లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టు ఇందుకు కారణమవుతోంది.
‘ఇండియా కూటమిలో భాగంగా ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తుకు మంచి ప్రారంభం లభించింది. యూపీలో 11 బలమైన సీట్లను కాంగ్రెస్‌కు ఇస్తున్నాం‘ అని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నిజానికి కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీని యూపీలో అడిగింది 13 సీట్లు.
దీనికి అఖిలేశ్ ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్‌కు కేవలం 11 సీట్లే ఆయన ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ 13 సీట్ల కోసం కాంగ్రెస్ పట్టుపడితే పొత్తు వ్యవహారంలో మొదటికే మోసం వస్తుందన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
అఖిలేశ్ పోస్టుపై యూపీ కాంగ్రెస్ వ్యవహరాల ఇంఛార్జ్ అవినాష్ పాండే స్పందించారు. ‘సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకంలో చర్చల్లో మంచి పురోగతి ఉంది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ పోస్టు తాను కూడా చూశానని అయితే ఆయన వ్యాఖ్యలపై మరింత సమాచారం ఏదీ లేదు’అని పాండే అన్నారు.
కాగా, బిహార్ లాంటి కీలక రాషష్ట్రంలో జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ ఇప్పటికే ఇండియా కూటమిని వీడుతున్నట్లు స్పష్టమైపోయింది. ఆయన బీజేపీతో మళ్లీ జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై ఎటూ తేల్చలేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల వరకు ఇండియా కూటమిలో ఎన్ని పెద్ద పార్టీలు మిగులుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment