 7.59 గంటలకు అవి సంబంధిత కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 1.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నాటికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సంబంధిత నియోజకవర్గానికి పంపించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఎక్ఛేంజ్ కేంద్రం పెట్టామని ఆయన వివరించారు సెక్టోరియల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు... ప్రతి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఒక్కో సెక్టోరియల్ అధికారిని నియమించామని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారని వికాస్‌రాజ్ తెలిపారు. శాంతిభద్రతల సమస్యలొస్తే చర్యలు తీసుకునే మెజిస్టీరియల్ అధికారాలు వారికి ఉంటాయన్నారు. ఎక్కడైన ఈవీఎంలు పనిచేయని పక్షంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఈవీఎంలను వారే సమకూర్చుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహమద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్ 30న పోలింగ్ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు. -
రాజస్థాన్ ఎన్నికలు: ఫతేఫూర్‌లో రాళ్ల రాడి, భారీగా మోహరించిన పోలీసులు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హారా హోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా మధ్యాహ్నం 1 గంటల వరకు 40శాతానికి పైగా ఓటింగ్ నమోదుగా తాజా సమాచారం ప్రకారం 55.63శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు సికార్‌లోని బోచివాల్ భవన్, ఫతేపూర్ షెఖావతి సమీపంలో కొంతమంది రాళ్ల దాడికి దిగారు.దీంతో వారిని చెదరగొట్టేందుకు భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అయితే ఫతేపూర్ షెకావతి నుంచి హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత సమయంలో జనం అదుపు తప్పి భారీగా రాళ్లు రువ్వారు. హింసాకాండతో కొంత సేపు ఓటింగ్ నిలిచిపోయింది. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై జనాన్ని అదుపు చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. ఇది ఇలా ఉంటే ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందని, అధికారం తమదేనని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. భాజపా అఖండ మెజారిటీతో అధికారంలోకి రానుంది. రాజస్థాన్ ప్రజలు గత ఐదేళ్ల దుష్పరిపాలనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓట్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరాలు, అవినీతి పాలన అంతంకోసం జనం ఓటు వేస్తున్నారుని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానిచారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైందికాదనీ కొత్త ఓటర్లు ఈ పరిణామాల్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాగా రాజస్థాన్‌లోని 200 నియోజకవర్గాల అసెంబ్లీలలో 199 అసెంబ్లీలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటలక పోలింగ్‌కు కొనసాగుతుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ పుమేష్‌మిశ్రా తెలిపారు. ఇదిబ ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు డీజీపి పిలుపునిచ్చారు. #WATCH | Rajasthan Assembly elections: Stone pelting reported near Bochiwal Bhawan, Fatehpur Shekhawati in Sikar. Heavy Police deployed. pic.twitter.com/AAXLlkp5pn — ANI (@ANI) November 25, 2023 -
మధ్యప్రదేశ్‌లో అక్కడ మళ్లీ పోలింగ్!
మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్ 17న(శుక్రవారం) ఒకే దశలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసింది. సుమారు 71.16 శాతం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భింద్‌లోని కిషుపురాలో పోలింగ్ కేంద్రం నెంబర్ 71 బూత్‌లో కొందరు అధికారులు ఓటింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 20న(మంగళవారం) ఆ ప్రాంతంలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రశాంతంగ సాగుతోందని, కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ జరుగుతోందని కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ్ అన్నారు. ఇదిలా ఉండగా, మునపటి పోలింగ్‌లో పాల్గొన్న ఆ నలుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ముగ్గర్ని విధుల నుంచి సస్పెండ్ చేయగా, నాల్గవ వ్యక్తి పర్మినెంట్ వర్కర్ అని అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదే నవంబర్ 17వ తేదిన చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ ముగిసింది. ఇక ఆ ఇరు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. (చదవండి: కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి) -
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో నేడే పోలింగ్
భోపాల్/రాయ్‌పూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. కీలకమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లకు గాను రెండో, తుది దశలో భాగంగా 70 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ రాష్ట్రంలో నవంబర్ 7న తొలి దశలో 20 నక్సల్స్ ప్రాబల్య స్థానాల్లో పోలింగ్ ముగియడం తెలిసిందే. అదే తేదీన ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మొత్తం 40 స్థానాకలు ఒకే దశలో పోలింగ్ జరిగింది. మరో కీలక రాష్ట్రమైన రాజస్థాన్‌లో నవంబర్ 25న, చివరగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ డిసెంబర్ 3న వెల్లడవుతాయి. మధ్యప్రదేశ్‌లో.. మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలతో అతి పెద్ద పారీ్టగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కుప్పకూలింది. శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఆ రెండింటితో పాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా మరోసారి గట్టిగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది... ఛత్తీస్‌గఢ్ రెండో దశలో... రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 68 సీట్లతో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఈ ఐదేళ్లలో సీఎం భూపేశ్ బఘెల్ పలు ప్రజాకర్షక పథకాలతో రైతులతో పాటు అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వచ్చారు. అనంరం ఉప ఎన్నికల విజయాలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉన్నాయి... -
సమస్యాత్మక పోలింగ్స్టేషన్లు గుర్తించాలి
నాగర్‌కర్నూల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ సజావుగా చేపట్టాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఉదయం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ మనోహర్‌తో కలిసి సమస్యాత్మక పోలింగ్స్టేషన్ల గుర్తింపుపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 760 పోలింగ్స్టేషన్లు ఉండగా.. వీటిలో సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్ ఎన్ని ఉన్నాయి.. అందుకు గల కారణాలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలను ప్రామాణికంగా చేసుకోవాలని సూచించారు. గొడవలు జరిగిన పోలింగ్ స్టేషన్, క్రిమినల్ కేసులు ఎక్కువగా నమోదైన పోలింగ్ స్టేషన్, రెండు పొలిటికల్ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉన్న ప్రాంతం, కుల, మత విభేదాలు ఎక్కువగా ఉన్న పోలింగ్‌స్టేషన్, 80 శాతం కన్నా అధికంగా పోల్ అయినవి లేదా 70 శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పోల్ అయిన పోలింగ్‌స్టేషన్.. ఏ నియోజకవర్గంలో వస్తుంది అనే పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు. లైసెన్స్ పొందిన మారణాయుధాలు ఎవరి దగ్గర ఉన్నాయో గుర్తించి తిరిగి జమ చేసుకోవాలని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ 2018 ఎన్నికల రోజున ఏదైనా పోలింగ్స్టేషన్లో గొడవ జరిగి ఉంటే దానిని సైతం సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉందా.. లేదా.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందా.. అని భావిస్తే పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు మోహన్‌కుమార్, గిరిబాబు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ జాకీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. -
Karnataka Assembly election 2023: కర్ణాటకలో 73.19 శాతం పోలింగ్ నమోదు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికలు బుధవారం జరగ్గా, తుది గణాంకాలను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. 73.19 శాతం పోలింగ్ నమోదు కావడం ఒక కొత్త రికార్డేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి చెప్పారు. అత్యధికంగా చిక్కబళ్లాపుర జిల్లాలో 85.56 శాతం, బెంగళూరు రూరల్‌లో 85.08 శాతం, అత్యల్పంగా బీబీఎంపీ దక్షిణంలో 52.33 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాష్ట్రంలో మొత్తం 58,545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎక్కడా రాలేదని అధికారులు తెలిపారు. -
ఆత్మకూర్ బైపోల్.. 62 శాతం పోలింగ్
-
సోనూసూద్ ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న పోలీసులు!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోగా పోలింగ్ బూత్ వద్ద బాలీవుడ్ నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ ఎస్యూవీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన తన సోదరి మాళవిక సూద్ సచార్ కోసం బాలీవుడ్ నటుడు మోగాలో క్యాంప్ చేస్తున్నాడు. అయితే మోగా జిల్లాలోని లంధేకే గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోనూ సూద్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్యూవీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. ఈ మేరకు సిటీ పోలీస స్టేషన్ ఆఫీసర్ దేవిందర్ సింగ్ మాట్లాడుతూ ..అనుమానాస్పద కార్యాచరణ ఆధారంగా ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నాము. లంధేకే గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర ఎస్యూవీ తిరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము దానిని స్వాధీనం చేసుకున్నాము. అంతేకాదు అతను మోగాలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆ వాహనాన్ని ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి వీల్లేదని ఇంట్లోనే ఉండాలని ఎస్డీఎం-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా ఆదేశించారు. అయితే అతను ఆ ఆదేశాలను ఉల్లంఘించాడు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి. అని అన్నారు. ఈ విషయమై సోనూసూద్‌ను మాట్లాడుతూ.. “శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్, అలియాస్ మఖన్ బ్రార్, నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమే. వాహనం సరిగ్గా పార్క్ చేయలేదు. ఇంకేమీ లేదు" అని చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కావాలి
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్‌లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆవశ్యకతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి లేవనెత్తారు. వన్ నేషన్–వన్ –ఎలక్షన్ –వన్ ఓటరు లిస్ట్ ఉండాలని, లేదంటే ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడుతోందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగానున్న బీజేపీ కార్యకర్తలతో ఆన్లైన్లో ప్రధాని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో విద్యాధికులు, సంపన్నులు ఓటు వెయ్యకపోవడం పట్ల మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలో ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. 1951–52లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 45% పోలింగ్ జరిగితే 2019 నాటికి 67శాతానికి పెరిగిందన్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయమని, కానీ ఇంత తక్కువ ఓటింగ్ జరగడానికి గల కారణాలేంటో రాజకీయ పార్టీలన్నీ ఆలోచించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎన్నికల గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘ చర్చలు చేస్తారు కానీ , పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం లేదన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా క్షేత్రస్థాయిలో బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌లు (పన్నా ప్రముఖ్స్) కనీసం 75% పోలింగ్ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ఓట్ల శాతం పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యల్ని ప్రధాని అభినందించారు. 75% ఓటింగ్ జరిగేలా చూడాలి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 75శాతానికి పెరిగేలా చర్యలు చేపట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తాను హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి సందేశాన్ని పంపారు. కోవిడ్–19తో బాధపడుతూ హోం క్వారంటైన్లో ఉన్న ఆయన తన సందేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో 75% ఓటింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు అంటే హక్కు కాదని, తమ బాధ్యతని భావించిన రోజు దేశంలో ఓటింగ్ శాతం పెరుగుతుందని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఓటింగ్ తప్పనిసరి చేయాలి.. దేశంలో ఓటు వెయ్యడాన్ని తప్పనిసరి చేయా లని 86 శాతం మంది ముక్తకంఠంతో కోరారని ఒక సర్వేలో వెల్లడైంది. పబ్లిక్ యాప్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ జాతీయ ఓటరు దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్‌పై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నాలుగు లక్షల మందికిపైగా పాల్గొన్నారు. వారిలో 86 శాతం మందికి పైగా ఓటింగ్‌ను తప్పనిసరి చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 80శాతం మందికిపైగా చెప్పారు. దేశంలో తక్కువగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్‌ని తప్పనిసరి చేయాలా అని అడిగిన ప్రశ్నకు 86శాతం మందికి పైగా చేసి తీరాలని అన్నారు. -
అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
-
పోలింగ్ కేంద్రంలో కౌశిక్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
-
ముగిసిన బెంగాల్ పోలింగ్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తుది దశ పోలింగ్‌లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. గురువారం 35 స్థానాలకు జరిగిన ఎనిమిదో విడత పోలింగ్‌లో 76.07శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా భయాలను కూడా ఖాతరు చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ దశలోనూ పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీర్భమ్ జిల్లా ఇలామ్‌బజార్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. బీజేపీ అ«భ్యర్థి అనిర్బన్ గంగూలీపై దాడి జరిగినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. కర్రలు, బ్యాట్లు తీసుకొని ఆయనపై దాడి చేయడానికి వచ్చినçప్పుడు ఏర్పడిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడి వెనుక టీఎంసీ మద్దతుదారులు ఉన్నారని గంగూలీ చెప్పారు. తన కారుని పూర్తిగా ధ్వంసం చేశారని అన్నారు. వాళ్లు రాక ముందు వరకు పోలింగ్ ప్రశాంతంగా సాగిందని తెలిపారు. జొరసాంకో నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మీనాదేవి పురోహిత్ తాను నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటే ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు తన కారుపై బాంబులు విసిరారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు ఉండగా ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించారు. మార్చి 27 న మొదలైన పోలింగ్ ఏప్రిల్ 29తో ముగిసింది. -
విషాదం: పోలింగ్ కేంద్రంలో జవాన్ ఆత్మహత్య
కోల్కత్తా: ఎన్నికలకు అంతా సిద్ధమైంది.. కొద్దిసేపయితే పోలింగ్ ప్రారంభం అవ్వాల్సిన సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ జవాన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికలకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో రెండో దశ పోలింగ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని పాతర్ ప్రతిమ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఆ కేంద్రంలో బందోబస్తు నిర్వహించేందుకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన కమల్‌గంగూలీ బుధవారం వచ్చాడు. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఒకవైపు ఎన్నికలు ఉన్నాయి.. ఇక్కడేమో మృతదేహం అని కంగారు పడ్డారు. వెంటనే మృతదేహాన్ని దించి పోస్టుమార్టం తరలించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో మొత్తం సర్దుబాటు చేసి ఏర్పాట్లు పునరుద్ధరించారు. అయితే జవాన్ గంగూలీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
భారీ పోలింగ్ మా విజయానికి సంకేతం
ధనేఖలి: బెంగాల్ తొలివిడత ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం రాష్ట్రంలో మార్పునకు సంకేతమని, అవినీతి టీఎంసీ పాలనపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనేందుకు నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. టీఎంసీ గూండాల బీభత్సాల నడుమ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించిందంటూ ఎన్నికల కమిషన్‌ను ప్రశంసించారు. టీఎంసీ ఆట ముగిసిందని, ఎన్నికలు శాంతియుతంగా జరగడంపై మమతా బెనర్జీ ఆందోళనగా ఉన్నారని విమర్శించారు. బెంగాల్ తొలిదశ ఎన్నికల్లో దాదాపు 85 శాతం పోలింగ్ నమోదయింది. మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ ‘‘ తన కేబినెట్లో మాజీ మంత్రిని ఎదుర్కొనేందుకు స్వయంగా సీఎం రంగంలోకి దిగారంటే, ఇద్దరిలో ఎవరు బడాలీడర్?’’ అని ప్రశ్నించారు. బెంగాల్లో టీఎంసీ అదృశ్యమవుతుందని నందిగ్రామ్ ప్రజలు స్పష్టమైన సమాధానమిస్తారన్నారు. ఇటీవలే మరణించిన 82ఏళ్ల వృద్ధురాలు సోవా మజుందార్‌ను ప్రస్తావిస్తూ, మమత పాలనను దుయ్యబట్టారు. బెంగాల్లో మా, మాటీ, మానుష్ అరక్షితంగా మారాయన్నారు. మమత పాలనలో సిండికేట్ రాజ్యం ఏర్పడిందని ఆరోపించారు. కిడ్నాపులు, యాసిడ్ దాడులు, హత్యాయత్నాల్లో బెంగాల్ అగ్రగామిగా మారేందుకు మమతే కారణమని విమర్శించారు. మొహర్రం ఊరేగింపునకు గతేడాది అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, రామమందిరం శంకుస్థాపన రోజు ఎందుకు కర్ఫ్యూ విధించిందని నడ్డా ప్రశ్నించారు. దుర్గాపూజ, సరస్వతి పూజపై పరిమితులు విధించిన సీఎం ఎన్నికలు వచ్చే సరికి చండీయాగాలు చేస్తోందన్నారు. హూగ్లీలో జూట్‌మిల్లుల్లో అధికశాతం మూతపడడం, రాష్ట్రంలో పరిశ్రమల దుస్థితికి నిదర్శనమన్నారు. -
తొలి దశకు సర్వం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అస్సాంలో 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంలో తృణమూల్ కాంగ్రెస్, తూర్పున పాగా వెయ్యాలన్న వ్యూహంలో బీజేపీ నిలవడంతో హోరాహోరీ పోరు నెలకొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ ఈ 30 స్థానాలకు గాను 26 సీట్లలో గెలుపొందింది. అయితే గత అయిదేళ్లలో ఈ ప్రాంతంలో బీజేపీ పట్టు బిగించి అధికారపక్షానికి సవాల్ విసురుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి సొంత జిల్లా మేదినిపూర్ జిల్లాలో పోలింగ్ జరుగుతూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీఎంసీ, బీజేపీలు 29 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపితే, లెఫ్ట్–కాంగ్రెస్–ఐఎస్ఎఫ్ కూటమి మొత్తం 30 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. అధికారాన్ని కాపాడుకోవడానికి పకడ్బందీ వ్యూహాలను రచించిన బీజేపీ–ఏజీపీ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, లోకల్ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్‌ల నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. గత ఎన్నికల్లో బీజేపీ–ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొందాయి. భద్రతా బలగాల నీడలో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన జంగల్మహల్లో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతమై జర్గ్రామ్ జిల్లాలో ప్రతీ పోలింగ్ బూత్ దగ్గర 11 మంది పారామిలటరీ సిబ్బంది మోహరించినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1307 పోలింగ్ బృందాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించి 127 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పురూలియాలో 185 కంపెనీలు, పూర్వ మేదినీపూర్‌లో 148 కంపెనీలు, బంకూరాలో 83 కంపెనీల బలగాలు మోహరించాయి. ఒక్కో కంపెనీలో వంద మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రానికి చెందిన 22 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు. బరిలో ఉన్న ప్రముఖులు పశ్చిమబెంగాల్లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు. -
ఆఫీసర్స్ అందరూ మహిళలే
మహిళల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం కలిగించడం కోసం అస్సాంలోని నల్బరి జిల్లా యంత్రాంగం కొత్తగా ఆలోచిస్తోంది. నల్బరినే ఎందుకు అంటే.. ఆ జిల్లాలోని అత్యున్నతస్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావడం! డిప్యూటీ కమిషనర్ మహిళ. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహిళ. ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. వీళ్లంతా కలిసి నల్బరిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు నడిపించేందుకు రకరకాల ప్రణాళికలు, పథకాలు రచిస్తున్నారు! 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీకి మూడు విడతలుగా.. మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీలలో.. పోలింగ్ జరుగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లే ప్రభావం చూపబోతున్నారని సర్వేల అంచనా. బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డున అస్సాం నగరం గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంది నల్బరి జిల్లా. ఆ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలేనన్నది మరీ కొత్త సంగతైతే కాదు. అయితే వీళ్లంతా కలిసి మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వైపు ఆకర్షించేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. వీళ్లకేం పని? వీళ్లకే పని! డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు.. వీళ్లే కదా జిల్లా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయవలసింది, బాధ్యత గల పౌరులుగా మెలిగేలా నడిపించవలసింది! అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం పౌరధర్మం అయితే, ఓటు వేయించడం అధికారం ధర్మం. ఆ ధర్మాన్నే ఈ మహిళా అధికారులంతా బాధ్యతగా, వినూత్నంగా చేపడుతున్నారు. అభ్యర్థులు మహిళల ఓట్ల కోసం పాట్లు పడుతుంటే, అధికారులు మహిళల చేత ఓటు వేయించడం కోసం ‘ప్లాట్’లు ఆలోచిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. లోపల బూత్ సిబ్బంది, బయట భద్రతా సిబ్బంది అంతా మహిళల్నే నియమిస్తున్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మహిళల్ని ఆ పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన నల్బరీ, బర్క్షెత్రి, ధర్మాపూర్లను ప్రత్యేక జోన్లుగా, సెక్టార్లుగా, చౌక్‌లుగా విభజించి అక్కడ మహిళా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కేంద్రాలలో ఉండేది మళ్లీ మహిళలే. వారు తమ పరిధిలోని మహిళలకు ఓటు ఎందుకు వేయాలో చెబుతారు. ఓటు వేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తారు. ‘ఈసారి మన మహిళల ఓటు మీద అస్సాం భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సర్వేలను ఉదహరిస్తూ కొన్ని ప్రధానమైన అభివృద్ధి అంశాలను అర్థమయ్యేలా చేస్తారు. ఓటు ఎవరికి వేసినా గానీ, మొత్తానికైతే ఓటు వేయడం మానకూడదన్న స్పృహ కలిగిస్తారు. ఇందుకోసం ఆ కేంద్రాల్లోని మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇప్పటికే పూర్తయింది. ఇక పోలింగ్ డ్యూటీలో ఉన్న మహిళలకైతే వాళ్లెంత చిన్న బాధ్యతల్లో ఉన్నా ప్రత్యేక వసతుల్ని కల్పిస్తున్నారు. ‘‘మహిళలు సౌకర్యంగా ఉంటే, సమాజం సవ్యంగా సాగుతుంది’’ అంటారు డిప్యూటీ కమిషనర్ పురబి కన్వార్. అందుకే ఆమె ఓటు వేసే మహిళలకే కాకుండా, ఓటు వేయమని చెప్పే, బూత్ లోపల ఓటు వేసేందుకు దారి చూపే మహిళా సిబ్బంది అందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పురబి కన్వార్ జిల్లా ఎన్నికల అధికారి కూడా. మరోవైపు.. ఇళ్లకు డెలివరీ అయ్యే గ్యాస్ సిలిండర్లపై ‘ఓటు వెయ్యడం మీ కర్తవ్యం’ అని తెలియజెప్పే స్టిక్కర్లను అతికించమని చెబుతున్నారు. ఇప్పటి వరకు అలా స్టిక్కర్లు అంటించిన సిలిండర్లు ఐదు వేల వరకు డెలివరీ అయ్యాయి. అలాగే వీధి నాటకాలు వేయిస్తున్నారు. మహిళా కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ‘మహిళా అధికారుల జిల్లా’గా నల్బరి స్టోరీ అప్పుడే అయిపోలేదు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.. అందరూ మహిళలే! జిల్లా ఎస్పీ మహిళ (అమన్‌జీత్ కౌర్). జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్ (రెవిన్యూ), ఇంకా.. డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు అంతా మహిళలే. ఇంత మంది మహిళా అధికారులు ఉన్నప్పుడు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా ఉంటుందా? మహిళల్లో చైతన్యం వెల్లివిరవకుండా ఉంటుందా? -
డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు.
-
తెలంగాణ ఎమ్మెల్సీ: డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా
సాక్షి, నల్గొండ: నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి నేడు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్కు ఓటు వేయాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు బూత్‌లోకి వచ్చే పట్టభద్రులకు డబ్బులు పంచడం స్థానికంగా కలకలం రేపింది. తాజాగా భువనగిరి, సూర్యాపేట, దేవరకొండలో ఓటు వేయడానికి వస్తున్న పట్టభద్రులను ప్రలోబాలకు గురిచేస్తూ డబ్బులు పంచుతూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ- వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్), ఎస్.రాములునాయక్ (కాంగ్రెస్), గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారధి రెడ్డి (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్) తదితరులు పోటీ పడుతున్నారు. కాగా నల్గొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల బూత్ నెం 30 లో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి. గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఏజెంట్‌గా కూర్చున్నారంటూ బీజేపీ ఏజెంట్‌పై టీఆర్ఎస్ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ వార్త తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చదవండి: MLC Elections 2021: పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
రేపే రెండవ విడత పంచాయతీ ఎన్నికలు
సాక్షి, విజయవాడ : రెండవ విడత పంచాయతీ ఎన్నికలు రేపే (ఫిబ్రవరి13)జరగనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండవ విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలో 167 మండలాల్లోని 2786 పంచాయితీలకి ఎన్నికలు ఉండనున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పోలీంగ్కి 44గంటల ముందే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో మద్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ప్రక్రియ జరగనుంది. రెండవ విడతకి నోటిఫికేషన్ ఇచ్చిన మొత్తం పంచాయతీలు 3328 కాగా, వాటిలో 539 సర్పంచ్ స్థానలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 33,570 వార్డులు ఉండగా, వాటిలో 12,604 ఏకగ్రీవమయ్యాయి. అయితే 149 వార్డుల్లో నో నామినేషన్ ఉండటంతో 20,817 వార్డులకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. (అమానుషం: కారుతో మూడుసార్లు తొక్కించి..) 44,876 మంది అభ్యర్థులు వార్డులకి పోటీపడనున్నారు. 167 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రిని ఈరోజు రాత్రి వరకే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 29,304 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 5480 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా, 4181పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఎన్నికల నిర్వహణకి 18387పెద్ద బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయగా, 8351 మధ్యరకం, 24034 చిన్న బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 1292 స్టేజ్ - 1 రిటర్నింగ్ అధికారులు ఉండనుండగా, 3427స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు, 1370 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉండనున్నారు. ప్రిసైడింగ్ అధికారులు 33835 కాగా, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 47492 మంది ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 32141మంది కౌంటింగ్ సిబ్బంది ఉండగా, పర్యవేక్షణ కోసం జిల్లాకి ఒకరు చొప్పున 13 మంది పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులు ఉన్నారు. పంచాయితీ రాజ్ కమీషనర్, డిజిపి కార్యాలయాలలో ఎన్నికల ప్రక్రియ పరిశీలనకి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్ఇసి కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమీషనర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు. (సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు ) -
కశ్మీర్ చలిలో ఎన్నికల పంజా
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల తొలిదశ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. అనుమానాస్పద ప్రాంతాలలో బలగాలు గస్తీ నిర్వహించాయి. సురక్షితమైన ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉంచామని, మొత్తం 51.76% పోలింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కెకె శర్మ తెలిపారు. ఈరోజు 43 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్(డీడీసీ) స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో 25 కశ్మీర్లో ఉండగా జమ్మూ ప్రాంతంలో 18 స్థానాలు ఉన్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం 7,03,620 మంది ఓటర్లకుగానూ మొత్తం 2,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి దశ డీడీసీ, సర్పంచ్, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 280 డీడీసీ, 12,153 పంచాయతీలకు 8 దశల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పిఎజిడి), బీజేపీ, మాజీ మంత్రి బుఖారీ స్థాపించిన అప్ని పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీల సమ్మేళనం అయిన పీఎజీడీ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది. -
ఓటరు కార్డు లేదా.. అయితే ఇవి తెచ్చుకోండి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపుకార్డు లేకున్నా ప్రత్యామ్నాయ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి డిఎస్ లోకేష్ కుమార్ శనివారం తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ప్రతీ ఒక్క ఓటరు గుర్తింపు నిర్థారణకు గాను ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే నిర్థారణకు కింద తెలిపిన ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదయినా ఒకదానిని చూపాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కాగా ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా కింద పేర్కొన్న 18 గుర్తింపు కార్డులు ఓటర్లు తమ వెంట తీసుకురావచ్చు. అవి ఏంటంటే 1. ఆధార్ కార్డు 2. పాస్‌పోర్ట్ 3. డ్రైవింగ్ లైసెన్స్ 4. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫైకార్డ్ 5. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్ 6. పాన్ కార్డు7. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు 8. జాబ్ కార్డు 9. హెల్త్ కార్డు 10. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్ 11. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం 12. రేషన్ కార్డు 13. కుల ధృవీకరణ పత్రం 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు 16. అంగవైకల్యం సర్టిఫికెట్ 17. లోక్‌సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు 18. పట్టదారు పాస్‌బుక్ -
మాస్కు ఉంటేనే ఓటు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి సమగ్ర మార్గదర్శకాలను అందజేశారు. ఆ ప్రకారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. లేకుంటే పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ‘నో మాస్క్ నో ఎంట్రీ’అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ‘భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది తమ కార్యకలాపాలను పెద్ద పెద్ద హాళ్లలో నిర్వహించుకోవాలి. పోలింగ్, భద్రతా సిబ్బంది కిక్కిరిసినట్లు వెళ్లకుండా తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల’ని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరడుగుల దూరం పోలింగ్‌స్టేషన్‌కు వచ్చే ఓటర్ల మధ్య ఆరడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సందర్భంగా కోవిడ్ జాగ్రత్తలను పర్యవేక్షించేందుకు వార్డు స్థాయి వరకు నోడల్ హెల్త్ ఆఫీసర్లను నియమించాలి. పోలింగ్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారి స్థానంలో రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల ఖర్చులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. నామినేషన్ సమర్పించడానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఇస్తారు. రెండు వాహనాలకే అనుమతి. మరికొన్ని మార్గదర్శకాలు... - ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. - పోలింగ్‌స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి కేటాయించాలి. - ఓటర్ల మధ్య ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా వలయాలు గీయాలి. వాటిల్లో ఓటర్లు నిలబడేలా పర్యవేక్షించాలి. - స్త్రీ, పురుషులు, వికలాంగులు/ సీనియర్ సిటిజన్లకు... మూడు క్యూలు ప్రత్యేకంగా ఉండాలి. - అవకాశముంటే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు క్యూలలో నిలబడకుండా నేరుగా పోలింగ్స్టేషన్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలి. - భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలి. - కోవిడ్ అవగాహనకు పోస్టర్లు ప్రదర్శించాలి. - సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్స్టేషన్లలో భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. - మాస్క్ లేకుండా ఓటర్లను పోలింగ్స్టేషన్లలోకి అనుమతించరు. అయితే ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్‌ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు. - ప్రతి పోలింగ్ అధికారి ముందు ఒక ఓటరు మాత్రమే నిలబడటానికి అనుమతిస్తారు. - పోలింగ్ అధికారులకు, భద్రతా సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్‌లు ఇస్తారు. - ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో కలిపి ఐదుగురు వెళ్లొచ్చు. - రోడ్‌షోలలో వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించాలి. - ఒకేమార్గంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీ రోడ్ షోలు ఉంటే, వాటి మధ్య కనీసం అరగంట తేడా ఉండాలి. - కరోనా ప్రొటోకాల్ ప్రకారం బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. పర్యవేక్షించడానికి హెల్త్ రెగ్యులేటర్లను నియమించాలి. -
అమెరికా ఎన్నికలు: మారుతున్న ఓటర్ల మూడ్
ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారో తేలే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నిర్ణయాధికారం ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకి ముహూర్తం సమీపిస్తోంది. అమెరికా అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ అసలు సిసలు సంగ్రామానికి తెరలేచే సమయం ఆసన్నమైంది. మంగళవారం నాడు జరిగే ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోంది ? అమెరికన్ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ట్రంప్ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా ? అందరిలోనూ అదే ఉత్కంఠ... స్వింగ్ భళా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాల్లో ఓటరు ఎటు వైపు మొగ్గుతారన్నదే అత్యంత కీలకం. 2016 ఎన్నికల తరహాలో పాపులర్ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్ రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా అధ్యక్షుడు ట్రంప్‌లో కనిపిస్తోంది. ఎన్నో కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిముషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉంది. అందుకే ట్రంప్, బైడెన్లు స్వింగ్ రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆఖరి నిముషంలో ప్రచారం చేస్తున్నారు. ఇక బైడెన్ పెన్సిల్వేనియా రాష్ట్రంపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పోలింగ్ రోజు రాత్రి ట్రంప్ మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాల సరళి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్‌ను సవాల్ చేస్తాం: ట్రంప్ ఫెయేట్‌విల్లే: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్ ఇన్ బ్యాలెట్ల ద్వారా ఓట్లేశారు. 9కోట్ల 20 లక్షల మంది ఈ పద్ధతిలో ఓట్లు వేసేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వీటిని లెక్కబెట్టేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా. ఫలితంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది స్పష్టమయ్యేందుకు మరింత సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో జరుగుతున్న జాప్యాన్ని తాము సవాలు చేసే అవకాశం ఉందని ట్రంప్ చెబుతున్నారు. కంప్యూటర్ల యుగంలోనూ ఎన్నికలు జరిగిన రోజు రాత్రికల్లా ఫలితాలు తేలకపోవడం ఘోరమైన విషయమన్నారు. మెయిల్–ఇన్ బ్యాలెట్ల పద్ధతిలో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికన్లు ఓట్లు వేయాలని అనుకుని ఉంటే చాలా ముందుగానే ఆ పని చేసి ఉండాల్సిందని అన్నారు. ‘అందరూ ఒకే రోజు ఓటేయాల్సిన అవసరం లేదు. నెల రోజుల క్రితం ఓటేసి ఉండవచ్చు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్వింగ్ ఎలక్టోరల్ రాష్ట్రాలు కాలేజీ ఓట్లు అరిజోనా 11 విస్కాన్సిన్ 10 మిషిగాన్ 16 పెన్సిల్వేనియా 20 ఓహియో 18 నార్త్ కరోలినా 15 జార్జియా 16 ఫ్లోరిడా 29 -
ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈసారి వంద శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లావ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 824మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24మంది పీపీఈ కిట్లతో వచ్చి మరీ ఓటు వేశారు. ఇక ఎమ్మెల్సీ బరిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవిత కల్వకుంట్ల పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్కర్ లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ఫలితాలు ఈ నెల 12న ప్రకటించనున్నారు. 99.64% పోలింగ్ శాతం నమోదు మొత్తం 824 ఓట్లకి 821 ఓట్లు పోల్ మిగతా ముగ్గురు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగం చివరి గంటలో ఓట్లు వేసిన కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజా ప్రతినిదులు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ఈనెల 12న ఓట్ల లెక్కింపు -
మహమ్మారి నీడన దక్షిణ కొరియాలో పోలింగ్
సియోల్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా దక్షిణ కొరియాలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ యథావిథిగా కొనపాగుతోంది. ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు, అభ్యర్ధులు, పోలింగ్ సిబ్బంది మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ప్రత్యేక బూత్‌ల్లో ఓటు వేసే అవకాశం కల్పించిన అధికారులు స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి ఓటింగ్ వేళలు ముగిసిన తర్వాతా ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. కాగా ఈ ఎన్నికల్లో అధికార మూస్ జే ఇన్స్ పార్టీ గెలిచే అవకాశం ఉందని సర్వేలు వెల్లడించాయి. కాగా, దక్షిణ కొరియాలో 10591 కరోనా కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 225 మంది మరణించారు. 13 వేల మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. చదవండి : కరోనా హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు -
ఢిల్లీ ఎన్నికల్లో 62.59 శాతం పోలింగ్ నమోదు
-
ఢిల్లీ పోలింగ్ @ 62.59%
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తుది గణాంకాలను.. పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల తరువాత.. ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు విడుదల చేసింది. మొత్తంగా, 62.59 శాతం పోలింగ్ నమోదైందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్‌బీర్ సింగ్ వెల్లడించారు. 2015 ఎన్నికల కన్నా ఇది దాదాపు 5% తక్కువ. ఆ ఎన్నికల్లో 67.47% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో బల్లీమారాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6%, ఢిల్లీ కంటోన్మెంట్ స్థానంలో అత్యల్పంగా 45.4% పోలింగ్ నమోదైందని సింగ్ తెలిపారు. తుది గణాంకాలను విడుదల చేయడంపై జరిగిన ఆలస్యంపై ఆయన వివరణ ఇచ్చారు. కచ్చితమైన గణాంకాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో రాత్రంతా రిటర్నింగ్ అధికారులు సమాచారాన్ని విశ్లేషించారని, అందువల్లనే పోలింగ్‌కు సంబంధించిన తుది శాతాన్ని వెల్లడి చేయడంలో జాప్యం ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే, ఇది అసాధారణ ఆలస్యమేమీ కాదన్నారు. తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించడంలో ఆలస్యం నెలకొనడాన్ని ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఈసీ ఏం చేస్తోంది? పోలింగ్ వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదు?’ అని ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ట్వీట్ చేశారు. ‘బీజేపీ నేతలు ఇచ్చే పోలింగ్ గణాంకాల కోసం ఈసీ ఎదురు చూస్తోంది. అందుకే, పోలింగ్ ముగిసి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ తుది లెక్కలు ఈసీ వెల్లడించలేకపోయింది’ అని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాతో అన్నారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. -
ఢిల్లీలో పోలింగ్ 61%
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రానికి 61.46% పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని 11 జిల్లాలకు గాను ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 65.24% పోలింగ్ నమోదు కాగా, న్యూఢిల్లీలో 56.10%, ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 54.89% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42% మంది ఓటేశారు. కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నందున పోలింగ్ శాతం పెరిగే చాన్సుందని అధికారులు తెలిపారు. గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47% పోలింగ్ నమోదు కాగా, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో 60.60% పోలింగ్ నమోదైంది. పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీములు కలిపి 60వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓటేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు పోలింగ్ సరళి ఇలా.. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి మూడు గంటల్లో కేవలం 14.5% మాత్రమే పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కొద్దిగా పుంజుకుని, మధ్యాహ్నం 3 గంటలకు 41.5%కు చేరుకుంది. పోలింగ్ ముగిసే 6 గంటల సమయానికి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ముస్తాఫాబాద్‌లో 66.29%, మతియామహల్ 65.62%, సీలాంపూర్‌లో 64.92% పోలింగ్ నమోదైంది. షహీన్బాగ్లాంటి కొన్ని చోట్ల ఓటర్ల క్యూలు కొనసాగుతున్నందున పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్‌బీర్ సింగ్ తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులో తన ఫొటో, పేరు కనిపించలేదంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ సభర్వాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే ఆ వీవీప్యాట్ మిషన్ స్థానంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ వైఫల్యం కేవలం ఒక్క శాతమేనని సీఈవో తెలిపారు. శతాధిక వృద్ధులు 60 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఓటేసిన ప్రముఖులు రాష్ట్రపతి కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజ్పూర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పోలింగ్ కేంద్రంలో తల్లిదండ్రులతోపాటు భార్య సునీత, కొడుకు పుల్కిత్తో కలిసి వచ్చి ఓటు వేశారు. ముందుగా ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రియాంకా గాంధీ కొడుకు రెహాన్, కేజ్రీవాల్ కొడుకు పుల్కిత్ మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కేజ్రీవాల్ మళ్లీ సీఎం అవుతారని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ప్రజలు ఎవరికి ఓటేస్తే వారే ఢిల్లీ సీఎం అవుతారని పుల్కిత్ బదులిచ్చాడు. పోలింగ్ కేంద్రం వద్ద సోనియా, ప్రియాంక కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ట్విట్టర్ వార్ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో మగవారిని సంప్రదించాలంటూ ఢిల్లీ మహిళలకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘మీరంతా తప్పకుండా ఓట్లేయండి. ముఖ్యంగా మహిళలకు ఓ విన్నపం. కుటుంబంతోపాటు దేశం, ఢిల్లీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో మీ ఇంట్లో మగవారితోనూ చర్చించండి’ అంటూ పోలింగ్‌కు ముందు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ..ఎవరికి ఓట్లేయాలో తెలియని స్థితిలో మహిళలున్నట్లు కేజ్రీవాల్ భావిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కేజ్రీవాల్ బదులిస్తూ..ఇంటి బాధ్యతలు మోసే ఢిల్లీ మహిళలు తమ కుటుంబం ఎవరికి ఓటేయాలో కూడా ఈసారి నిర్ణయించారని వ్యాఖ్యానించారు. షహీన్‌బాగ్‌లో ఆగని నిరసనలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని షహీన్‌బాగ్‌లో పోలింగ్ రోజూ నిరసనలు ఆగలేదు. నిరసనలు కొనసాగేందుకు వీలుగా అందులోని మహిళలు కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన పోలింగ్ ప్రక్రియలో తామూ భాగస్వాములయ్యామని నిరసనల్లో పాల్గొంటున్న జెహ్రా షేక్ తెలిపారు. బిర్యానీ కోసమే నిరసనల్లో పాల్గొంటున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువు చేసేందుకు ఓట్లు వేశామని మొహమ్మద్ అయూబ్ అన్నారు. ఏ పార్టీ వారు కూడా తమకు బిర్యానీ సరఫరా చేయడం లేదన్నారు. షహీన్‌బాగ్‌లో నిరసనకారులకు ఢిల్లీ సీఎం బిర్యానీ అందజేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగికి ఈసీ నోటీసులు పంపింది. సిరా గుర్తుతో ఎంపీ గౌతం గంభీర్ దంపతులు. 9నెలల పాపతో క్లాసికల్ డ్యాన్సర్ అరణ్యని ఓటేసిన 111ఏళ్ల కలితార మండల్ -
నేడు జార్ఖండ్‌లో 4వ విడత పోలింగ్
-
జార్ఖండ్‌లో నేడే మూడో విడత పోలింగ్
రాంచీ : జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ గురువారం జరుగుతోంది. మొత్తం 17 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా, అందులో రాజధాని నగరమైన రాంచీ కూడా ఉంది. రాంచీ, హతియా, కాంకె, బర్కత, రామ్‌గడ్ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్ణయించారు. ఈ విడత పోలింగ్‌లో ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలున్నాయి. అంతేకాక, మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి, మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మాతోలు కూడా మూడో విడతలో పోటీ పడుతున్నారు. -
జార్ఖండ్‌లో 64 శాతం పోలింగ్
రాంచీ: జార్ఖండ్‌లో మొదటి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం జరిగిన ఈ పోలింగ్‌లో 64.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుమ్లా జిల్లాలో ఓ కల్వర్టు వద్ద నక్సలైట్లు బాంబు పేల్చారని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని అదనపు డీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. దల్తన్గంజ్ నియోజకవర్గంలోని కోసియారాలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ త్రిపాఠి ఆయుధాలతో పోలింగ్ బూత్‌లో ప్రవేశించాలని చూడగా పోలీసులు అడ్డుకొని అతని నుంచి ఓ పిస్టల్, మూడు కాట్రిడ్జ్‌లను సీజ్ చేశామని పలమౌ డిప్యూటీ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ శాంతను అగ్రహారి తెలిపారు. నక్సల్స్ ప్రభావితం, చలికాలంలో త్వరగా చీకటి పడుతున్నందున ఉదయం 7కు ప్రారంభించి, మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగించినట్లు చెప్పారు. 13 ప్రాంతాల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు ఆరోగ్య శాఖ మంత్రి రామ్ చంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రామేశ్వర్ ఓరాన్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీ చీఫ్ విప్ రాధాక్రిష్ణ కిషోర్‌లు ఉన్నారు. -
నేడే హుజూర్నగర్ ఉప ఎన్నిక
సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ శాసనసభ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరగనుంది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 24న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 1,16,508 మంది పురుషులు, 1,20,435 మంది మహిళలు కలిపి మొత్తం 2,36,943 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సోమవారం నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం స్థానిక సెలవు దినంగా ప్రకటించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభకు ఎంపిక కావడంతో హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో శానంపూడి సైదిరెడ్డి(టీఆర్ఎస్), నలమాద పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ కోటా రామారావు(బీజేపీ), చావ కిరణ్మయి (టీడీపీ)తో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్ యూనిట్‌తో గరిష్టంగా 15 మంది (నోటాతో కలిపి 16) అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడంతో ఇక్కడ రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. మొత్తం 1,497 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పొల్గొంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. పోలీస్ పహారాలో.. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు. మొత్తం 2,350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేస్తున్నారు. 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, జోన్ పరిధిలోని జిల్లాల నుంచి అదనపు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్స్, టాస్క్‌ఫోర్స్, 27 రూట్ మొబైల్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ బందోబస్తులో ఉన్నాయి. -
రికార్డు స్థాయిలో 67.11% పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉదయానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చూస్తే 67.11% పోలింగ్ నమోదైంది. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం. అయితే ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. 2019 ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగ్గా, ఓటు హక్కు కలిగిన వారి సంఖ్య దాదాపు 91 కోట్లు. 2014 ఎన్నికల్లో 66.4 పోలింగ్ శాతం నమోదు కాగా, 2009లో అది మరీ 56.9 శాతమే. దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలుండగా, 542 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని వేల్లూరులో ధన ప్రవాహం అధికంగా ఉందనే కారణంతో ఈసీ అక్కడ ఎన్నికను రద్దు చేసింది. వేల్లూరులో తర్వాత ఎన్నిక ఎప్పుడు నిర్వహించేదీ ఈసీ ఇంకా ప్రకటించలేదు. 2014తో పోలిస్తే 2019కి ఓటర్ల సంఖ్య దాదాపు 8 కోట్లు పెరిగింది. 2019లో తొలిదశలో 69.61%, రెండో దశలో 69.44%, మూడో దశలో 68.4%, నాలుగో దశలో 65.5%, ఐదో దశలో 64.16%, ఆరో దశలో 64.4%, ఏడో దశలో 65.15% పోలింగ్ నమోదైంది. 2014తో పోలిస్తే మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో పోలింగ్ 5 ఐదు శాతానికి పైగా పెరిగింది. చండీగఢ్‌లో 10% పైగా తగ్గింది. -
ఆరు ముగిసింది... ఆఖరు పోరు ముందుంది..
ఆదివారం దేశంలోని 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ముగిసింది. దీంతో 17వ లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. మే 19న తుది విడత పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీలో పోలింగ్ బూత్‌ల దగ్గర ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల దగ్గర యువతులు బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓటు వేసిన నవవధువు బిహార్ రాష్ట్రం సివాన్‌లో ఓటేసిన నాటి, నేటి తరం మహిళలు న్యూ ఢిల్లీ సంగం విహార్ పోలింగ్ స్టేషన్లో ఐడీకార్డులతో ఓటర్లు పశ్చిమ బెంగాల్ సింగ్‌భూమ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న జవాన్ హరియాణా ఫరీదాబాద్‌లో ఓటేసిన ఆనందంలో మహిళలు ఢిల్లీలో ఓ సీనియర్ ఓటర్ను పోలింగ్ బూత్‌కి ఎత్తుకుని వెళ్తున్న యువకుడు బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలు ప్రయాగరాజ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సాధువులు -
ఆరులో 63.48%
న్యూఢిల్లీ: ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.48 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని వెల్లడించింది. పోలింగ్‌లో పశ్చిమబెంగాల్ మరోసారి అగ్రస్థానంలో నిలవగా, హరియాణా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, యూపీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. తాజా పోలింగ్‌తో మొత్తం 543 స్థానాలకు గానూ 484 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయనీ, మిగతా 59 సీట్లకు మే 19న చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఢిల్లీలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. 2014లో ఢిల్లీలో 65 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి అది 60 శాతానికి పడిపోయింది. బీజేపీ నేత భారతిపై దాడి.. పశ్చిమబెంగాల్లోని 8 లోక్ సభ సీట్లకు పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటాల్ నియోజకవర్గంలోని కేశ్పూర్ ప్రాంతంలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన మహిళా కార్యకర్తలు దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన భారతి రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో దొగాచియా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ టీఎంసీ మద్దతుదారులు ఆమె కాన్వాయ్‌పై రాళ్లతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో భారతి భద్రతా సిబ్బంది ఒకరు గాయపడగా, కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా మనస్తాపానికి లోనైన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పశ్చిమ మిడ్నాపూర్ మెజిస్ట్రేట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యూపీలో బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్ ఆఫీసర్‌పై బీజేపీ నేతలు దాడిచేశారు. ఔరాయ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియను నెమ్మదించేలా చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే దీననాథ్ భాస్కర్, ఆయన అనుచరులు ప్రిసైడింగ్ అధికారిని చితక్కొట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ, మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. మరోవైపు బిహార్‌లోని షియోహర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓ హోంగార్డ్ పోలింగ్‌కు ముందు కాల్పులు జరపడంతో ఎన్నికల అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించగా, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మరోవైపు హరియాణాలోని రోహతక్‌లో బీజేపీ నేత మనీశ్ గ్రోవర్ పోలింగ్ కేంద్రాల్లోకి బలవంతంగా ప్రవేశించి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ రోహతక్ అభ్యర్థి దీపేందర్ సింగ్ హుడా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మనీశ్ ఖండించారు. హరియాణాలో ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీకి ఫిర్యాదు చేస్తాం: బీజేపీ ఓడిపోతున్నామన్న ఆగ్రహంతోనే టీఎంసీ నేతలు భారతీ ఘోష్‌పై దాడిచేశారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తమ నేత కదలికలపై నిషేధాజ్ఞలు విధించారని మండిపడ్డారు. ఓటేసిన ప్రముఖులు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన భార్యతో కలిసి నిర్మాణ్ భవన్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇక్కడే ఓటు వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఔరంగజేబురోడ్డులోని పోలింగ్‌బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాతో కలసి న్యూఢిల్లీ స్థానంలో ఓటేయగా, మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా, ఓట్లు గల్లంతయ్యాయని మరికొన్ని చోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆదివారం ఓటేసిన అనంతరం వేలిపై సిరా గుర్తు చూపిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రియాంక గాంధీ వాద్రా దంపతులు, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మాజీ సీఎం షీలా దీక్షిత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ -
ఒంటిగంట వరకు 39.16శాతం పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో దేశ వ్యాప్తంగా 59 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా సాగుతోంది. బెంగాల్లో బీజేపీ-తృణమూల్ కార్యకర్తల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల నేతలు రిగింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. కొన్ని పాంత్రాల్లో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలింగ్‌కు కొంత అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఈవీఎంలు సరిగా పనిచేయడంలేదని ఆప్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా 1 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. 1 గంటల వరకు దేశ వ్యాప్తంగా 39.16శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రాల వారిగా 1 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు బిహార్ : 35.22 శాతం హర్యానా : 37.70 శాతం మధ్యప్రదేశ్ : 41.36శాతం ఉత్తర ప్రదేశ్ : 34.16శాతం ఢిల్లీ : 28.69శాతం పశ్చిమ బెంగాల్ : 52.31శాతం జార్ఖండ్ : 46.64శాతం -
నేడే ఆరో దశ
న్యూఢిల్లీ: ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. 1.13 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఈ విడతలో 10.17 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలతో పాటు హరియాణా(10), బిహార్(8), మధ్యప్రదేశ్(8), పశ్చిమబెంగాల్(8), ఢిల్లీ(7), జార్ఖండ్(4) సీట్లకు ఆరో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 979 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీకి ఎదురీత: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ ఏకంగా 45 సీట్లను సొంతం చేసుకుంది. ఈసారి యూపీలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూటమి బీజేపీ జోరుకు బ్రేకులు వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి గట్టిపట్టున్న గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ సీట్లను ఎస్పీ–బీఎస్పీ కూటమి దక్కించుకోవడం ఇందుకు ఉదాహరణ. 2014లో యూపీలోని ఈ 14 సీట్లలో 13 స్థానాలను బీజేపీ దక్కించుకుందనీ, ఈసారి ఆ పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు లేవని వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉండనుంది. దేశరాజధానిలో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 60,000 భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య తెలిపారు. బరిలో ఉన్న ప్రముఖులు వీరే నరేంద్రసింగ్ తోమర్ (బీజేపీ – మొరేనా), ప్రజ్ఞాసాధ్వీ ఠాకూర్ (బీజేపీ– భోపాల్) , మేనకాగాంధీ (బీజేపీ – సుల్తాన్పూర్) , గౌతం గంభీర్ (బీజేపీ – తూర్పు ఢిల్లీ), రీటా బహుగుణా జోషి (బీజేపీ – అలహాబాద్), హర్‡్షవర్ధన్ (బీజేపీ–ఢిల్లీలోని చాందినీచౌక్), దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్– భోపాల్) , జోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్ – గుణ) , షీలా దీక్షిత్ (కాంగ్రెస్ –ఈశాన్య ఢిల్లీ), భూపేందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్– సోనిపట్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ– అజాంగఢ్), విజేందర్ సింగ్ (కాంగ్రెస్–దక్షిణ ఢిల్లీ),దుష్యంత్ చౌతాలా (జేజేపీ–హిస్సార్), దీపేందర్ హుడా (కాంగ్రెస్ –రోహ్తక్) -
82.05 శాతం పోలింగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రెండో విడత పరిషత్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు జెడ్పీటీసీ, 82 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగంతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలు జరిగే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే స్పందించేందుకు రూట్ మొబైల్ పార్టీలను సిద్ధంగా ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం మందకొడిగా పోలింగ్ జరిగినప్పటికీ 11 గంటల తర్వాత ఊపందుకుంది. మొదటి విడత ఎన్నికల్లో చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకోగా.. రెండో విడతలో మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అయితే సత్తుపల్లి మండలం కిష్టారంలో మద్యం మత్తులో ఓ యువకుడు ట్రెయినీ ఎస్సై శ్రీకాంత్‌ను నెట్టివేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం రాత్రి స్వల్ప ఘర్షణ జరగడంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు తదితర ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, సీపీ.. రెండో విడత ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించారు. తల్లాడ జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంక సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అన్నారుగూడెంలో ఎన్నికల సరళిని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించి.. శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అలాగే కిష్టారం పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, అసిస్టెంట్ కలెక్టర్ హనుమంతు కొడింబా పరిశీలించారు. పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 82.05 శాతం పోలింగ్ నమోదు.. రెండో విడత ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 82.05 శాతం పోలింగ్ నమోదైంది. 1,88,785 ఓట్లు పోల్ కాగా.. అందులో 93,143 మంది పురుషులు, 95,642 మంది మహిళలు ఓట్లు వేశారు. అత్యధికంగా ఏన్కూరులో 85.31 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 22,207 ఓట్లు పోల్ కాగా.. 10,881 మంది పురుషులు, 11,326 మంది మహిళలు ఓట్లు వేశారు. అత్యల్పంగా కల్లూరులో 77.45 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 39,360 మంది ఓటు వేయగా.. అందులో 19,532 మంది పురుషులు, 19,828 మంది మహిళలు ఉన్నారు. పెనుబల్లిలో 84.61 శాతం పోలింగ్ నమోదు కాగా.. 34,418 మంది ఓటు వేశారు. ఇందులో 17,003 మంది పురుషులు, 17,415 మంది మహిళలు ఉన్నారు. సత్తుపల్లిలో 83.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. 28,536 మంది ఓట్లు వేశారు. 13,784 మంది పురుషులు, 14,752 మంది మహిళలు ఓట్లు వేశారు. తల్లాడలో 83.46 శాతం పోలింగ్ జరగ్గా.. 36,564 మంది ఓట్లు వేశారు. 18,064 మంది పురుషులు, 18,500 మంది మహిళలు ఓట్లు వేశారు. వేంసూరులో 80.49 శాతం పోలింగ్ జరగ్గా.. మొత్తం 27,700 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 13,879 మంది పురుషులు, 13,821 మంది మహిళలు ఓట్లు వేశారు. -
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్ బ్లాక్లోనిది. -
ఉదయం ఐదుకే పోలింగ్ ఓకేనా?
న్యూఢిల్లీ: విపరీతమైన ఎండలు, రంజాన్ పర్వదినాల్లో ఉపవాసాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తదుపరి దశల్లో పోలింగ్‌ను ఉదయం 5 గంటలకే ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తమ నిర్ణయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఉదయం 5 గంటలకే పోలింగ్ నిర్వహించాలని తాము ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించామని, అయితే వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే ఈ పిటిషన్‌ను దాఖలు చేస్తున్నామని పిటిషన్ వేసిన లాయర్లు మహమ్మద్ నిజాముద్దీన్ పాషా, అసద్ హయత్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. -
ముగిసిన నాలుగో దశ ప్రచారం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ ప్రచారం శనివారంతో ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. వివిధ నియోజకవర్గాల పోలింగ్ సమయాలు వేర్వేరుగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగియడానికి ముందు ఉండే 48 గంటల కాలాన్ని ‘నిశ్శబ్ద కాలం’గా పిలుస్తారు. ఈ సమయంలో ఎలాంటి రాజకీయ ప్రచారమైనా నిషిద్ధం. ప్రచారం గడువు ముగియడంతో మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాలో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలకు, వీధి కూడలి సమావేశాలకు తెరపడింది. -
ఊరికో పోలింగ్ స్టేషన్ !
నల్లగొండ : పరిషత్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో చిన్నచిన్న ఊళ్లలో ఉన్న ఓటర్లు పక్క గ్రామాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చేది. దీంతో వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వ్యయ, ప్రయాసలకు గురయ్యేవారు. ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల సంఘం ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఏ గ్రామం ఓటర్లు అదే ఊరిలో ఓటు వేసే విధంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 400 ఓట్లు ఉన్న గ్రామంలో కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఈ నిర్ణయంతో ఓటర్ల ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో జిల్లాలో 31 మండలాల పరిధిలో 31 జెడ్పీటీసీలు, 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి 9,67,912 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 1,930 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 1200 నుంచి 1400 ఓటర్లకు ఒక పీఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 1200 నుంచి 1400 ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 1,627 పోలింగ్ కేంద్రాలు ఉండేవి. అయితే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో రెండుమూడు గూడేలు ఉండేవి.. ఆ గూడేల్లో 300 నుంచి 400 వరకు ఓటర్లు ఉండేవారు. 1200 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో.. గ్రామపంచాయతీల్లోనే ఉండేవి. దీంతో పక్కనున్న గూడేల ఓటర్లు న డుచుకుంటూ వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే కొంతమంది రా జకీయ పార్టీల నాయకులు ఓటర్ల రవాణా కోసం వాహనాలను ఏర్పాటు చేసే వారు. దాన్ని కూడా ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. కొందరు పక్క గ్రామానికి వెళ్లలేక ఓటు హక్కునుకూడా వినియోగించుకోలేదు. ఎంపీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్స్టేషన్లు.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పోలింగ్‌కేంద్రాల సంఖ్యను పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పడిన ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల సంఘం 1000 నుంచి 1200 ఓటర్లకు ఒక పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,990కి చేరింది. పరిషత్ ఎన్నికల్లో 400 ఓటర్లకు పోలింగ్‌స్టేషన్.. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సంకల్పిం చిన ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల్లో 400 మంది ఓటర్లు ఉన్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రతి గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటైనట్ల య్యింది అంటే 200 నుంచి 400 ఓటర్ల వరకు ఉన్న ప్రతి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తక్కువ ఓటర్లు ఉన్న గ్రామాలు జిల్లాలో 305 ఉన్నాయి. ఆ గ్రామాల్లో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఏ గ్రామంలో ఉన్న ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు వేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. ఉదాహరణకు నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలం రెడ్డికాలనీకి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో బట్టపోతులగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కనగల్ మండలంలోని కుమ్మరిగూడెం ఓటర్లు అమ్మగూడెంలో, చెల్లాయిగూడెం ఓటర్లు కనగల్‌లో, తిప్పర్తి మండలంలోని బండ్లోరిగూడెం ఓటర్లు జొన్నగడ్డలగూడెంలో, సర్వాయిగూడెం ఓటర్లు గొల్లగూడంలో ఓటు వేసేవారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వారి ఇబ్బందులు తొలగనున్నాయి. -
95 స్థానాల్లో నేడు పోలింగ్
న్యూఢిల్లీ: లోక్‌సభ రెండో దశ ఎన్నికల్లో భాగంగా నేడు 95 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లోని జరగనుంది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జువల్ ఓరమ్, సదానంద గౌడ, పొన్ రాధాకృష్ణ సహా, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, డీఎంకే నేత దయానిధి మారన్, ఏ రాజా, కనిమొళి తదితరులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం తమిళనాడులోని 39 చోట్ల ఓటింగ్ జరగాల్సింది. కానీ, డీఎంకే నేత సంబంధీకుల వద్ద భారీ మొత్తంలో నగదు లభించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వేలూరు నియోజకవర్గంలో పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రద్దుచేసింది. సరైన శాంతిభద్రతలు లేకపోవడంతో త్రిపుర(ఈస్ట్) స్థానానికి పోలింగ్‌ను మూడో దశలో (ఏప్రిల్ 23న) నిర్వహించనున్నారు. ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫుల్బనీ అసెంబ్లీ నియోజకవర్గంలో సిబ్బందితో కలసి పోలింగ్ బూత్‌కు వెళ్తున్న ఎన్నికల అధికారిణిని మావోలు బుధవారం కాల్చి చంపారు. -
ఏపీలో పెరిగిన పోలింగ్
-
రాష్ట్రాల వారీగా పోలింగ్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం దేశవ్యాప్తంగా స్వల్ప ఘర్షణలు, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని ఈసీ వెల్లడించింది. 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో జరిగిన తొలివిడత పోలింగ్‌లో పలు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం అత్యధికంగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో 60 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు. ఇక బిహార్‌లో కేవలం 50 శాతం పోలింగ్ నమోదవగా, త్రిపురలో అత్యధికంగా 81.80 శాతం ఓటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొత్తం 25 లోక్‌సభ స్ధానాల్లో జరిగిన పోలింగ్‌లో 76.69 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో 60 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 81 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో 63.69 శాతం, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో 56 శాతం, జమ్ము కశ్మీర్లో 54.49 శాతం, అసోంలో 68 శాతం, నాగాలాండ్‌లో 78 శాతం, సిక్కింలో 69 శాతం, మణిపూర్‌లో 78 శాతం, మేఘాలయాలో 67.16 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 66 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 70 శాతం , లక్షద్వీప్‌లో 66 శాతం పోలింగ్ నమోదైంది. -
ఏపీలో 76.69 శాతం పోలింగ్
-
ఏపీలో 76.69 శాతం పోలింగ్ నమోదు
సాక్షి, ఆంధ్రప్రదేశ్: సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 76.69శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కొంతమేర పోలింగ్ శాతం తగ్గిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గుంటూరు, కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఈవీఎంలు మొరాయించడం, ఘర్షణలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల తొలిదశ పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాలో అత్యధికంగా 85 శాతం పోలింగ్ నమోదుకాగా.. విశాఖ, పశ్చిమ గోదావరి, కడపలో అత్యల్పంగా 70శాతం నమోదైంది. (చదవండి: ఓటెత్తిన ఆంధ్ర) జిల్లాల వారిగా పోలింగ్ శాతం వివరాలు శ్రీకాకుళం: 72 శాతం విజయనగరం: 85 శాతం విశాఖపట్నం: 70 శాతం తూర్పు గోదావరి: 81 శాతం పశ్చిమ గోదావరి: 70 శాతం కృష్ణా: 79 శాతం గుంటూరు: 80 శాతం ప్రకాశం: 85 శాతం నెల్లూరు: 75 శాతం చిత్తూరు: 79 శాతం కర్నూలు: 73 శాతం వైఎస్సార్ కడప: 70 శాతం అనంతపురం: 78 శాతం చదవండి: ఓటింగ్ శాతం తగ్గించేందుకు.. బాబు కుట్ర -
మహా యజ్ఞం షురూ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల యజ్ఞం ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా గురువారం 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 91 లోక్‌సభ స్థానాలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించిన పోలింగ్‌లో కోట్లాది మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించాయని, ఓటర్ల పేర్లు భారీగా గల్లంతైనట్లు వార్తలు వెలువడ్డాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఓటింగ్ కొనసాగుతుండగా ఓ పోలింగ్ బూత్ సమీపంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నలుగురు నక్సలైట్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో కొందరు గుర్తింపుకార్డులు లేకుండానే పోలింగ్ కేంద్రంలోకి చొరబడటానికి ప్రయత్నించగా, బీఎస్ఎఫ్ జవాను గాల్లోకి కాల్పులు జరిపి వారిని నిలువరించాడు. తొలి దశలో పోటీచేసిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ(నాగ్‌పూర్), హంసరాజ్ అహిర్(చంద్రాపూర్) కిరణ్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్(ముజఫర్‌నగర్) తదితరులున్నారు. ఎన్నికల గురించి తమ వేదికపై సుమారు 4.5 లక్షల సంభాషణలు జరిగినట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఉద్యోగాలు, వ్యవసాయం, పన్నులు తదితరాల కన్నా జాతీయభద్రత గురించే ఎక్కువ చర్చ జరిగిందని, ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిందని తెలిపింది. బెంగాల్లో 81 శాతం.. బిహార్‌లో 50 శాతం.. తొలి దశ పోలింగ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్‌లో అత్యల్పంగా 50 శాతం మందే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మిజోరంలో 61.95 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలో 35.01 శాతం, జమ్మూలో 72.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్(25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్(5), ఉత్తరప్రదేశ్(8), మహారాష్ట్ర(7), అస్సాం(5), బిహార్(4), ఒడిశా(4), జమ్మూ కశ్మీర్(2), పశ్చిమ బెంగాల్(2), ఛత్తీస్‌గఢ్(1), మేఘాలయ(2), అరుణాచల్‌ప్రదేశ్(2), మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్(175), అరుణాచల్‌ప్రదేశ్(57), సిక్కిం(32), ఒడిశా(28) అసెంబ్లీలకు కూడా తొలి దశలో ఎన్నికలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో నక్సలైట్ మృతి.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నక్సలైట్ చనిపోగా, ఒక జవాన్ గాయపడ్డాడు. ఓర్చా ప్రాంతంలోని అటవీప్రాంతంలో హెలిప్యాడ్ వద్ద భద్రతా బలగాలు సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని డీఐజీ సుందర్రాజ్ చెప్పారు. బస్తర్ లోక్‌సభకు పోలింగ్ నేపథ్యంలో నిఘా బృందం ఈ ఆపరేషన్‌ను చేపట్టిందని తెలిపారు. పేట్రోలింగ్ పూర్తయిన తరువాత భద్రతా బలగాలు వెనుదిరుగుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని దీంతో ఎన్కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు. -
పోలింగ్ సరళి పై టీడీపీలో నిరాశ
-
ఏపీలో 80 శాతం పైనే పోలింగ్!
-
పాతబస్తీలో ఫలించని మంత్రం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో పోలింగ్ శాతం పెంపుపై ఎన్నికల యంత్రాంగం, ప్రధాన రాజకీయ పక్షాలు చేసిన ప్రయోగం ఫలించలేదు. లోక్‌సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరుగుతున్న పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. ఈసారి కొత్తగా నమోదైన యువ ఓటర్లపై ఎన్నికల యంత్రాంగంతో పాటు మజ్లిస్ పార్టీ దృష్టి సారించినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా లెర్న్ ప్రాజెక్టును ప్రారంభించి కళాశాల విద్యార్ధులతో టాక్‌విత్ అసదుద్దీన్ పేరుతో ముఖాముఖి, టౌన్‌హాల్ కార్యక్రమాలను నిర్వహించింది. పాదయాత్రలతో పోలింగ్ శాతం పెంపుపై అవగాహన కూడా కల్పించింది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో వన్‌సైడ్‌గా పోలింగ్ జరిగే ఆనవాయితీ ఉన్నా.. మెజార్టీకి పోలింగ్ శాతమే ప్రాణం. వాస్తవంగా పాతబస్తీ పరిధిలో విస్తరించి ఉన్న లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. మెజార్టీ ఒకే సామాజిక వర్గం కావడంతో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. గుండుగుత్తగా ఓట్లు పడతాయి. సదరు సామాజికవర్గం వారు ఓట్లు వేశారంటే కచ్చితంగా ఆ పార్టీ ఖాతాలో పడినట్లే నమ్మకం. ప్రజలపై విశ్వాసం. కానీ ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. పాతబస్తీలో పురుష ఓటర్లతో పోల్చితే మహిళా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యింది. సాధారణంగా ఇంటి పనులతో తీరికలేకపోవడం, కట్టుబాట్లు, ఇతరత్రా కారణాలతో ప్రత్యేక సమయం కేటాయించి బయటకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ప్రతిసారీ మహిళా పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం. -
నాగల్‌గొంది.. తీరిన రంది
కెరమెరి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి వా రు అనుభవిస్తున్న కష్టాలు ఎట్టకేలకు దూరమయ్యాయి. కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉన్న గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఓటర్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల తర్వాత అక్కడి ఆదివాసీలకు ఎట్టకేలకు స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావిస్తున్నారు. ఏళ్ల కష్టాలు దూరం.. మండలంలోని కరంజివాడ గ్రామ పంచాయతీ లోని నాగల్‌గొంది, కొలాంగూడ గ్రామాల్లో 379 జనాభా ఉంది. అందులో పురుష ఓటర్లు 113 కా గా.. మహిళలు 106 మొత్తం 219 ఓటర్లు ఉన్నా రు. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇందాపూర్, లేదా నిషాని గ్రామంలోని పోలింగ్ బూత్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేవారు. 70 ఏళ్లలో ఇప్పటికి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వారికి కష్టాలు తప్పలేదు. ఇందాపూర్‌కు వెళ్లాలంటే 15 కిలోమీ టర్లు కాగా, నిషాని గ్రామం 18 కిలోమీటర్ల దూ రంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ కాలంలో ఏ ఎన్ని కలు జరిగిన వారు పాదయాత్రగా వెళ్లక తప్పలే దు. చాలా సందర్భాల్లో వానకు తడుస్తూ, ఎండ కు ఎండుతూ.. చలికి వణుకుతూ వెళ్లి ఓట్లు వేశా రు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి వారు దూరభా రం అధికమవుతుందని దగ్గర్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ఓటర్లు కోరినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. పోలింగ్ కేంద్రాల మార్పు రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉన్నప్పటికి మనకెందుకులే అనుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఓటు వేసేందుకు కష్టాలు చవిచూశారు. సాక్షి, తహసీల్దార్ ప్రత్యేక చొరవ ఈ విషయమై డిసెంబర్ 7న సాక్షి దినపత్రికలో ‘ఓట్ల కోసం తప్పని పాట్లు’ అనే కథనం ప్రచురి తం కావడంతో పాటు ఆ ప్రాంత ప్రజలు కెరమెరి తహసీల్దార్ ప్రమోద్ను వేడుకున్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ అక్కడి ఓటర్లు, జనాభా తదితరాల వివరాలను సేకరించారు. అక్కడి ఓట ర్లు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్న విష యం వాస్తవమేనని గ్రహించిన ప్రమోద్‌కుమార్ వెంటనే నాగల్గొందిలోనే పోలింగ్ కేంద్రం ఏర్పా టు చేశారు. నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు వారు నాగల్‌గొంది గ్రామంలో ఏర్పాటు చేసిన పో లింగ్ బూత్ సంఖ్య 90లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దూరభారం తగ్గింది చాలా కాలంగా ఓట్లు వేయడానికి పడుతున్న కష్టం ఎట్టకేలకు ముగిసింది. ఇక చక్కగ తమ గ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రెవెన్యూ అధికారులు కల్పించారు. సరైన రోడ్డు సౌకర్యం లేక , దూరభారం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. – మధుకర్ సర్పంచ్, నాగల్‌గొంది ఓటర్ల బాధలు చూసి.. ఓటర్లు టు వేసేందుకు పడుతున్న బాధనలు చూ సి వారు ఉండే గ్రామంలోనే పోలింగ బూత్ కేంద్రం ఏర్పాటు చే యాలని భావించాం. వెంటనే అధికారులకు నివేదికలు సమర్పించండంతో అక్కడ నూతనంగా పోలింగ్ బూత్ కేంద్రం మంజూరైంది. దీనికి ‘సాక్షి’ కూడా తోడైంది. ప్రజల బాధలు తీరాయి. దూరభారం తగ్గింది. – వి.ప్రమోద్, తహసీల్దార్ -
‘ఆమె’ కీలకం
బజార్హత్నూర్(బోథ్): 17వ లోక్‌సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జాతీయ పార్టీలుగా సుదీర్ఘ కాలంగా పాలించిన కాంగ్రెస్, బీజేపీతో ప్రాంతీయ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలు గెలుపొందేందుకు ముమ్మర ప్రచారంతో హోరెత్తించగా.. బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తమ ప్రచార పర్వం ఉధృతంగానే కొనసాగించాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు (ఖానాపూర్, సిర్పూర్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, ముథోల్) ఉన్నాయి. అతివలే అంతిమ నిర్ణేతలు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా,నేనా అన్నట్లు రీతిలో ప్రచా రం చేపట్టాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో సిర్పూర్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాలల్లో పురుషులతో పోల్చితే మహిళ ఓటర్లే అధికం. సహజంగానే పోలింగ్ సరళిలో పురుషులతో పోల్చితే మహిళలే ఉత్సహంగా పాల్గొంటారన్నది గత అనుభావాలు సూచిస్తుండటంతో ప్రస్తుత ఎన్నికల్లోనూ మహిళలదే కీలక పాత్ర కాబోతోంది. అంతే కాదు కొత్తగా 38,588 మంది ఓటర్లుగా నమోదైన యువత కూడా అభ్యర్థుల గెలుపోటమిలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఏడు నియోజకవర్గాల్లో 7,58,064 మంది మహిళా ఓటర్లు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 14,88,353 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,30,233 మంది పురుష ఓటర్లు, 7,58,064 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 56 మంది ఉన్నారు. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సిర్పూర్ మినహా పురుష ఓటర్లతో పోల్చితే మహిళా ఓటర్లే అధికం. సిర్పూర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లతో పోల్చితే పురుష ఓటర్లు 1574మంది అధికంగా ఉన్నారు. మిగతా ఆరు నియోజక వర్గాలలో మహిళా ఓటర్లే అధికం. ఖానాపూర్‌లో 3,763, నిర్మల్ 13,396, ఆసిఫాబాద్ 135, ఆదిలాబాద్ 2437, బోథ్ 3896, ముథోల్ 5676, మొత్తం 27,381 మంది మహిళలు అధికంగా ఉండటంతో ఎంపీ అభ్యర్థుల గెలుపోటమి వీరిపైనే ఆధారపడి ఉంది. ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు లోక్‌సభ అభ్యర్థికి మహిళల ఓట్లు కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ మా ప్రభుత్వం వస్తే, మా అభ్యర్థి గెలిస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పథకాలు ప్రవేశపెడుతామని హామీలిస్తూ మహిళలను కలుసుకుని ఓట్లు వేయాలని కోరారు. గ్రామస్థాయిలో సర్పంచులుగా మహిళల ప్రాతినిధ్యం పెరిగినందున అందులో అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా సర్పంచులు అధికంగా ఉండటంతో వారికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్కు ఓటు వేస్తే మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. బీజేపీ ముస్లిం మహిళలకు తలాక్ రద్దు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పరువు కాపాడుటతో పాటు స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు ప్రచారం చేసింది. ఇక కాంగ్రెస్ మహిళలకు ప్రత్యేక పథకాలు ఉంటాయని భరోసా కల్పిస్తూ ప్రచారం హోరెత్తించాయి. మరి ఈ ఎన్నికల్లో మహిళలు ఎటువైపు మొగ్గుచూపుతారోనన్న ఉత్కంఠ సర్వత్రా చోటు చేసుకుంది. -
ఆకట్టుకుంటున్న శక్తి పోలింగ్ స్టేషన్
సాక్షి, జోగిపేట(అందోల్): అందోలులోని ఉన్నత పాఠశాలలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుధవారం శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఒక్కటి శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉండటంతో అందోలులో ఏర్పాటు చేసినట్లు అందోలు తహసీల్దార్ బాల్‌రెడ్డి తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారిని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక కర్టెన్లతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలాగా ఏర్పాటు చేసిన స్వాగతతోరణం బాగా ఆకట్టుకుంటుంది. గ్రామస్తులు ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని చూసి వెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్
-
వలస కూలీల ఓట్ల పాట్లు...
సాక్షి, కర్నూల్ (ఆస్పరి) : ఈ రోజుల్లో ఉన్నత విద్యావంతులకు కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలంటే నామోషి.. ఆఫీసులు ఆ రోజు సెలవునిస్తే సినిమాలకు, పబ్బులకు వెళ్లి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు... మరోవైపు వారికి చదువు రాదు.. పొట్టచేత బట్టుకుని వలస వెళ్లారు.. కానీ వారికి ఓటు విలువ తెలుసు. ఓటు హక్కును వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావించి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సొంతూరు పయణమయ్యారు.. వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోయి పనులు లేకపోవడంతో బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లిన మండల పరిధిలోని తంగరడోణ, ములుగుందం, బనవనూరు, కైరుప్పల, తొగలుగల్లు, యాటకల్లు, హలిగేర, చిరుమాన్‌దొడ్డి, శంకరబండ తదితర గ్రామాలకు చెందిన కూలీలు మిర్చి కోత పనుల కోసం రెండు, మూడు నెలల క్రితం గుంటూరు వెళ్లారు. ఈ రోజు పోలింగ్ ఉండడంతో దూర ప్రాంతాల్లోని వారంతా లారీలు, రైళ్లు, బస్సులు ఇతర ప్రత్యేక వాహనాల్లో సొంతూరు వస్తున్నారు. మండల పరిధిలోని తంగరడోణకు చెందిన కూలీలు గుంటూరు నుంచి ఆల్విన్ వాహనంలో సొంతూరు వచ్చారు. -
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే... తాట తీస్తా..!
సాక్షి, కడప అర్బన్: ఎన్నికల నిర్వహణలో అప్రజాస్వామికంగా వ్యవహరించినా, విఘాతం కలిగించినా తాట తీస్తామని ఎస్పీ అభిషేక్ మహంతి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామనీ ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు, ఏజెంట్లకు సూచనలు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లు గానీ వాహనాలు కాన్వాయ్‌గా రాకూడదన్నారు. అనుమతించిన వాహనాలలోనే విడివిడిగా వెళ్లాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద, ఇతర ప్రదేశాలకుగానీ గుంపులుగా ఉండరాదు. ఓటరును భయపెట్టరాదు. ప్రలోభాలకు గురి చేయరాదు. ఓటర్లను వాహనాల్లో తరలించరాదు. ఇతర సౌకర్యాలైన భోజనం, వగైరా వసతులను కల్పించరాదన్నారు. అలా చేస్తే వాహనాలు, వస్తువులను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 18వేల మందిని బైండోవర్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల ప్రక్రియను ఎప్పటికపుడు చిత్రీకరించనున్నారు. దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందిబందోబస్తులో పాల్గొంటున్నారు. సిఆర్పీఎఫ్, ఐఆర్బీ, కేరళ, కర్నాటక నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు పోలింగ్ స్టేషన్ వద్ద బందోబస్తులో పాల్గొంటాయి. పోలింగ్ ప్రక్రియకు విఘాతం కల్గించే వ్యక్తులపై, వారికి మద్దతు ఇచ్చే అభ్యర్థులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. -
ఒకే నియోజకవర్గం..80,000 మంది పోలీసులు..
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో కట్టదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇవ్వడం, పోలింగ్‌కు రెండు రోజుల ముందు బీజేపీ ఎమ్మెల్యే భీమా మాందవి, నలుగురు పోలీసు సిబ్బందిని మావోలు హతమార్చడంతో బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో 80,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. మావోల దాడి జరిగిన దంతెవాడ బస్తర్ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నియోజకవర్గంలో 1879 పోలింగ్ కేంద్రాలకు గాను 741 పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యసాత్మకంగా, 606 సమస్యాత్మక బూత్‌లుగా గుర్తించారు. మావోల హెచ్చరికల నేపథ్యంలో 289 పోలింగ్ కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా డ్రోన్లను సైతం వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. -
దేశవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో పోలింగ్ షురూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, బిహార్, ఒడిశా,చండీగఢ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల్లోని పలు నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఇక జనరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఐదు గంటల వరకూ కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. అయితే మణిపూర్, నాగాలండ్‌లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని పేర్కొంది. మరోవైపు తొలివిడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రారంభమైంది. తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. పలు చోట్ల ఈవీఎం మొరాయించడంతో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయి. ఎలాంటి సాంకేతికమైన సమస్యలు తలెత్తకుండా ఉదయం 5.30 గంటల నుంచి మాక్ పోలింగ్‌ను నిర్వహించారు. ఏపీలో 46,120 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా.. తెలంగాణలో మొత్తం 34,603 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా నేడు తొలి విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 91 పార్లమెంట్ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమైంది. సున్నితమైన, సమస్యత్మాక ప్రాంతాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. -
పోలింగ్ చీటీపైనే అన్నీ.
వాంకిడి(ఆసిఫాబాద్): ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్ చీటీలను బీఎల్వోల ద్వారా పంచి పెట్టింది. ఓటర్లకు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలింగ్ చీటీపైనే ఓటరు ఫొటో, పోలింగ్ కేంద్రం మ్యాప్, బీఎల్వో పేరు, ఫోన్‌నంబర్, కేంద్రం సమస్త వివరాలను ముద్రించింది. దీంతో గత ఎన్నికల్లో ఓటరు ఓటు వేయాలన్న కేంద్రం ఎక్కడుంది, ఓటు వేయాడానికి వెళ్లాలన్న ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నికల కమిషన్ ఓటరు ఫొటోతో కూడిన పోలింగ్ చీటీలను పంపిణీ చేస్తూ వాటి వెనుకలో కేంద్రం మ్యాప్, వివరాలను పొందుపర్చారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ విధానం అములు చేయడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడడంతో తిరిగి అదే విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు.జిల్లాలో మొత్తం 583 పోలింగ్ కేంద్రాలు చేశారు. ఇందులో సిర్పూర్(టి) నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 300ల కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4,02,663 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 1863 మంది అధికారులను నియమించారు. ఓటర్లు వచ్చేలా చర్యలు పోలింగ్ చీటీలో ముద్రించిన సూచనలు ఇలా.. మీ గుర్తింపును నిరూపించడానికి ఓటరు చీటి మాత్రమే సరిపోదు, మీ గుర్తింపును బలపర్చడానికి మీరు మీ ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల కమిషన్ పేర్కొంది. 11 డాక్యూమెంట్లలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పని సరిగా మీ వెంట తీసుకురావాలి. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ వరుసలో ఉన్న ఓటర్లందరికీ టోకెన్ జారీ చేసి తమ ఓటు వేయడానికి అనుమతిస్తారు. మహిళకు ప్రత్యేక క్యూ ఉంటుంది. వయోవృద్ధులకు ఓటింగ్ నిమిత్తం ప్రాధాన్యం ఉంటుంది. అందులు, శారీరక వైకల్యం కలిగిన ఓటరు ఓటు వేయడం కోసం కంపార్టుమెంటు వద్దకు తీసుకెళ్లేందుకు ఒక వయోజనుడిని సహాయకుడిగా అనుమతించవచ్చు. మొబైల్ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పోలింగ్ బూత్‌లోకి అనుమతించరు. ఒక నిర్ణీత అభ్యర్థి కోసం ఓటు వేయడానికి డబ్బు లేదా ఏదేని ఇతర విధాలైన ప్రతిఫలాన్ని ఇవ్వజూపడం లేదా అంగీకరించడం చట్ట ప్రకారం అవినీతి చేష్ట కిందకు వస్తుంది. ఏ ఒక్క ఓటరును వదిలేయరాదు. ప్రతీ ఓటు లెక్కించబడుతుంది. ఓటరు చెంతలోనే పోలింగ్ చీటీలు మండలాల వారీగా ఏర్పాటు చేసిన బీఎల్వోలు పోలింగ్ చీటీలను వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అలా పంపిణీ చేసిన అనంతరం బీఎల్వోలు ఓటరులకు పోల్ చీటిలు ముట్టినట్లు సదరు ఓటరు ద్వార సంతకాలు తీసుకుంటున్నారు. ఇలా పోలింగ్ చీటీలు ఇవ్వడానికి బీఎల్వోలు వెళ్లినప్పుడు ఇంట్లో ఓటరు లేకున్న దిగులు పడకుండా ఓటింగ్ సమయంలో కేంద్రాల వద్ద ఉన్న బీఎల్వో వద్ద నుంచి తమ పోలింగ్ చీటీలు సేకరించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చనే వెసులుబాటు కల్పించారు.