ఏపీలో 76.69 శాతం పోలింగ్‌ నమోదు | District Wise Voting Percentage In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 76.69 శాతం పోలింగ్‌ నమోదు

Apr 12 2019 9:27 AM | Updated on Apr 12 2019 7:15 PM

District Wise Voting Percentage In Andhra Pradesh - Sakshi

సాక్షి, ఆంధ్రప్రదేశ్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 76.69శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కొంతమేర పోలింగ్‌ శాతం తగ్గిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గుంటూరు, కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఈవీఎంలు మొరాయించడం, ఘర్షణలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 

ఎన్నికల తొలిదశ పోలింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాలో అత్యధికంగా 85 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. విశాఖ, పశ్చిమ గోదావరి, కడపలో అత్యల్పంగా 70శాతం నమోదైంది. (చదవండి: ఓటెత్తిన ఆంధ్ర)

జిల్లాల వారిగా పోలింగ్‌ శాతం వివరాలు

  • శ్రీకాకుళం: 72 శాతం
  • విజయనగరం: 85 శాతం
  • విశాఖపట్నం: 70 శాతం
  • తూర్పు గోదావరి: 81 శాతం
  • పశ్చిమ గోదావరి: 70 శాతం
  • కృష్ణా: 79 శాతం
  • గుంటూరు: 80 శాతం
  • ప్రకాశం: 85 శాతం
  • నెల్లూరు: 75 శాతం
  • చిత్తూరు: 79 శాతం
  • కర్నూలు: 73 శాతం
  • వైఎస్సార్‌ కడప: 70 శాతం
  • అనంతపురం: 78 శాతం

చదవండి: ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు.. బాబు కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement