![GHMC Elections 2020: Voters Allowed Show Alternate Documents Voting Day - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/28/id%20proof.jpg.webp?itok=ZIMp1Y4v)
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపుకార్డు లేకున్నా ప్రత్యామ్నాయ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి డిఎస్ లోకేష్ కుమార్ శనివారం తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ప్రతీ ఒక్క ఓటరు గుర్తింపు నిర్థారణకు గాను ఓటరు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే నిర్థారణకు కింద తెలిపిన ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదయినా ఒకదానిని చూపాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కాగా ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా కింద పేర్కొన్న 18 గుర్తింపు కార్డులు ఓటర్లు తమ వెంట తీసుకురావచ్చు. అవి ఏంటంటే
1. ఆధార్ కార్డు 2. పాస్‌పోర్ట్ 3. డ్రైవింగ్ లైసెన్స్ 4. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫైకార్డ్ 5. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్ 6. పాన్ కార్డు7. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు 8. జాబ్ కార్డు 9. హెల్త్ కార్డు 10. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్ 11. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం 12. రేషన్ కార్డు 13. కుల ధృవీకరణ పత్రం 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు 16. అంగవైకల్యం సర్టిఫికెట్ 17. లోక్‌సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు 18. పట్టదారు పాస్‌బుక్
Comments
Please login to add a commentAdd a comment