యూపీలోని లక్నోలో గల సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర వెలసిన ఒక పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్‌లో డింపుల్ యాదవ్‌ను యూపీకికి కాబోయే ముఖ్యమంత్రిగా చూపించారు. ఇంతేకాదు ఈ పోస్టర్‌లో డింపుల్ యాదవ్ ఫొటోను అఖిలేష్ యాదవ్ కంటే పెద్దదిగా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ వెనుక కథనం అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర తరచూ పోస్టర్లు కనిపించడం సాధారణమే. అయితే తాజాగా వెలసిన డింపుల్ యాదవ్‌కు సంబంధించిన పోస్టర్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ హోర్డింగ్‌ను ఎస్పీ నేత అబ్దుల్ అజీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, డింపుల్ యాదవ్‌ను యూపీకి కాబోయే కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు.
జనవరి 15న డింపుల్ యాదవ్ పుట్టినరోజు. దీనికి ముందుగానే పార్టీ కార్యాలయం ముందు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అనేక అర్థాలకు అవకాశమిస్తోంది. దీనిని చూసిన కొందరు ఇకపై అఖిలేష్ యాదవ్ దేశరాజకీయాలపై దృష్టిపెడతారని, అతని స్థానంలో డింపుల్ యాదవ్ యూపీ బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలావుండగా అఖిలేష్ యాదవ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కన్నౌజ్, అజంగఢ్ లోక్‌సభ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment