బీజేపీ మద్దతు దారులు పోలింగ్ బూత్‌లను లూటి చేస్తున్నారంటూ ఉత్తర్ ప్రదేశ్ సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఉత్తర్ప్రదేశ్లో ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న 10 లోక్‌సభ స్థానాల్లో మూడో విడతలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో తన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మైన్‌పురి నియోజకవర్గంలో ఎటావాలో ఓటు వేశారు.
రైతులు ప్రాణాలు కోల్పోయారని
అనంతరం బీజేపీపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. బీజేపీలో అధికార పోరు నడుస్తోందని, అందుకే ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతికేరంగా వెయ్యి మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.
లఖింపూర్ ఖేరీ హింసాకాండపై
ఈ సందర్భంగా 2021లో జరిగిన లఖింపూర్ ఖేరీ హింసాకాండను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో ఉన్న ఓ నలుగురు అగంతకులు రైతులను ఢీకొట్టారని ఆరోపించారు. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ద్వజమెత్తారు.
ఐదు లక్షల ఓట్లతో డింపుల్ యాదవ్
కాగా, సైఫాయిలో ఓటు వేసిన ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని కాపాడే పోరాటమని, మైన్‌పురి స్థానంలో డింపుల్ యాదవ్ ఐదు లక్షల ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment