dimple yadav
-
అఖిలేష్‌పై డింపుల్ కళ్లు.. ‘సభ’లో సూపర్ సీన్
18వ లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి సెషన్లో మూడో రోజు బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ సమయంలో సభలో ఓ దృశ్యం తళుక్కున మెరిసింది. ఓం బిర్లాకు ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కూడా ఓం బిర్లాను అభినందించారు. ఈ సమయంలో అఖిలేష్ భార్య భార్య డింపుల్ యాదవ్ అతని వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నారు. అఖిలేష్ మాట్లాడుతున్నంత సేపు ఆమె దృష్టి భర్తపైనే నిలిచింది. అఖిలేష్ నూతన స్పీకర్ ఓం బిర్లాను అభినందిస్తూ.. కొత్త పార్లమెంటు- పాత పార్లమెంట్ అనే తేడాలు చూపిస్తూ మాట్లాడారు. కొత్త సభలో స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉందని, పాత పార్లమెంటులో కుర్చీ ఎత్తు తక్కువని అన్నారు. ‘స్పీకర్ సార్ మీకు అభినందనలు. మీకు స్పీకర్‌గా ఐదేళ్ల అనుభవం ఉంది. మీకు పాత, కొత్త సభలతో పరిచయం ఉంది.మీరు కూర్చున్న స్థానం ఎంతో విలువైనది. అద్భుత సంప్రదాయాలు కలిగినది. మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని, వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. మీరు ప్రతీ ఎంపీకి, ప్రతీ పార్టీకి సమాన అవకాశం, గౌరవం ఇస్తారని అనుకుంటున్నాం. నిష్పాక్షికత అనేది ఈ స్థానానికున్న ప్రధాన బాధ్యత. మీరు లోక్‌సభలో ప్రధాన న్యాయమూర్తి తరహాలో కూర్చున్నారు. ఎవరి గొంతునూ అణచివేయకూడదు. అలాగని ఎవరినీ బహిష్కరించకూడదు.మీ నియంత్రణ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై కూడా ఉండాలి. మీ సూచనల మేరకు సభ నడుచుకోవాలి. దానికి విరుద్ధంగా ఉండకూడదు. నేను మొదటిసారి సభకు వచ్చాను. మీ స్పీకర్ కుర్చీ చాలా ఎత్తుగా ఉన్నదని నేను అనుకుంటున్నాను..స్పీకర్ సార్’అని అఖిలేష్ అన్నారు. అఖిలేష్ సభలో మాట్లాడుతున్నంత సేపు అతని భార్య డింపుల్ చిరునవ్వులు చిందిస్తూ భర్తను చూస్తూనే ఉన్నారు.భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓం బిర్లా బుధవారం లోక్‌సభ స్పీకర్‌గా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ఈ బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రొటెం స్పీకర్ (యాక్టింగ్ స్పీకర్) భర్తిహరి మహతాబ్ సభలో ఓటింగ్ కోసం ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు తాత్కాలిక స్పీకర్ మహతాబ్ ప్రకటించారు. -
ఒకే వేదికపై ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్?
యూపీలో వివిధ రాజకీయ పార్టీల లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియా కూటమి అభ్యర్థి అజయ్ రాయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వారణాసిలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు.దీనికి సంబంధించి ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే సభ జరిగే వేదికను, తేదీని ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ మహానగర అధ్యక్షుడు రాఘవేంద్ర చౌబే, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ పటేల్ మాట్లాడుతూ ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి అధికారులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా వారణాసిలో జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌కు మద్దతుగా మే 28 లేదా 29న ఈ ఇద్దరు నేతలూ వారణాసిలో రోడ్ షో నిర్వహిస్తారని సమాచారం. -
పోలింగ్ బూత్‌లలో లూటీ.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మద్దతు దారులు పోలింగ్ బూత్‌లను లూటి చేస్తున్నారంటూ ఉత్తర్ ప్రదేశ్ సమాజ్‌వాది (ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న 10 లోక్‌సభ స్థానాల్లో మూడో విడతలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ తరుణంలో తన భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మైన్‌పురి నియోజకవర్గంలో ఎటావాలో ఓటు వేశారు.రైతులు ప్రాణాలు కోల్పోయారనిఅనంతరం బీజేపీపై అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. బీజేపీలో అధికార పోరు నడుస్తోందని, అందుకే ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని, మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతికేరంగా వెయ్యి మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.లఖింపూర్ ఖేరీ హింసాకాండపైఈ సందర్భంగా 2021లో జరిగిన లఖింపూర్ ఖేరీ హింసాకాండను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారులో ఉన్న ఓ నలుగురు అగంతకులు రైతులను ఢీకొట్టారని ఆరోపించారు. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ద్వజమెత్తారు. ఐదు లక్షల ఓట్లతో డింపుల్ యాదవ్ కాగా, సైఫాయిలో ఓటు వేసిన ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని కాపాడే పోరాటమని, మైన్‌పురి స్థానంలో డింపుల్ యాదవ్ ఐదు లక్షల ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
లక్నో: దేశంలో మూడోదశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటుహక్కును సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని సైఫాయ్‌లో ఓటు వేసిన తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ.. మెయిన్‌పురి అభ్యర్థి డింపుల్ యాదవ్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై బీజేపీని ఉద్దేశించి డింపుల్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీలో భారీ లోపం ఉందని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా బీజేపీ ప్రతి వర్గాల ప్రజలు నిర్లక్ష్యంగా భావిస్తున్నారని అన్నారు. బీజేపీ హయాంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ నిరంతరం పడిపోతోంది అన్నారు.10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏ పనీ చేయలేకపోయిందని, ప్రభుత్వం తన వైఫల్యాన్ని దేశం మొత్తంలో వ్యాపింపజేసిందని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారని అన్నారు. రాజకీయ భావజాలం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఇప్పుడు చాలా అవసరమని అన్నారు. -
ఈసారి ఓటు మార్పు కోసమే
మెయిన్‌పురి: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా మార్పు కోసమే ఓటేస్తారని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ధీమా వెలిబుచ్చారు. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామం సైఫైలో పీటీఐ ప్రత్యేక ముఖాముఖిలో పలు అంశాలపై డింపుల్ తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు... బీజేపీపై.. బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మునిగిపోయింది. కులాల లెక్కన జనాన్ని విడగొడుతోంది. జనం మనోభావాలతో ఆడుకుంటోంది. కీలక సమస్యల నుంచి జనం దృష్టి మరల్చుతోంది. బీజేపీ రాజకీయ ఒత్తిళ్లతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. విభజన రాజకీయాలతో వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటోందని వారికి తెలిసొచి్చంది. అందుకే కేంద్రంలో ఈసారి అధికార మార్పు కోసమే జనం ఓటేస్తారు.దర్యాప్తు సంస్థలు, ధరలపై.. ఈడీ, సీబీఐ, ఐటీ ఇలా ప్రతి దర్యాప్తు సంస్థనూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దురి్వనియోగం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా స్థాయిలోనూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ జనాన్ని పీడిస్తోంది. ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు జనాలకు చేరట్లేవు. వాగ్దానాలైతే జోరుగా చేస్తున్నారుగానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు అస్సలు కనిపించట్లేదు. దేశాన్ని బీజేపీ ఎటువైపు తీసుకెళ్తుందో అందరికీ తెలుసు. పోషకాహార లోపం, ఆకలి చావుల రేటింగ్స్, గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఏటికేడు దిగజారుతోంది. మళ్లీ బీజేపీ గెలిస్తే దేశం 15 ఏళ్లు తిరోగమనంలోకి వెళ్లడం ఖాయం. దేశ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన తరుణంలో వచ్చిన ఎన్నికలివి.మోదీ మంగళసూత్రం వ్యాఖ్యలపై ఇదొక్కటే వాళ్లకు ఆయుధంగా దొరికింది. జనం భవితకు సంబంధించిన ఏ అంశమూ బీజేపీకి పట్టదు. యూపీలో మొత్తం 80 సీట్లు గెలిచేస్తామని అబద్ధాలు చెబుతున్నారు. అందులో నిపుణులు వాళ్లు. కానీ వాళ్ల మాటలను ఈసారి జనం నమ్మట్లేరు. గట్టి గుణపాఠమే చెప్తారు. అత్యంత అవినీతి నేతలను బీజేపీ లాగేసి డ్రై క్లీనింగ్ మెషీన్లో పడేస్తోంది. అంతా రాజకీయ లబ్దికోసమే చేస్తుంది. గెలుపు మెజారిటీ తగ్గడంపై.. మామ ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి చూస్తే భారీ మెజారిటీ అనేది తగ్గడం వాస్తవమే. 2019లో ఆ మెజారిటీ కేవలం 94000కు తగ్గింది. ఎన్నికలు ఎప్పుడూ ఒకేలా జరగవు. ప్రతిసారీ గెలుపును వేర్వేరు కారణాలు ప్రభావితం చేస్తాయి. తన ప్రచార సరళిపై.. రోజుకు ఎనిమిది, తొమ్మిది మీటింగ్‌లలో పాల్గొంటున్నా. విపక్షాల ‘ఇండియా’ కూటమికి జనం నుంచి వస్తున్న స్పందన అద్భుతం. నా కూతురు అదితి యాదవ్ సైతం తొలిసారిగా ప్రచారంలో పాల్గొంటోంది. గ్రామాలకు వెళ్తూ వారిని కలుస్తోంది. ములాయం మరణంతో వెల్లువెత్తిన సానుభూతి కారణంగానే 2022 మెయిన్‌పురి ఉపఎన్నికల్లో 2.8 లక్షల భారీ మెజారిటీతో ఎస్పీ గెలిచిందన్న బీజేపీ వ్యాఖ్యల్లో నిజంలేదు. జనం మనసుల్లో మేమే ఉన్నాం. ఈసారీ గెలుపు మాదే. ఆర్మీలో పనిచేస్తున్న యువతతోపాటు వృద్ధులు, మహిళలు అంతా బీజేపీ వాగ్దానాలను నెరవేర్చలేదన్న నిస్పృహలో ఉన్నారు. -
డింపుల్ యాదవ్ సింపుల్ పొలిటీషియన్
డింపుల్ యాదవ్. సైనిక కుటుంబానికి చెందిన సాదాసీదా అమ్మాయి. అఖిలేశ్ యాదవ్‌ను పెళ్లాడి అనూహ్యంగా బడా రాజకీయ కుటుంబంలో అడుగు పెట్టారు. తొలుత తనను అంతగా ఇష్టపడని ములాయం సింగ్ యాదవ్‌కు ప్రియమైన కోడలిగా మారారు. తండ్రీ కొడుకుల రాజకీయ విభేదాలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అంతే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రమూ చేసినా స్వయంకృషితో ఎంపీగానూ రాణించారు. అలా ఇంటా బయటా ఫుల్ మార్కులు కొట్టేశారు.డింపుల్‌కు తొలుత రాజకీయాలు, కులాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె పుట్టింది పూర్తి భిన్నమైన కుటుంబం కావడమే అందుకు కారణం. అలాంటిది పెళ్లి తర్వాత వాటిపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. కుల సమీకరణాలకు పుట్టిల్లయిన యూపీ వంటి రాష్ట్రంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. స్వతహాగా మితభాషి అయినా వేదిక ఎక్కితే మాత్రం డింపుల్ అద్భుతమైన వక్త. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే సమాజ్‌వాదీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి... రాజకీయాల్లోకి రావాలని డింపుల్ ఎప్పుడూ అనుకోలేదు. భర్త అఖిలేశ్ యాదవ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్, కన్నౌజ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. కన్నౌజ్ను అట్టిపెట్టుకోవడంతో ఫిరోజాబాద్‌కు ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ డింపుల్ బరిలో దిగాల్సి వచి్చంది. కానీ బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం కావడంతో కన్నౌజ్ లోక్‌సభ స్థానమూ ఖాళీ అయింది. అక్కడి నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్నౌజ్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా, యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళా ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు. 2019లో బీజేపీ నేత సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. 2022లో మామ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో డింపుల్ భారీ విజయం సాధించారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని డింపుల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా ప్రచారం చేశారు. భర్తకు మద్దతుగా 20 ర్యాలీల్లో ప్రసంగించారు. అంతకుముందు కుటుంబ కలహాల వేళ తండ్రీ కొడుకుల మధ్య సఖ్యత నెలకొల్పారు.ప్రేమ, పెళ్లి, పిల్లలు.. డింపుల్ మహారాష్ట్రలోని పుణెలో 1978 జనవరి 15న జని్మంచారు. తండ్రి ఆర్మీ కల్నల్ రామ్‌చంద్ర సింగ్ రావత్. వారిది ఉత్తరాఖండ్. తండ్రి ఉద్యోగరీత్యా పుణె, భటిండా, అండమాన్, నికోబార్ దీవుల్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో చదివారు డింపుల్. లక్నో యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. అఖిలేశ్‌ను తొలిసారి చూసినప్పుడు డింపుల్ ప్లస్ టూ చదువుతున్నారు. ఆమెకు 17 ఏళ్లు, అఖిలేశ్‌కు అప్పుడు 21 ఏళ్లు. ఇంజనీరింగ్ చేస్తున్నారు. కామన్ ఫ్రెండ్ పార్టీలో పరిచయమైంది. తొలి భేటీలోనే మంచి స్నేహితులయ్యారు. పై చదువులకు అఖిలేశ్ ఆ్రస్టేలియా వెళ్లారు. అప్పుడు ఇద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అలా ప్రేమ చిగురించింది. తిరిగొచ్చాక అఖిలేశ్‌పై పెళ్లి ఒత్తిడి పెరగడంతో డింపుల్ గురించి అమ్మమ్మకు చెప్పారు. కుటుంబ నేపథ్యాలు వేర్వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. అఖిలేశ్ పట్టుదల చూసి తండ్రి ములాయం సింగ్ చివరికి పెళ్లికి అంగీకరించారు. అలా 1999న వారు ఒకటయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అదితి. అర్జున్, టీనా కవలలు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడానికి ఇష్టపడతారు డింపుల్. ‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. రాజకీయాలతోపాటు పిల్లలకు సమయమివ్వడానికి ఇష్టపడతా’’ అంటారు. -
నా భార్య రూ.54 లక్షల అప్పుంది: మాజీ సీఎం
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.తన అభ్యర్థిత్వంతో పాటుగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన వద్ద రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్ ఆస్తుల విలువ రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో ఆయన మొత్తం కుటుంబ ఆస్తులు రూ.41.88 కోట్లకు చేరాయి.అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్లో తన భార్య డింపుల్ యాదవ్ తనకు రూ. 54 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 1.60 లక్షల విలువైన మట్టి, పింగాణి పాత్రలు ఉన్నట్లు వెల్లడించడం విశేషం. అఖిలేష్ చేతిలో రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్ల బ్యాంకు వాల్ట్‌లు ఉన్నాయి.లిక్విడ్ క్యాష్ రూపంలో డింపుల్ యాదవ్ వద్ద రూ.5.72 లక్షలు, వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో రూ.3.75 కోట్లు ఉన్నాయి. ఆమె వద్ద 2.77 కేజీల బంగారంతో కూడిన రూ.59.76 లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఇక అఖిలేష్ చరాస్తుల్లో రూ.9.12 కోట్లు, స్థిరాస్తుల్లో రూ.17.22 కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా, డింపుల్ చరాస్తుల విలువ 5.10 కోట్లు. ఆమెకు రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. -
ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్‌ప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ, మెయిన్‌పురి ఎంపీ అభ్యర్ధి డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే ఈ లోక్‌సభ ఎన్నికలు. సమాజంలోని ప్రతి వర్గం నిర్లక్ష్యానికి గురవుతోంది. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అబద్ధాలు, దోపిడి ప్రభుత్వమని రాష్ట్రం, దేశం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. అందుకే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలని ఓటర్లకు పిలునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఓడించారు. అందుకు ఈ ఎన్నికలే మనకు ఆయుధం. ఈ (బీజేపీ) ప్రభుత్వాన్ని కేంద్రం నుండి తొలగిస్తే, అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తొలగించే పని కూడా జరగవచ్చు అని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణీయే డింపుల్ యాదవ్ -
‘సమాజ్‌వాది’ వస్తే.. సీఎంగా డింపుల్ యాదవ్?
యూపీలోని లక్నోలో గల సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర వెలసిన ఒక పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్‌ను యూపీకికి కాబోయే ముఖ్యమంత్రిగా చూపించారు. ఇంతేకాదు ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్ ఫొటోను అఖిలేష్ యాదవ్ కంటే పెద్దదిగా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ వెనుక కథనం అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర తరచూ పోస్టర్లు కనిపించడం సాధారణమే. అయితే తాజాగా వెలసిన డింపుల్ యాదవ్‌కు సంబంధించిన పోస్టర్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ హోర్డింగ్‌ను ఎస్పీ నేత అబ్దుల్ అజీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, డింపుల్ యాదవ్‌ను యూపీకి కాబోయే కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. జనవరి 15న డింపుల్ యాదవ్ పుట్టినరోజు. దీనికి ముందుగానే పార్టీ కార్యాలయం ముందు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అనేక అర్థాలకు అవకాశమిస్తోంది. దీనిని చూసిన కొందరు ఇకపై అఖిలేష్ యాదవ్ దేశరాజకీయాలపై దృష్టిపెడతారని, అతని స్థానంలో డింపుల్ యాదవ్ యూపీ బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుండగా అఖిలేష్ యాదవ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కన్నౌజ్, అజంగఢ్ లోక్‌సభ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ భారీ విజయం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని 5 రాష్ట్రాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం వెలువడుతున్నాయి. ఇందులో ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్ పూరి లోక్‌సభ స్థానం కూడా ఒకటి. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్‌లో మృతి చెందడంతో మెయిన్‌పూరి లోక్‌సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి ఎస్పీ తరపున ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. మెయిన్‌పూరి ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ చరిత్రను తిరగరాస్తూ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడు లక్షల బంపర్ మెజార్టీతో మెయిన్‌పూరిని కైవసం చేసుకున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2,88,461 ఓట్ల భారీ తేడాతో విజయ కేతనం ఎగరవేశారు. మొయిన్‌పూరి విజయంపై డింపుల్ యాదవ్ స్పందించారు.. తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మినందుకు మెయిన్‌పురి ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం నేతాజీకి (దివంగత ములాయం సింగ్ యాదవ్) అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ రంగంలోకి దింపినా ఓటర్లు మాత్రం డింపుల్‌వైపు మొగ్గుచూపారు. ఒకానొక దశలో ఆమె వెనుకంజలో ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ పుంజుకొని మెజార్టీ సాధించారు. సమాజ్‌వాదీకి కంచుకోటగా పిలిచే మొయిన్‌పూరిలో సైకిల్ పరుగులు పెట్టడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సహంలో మునిగిపోయారు. చదవండి: గుజరాత్ ఎన్నికలతో చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్ కాగా మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్.. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా -
Dimple Yadav: మామ స్థానంలో బరిలో కోడలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ట్విటర్లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వీటితోపాటే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు.. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. समाजवादी पार्टी द्वारा लोकसभा क्षेत्र मैनपुरी उपचुनाव - 2022 हेतु श्रीमती डिंपल यादव पूर्व सांसद को प्रत्याशी घोषित किया गया है। pic.twitter.com/gZIvtETfLT — Samajwadi Party (@samajwadiparty) November 10, 2022 మామ ములాయంతో డింపుల్ (పాత ఫొటో) మోదీ 2.0 వేవ్‌ను తట్టుకుని ములాయం సింగ్ యాదవ్.. బీజేపీ అభ్యర్థిపై 94వేల ఆధిక్యంతో 2019 ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి నెగ్గారు. అయితే 2014లో ములాయం ఏకంగా మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గడం గమనార్హం. దీంతో మెయిన్‌పురి ఆయన ఇలాకాగా పేరు దక్కించుకుంది. భర్త అఖిలేష్‌తో డింపుల్ మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్(44).. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. -
మాజీ సీఎం భార్య, కుమార్తెకు కరోనా
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అఖిలేశ్ భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. వారి కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని డింపుల్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కోవిడ్-19 టీకాలు రెండు డోసులు వేయించుకున్నప్పటికీ ఆమె కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. ‘నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నేను పూర్తిగా కరోనా టీకాలు వేసుకున్నాను. కోవిడ్ సోకినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. నా, ఇతరుల భద్రత కోసం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ త్వరగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా’ అని డింపుల్ ట్వీట్ చేశారు. (చదవండి: ఒమిక్రాన్ అప్డేట్స్.. రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు..) డింపుల్ యాదవ్, ఆమె కుమార్తె యొక్క నమూనాలను మంగళవారం తీసుకుని పరీక్షించారు. బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. భార్య, కుమార్తెకు కరోనా సోకడంతో అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి దూరం కానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన ఇప్పటికే విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ( చదవండి: డెల్టా కంటే 3 రెట్లు వేగం.. ఒమిక్రాన్‌తో బహుపరాక్..) -
జయప్రద వర్సెస్ డింపుల్!
లక్నో: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్.. అదే స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ నేపథ్యంలో కనౌజ్ ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన.. డింపుల్‌ను ఉప ఎన్నికల బరిలో నిలిపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీకి కంచుకోటయిన రాంపూర్‌లో డింపుల్ అయితేనే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు. అయితే బీజేపీ నుంచి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె రెండు సార్లు ఎంపీగా గెలుపొందగా.. గత ఎన్నికల్లో ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2009, 14 ఎన్నికల్లో ఎస్పీ నుంచి గెలుపొందిన జయప్రద అనంతరం బీజేపీలో చేరి ఓడిపోయారు. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఆమెనే నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడే అవకాశం ఉండడంతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదిలావుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు ఫలితాల అనంతరం ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇక జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. అయితే డింపుల్‌ను బరిలోకి దింపితే.. బీఎస్పీ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఎస్పీ నేతలను వెంటాడుతున్న ప్రశ్న. 1980 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎస్పీ తప్ప మరో పార్టీకి గెలిచే అవకాశం రాలేదు. ఈసారి బీజేపీ ఇక్కడ విజయం సాధించాలని ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అందుకే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జయప్రద రాంపూర్ స్థానిక నేతలతో చర్చలను ప్రారంభించారు. -
తల్లి తరఫున ప్రచారంలో బాలీవుడ్ నటి
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోక్‌సభ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున తన తల్లి పూనమ్ సిన్హా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పూనమ్ సిన్హా విజయాన్ని కోరుతూ.. శుక్రవారం లక్నో వీదుల్లో నిర్వహించిన ర్యాలీలో సోనాక్షి సిన్హా పాల్గొన్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ ఎంపీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌తో కలిసి సోనాక్షి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తల్లిని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. పూనమ్‌తో పాటు సోనాక్షి, డింపుల్ రావడంతో వారిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక లక్నో లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పూనమ్, బీజేపీ నుంచి కేంద్రమంత్రి, సిటింగ్ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి గురు ఆచార్య ప్రమోద్ కిృష్ణణ్‌ను బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రాతినిథ్యం వహించిన లక్నోలో 1991 నుంచి ఇప్పటి వరకు బీజేపీ మినహా మరేపార్టీ విజయం సాధించలేదు. 1991 నుంచి 2009 వరకు వాజ్‌పేయీ ఇక్కడ విజయం సాధించగా.. 2014లో రాజ్‌నాథ్ సింగ్ గెలుపొందారు. ఎస్పీ, బీఎస్పీ కూటగా పోటీ చేస్తుండడంతో ఈ స్థానం ఎన్నిక ఉత్కంఠంగా మారింది. కాగా సోనాక్షి తండ్రి శత్రుష్ను సిహ్హా బిహార్‌లోని పట్నాసాహెబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
డింపుల్ యాదవ్ 30ఏళ్ల రికార్డు!
దేశంలో గత ముప్పయ్యేళ్లలో లోక్‌సభకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక మహిళ డింపుల్ యాదవ్. మొత్తం ఎన్నికల చరిత్రలో ఈ ఘనత సాధించిన 44వ వ్యక్తి కూడా ఆమే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అయిన డింపుల్ యాదవ్.. కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రుల పేర్లో లేదా కుటుంబ వారసత్వాన్నో ఉపయోగించుకుని రాజకీయాల్లో పైకొచ్చిన వాళ్లుంటారు. డింపుల్ యాదవ్ భర్త అఖిలేశ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె మామ ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర రాజకీయ ప్రముఖుడు. అయితే, డింపుల్ వీరి సాయంతో రాజకీయాల్లో రాణించలేదు. తన సొంత ప్రతిభతో రాష్ట్రంలో, పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నా కంటే డింపుల్ ఎన్నికల సభలకే ఎక్కువ జనం వస్తార’ని స్వయంగా అఖిలేశ్ యాదవే అన్నారంటే ఆమె చరిష్మా ఎలాంటిదో అర్థమవుతుంది. 2012లో భర్త ఖాళీ చేసిన కనౌజ్ లోక్‌సభ స్థానంలో గెలవడంతో డింపుల్ రాజకీయ జైత్రయాత్ర మొదలైంది. కనౌజ్ నుంచి గెలిచిన అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీకి వెళ్లడం కోసం ఆ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో డింపుల్ సహా ముగ్గురు పోటీ చేశారు. వారిలో ఒక ఇండిపెండెంట్, సంయుక్త సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అసలు అభ్యర్థులనే పెట్టలేదు. దాంతో డింపుల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 2009లో ఫిరోజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా ఎన్నికల్లో అరంగేట్రం చేశారామె. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2014లో మోదీ హవాలో యూపీలోని 80 లోక్‌సభ సీట్లలో ఎస్పీకి ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. వాటిలో డింపుల్ పోటీ చేసిన కనౌజ్ ఒకటి. రాష్ట్ర ప్రజలు ‘బహు’, ‘భాభీ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే డింపుల్ రాజకీయంగా పరిణతి సాధించారు. కాగితంపై రాసుకుని ప్రసంగించే స్థాయి నుంచి సొంతంగా అనర్గళంగా ప్రసంగించే స్థాయికి ఎదిగారు. 2017 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. -
అఖిలేశ్ ఆస్తులు 37 కోట్లు
ఆజంగఢ్: ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లోక్‌సభ స్థానానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ గురువారం నామినేషన్ వేశారు. తనకు, తన భార్యకు కలిపి రూ. 37 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అఖిలేశ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 7.9 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 16.9 కోట్లు, తన భార్య డింపుల్ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 3.68 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 9.3 కోట్లు ఉందని వెల్లడించారు. నగదు తన వద్ద రూ. 3.91 లక్షలు, తన భార్య వద్ద రూ. 4.03 లక్షలు ఉందని తెలిపారు. 2014లో ఈ దంపతుల ఆస్తుల విలువ దాదాపు రూ. 24 కోట్లు. -
కుటుంబ కథా చిత్రం
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గెలిచిన ఐదు సీట్లూ పార్టీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు పోటీ చేసినవే. ఈసారి ఈ ఐదు స్థానాల్లో మూడు చోట్ల ఎస్పీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్టు కనిపిస్తున్నారు. మిగిలిన రెండు సీట్లలో (కనౌజ్, ఫిరోజాబాద్) ములాయం కోడలు డింపుల్, ఆయన అన్న మనవడు అక్షయ్ యాదవ్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో ములాయం సొంత స్థానం మైనపురీ, తూర్పు యూపీలోని ఆజమ్గఢ్ నుంచి పోటీచేసి గెలిచారు. మైన్‌పురీ సీటుకు రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న రతన్‌సింగ్ యాదవ్ మనవడు తేజ్‌ప్రతాప్ విజయం సాధించారు. కోడలు డింపుల్ తమ కంచుకోటగా భావించే కనౌజ్ నుంచి మూడోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వరుసకు తమ్ముడైన ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్ కొడుకు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్‌లో తొలిసారి విజయం సాధించారు. బదాయూన్ నుంచి ములాయం మరో అన్న అభయ్‌రాం కొడుకు ధర్మేంద్ర యాదవ్ ఎస్పీ టికెట్‌పై విజయం సాధించారు. ఈ ఐదుగురూ మళ్లీ తమ పాత నియోజకవర్గాల నుంచే ఎస్పీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమంటే ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ మిత్రపక్షం బీఎస్పీ ఎస్పీకి మద్దతు ఇవ్వడం. అంతేకాదు, కాంగ్రెస్ ఈ స్థానాల్లో ఒక్కచోటే అభ్యర్థిని నిలిపింది. కనౌజ్లో డింపుల్‌కు గట్టి పోటీ? గతంలో రెండుసార్లు (2012 ఉప ఎన్నిక, 2014) కనౌజ్ నుంచి గెలిచిన డింపుల్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఎస్పీ, అధ్యక్షుడైన ఆమె భర్త అఖిలేశ్ అంతకు ముందు మూడు సార్లు, మామ ములాయం ఒకసారి విజయం సాధించిన స్థానం ఇది. 2019లో డింపుల్‌కు బీఎస్పీ మద్దతు ఉంది. కాంగ్రెస్ ఇక్కడ పోటీ పెట్టలేదు. ములాయం తమ్ముడు, మాజీ మంత్రి శివపాల్‌సింగ్ కూడా తన సొంత పార్టీ ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) తరఫున మొదట అభ్యర్థిని ప్రకటించి తర్వాత నామినేషన్ వేయించకపోవడంతో డింపుల్ సునాయాసంగా గెలవాలి. అయితే, 2014లో ఆమె సమీప బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌పై కేవలం 19 వేలకు పైగా ఓట్లతోనే విజయం సాధించారు. మళ్లీ బీజేపీ టికెట్‌పై పాఠక్ పోటీచేస్తున్నారు. ఈ ముఖాముఖి పోటీలో పాఠక్ నుంచి డింపుల్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 1999 నుంచీ ఎస్పీ గెలుచుకుంటున్న కనౌజ్లో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 18.5 లక్షలు. వారిలో ముస్లింలు 3 లక్షలు, యాదవులు 2.5 లక్షలు, దళితులు మూడు లక్షలు, బ్రాహ్మణులు రెండు లక్షల మంది ఉన్నారు. బ్రాహ్మణుడైన బీజేపీ అభ్యర్థి పాఠక్ ఈసారి డింపుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఫిరోజాబాద్‌లో ముసలం ఫిరోజాబాద్ ప్రస్తుత ఎంపీ అక్షయ్ తండ్రి, ములాయంకు వరుసకు సోదరుడైన రాంగోపాల్ 2014లో తన కొడుకుకు పార్టీ టికెట్ ఇప్పించడంలో విజయం సాధించారు. కాని, ములాయం తమ్ముడు శివపాల్ తన కొడుకు ఆదిత్యకు ఫిరోజాబాద్ టికెట్ వస్తుందని ఆశించారు. ఫలితంగా తమ్ముడు, వరుసకు తమ్ముడి మధ్య అప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పగ్గాలు అఖిలేశ్ చేతుల్లోకి పోవడంతో ఇవి ముదిరాయి. పీఎస్పీ పార్టీ పెట్టిన శివపాల్ ఇప్పుడు తానే స్వయంగా ఫిరోజాబాద్‌లో అక్షయ్‌పై పోటీకి దిగి రాంగోపాల్‌పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అక్షయ్‌కు ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చంద్రసేన్ జాదోన్ నుంచి గట్టి పోటీ ఉంది. శివపాల్‌సింగ్ కూడా రంగంలో ఉండటంతో ఎస్పీ మద్దతుదారుల ఓట్లు చీలి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏర్పడింది. అయితే, తమ ఎన్నికల ప్రచారం లక్ష్యం శివపాల్‌ను గెలిపించడమేనని, ఆయన విజయం ఖాయమని పీఎస్పీ నేత రాందర్శన్ యాదవ్ చెప్పారు. శివపాల్ పోటీ వల్ల ఇక్కడ యాదవులు, ముస్లింల ఓట్లు చీలిపోయే మాట నిజమేగాని అక్షయ్ గెలుస్తారని జిల్లా ఎస్పీ నేత సుమన్ దేవి భర్త రఘువీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంపీగా ఎన్నికయ్యాక అక్షయ్ నియోజవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో వారు కోపంతో ఉన్న మాట వాస్తవమే. కాని, ఈ సమస్య పరిష్కరించాం’ అని ఆయన వివరించారు. బీజేపీ అభ్యర్థి జాదోన్ ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. 2014లో ఓడిన బీజేపీ అభ్యర్థి ఎస్పీ బాఘేల్‌ను ఇక్కడ పోటీకి దింపకపోవడంతో పార్టీలో అసంతృప్తి నెలకొన్నది. ఈ సీటులో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని నిలపలేదు. 2009లో కనౌజ్‌తో పాటు ఫిరోజాబాద్ నుంచి కూడా ఎన్నికైన అఖిలేశ్ రాజీనామా చేశాక ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య డింపుల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. ఆజంగఢ్‌లో అఖిలేశ్.. ఆజంగఢ్‌లో తొలిసారి పోటీచేస్తున్న అఖిలేశ్‌పై భోజ్‌పురీ నటుడు దినేశ్‌లాల్ యాదవ్ ‘నిరాహువా’ను బీజేపీ బరిలోకి దింపింది. అఖిలేశ్ సీఎంగా ఉన్న కాలంలోనే ఈ నటుడికి సీఎం చేతుల మీదుగా ‘యశ్భారతీ’ అవార్డు ప్రదానం చేశారు. ఇక్కడ మాత్రం శివపాల్‌యాదవ్ పార్టీ పీఎస్పీ తన అభ్యర్థిని పోటీకి దింపలేదు. ఇక్కడ అఖిలేశ్ విజయం నల్లేరు మీద నడకగా సాగిపోతుందని అంచనా. మైన్‌పురీ నుంచి ములాయం మళ్లీ.. 2014 ఎన్నికల్లో ములాయం సొంత నియోజకవర్గం మైన్‌పురీలో బీజేపీ ప్రత్యర్థి శత్రుఘన్సింగ్ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించారు. అనంతరం ములాయం రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన అన్న మనవడు తేజ్‌ప్రతాప్ తన బీజేపీ ప్రత్యర్థి ప్రేంసింగ్ శాక్యాను మూడు లక్షల 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు మళ్లీ ములాయం ఇక్కడి నుంచే బరిలోకి దిగగా, ఆయనపై బీజేపీ నుంచి ప్రేంసింగ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పోటీలో లేదు. బదాయూన్‌లో త్రిముఖ పోటీ ములాయం అన్న మనవడు, సిట్టింగ్ సభ్యుడు ధర్మేంద్ర మళ్లీ పోటీ చేస్తున్న బదాయూన్‌లో బీజేపీ తరఫున యూపీ కేబినెట్ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కూతురు సంఘమిత్ర బరిలోకి దిగారు. 2014లో ఆమె బీఎస్పీ అభ్యర్థిగా మైన్‌పురీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2016లో సంఘమిత్ర తన తండ్రితోపాటు బీజేపీలో చేరారు. ఇక్కడ పీఎస్పీ అభ్యర్థిని నిలపకపోవచ్చని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సలీం షేర్వానీ పోటీ చేస్తున్నారు. ఆయన 1996 నుంచి ఎస్పీ తరఫున మూడుసార్లు పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరి ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. -
మూడోసారి కనౌజ్ నుంచి డింపుల్ యాదవ్ పోటి
-
స్త్రీలోక సంచారం
::: కనౌజ్ ఎంపీ డింపుల్ యాదవ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె భర్త అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు! రాజకీయాల్లో బంధుప్రీతికి ముగింపు పలికేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ, చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కూడా తనను అనుసరించాలని అఖిలేశ్ సవాల్ విసిరారు ::: ఇటలీలో నిర్మాణంలో ఉన్న విహార నౌక ‘న్యూస్టాటన్డామ్’ను లాంఛనప్రాయగా జలప్రవేశం చేయించేందుకు ప్రఖ్యాత అమెరికన్ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రేకు ‘గాడ్‌మదర్’గా అవకాశం లభించింది. హాలెండ్, అమెరికా కలిసి నిర్మిస్తున్న ఈ నౌక.. వచ్చే ఏడాది జనవరిలో మధ్యదరా సముద్ర జలాల్లో ప్రయాణం మొదలుపెడుతుంది ::: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రమండలం నుంచి తనకు కానుకగా తెచ్చి ఇచ్చిన మట్టిరాళ్లను తన నుంచి ‘నాసా’ స్వాధీనం చేసుకునే వీలులేకుండా ముందస్తు ఉత్తర్వులు ఇవ్వాలని యు.ఎస్‌లోని సిన్సినాటీలో ఉంటున్న లారా చీకో అనే మహిళ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. తన పదేళ్ల వయసులో తన తండ్రి స్నేహితుడైన ఆర్మ్‌స్ట్రాంగ్ తనకు ఆ మట్టిరాళ్లను ఇచ్చినట్లు లారా కోర్టుకు నివేదించారు ::: బాలీవుడ్ నటి ఆలియాభట్ అక్క షహీన్.. గతంలో తనక్కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినట్లు వెల్లడించారు! ‘వోగ్’ తాజా సంచికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న స్టార్ చెఫ్ ఆంథోనీ బోర్డియన్ ప్రస్తావన వచ్చినప్పుడు షహీన్ ఈ విషయం చెప్పారు ::: అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారన్న వార్తలు చిక్కనవుతున్నాయి. రెండేళ్లుగా ప్రియాంక ప్రేమలో మునిగి ఉన్న నిక్ జోనాస్.. ఇటీవలి ఒక పెళ్లివేడుకలో తొలిసారి ప్రియాంకను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయడాన్ని ఏడడుగులకు ముందు పడిన తొలి అడుగుగా అంతా భావిస్తున్నారు ::: వీడియోకాన్ కంపెనీకి రుణాలు ఇచ్చిన వ్యవహారంలో అరోపణలు ఎదుర్కొంటున్న ఐ.సి. ఐ.సి.బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ కనుక ఆ పదవి నుంచి దిగిపోవలసి వస్తే ఆమె తర్వాత ఎవరిని సీఈవోగా నియమించాలనే విషయమై డైరెక్టర్ల బోర్టు సమావేశమైంది. బోర్డు ఎవరిని నియమించినా, ఆ నియామకాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆమోదించవలసి ఉంటుంది ::: లేడీ డయానా దగ్గర ‘రివెంజ్ డ్రెస్’ ఉందనే విషయం మీకు తెలుసా? అంటూ మీడియా ఒక కథనాన్ని వండి వార్చింది. గ్రీకు ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టీనా స్టాంబోలియన్ తన కోసం డిజైన్ చేసిన సంప్రదాయ విరుద్ధమైన డ్రెస్‌ను ధరించడానికి చాలాకాలం పాటు బిడియపడిన డయానా.. తన భర్తకు కామిల్లా పార్కర్‌తో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన రోజు సాయంత్రం ఆ నలుపురంగు డ్రెస్‌ను తొలిసారిగా బయటికి తీసి ధరించారని, అలా అది రివెంజ్ డ్రెస్ అయిందని బ్రిటన్ పత్రికలు విపరీతార్థాలు తీస్తున్నాయి ::: వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలిగితే దేశంలో ఆకలి బాధల్ని నివారించవచ్చని ఐక్యరాజ్యసమితి సంస్థ ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ సూచించింది. మొక్కలు నాటడం నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి దశలోనూ మహిళల సహకారం ఉంటే పంట దిగుబడి 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతుందని, తద్వారా ఆకలికి అలమటించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తాజా నివేదికలో వెల్లడించింది. -
ఢిల్లీలో అఖిలేష్, డింపుల్ ప్రచారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అఖిలేష్ దంపతులతో పాటు సినీ నటి, ఎంపీ జయా బచ్చన్, అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 76 మంది ప్రచారం చేస్తారని ఢిల్లీ ఎస్పీ చీఫ్ ఉషా యాదవ్ చెప్పారు. ఏప్రిల్ 23న జరిగే ఎంసీడీ ఎన్నికలకు ఎస్పీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. త్వరలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ఉషా యాదవ్ చెప్పారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ బరిలో ఉన్నాయి. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తారు. 2007 నుంచి ఎంసీడీని బీజేపీ పాలిస్తోంది. ఎంసీడీలో మొత్తం 272 కార్పొరేటర్ల స్థానాలున్నాయి. -
మా కుటుంబంలో బాధ వర్ణించలేను: అఖిలేశ్
న్యూఢిల్లీ: ప్రధాని మంత్రి నరేంద్రమోదీని ఎన్నికల ప్రచారంలో ముందు పెట్టకపోయుంటే బీజేపీ మొత్తానికే తుడిచిపెట్టుకుపోయేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ఆయన తన సతీమణి డింపుల్ యాదవ్‌తో కలిసి కాలిదాస్ మార్గ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సేద తీరుతూ కనిపించారు. ఈ సందర్భంగా సరదాగా మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు అభివృద్ధిని చూసే ఓటు వేశారని, ఆర్భాటం చూసి కాదని అన్నారు. వారణాసి మొత్తం కూడా ఎస్పీ చేతుల్లోకి వచ్చేదని, ఆ విషయం ముందు గ్రహించే చివరకు మోదీని అక్కడ ప్రచారంలోకి బీజేపీ దింపిందని లేదంటే అక్కడ ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయి ఉండేదని చెప్పారు. వారణాసి కోసం ప్రత్యేకంగా బీజేపీ కేంద్రమంత్రులంతా ప్రచారం నిర్వహించారని, తమ పార్టీకి అలాంటి పరిస్థితి లేదని అన్నారు. తాము చేసిన మంచి పని ముందు బీజేపీ వారణాసిలో గల్లంతయ్యేదని మోదీని ముందుపెట్టి ఆ పరిస్థితిని కొంత మార్చుకోగలిగారని చెప్పారు. ‘తొలుత వారం రోజులపాటు బాగా కష్టంగా అనిపించింది. కానీ, తర్వాత పరిస్థితి మెరుగవుతూ వచ్చింది’ అని డింపుల్ ప్రచారం గురించి చెప్పారు. గత ఏడాది కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా తట్టుకోగలిగారు ఆ పరిస్థితిని కాస్త చెబుతారా అని డింపుల్‌ను ప్రశ్నించగా అఖిలేశ్ మధ్యలో జోక్యం చేసుకొని ఒక కథ చెప్పారు. ‘ఒకసారి రామకృష్ణ పరమహంసను ఒకసారి వివేకానందుడు దేవుడిని చూపించమని అడిగారు. దాంతో ఆయన గట్టిగా గిల్లారు. ఏమైందని ప్రశ్నించగా నొప్పిగా ఉందని బదులిచ్చారు. నొప్పి చూపించాలని రామకృష్ణ పరమహంస కోరగా వివేకానందుడు ఆశ్చర్యపోయారు. అలాగే మా ఇంట్లో పరిస్థితి ఎంత బాధకరమైందో మాటల్లో చెప్పలేను’ అని చెప్పారు. ప్రచారంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. -
పెళ్లిపెద్దపై నిప్పులు చెరిగిన డింపుల్ యాదవ్
తనకు అఖిలేష్ యాదవ్‌తో దగ్గరుండి పెళ్లి చేయించిన పెళ్లిపెద్ద అమర్‌సింగ్ మీద సీఎం భార్య డింపుల్ యాదవ్ నిప్పులు చెరిగారు. అలాంటి మనుషుల మాటలను తాను లెక్కచేసేది లేదని స్పష్టం చేశారు. కనీసం తన పిల్లలను టీవీలో కూడా అమర్ సింగ్ ముఖం చూడనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని తాను ఒకసారి ములాయం సింగ్ యాదవ్‌కు చెప్పినట్లు అమర్ సింగ్ అన్న విషయాన్ని ప్రస్తావించగా, అలాంటి మనుషులను తాను పట్టించుకోనని, టీవీలో ఆయన ముఖం వస్తే వెంటనే టీవీ కట్టేస్తానని, తన పిల్లలకు కూడా ఆయన ముకం టీవీలో చూపించబోనని డింపుల్ అన్నారు. అఖిలేష్ యాదవ్‌కు, ఆయన తండ్రి ములాయంకు మధ్య తగాదాలకు అమర్ సింగే ప్రధాన కారణమన్న వాదన ఒకటి ఉంది. అమర్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాతే పార్టీలో ముసలం మొదలైంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలున్న గాయత్రీ ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆమెను అడగ్గా.. అది వాస్తవం కాదని, తాము చట్టాన్ని గౌరవిస్తామని, నేరం చేసినవాళ్లు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. -
పరీక్షలు బాగా రాయాలి.. మీరు ఎన్నికల్లో గెలవాలి
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్నారు. రోజుకు నాలుగు నుంచి ఏడు ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 170 ర్యాలీలలో పాల్గొన్నారు. అఖిలేష్కిది ఎన్నికల పరీక్షా సమయం కాగా.. ఆయన ముగ్గురు పిల్లలకు పరీక్షల కాలం. ఎన్నికల ప్రచారంలో పడి తన పిల్లల చదువు, పరీక్షల గురించి పట్టించుకోలేకపోతున్నానని అఖిలేష్ అన్నారు. ఎలా చదువుతున్నారని తన పిల్లలను అడిగానని, పరీక్షలు బాగా రాయాలని విషెస్ చెప్పానని, వారు కూడా తాను ఎన్నికల్లో గెలవాలని విషెస్ చెప్పారని తెలిపారు. అఖిలేష్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎస్పీలో అఖిలేష్ తర్వాత ఆమే స్టార్ క్యాంపెయినర్. దీంతో అఖిలేష్, డింపుల్ ఇద్దరూ తమ పిల్లల చదువుపై ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. తమ పరిస్థితిని పిల్లలు అర్థం చేసుకున్నారని అఖిలేష్ చెప్పారు. ప్రతిరోజూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రికి ఇంటికి వస్తానని, ఆ సమయంలో పిల్లల పరీక్షల గురించి ఆలోచిస్తానని, మరుసటి రోజు ఉదయం వారి ప్రిపరేషన్ గురించి తెలుసుకుని విషెస్ చెబితే.. వారూ తనకు విషెస్ చెబుతారని ఓ ఇంటర్వ్యూలో అఖిలేష్ చెప్పారు. ఇక తన ప్రచారం గురించి మాట్లాడుతూ.. ర్యాలీలకు ప్రజలు భారీగా తరలిరావడం తనకు ఉత్సాహాన్ని, వారు తనలో స్ఫూర్తి కలిగిస్తున్నారన్నారు. -
‘కసబ్’కు కొత్త నిర్వచనం
‘కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ , బచ్చే’ అని చెప్పిన డింపుల్ జౌన్ పూర్: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సంక్షిప్త పదాలతో ప్రత్యర్థి పార్టీ లపై విరుచుకుపడుతుండటం కొనసాగుతోం ది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంధించిన ‘కసబ్’ వాగ్బాణాన్ని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ తిప్పికొట్టారు. ‘క అంటే కాంగ్రెస్ అని బీజేపీ చెబుతోంది. కానీ ‘క’ అంటే కంప్యూటర్ అని మీ అఖిలేశ్ భయ్యా చెప్పారు. ‘స’ అంటే స్మార్ట్‌ఫోన్ . ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసు కోవచ్చు. ఇక ‘బ్’ అంటే బచ్చే (చిన్నా రులు)’ అంటూ డింపుల్ వివరించారు. ఎస్పీ తిరిగి అధికారంలోకి వస్తే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు, స్మార్ట్ఫోన్లు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది. గర్భిణులకు ఇంటివద్దనే ఆహార ధాన్యాలు అందిస్తామని డింపుల్ యాదవ్æ హామీ ఇచ్చారు. -
అమిత్‌షాను టార్గెట్ చేసిన అఖిలేశ్ భార్య
-
అమిత్‌షాను టార్గెట్ చేసిన అఖిలేశ్ భార్య
జౌన్పూర్: ఉగ్రవాది కసాయి కసబ్ చనిపోయి చాలా రోజులవుతున్నా ఉత్తరప్రదేశ్ ఎన్నికల పుణ్యానా, నేతల దయవల్ల మరోసారి అతడిపేరు విరివిగా వినిపిస్తోంది. జనాలకు చిరాకు వచ్చే స్థాయిలో కసబ్ పేరును తలుస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోట వచ్చిన ఈ మాటను ఒక నేత తర్వాత మరో నేత మోస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసేందుకు అమిత్‌షా ఈ మాటను ఉపయోగించగా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా తిరిగి బీజేపీపై దాడి చేసేందుకు అదే పేరును తలుస్తూ దానికి కొత్త అర్థాన్ని, నిర్వచనాలను, విస్తృతిని కల్పిస్తున్నాయి. తాజాగా, కసబ్ అనే పేరుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కొత్త నిర్వచనం చెప్పారు. కసబ్ అనే పేరులో క అంటే హిందీలో కంప్యూటర్ అని, స అంటే స్మార్ట్ ఫోన్ అని, ఇక బీ అంటే బచ్చే (చిన్నారులు) అని ఆమె కొత్త అర్ధం చెప్పారు. ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుండా ఉండలేమని, ఇక స్మార్ట్‌ఫోన్‌తో ప్రభుత్వ విధానాలన్నీ కూడా తెలుసుకోవచ్చని, పిల్లల సంరక్షణే తమ ధ్యేయంగా ముందుకెళతామని వివరించారు. అమిత్ షా చెప్పినంత చెడు అర్థం తమకు వర్తించదని ఆమె ఎదురుదాడికి దిగారు. తొలుత కసబ్ అనే పేరులో క అంటే కాంగ్రెస్ అని, స అంటే సమాజ్‌వాది పార్టీ అని బీ అంటే బీ అంటే బీఎస్పీ అని, ఈ కసబ్ పీడ త్వరలోనే వదులుతుందంటూ అమిత్‌షా విమర్శించగా ఆ సమయంలో స్పందించిన అఖిలేశ్ కా అంటే పావురం అని చెప్పారు. ఇక మాయావతి అయితే, అమిత్‌షా అయితే కసబ్‌ను మించినవారని, అసలు అమిత్ షా ఒక టెర్రిరిస్టు అని తీవ్రంగా ఆరోపించారు. ఇలా, కసబ్ పేరుతో పెద్ద దుమారం రేపుతున్నారు. -
మేరే అంగనే మే.. పాట పాడిన డింపుల్!
ఎన్నికల ప్రచార సభలలో పాటలు పెట్టడం సర్వసాధారణం. కానీ పెద్ద నాయకులు ఇలాంటి పాటలు పాడటం మాత్రం ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు. వాడి వేడిగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో తొలిసారి ఈ చిత్రం కనిపించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి భార్య, స్వయానా ఎంపీ అయిన డింపుల్ యాదవ్ (39) 'మేరే అంగనే మే.. తుమ్హారా క్యా కామ్ హై' అంటూ ఓ పాట పాడారు. అలాగని ఆమె పూర్తిగా పాడారనుకోవద్దు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి, తమ ఇంట్లో (అంటే యూపీలో) మీకు ఏం పని అంటూ ప్రశ్నించారు. 1980లలో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'లావారిస్'లోని పాట మొదటి లైనును ఇందుకోసం ఆమె ఎంచుకున్నారు. మెరూన్ రంగు చీర కట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకున్న డింపుల్ యాదవ్.. అలహాబాద్‌లో పోటీ చేస్తున్న విద్యార్థి నాయకురాలు రిచా సింగ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ మాట అన్నారు. ఈ మాట అనగానే ఒక్కసారిగా అక్కడున్న వందలాది మంది మహిళలు 'డింపుల్ భాభీ' అంటూ నినదించారు. డింపుల్ యాదవ్ లోక్‌సభలో పెద్దగా మాట్లాడరు, ప్రశ్నలు కూడా పెద్దగా అడిగిన సందర్భాలు లేవు. ఆమె ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే చర్చలలో పాల్గొన్నారు. లోక్‌సభకు ఆమె హాజరు కూడా కేవలం 37 శాతం మాత్రమే. 2014 సంవత్సరంలో మహిళల మీద జరుగుతున్న నేరాలపై మాట్లాడుతుండగా పదే పదే ఇతర సభ్యులు అంతరాయాలు కలిగించడంతో.. కనీసం తాను మాట్లాడుతున్నందుకు తన మామగారు ములాయం సింగ్ యాదవ్ సంతోషిస్తారని చెప్పారు. అలాంటి డింపుల్.. ఇప్పుడు మాత్రం ఎన్నికల ప్రచార సభలో మంచి దూకుడుగా వెళ్తున్నారు. తన భర్త అఖిలేష్ యాదవ్‌తో కలిసి, విడిగా కూడా ప్రచారాలు చేస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రి మీదే విమర్శలు చేసే స్థాయికి డింపుల్ వచ్చారు. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ అంటూ రేడియోలో ప్రసంగాలు చేస్తున్నారు కానీ.. 'కామ్ కీ బాత్' (పనికొచ్చే మాటలు) లేవని అన్నారు. -
తోటికోడలి కోసం ప్రచారం
అపర్ణకు బాసటగా డింపుల్ లక్నో: యూపీ సీఎం అఖిలేశ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ లక్నోలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బుధవారం తోటికోడలు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ స్థానం నుంచి ములాయం రెండో భార్య కుమారుడైన ప్రతీక్ భార్య అపర్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన డింపుల్.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, లక్నో మెట్రో ప్రాజెక్టును డింపుల్ ప్రస్తావించినపుడు ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషి బరిలో ఉన్నారు. కుటుంబంలో ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇద్దరు కోడళ్లు ఒకే వేదికపైకి రావటం విశేషం. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ కూడా చిన్న కోడలి తరపున బుధవారం కంటోన్మెంట్లో ప్రచారం చేశారు. బీజేపీవి విద్వేష రాజకీయాలు:రాహుల్ బారాబంకి: బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని జైద్పూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తనూజ్ పూనియా తరఫున ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ విద్వేషం ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ప్రజల మధ్య సామరస్యం పెంచడానికి పాటుపడుతోందనే సందేశాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ మాటలు మాత్రమే చెబుతారని పనులు చేయరని ఎద్దేవా చేశారు. యూపీ అభివృద్దికి కాంగ్రెస్–ఎస్పీ కూటమి మాత్రమే పనిచేస్తుందని అన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ మాట నిజం కాలేదని, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును నవంబర్ 8న చిత్తుకాగితాలు చేశారని చురకలంటించారు. -
ఒకే వేదికపై ములాయం కోడళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ నిరూపించారు. ఎన్నికల ప్రచారంలో డింపుల్, అపర్ణ ఇద్దరూ కలసి ఒకే వేదికను పంచుకున్నారు. తోడికోడలు అపర్ణకు మద్దతుగా డింపుల్ ప్రచారం నిర్వహించారు. బుధవారం లక్నో కంటోన్మెంట్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో డింపుల్, అపర్ణ పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా డింపుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. అపర్ణకు ఓట్లు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సమాజ్‌వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఆమె ఎంచుకున్నారు. ఇక ములాయం పెద్ద కొడుకు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ లోక్ సభ సభ్యురాలు. ఆమె కనౌజ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. బుధవారం ములాయం కోడళ్లు ఇద్దరూ లక్నోలో ప్రచారం చేశారు. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరయినా డింపుల్, తాను చాలా సన్నిహితంగా ఉంటామని అపర్ణ చెప్పారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ వెలుగులోకి వచ్చారు. ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణకు, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ములాయం కుటుంబంలో ఆధిపత్య పోరు, ఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కినా.. ఎన్నికలు వచ్చేసరికి తమ మధ్య విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగా ఉన్నామని ములాయం కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
యూపీ ప్రచారంలోకి ప్రియాంక, డింపుల్!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీలికవర్గం నేత, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహానికి కొత్త హంగులు అద్దుతున్నారు. ఆయన ఎస్పీ వర్గం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కోసం కసరత్తు జరుగుతోందని సమాచారం. త్వరలో అఖిలేశ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు పొత్తుపై ప్రకటన చేస్తారని అఖిలేశ్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి అఖిలేశ్ భార్య, కనౌజ్ ఎంపీ డింపుల్ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. పొత్తు సాకారమైతే ప్రియాంక, డింపుల్‌లు ఎన్నికల్లో ప్రచారం చేసేలా వ్యూహం రూపుదిద్దుకుంటోందని పేర్కొంటున్నారు. లోక్‌దళ్ గుర్తుపై ములాయం ఆసక్తి సాక్షి, న్యూఢిల్లీ: ములాయం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని చరణ్ సింగ్ 1980లో స్థాపించిన లోక్‌దళ్ పార్టీ గుర్తు ‘పొలం దున్నుతున్న రైతు’పై ఆసక్తి చూపుతున్నారు. -
ప్రియాంకా, డింపుల్ ఫొటో పక్కపక్కనే..
అలహాబాద్: సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయనున్నాయా? తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య దాదాపు పొత్తు కుదిరినట్లేనా? అంటే ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు ఆ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అలహాబాద్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి హసీబ్ అహ్మద్ ఏర్పాటుచేసిన పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఫొటోలు చేర్చారు. అతడి ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో కూడా ఈ ఫ్లెక్సీల ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్లలో 'ఉత్తరప్రదేశ్‌లోకి మతశక్తులు ప్రవేశాన్ని అడ్డుకునేందుకు మేమంతా ఒక్కటయ్యాం. ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్‌కు సుస్వాగతం' అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాశారు. ప్రియాంక, డింపుల్‌తోపాటు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రమోద్ తివారీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ఫొటోలు కూడా చేర్చారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన హసీబ్ వివరణ ఇస్తూ.. 'ఈ పోస్టర్ ద్వారా కమ్యునల్ శక్తులను అడ్డుకునేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని చెప్పాలనుకున్నాను. పునర్వైభవాన్ని తెచ్చేందుకు అఖిలేశ్‌తో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా మంచి అవకాశం. కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో తప్పకుండా ఆలోచించాలి. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే వెళితే మా పార్టీకి మెజారిటీ వస్తుంది. లేదా రెండు పార్టీలు కలిసి పనిచేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు చేయొచ్చు' అని చెప్పాడు. కాగా, దీనిపై యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముకుంద్ తివారీ స్పందిస్తూ 'కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేం పాటిస్తాం. పార్టీ విజయం కోసం పనిచేస్తాం' అని అన్నారు. మరోపక్క, వీరి కలయికపై బీజేపీ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ ఒంటరిగా పోటీ చేస్తే బతకదనే విషయం కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసుకాబట్టే సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుందని అన్నారు. ఏదేమైనా ఈ రెండు పార్టీలకు ఈసారి ప్రజలు గుణపాఠం నేర్పడం ఖాయమని, బీజేపీకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
సింపుల్ యాదవ్
మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన పెద్దమనిషికి కోడలు. ఒక ముఖ్యమంత్రికి భార్య... ఒక నియోజకవర్గానికి ఎం.పి. ముగ్గురు పిల్లలకు తల్లి... ఇద్దరు అత్తలకు కోడలు. పొలిటికల్ యాంబిషన్ ఉన్న ఒక డైనమిక్ వ్యక్తికి తోడికోడలు. ఇక సింపుల్ ఏముందీ?! అంతా కాంప్లెక్స్! ఈ అమ్మాయికి రాజకీయాలు వద్దన్నవాళ్లు ఉన్నారు. ఈ అమ్మాయి భర్త చేస్తున్నది తప్పన్నవాళ్లూ ఉన్నారు. ఈమెకూ రాజకీయాలు ఇష్టం లేదు! అబ్బో చాలా కాంప్లెక్స్. అయినా... ‘బహూ’ డింపుల్... బహుత్ సింపుల్. కోడలు డింపుల్... చాలా సింపుల్. ‘‘డింపుల్‌ని పెళ్లి చేసుకున్నాక నాకు అదృష్టం కలసొచ్చింది!’’ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చాలా సందర్భాలలో చెప్పిన మాట ఇది. అఖిలేశ్‌ను ఆయన భార్య డింపుల్ ముద్దుగా ఎ.డి. అని పిలుస్తారు. అంటే.. అఖిలేశ్ దాదా! అయితే డింపుల్, అఖిలేశ్ భార్యాభర్తలు కావడం, ఆమె రూపంలో అతడి అదృష్టం కలసి రావడం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. వారి కులాలు వేరు. ఆమె డింపుల్ రావత్. అతడు అఖిలేశ్ యాదవ్. కళ్లు కళ్లు కలుసుకున్నాయి 1995. అఖిలేశ్ మైసూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. అప్పుడు అతడి వయసు 23. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మెరైన్ ఇంజనీరింగ్ చదవాలన్న తలంపుతో ఉన్నాడు. అప్పుడే మిత్రులు లక్నోలో ఇచ్చిన ఒక విందుకు హాజరయ్యాడు. అక్కడ తొలిసారి డింపుల్‌ని చూశాడు. అప్పటికి ఆమె వయసు 17. అందంగా ఉంది. సైన్యంలో పదవీ విరమణ చేసిన కల్నల్ ఆర్సీఎస్ రావత్ కూతురామె. ఆ విందులో అఖిలేశ్, డింపుల్‌ల మనసులు కలవలేదు కానీ, మాటలు బాగా కలిశాయి. మనసులు దగ్గరయ్యాక మాత్రం వాళ్లిద్దరూ పెద్దలకి భయపడ్డారు. అందుకు నిదర్శనం ఇంట్లో వాళ్లకి తెలియకుండా లేఖలు రాసుకోవడమే. ఇద్దరి దగ్గరా సెల్ఫోన్లు లేవు. ల్యాండ్‌లైన్‌కి చేస్తే కొంపలు మునుగుతాయి. అందుకే ఉత్తరాలని ఆశ్రయించాడు అఖిలేశ్. అతడు లక్నోలోని ఒక మిత్రుడి చిరునామాకు రాసేవాడు. వాటిని డింపుల్ వచ్చి పట్టుకెళ్లేది. ములాయం ‘నో’ చెప్పేశారు! అఖిలేశ్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాడు. డింపుల్ లక్నో విశ్వవిద్యాలయంలో కామర్స్ డిగ్రీ చేస్తోంది. పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంటే తమ ప్రేమని బహిర్గతం చేసే పని. అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ పరిచయం అక్కరలేదు. రావత్ పరిచయానికి ప్రాధాన్యం లేదు. ములాయం మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్రంలో రక్షణ శాఖను నిర్వహించారు. అంటే కల్నల్ రావత్‌కి పరోక్షంగా బాస్. ఈ పెళ్లి గురించి చెప్పగానే ములాయం మరోమాట లేకుండా కుదరదని చెప్పేశారు. ములాయం పెద్ద రాజకీయవేత్త. అతడికో వారసుడు అవసరం. ‘ఎంవై’ అనే సామాజిక సమీకరణే ములాయం బలమని దేశమంతటికీ తెలుసు. ‘ఎం’ అంటే ముస్లిం, ‘వై’ అంటే యాదవ్. అలాంటిది ములాయం ఒక యాదవేతర కులం నుంచి కోడల్ని తెచ్చుకుంటే? అది పార్టీకే నష్టం. అందుకే ‘నో’ అన్నారు. అమర్‌సింగ్ ఒప్పించాడు! ములాయం సింగ్ మాత్రమే కాదు, డింపుల్ కుటుంబం కూడా ఈ పెళ్లికి ససేమిరా అంది. అప్పుడు రంగంలోకి దిగాడు అమర్‌సింగ్. ములాయంకి అత్యంత ఆప్తుడు. ఆ రెండు కుటుంబాలను ఒప్పించి అఖిలేశ్, డింపుల్‌ల వివాహం సాధ్యమయ్యేలా చేసింది అమర్‌సింగే. 1999 నవంబర్ 24న అఖిలేశ్ డింపుల్ పెళ్లి జరిగింది. అమితాబ్ బచ్చన్, రాజేశ్ఖన్నాలతో పాటు ఎందరో రాజకీయ నాయకులు హాజరైన ఆ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. మొదట రాజకీయాలలోకి వెళ్లకూడదనే అనుకున్నా తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయాలు, లోహియా భావాలు అఖిలేశ్‌ను మొదట ఎంపీగా, తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాయి. భర్త వెంట డింపుల్ కూడా నడవకతప్పలేదు. ‘‘ఆయన అర్థం చేసుకునే మనిషి. నేను సర్దుపోయే మనస్తత్వం ఉన్నదానిని’’ అని చెప్పారు డింపుల్.. యంగ్ ఫిక్కీ లేడీస్ సంస్థ ఏర్పాటు చేసిన ఒక సభ (2012)లో. అప్పటికే ఆమె కనౌజ్ ఎంపీ. మౌనం.. మహిళాశక్తికి ఒక రూపం! డింపుల్ చాలా తక్కువగా మాట్లాడతారు. నిజానికి ఆమె అంతర్ముఖి. బొమ్మలేయడం, గుర్రపుస్వారీ ఆమె అభిరుచులు. ఇంతకీ ఆ రోజు సభలో ఆమె చెప్పిన మాట, డింపుల్‌కి కూడా రాజకీయాలు అబ్బుతున్న సంగతిని రూఢీ చేస్తాయి. ‘ఏ మహిళ మౌనాన్నయినా, అదొక బలహీనతగా తీసుకోవద్దు. హుందాతనానికీ, శక్తికీ ఆ మౌనం ఒక ప్రతీక మాత్రమే. మేం తల్లులం. ఇల్లూ చక్కబెట్టగలం. దేశాన్నీ తీర్చిదిద్దగలం’ అన్నది ఆ సర్దుకుపోవడం అన్న మాట లోని పరమార్థం. ఆమె ఎం.పి., భర్త ముఖ్యమంత్రి. అత్తగారు, తోటికోడలు రాజకీయంగా పెద్ద ఆశలతో ఉన్నారు. ఆ ఆశలు నెరవేడమనేది సాక్షాత్తు తన భర్త పదవీచ్యుతి మీద ఆధారపడి ఉంది ఇప్పుడు. వీటన్నిటితో పాటు పిల్లల ఆలనాపాలనా చూడాలి. అదితి (10), అర్జున్ (6), టీనా (6).. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇందులో అర్జున్, టీనా కవలలు. ఈమె చిరుజల్లు... ఆమె జడివాన! ముభావంగా ఉండే డింపుల్‌కు తోటికోడలుగా వచ్చిన యువతి అపర్ణ. చాలా కలుపుగోలుతనం ఉన్న అమ్మాయి. అపర్ణ తండ్రి అరవింద్ సింగ్ బిస్త్. టైమ్స్ ఆఫ్ ఇండియా లక్నో ఎడిషన్ ఎడిటర్. రాష్ట్ర సమాచార కమిషనర్‌గా కూడా పనిచేశారు. కాబట్టే రాజకీయ నాయకులు, సమాజంలో పెద్ద వ్యక్తులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అపర్ణ చొరవ ఎంతవరకు వెళ్లిందంటే, తన మామగారు ములాయం సింగ్ రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించే నరేంద్ర మోదీతో కలసి ఆమె ఫొటో తీయించుకుంది. అపర్ణ మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో (ఇంగ్లండ్) అంతర్జాతీయ సంబంధాల కోర్సులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. అక్కడే లీడ్స్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్ కోర్సు చదివేవాడు ములాయం రెండో కొడుకు ప్రతీక్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మరిది పెళ్లికి సంప్రదాయ నృత్యం ప్రతీక్, అపర్ణల పెళ్లికి మాత్రం ములాయం ఎలాంటి అడ్డంకి చెప్పలేదు. డింపుల్ కూడా అన్నీ తానై చూసుకుంది. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం మరిది పెళ్లిలో అందరితో కలసి నృత్యం కూడా చేసింది. 2012లో అఖిలేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక ఇంటెలిజెన్స్ అధికారి ములాయం అంతఃపుర రాజకీయాల గురించి ఒక మాట బయటపెట్టాడు. అది డింపుల్ దాకా రాకుండా ఉంటుందా? నిజానికి ఇంట్లో ఏదో కుట్ర జరుగుతోందంటూ మొదట అఖిలేశ్‌ను హెచ్చరించినది డింపులే కావడం విశేషం. వేరే చోట ఉంటున్న తండ్రిని రోజూ ఒక్కసారైన అఖిలేశ్ పలకరించేవాడు. ఇది సరిపోదని భావించిన డింపుల్ ఏకంగా తమ బసనే ములాయం ఇంటి పక్కకు మార్పించారు. కానీ తండ్రీకొడుకుల మధ్య ఘర్షణను ఆమె నివారించలేకపోయారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ చీలిపోయినా ఆ నింద డింపుల్ మీద పడలేదంటేనే ఆమె సాత్విక సామర్థ్యం ఎంతో అర్థమవుతోంది. ఇద్దరి అత్తల ముద్దుల కోడలు ఆ ఇంటికి డింపుల్ పెద్ద కోడలు. అసలు అత్తగారు మాలతీదేవి. అంటే ములాయం మొదటి భార్య. మాలతీదేవి అచ్చమైన గృహిణి. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో ములాయం తలమునకలై ఉనప్పుడు కొడుకు బాధ్యత మొత్తం ఆమే తీసుకున్నారు. ములాయం జీవితంలోకి 1980లో మరో స్త్రీ ప్రవేశించింది. ఆమే సాధనా గుప్తా. సమాజ్‌వాదీ పార్టీలో చిన్న పదవిలో ఉండేవారామె. అందమైన స్త్రీ.. దీనితో ములాయం ఆమెకు దగ్గరయ్యాడు. సాధన ద్వారా ములాయం ప్రతీక్‌సింగ్ యాదవ్‌కు తండ్రయ్యాడు. కానీ కొడుకు పుట్టిన రెండు సంవత్సరాలకు గాని ములాయం సాధనతో తన వివాహం గురించి బయటపెట్టలేదు. అసలు ఆ పెళ్లి ఎప్పుడైందో కూడా ఎవరికీ తెలియదు. ప్రతీక్ 1988లో పుట్టాడు కాబట్టి, అంతకు ముందుటేడాదే పెళ్లి జరిగి ఉండవచ్చునని అంటారు. సాధన ప్రవేశంతో మాలతీదేవి భర్తకు పూర్తిగా దూరమైంది. దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లింది. 2003లో మరణించింది. డింపుల్ ప్రాణ స్నేహితురాలు సాక్షి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్య ప్రకారం పెద్దత్తతో ఉన్నంతగానే, చిన్నత్త సాధనాగుప్తాతో కూడా డింపుల్ చాలా సన్నిహితంగా ఉంటారు. అఖిలేశ్... డింపుల్... కనౌజ్ కనౌజ్.. గులాబీ అత్తరుకు ప్రసిద్ధి. ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు డింపుల్. అదొక చరిత్ర. నిజానికి డింపుల్, అఖిలేశ్, ములాయంల మధ్య జరిగిన ఘర్షణకీ, కనౌజ్ మధుర గాధలకీ సన్నిహిత సంబంధం కనిపిస్తుంది. డింపుల్‌ను అక్కడ నుంచి పోటీ చేయించి తండ్రికి దీటైన సమాధానం చెప్పాడా అఖిలేశ్ అనిపిస్తుంది. లక్నోకు 115 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కనౌజ్. అక్కడి జనాభాలో 83 శాతం రైతులే. వారిలో ఎక్కువ మంది పూల సాగు చేసేవారే. మొగలాయిల కాలంలో అత్తరుకు ప్రసిద్ధికెక్కితే, అంతకు ఎంతో ముందే గొప్ప చరిత్రాత్మక ప్రేమఘట్టానికి వేదికగా కనిపిస్తుంది. కనౌజ్ పాలకుడు జయచంద్రుడు. ఆయన కుమార్తె రాణీ సంయుక్త. తను వలచిన పృథ్వీరాజ్‌తో ఆ సౌందర్యరాశి ఢిల్లీ వెళ్లిపోతుంది. ‘‘జహంగీర్ నా తండ్రి’’ అని రాశాడు జహంగీర్. ఇక్కడ జహంగీర్ అంటే ఒక రకం అత్తరు. అతడి భార్య నూర్జహాన్ ప్రోద్బలంతో అక్కడి నిపుణులు ఆనాడు తయారుచేసిన ఒక అత్తరుకు పాదుషా జహంగీర్ పేరే పెట్టారు. అది గులాబీల నుంచి తీస్తారు. ఆ అత్తరు ఆదమరచిన ఆత్మలకు సైతం కొత్త జీవాన్ని ఇస్తుంది.. అని కూడా రాశాడట జహంగీర్. కానీ తన ప్రేమ పరిమళాన్ని తండ్రి నషాళానికి అంటేటట్టు చేశాడు అఖిలేశ్. ములాయం తమ వివాహానికి అంగీకరించకపోతే, అఖిలేశ్ తన మామ్మను ఆశ్రయించాడు. మొదట ఆమె ములాయంను కొంత లొంగదీసింది. తరువాత అమర్‌సింగ్ వచ్చాడు. మామకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి! కోడలు రాజకీయాలలోకి రావడం కూడా ములాయంకు మొదట ఇష్టం లేదు. 2009లో ఫిరోజాబాద్, కనౌజ్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన అఖిలేశ్ కనౌజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహించి, ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి డింపుల్‌ను పోటీ చేయించాలని అఖిలేశ్ కోరిక. అన్య మనస్కంగానే ములాయం అభ్యర్థిత్వం ఇచ్చాడు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రఖ్యాత సినీనటుడు రాజ్ బబ్బర్ పోటీ చేశారు. గెలిచారు. తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి 2012లో అఖిలేశ్ కనౌజ్ స్థానానికి రాజీనామా చేశారు. ఈసారి తన అదృష్టాన్ని కనౌజ్ నుంచి పరీక్షించుకునే అవకాశం డింపుల్‌కు వచ్చింది. మిగిలిన పార్టీల వారు వివిధ కారణాల నామినేషన్లు వేయలేదు. దాంతో ఆమె ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మళ్లీ 2014లో మోదీ హవా మధ్య కూడా ఆమె అక్కడ నుంచే ఎన్నికయ్యారు. తాజ్ మహల్... డింపుల్ కపుల్ ఉత్తరప్రదేశ్‌లోనే ఆగ్రా ఉంది. అక్కడే ఉంది గొప్ప ప్రేమ చిహ్నం తాజ్ మహల్. 2015లో అక్కడ లవర్స్ బెంచ్‌ని ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన వారు ఎవరో కాదు అఖిలేశ్, డింపుల్ దంపతులే. ఆ సంవత్సరం వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ ఇద్దరు అక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు ఎంతెంత రాజకీయం చేసినా, ఎన్నెన్ని ఎత్తులు వేసినా, ఎంత ఉద్రిక్తత తలెత్తినా.. వీటి మధ్య కూడా డింపుల్, అఖిలేశ్ ప్రేమానుబంధాన్ని సడలనీయకుండా కాపాడుకుంటున్నారు. – గోపరాజు నారాయణరావు -
‘సైకిల్’ సమరంలో ఇద్దరు కోడళ్లు!
⇒ సమాజ్‌వాదీ పార్టీ ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి? ⇒ అఖిలేశ్‌కు పోటీగా చిన్న కోడలు అపర్ణను రంగంలోకి దించిన సాధన (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సమాజ్‌వాదీ పార్టీ ‘కుటుంబం’లో ముదిరిన ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర ఏమిటి? పార్టీలో ఆధిపత్యం కోసం తండ్రీ కొడుకుల మధ్య సాగుతున్న పోరాటంలో కోడళ్లు ఎటు ఉన్నారు? పార్టీని తండ్రి చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకోవ డానికి ప్రయత్నిస్తున్న పెద్ద కొడుకు అఖిలేశ్‌యాదవ్‌కు ఆయన భార్య డింపుల్ అండగా నిలిచారు. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ భార్య అపర్ణ.. ములాయం శిబిరంలో ఇంకా కచ్చితంగా చెప్పా లంటే శివ్‌పాల్ శిబిరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ప్రమాదాన్ని’ ముందే పసిగట్టిన డింపుల్.. అఖిలేశ్‌ను 2012లో ముఖ్యమంత్రిగా ప్రకటించే సమయంలోనే.. ములాయం రెండో భార్య, అఖిలేశ్ సవతి తల్లి అయిన సాధనాగుప్తా.. తన కుమారుడైన ప్రతీక్‌ను ములాయం వారసుడిగా ప్రతిష్టించాలని కోర ుకున్నారు. అయితే ప్రతీక్ రాజకీయాలను కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. దీంతో ప్రతీక్ భార్య, తన కోడలు అపర్ణను అఖిలేశ్‌కు పోటీగా దించాలని సాధనాగుప్తా నిర్ణయించారు. ఈ వ్యూహాన్ని పసి గట్టిన డింపుల్ తన భర్త అఖిలేశ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన తన తండ్రి ములాయంను రోజూ కలుస్తూ జాగ్రత్తలు తీసుకునేవారు. అయినా కూడా తండ్రి నివాసం నుంచి సాధనాగుప్తాతో పాటు తన బాబాయి శివ్‌పాల్‌లు ఇబ్బం దులు సృష్టించగలరని తేటతెల్లమయ్యాక అఖిలేశ్ తన నివాసాన్ని ఏకంగా ములాయం ఇంటి పక్కకే మార్చేశారు. శివపాల్ అపర్ణల శిబిరం వ్యూహాలను ప్రతిఘటిస్తూ వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందే దూకుడు.. ములాయం పెద్ద కోడలు డింపుల్ పెద్దగా మాట్లాడరు. చిన్నకోడలు అపర్ణ తీరు ఇందుకు విరుద్ధమైనది. రాజకీయాల్లోకి ప్రవేశించకముందే తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. తనను తాను ప్రతిష్టించుకోవడం ఎలాగో ఆమెకు బాగా తెలుసు. ములాయం దృష్టిని ఆకర్షించడానికి ఆమె 2014లో ప్రధాని మోదీని కీర్తించటం మొదలుపెట్టారు. అఖిలేశ్‌ను ఎదుర్కోవడానికి ములాయం కుటుంబం నుంచి ఒక వ్యక్తి కావాలని కోరుకుంటున్న శివ్‌పాల్.. అపర్ణ శక్తిసామర్థ్యాలను గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అపర్ణ పోటీ చేస్తారని ఏడాది కిందటే ప్రకటించారు. ఇటీవల ములాయం ప్రకటిం చిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఆ సీటుకు అపర్ణ పేరును ఖరారు చేశారు. ములాయం జాబితాను కాదంటూ సీఎం అఖిలేశ్ ప్రకటించిన రెబెల్ అభ్యర్థుల జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి ఏ పేరునూ ప్రకటించలేదు. దీనినిబట్టి.. అక్కడ అపర్ణ పోటీకి అఖిలేశ్ కూడా వ్యూహాత్మకంగానే అయినా వ్యతిరేకం కాదన్నది అర్థమవుతోంది. కుటుంబ సభ్యుల మధ్య చెల రేగిన వివాదం ఆ పార్టీని ఇబ్బం దుల్లోకి నెట్టింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూ ల్ కూడా విడుదలైనందున ఈ సంక్షోభాన్ని సత్వర మే పరిష్కరించుకోకపోతే ఎన్నికల్లో ఎస్పీకి ఇబ్బం దులు తప్పవనేది పరిశీల కుల అంచనా. అపర్ణకు రాజ్‌నాథ్ ఆశీర్వాదం.. డింపుల్ సమాజ్‌వాదీ పార్టీకి సంప్రదాయమైన రాజకీయాల పరిధిలోనే ఉంటే.. అపర్ణ తరచుగా ఆ పరిధిని దాటిపోయారు. ములాయం అన్న మనవడు తేజ్పా ల్ వివాహం లాలుప్రసాద్ కుమార్తె రాజ్ లక్ష్మితో జరి గినపుడు తిలక్ వేడుకకు హాజరైన ప్రధాని మోదీతో అపర్ణ సెల్ఫీ తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ దేశంలో అసహనం పెరుగుతోందన్న వ్యాఖ్యలపై వివాదం రేగినపుడు కూడా ఆమె బీజేపీని సమర్థిస్తూ మాట్లాడటం ద్వారా.. ఎస్పీ సైద్ధాంతిక పరిధిని మళ్లీ అతిక్రమించారు. అంతేకాదు.. గత అక్టోబర్‌లో అపర్ణ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఆయన పాదాలను తాకి నమస్కరించారు. యూపీలో బీజేపీకి ఠాకూర్ ప్రతినిధి అయిన రాజ్‌నాథ్.. అసెంబ్లీ ఎన్నికల విషయంలో అపర్ణను ‘ఆశీర్వదించార’ని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. -
'అందరూ వద్దంటున్నా.. సీఎం పెళ్లి నేనే చేశా'
ములాయం సింగ్ యాదవ్ కుటుంబం అంతా అఖిలేష్ యాదవ్ పెళ్లిని వ్యతిరేకిస్తుంటే.. డింపుల్‌తో అతడి పెళ్లి తానే చేయించానని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ సహచరుడు అమర్ సింగ్ చెప్పారు. అప్పట్లో అఖిలేష్ తరఫున గట్టిగా నిలబడింది తానొక్కడినేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా అతడి పెళ్లి ఫొటోలు చూస్తే.. తాను లేకుండా ఏ ఒక్క ఫొటో కూడా ఉండదని తెలిపారు. అలాంటి అఖిలేష్ యాదవ్.. ఇప్పుడు తనను 'దలాల్' అంటూ వ్యాఖ్యానించడం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తోందని అమర్ సింగ్ చెప్పారు. 'ముఖ్యమంత్రి అఖిలేష్'కు తాను సన్నిహితం కాకపోవచ్చు గానీ.. ములాయం కొడుకు అఖిలేష్‌కు మాత్రం తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది గానీ అఖిలేష్ అపాయింట్మెంట్ మాత్రం దొరకదన్నారు. తన బలితోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటే.. బలిదానం చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. రాంగోపాల్ యాదవ్ తనను బెదిరిస్తూ చేసిన ప్రకటన చూసి భయం వేస్తోందని.. తనకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని అమర్ సింగ్ చెప్పారు. రాంగోపాల్ యాదవ్‌ను తాను ఎప్పుడూ 'నపుంసకుడు' అనలేదని, ఆయన పేరుతోను, బాలగోపాల్ అనే పేరుతో మాత్రమే పిలిచానని చెప్పారు. తానెప్పుడూ అలాంటి తిట్లు వాడలేదన్నారు. పవన్ పాండే చేతిలో దెబ్బలు తిన్నారని కథనాలు వచ్చిన అషు మాలిక్‌ను తాను ఎప్పుడూ కలవలేదని అమర్ తెలిపారు. శివపాల్ యాదవ్‌కు బదులు అఖిలేష్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు కూడా తననే అందరూ తప్పుబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు శివపాల్ యాదవ్ మాత్రం తనను తప్పుబట్టకుండా, కొత్త అధ్యక్షుడైన అఖిలేష్‌ను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారన్నారు. ఇక నవంబర్ 3వ తేదీ నుంచి అఖిలేష్ యాదవ్ నిర్వహించనున్న రథయాత్రకు తనకు ఆహ్వానం లేదని.. అలాంటప్పుడు తాను అక్కడకు వెళ్తే అఖిలేష్ మద్దతుదారులు తన దుస్తులు చింపి, కొట్టడం ఖాయమని అమర్ సింగ్ చెప్పారు. అప్పుడు అనవసరంగా అఖిలేషే తనను కొట్టించాడన్న ఆరోపణలు వస్తాయని, అందువల్ల ఆ రథయాత్రకు తాను వెళ్లడం లేదని తెలిపారు. -
అందమైన ప్రజా ప్రతినిధులు
ఆలోచన అందంగా ఉంటే మనిషీ అందంగా కనిపిస్తాడు!ఇదిగో వీరంతా అందానికి కాకుండా అందమైన ఆలోచనకు ప్రతినిధులు! ప్రజా ప్రతినిధులు!! ఆకుల చాటున దాగి ఉండే పువ్వుల్లా కాకుండా...సూర్యుడు భూమి మీదే వికసించాడా అన్నంత గొప్పగా కనిపిస్తున్నారు! అందం దేవుడిచ్చాడు.. అర్హత ప్రజలు ఇచ్చారు.. ఇక గౌరవం వీళ్లు నిలబెట్టుకోవాలి! రాజకీయం... ఒకప్పుడు పురుషులకు మాత్రమే తెలిసిన మంత్రం.. వాళ్లకు మాత్రమే చేతనైన తంత్రం.. వాళ్లు మాత్రమే రాణించదగ్గ రంగం.. కానీ ఇప్పుడు... స్త్రీలకూ తెలిసిందా వ్యూహం! వాళ్లూ నెరుపుతున్నారు రాజకీయం... అందుకుంటున్నారు అధికారం! యుక్తి, యోగ్యత, శక్తిసామర్థ్యాలు కలిగిన మహిళానేతలున్న దేశాలే దీనికి నిదర్శనం! అంతెందుకు మొన్నటికిమొన్న మన దగ్గర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, మమతాబెనర్జీ, మహబూబా ముఫ్తీసహీద్లు ముఖ్యమంత్రులవడం మరో మంచి ఉదాహరణ! అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ ఇంకో ప్రతీక! ఈ సంగతి అలా ఉంచితే.. సహజంగానే ఆడవాళ్లు అందానికి పర్యాయపదాలు! నటన, మోడలింగ్, క్రీడలు, సైనికబలగాలు వంటి రంగాల్లో అందమైన మహిళలున్నట్టే రాజకీయాల్లో కూడా చతురతతో పాటు అందాన్ని కలబోసుకున్న ఆడవాళ్లు ఉన్నారు. ఓ ఇంటర్నేషనల్ వెబ్ జర్నల్ ఈ విషయంమీద ఓటింగ్ ద్వారా ఓ పోటీ నిర్వహించాలనుకుంది. అనుకున్నదే తడవుగా 2015లో ప్రపంచవ్యాప్తంగా ఓటింగ్ పెట్టింది. అందులో గెలిచి నిలిచిన టాప్ టెన్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ జాబితాను విడుదల చేసింది! ఆ సుందర రాజకీయ మహిళామణులెవరో చూద్దాం... 1. వంజా హెడ్జోవిక్... సెర్బియా విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖలో సలహాదారు. కవ్వించే ఫోటోగ్రాఫ్స్తో కంట్రావర్సీకి కేంద్రంగా మారారు అందాల వంజా హెడ్జోవిక్ . ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాల్సివస్తే బ్రెయిన్‌తో బ్యూటీని డామినేట్ చేసి సమర్థవంతురాలిగా పేరుతెచ్చుకున్నారు. పనిపట్ల ఆమెకున్న నిబద్ధత, నిజాయితీలు ఆమెను సెర్బియాలోని సోషలిస్ట్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్‌ను చేశాయి! ఇక ఆమె అందమేమో ... వెబ్‌జర్నల్ నిర్వహించిన బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పాలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్ కాంటెస్ట్‌లో వంజా హెడ్జోవిక్ను మొదటి స్థానంలో నిలిపింది. 2. మారా కార్ఫెగ్నా ఇటాలియన్ రాజకీయ నేత. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రసిద్ధ మోడల్. టెలివిజన్ సిరీస్‌లో కూడా నటించారు. 2004లో రాజకీయారంగప్రవేశం చేశారు. బెర్లుస్కోని ఫోర్త్ కాబినెట్లో ఈక్వల్ ఆపర్చునిటీ శాఖా మంత్రిగానూ ఉన్నారు. యూరప్మీడియా అంతా ఆమెను ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇటాలియన్ మినిస్టర్‌గా అభివర్ణించింది. ఓ యూరప్ మ్యాగజైన్ అయితే మారాను టాప్ హాటెస్ట్ ఫీమేల్ పొలిటీషియన్స్‌గా పేర్కొంది. అలాగే ఈ వెబ్ జర్నల్ నిర్వహించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్ కాంటెస్ట్‌లో మారా కార్ఫెగ్నా రెండోస్థానం పొందారు. 3. కష్మాలా తారీఖ్ నలభైమూడేళ్ల ఈ పాకిస్తానీ నేత పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ ై‘ఖెద్ ఎ అజమ్’ సభ్యురాలు. ఆ పార్టీ నుంచే నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మానవ హక్కుల కార్యకర్త కూడా అయిన కష్మాలా తారీఖ్ పాకిస్తాన్లో పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. 4. డింపుల్ యాదవ్ మనందరికీ బాగా పరిచయం ఉన్న మహిళ. అవును.. అఖిలేశ్ యాదవ్ భార్య, ములాయంసింగ్ యాదవ్ కోడలు! సమాజ్‌వాదీ పార్టీ నేత. 2012లో ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేతగానే కాదు ఫంక్షన్లు, పార్టీలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకుంటూ సెలబ్రెటీగా కూడా పాపులర్ అయ్యారు ఆమె. ప్రస్తుతం మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫీమేల్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్‌లో నాలుగో స్థానంలో ఉన్నారు. 5. ఇవా కైలి పాన్హెల్లెనిక్ సోషలిస్ట్ మూవ్మెంట్ నుంచి యురోపియన్పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 37 ఏళ్ల ఇవాకైలీ విద్యార్థి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండేవారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2004లో ప్రధానస్రవంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నేషనల్ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో శాశ్వత సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన యూరోపియన్ ఎన్నికల్లో నాటో పార్లమెంటరీ అసెంబ్లీలోని డెలిగేషన్స్ ఫర్ రిలేషన్స్కి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు ఇవాై కెలి. 6. సెత్రిడా జియాజియా 49 ఏళ్ల ఈ లెబనీస్ నేత 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. లెబనాన్‌లోకి సిరియా శక్తులు దూసుకువచ్చినప్పుడు ఆ శక్తులు వెనక్కివెళ్లేలా పోరాడారు సెత్రిడా జియాజియా. లెబనీస్ ఫోర్సెస్ పార్టీని నిలబెట్టి తిరిగి అధికారం పొందేలా చేశారు. లెబనీస్ మెరోనైట్ లీగ్ సభ్యురాలిగా రహదారి భద్రత మీద ప్రత్యేక దృష్టిపెట్టి విజయం సాధించారు. అంతకుమించి సామాజిక సేవనూ అందించారు. ఈ సాహస వనిత మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫిమేల్ పొలిటీషియన్స్ ఇన్ ద వరల్డ్‌లో ఆరో స్థానాన్ని సాధించారు. 7. అలినా కబీవా ఈ రష్యన్ నేత పూర్వాశ్రమంలో రిథమిక్ జిమ్నాస్ట్. 33 ఏళ్ల అలినా క్రీడల నుంచి రిటైరయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. యునెటైడ్ రష్యా పార్టీ తరపున 2007లో పబ్లిక్ చాంబర్ ఆఫ్ రష్యా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2014 వరకు కొనసాగారు. 2014లో రష్యాలోనే అతిపెద్ద మీడియా కార్పోరేషన్ అయిన నేషనల్ మీడియా గ్రూప్‌కి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ ఫిమేల్ పొలిటీషియన్స్ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. 8.నినా సైఖలీ మొరాదీ ఇరానియన్ రాజకీయ నేత. ఇరానియన్ కౌన్సిల్ సభ్యురాలూ అయిన నినా ఆర్కిటెక్ట్ కూడా. అయితే ఆమె అందమే అమెకు శత్రువైంది. నినా అందానికి అందకూ ఆకర్షితులవుతుండడం, కౌన్సిల్లో అందరి కళ్లూ ఆమె మీదకే మళ్లుతుండడం వల్ల కౌన్సిల్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని కౌన్సిల్ ఆమె సభ్యత్వాన్నే రద్దు చేసింది. అలాంటి ఈ అద్భుత సౌందర్యరాశి టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్‌లో స్థానం సంపాదించడంలో ఆశ్చర్యం లేదు. 9. ఆంజెలా జెరెకోవ్ గ్రీక్ వనిత. ఈమె కూడా రాజకీయాల్లో రాణిస్తూనే ఆర్కిటెక్ట్‌గానూ కొనసాగుతున్నారు. సమరస్ ప్రభుత్వంలో క్రీడలు, సాంస్కృతిక శాఖా డిప్యుటీ మంత్రి. పూర్వశ్రమంలో సినీ నటి. ది గర్ల్ ఆఫ్ మానిలో నటించారు. 2009లో రాజకీయరంగంలోకి వచ్చారు. రావడం రావడంతోనే టూరిజం శాఖా బాధ్యతలను తీసుకున్నారు. చూడగానే ఆకట్టుకునే ఈ గ్రీకు నేత ది టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్ జాబితాలో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. 10. ఓర్లీ లెవీ ఇజ్రాయేలీ విదేశీవ్యవహారాల మాజీ మంత్రి డేవిడ్ లెవీ ముద్దుల బిడ్డ. తండ్రిబాటలోనే నడిచి నేతగా ఎదిగారు ఓర్లీ. రాజకీయాల్లో చేరిన కొత్తలోనే క్నెస్సెట్ సభ్యురాలైంది. అంతేకాదు డిప్యుటీ స్పీకర్‌గానూ ఎన్నికయ్యారు. తలతిప్పుకోనివ్వని సౌందర్యంతో ఓర్లీ లెవీ ది టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ పొలిటీషియన్స్‌లో పదో స్థానంలో నిలిచారు. -
కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు!
-
కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆదివారం 77వ ఏట అడుగుపెట్టారు. ములాయం జన్మదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం సైఫైలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత అట్టహాసంగా శనివారం సాయంత్రం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన 77 కిలోల కేక్‌ను కట్ చేశారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యంత భారీ రీతిలో జరిగిన ములాయం జన్మదిన వేడుకలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొని రైతులు అల్లాడుతున్న సమయంలో ఇంత భారీ ఖర్చు, ఆర్భాటంతో ఆయన వేడుకలు జరుపుకోవడమేమిటని ప్రత్యర్థి పార్టీలు దుయ్యబడుతున్నాయి. కరువుతో యూపీ ప్రజలు అల్లాడుతున్నా ములాయం వేడుకలు మానుకోవడం లేదని విమర్శించాయి. ఈ ఆరోపణలపై ములాయం కోడలు, ఎంపీ డింపుల్ యాదవ్ స్పందిస్తూ.. కరువు ఉన్నంతా మాత్రాన ములాయం జన్మదిన వేడుకలు ఆపాల్సిన పనిలేదని, కరువు బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు. -
చెరగని చిరునవ్వు
వండర్ జెండర్ రేపు (మార్చి 8) మహిళా దినోత్సవం. పూర్తిగా ‘లేడీస్ ఓన్లీ’ ఈవెంట్. ఇందులోక్కూడా మగాళ్లు దూరేసి, మహిళల గొప్పదనం గురించి మాట్లాడ్డం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. ‘ఇందులో ఇబ్బందేముందీ, వాళ్ల వైపే కదా మాట్లాడబోతాం’ అని మనం అనుకోవచ్చు. లేడీస్ వాష్ రూమ్‌ని లేడీసే క్లీన్ చెయ్యాలి. ‘క్లీన్ చెయ్యడం మీ కోసమే కదా’ అని చీపురుకట్ట, బకెట్ పట్టుకుని మగాళ్లు వచ్చేస్తే స్త్రీలు ఇబ్బంది పడడంలో అసహజత్వం ఏముంటుంది? మేల్ ఫెమినిస్టుల్లా మగాళ్లు మాట్లాడడమూ ఇలాంటిదే. పైగా మగవాడి అహంకారంలో, ఆధిక్యంలో ఉండే సహజత్వం... అతడిలోని ‘స్త్రీ సానుకూల ధోరణి’లో కనిపించదు. ఏడ్చే మగాణ్ణయినా నమ్ముతుంది కానీ, యావత్ మహిళాలోకం తరఫున ఏడ్చే సగటు మగాణ్ణి స్త్రీ అస్సలు నమ్మదు. మరేం చేద్దాం? చాలా చెయ్యొచ్చు... ప్రశంసా పత్రాలు ఇవ్వడం కాకుండా! ఉమెన్స్ డే సెలబ్రేషన్స్‌కి రంగురంగుల కాగితాలు కట్టి రావచ్చు. పింక్ కలర్ బెలూన్లు ఊది ఇవ్వొచ్చు. మహిళలు కట్ చేయబోతున్నది ప్రపంచ పటమంత భారీ కేక్ అయితే కనుక దాన్ని మోయడానికి చొక్కా చేతులు పైకి మడిచి వెళ్లొచ్చు. ఏదైనా కాస్త దూరం నుంచే చేయాలి. ఏం చేసినా సహాయం చేస్తున్నట్టుగా కాకుండా చెయ్యాలి. ఎందుకింతగా ఒళ్లు దగ్గరపెట్టుకోవడం? ఎందుకంటే, మగాళ్లకి ఏమంత మంచి పేరు లేదు. అయినా మగాళ్ల మంచితనం గురించి మాట్లాడుకోడానికి మహిళా దినోత్సవమే దొరికిందా మనకి?! ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. అబ్బే... ఈ ఇడియమ్ మనకి సెట్ అయ్యేలా లేదు. మేల్ ఛావనిస్ట్ పిగ్ లము కదా. ఈ రకం పిగ్గులకేమైనా డేస్ ఉన్నాయేమో వెతుక్కోవాలి. మహిళల ప్రయత్నాలను ప్రశంసిస్తూ, అభినందిస్తూ, వాళ్ల ప్రతిభను చూసి అబ్బురపడుతూ, నివ్వెరపోతూ... ఎన్ని విధాలుగా మనం మన శౌర్య వినమ్రతను (షివల్రీ) ప్రదర్శించినా పట్టించుకునే తీరిక, ముంద సలు మన మాటలపై వారికొక సదభిప్రాయం ఉండవని చెప్పి ఎంతసేపని మౌనంగా ఉండిపోగలం చెప్పండి? నిజం మాట్లాడుకుని తీరాలి. విమెన్ ఆర్ రియల్లీ వండర్ఫుల్... మన మాటకు వారి దృష్టిలో విలువున్నా, లేకున్నా! ప్రపంచమంతా మార్చి 8న మహిళా దినోత్సవం అంటోంది కానీ, ప్రతి రోజునూ మహిళ ఒక దినోత్సవంగా నెట్టుకొస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఉత్సవాన్ని ఎవరైనా సంతోషంగా జరుపుకుంటారు. ఈ ‘నెట్టుకురావడం’ ఏమిటి? నెట్టుకురావలసిన పరిస్థితులనే స్త్రీ ఎప్పటికప్పుడు ఒక ఉత్సవంగా మలచుకుంటూ ఉంటుందని! ఇదిగో ఇందుకే నమ్మరు మహిళలు మన మగాళ్లను. ఉబ్బేయడానికీ ఒక హద్దూపద్దూ ఉండొద్దా అని వారి ఉద్దేశం కావచ్చు. కానీ కొన్ని నిజాలనైనా వాళ్లు గొప్ప సహానుభూతితో అంగీకరించాలి. ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ నిశ్చలమైనవి, నిర్జీవమైనవీ! మరి అద్భుతాలు ఎలా అయ్యాయి? మనిషిలోని జీవం వల్ల, చలనశీలత వల్ల. నిజానికి ఆ ఏడు అద్భుతాలను మించిన అద్భుతం... మహిళ! వాటిలా ఆమెది నిశ్చలమైన, నిర్జీవమైన స్వభావం కాదు కనుక. మరి ఎందుకని ఆమె అద్భుతం కాకుండా పోయింది? ఆమె పట్ల మగవాళ్ల నిశ్చలత్వం వల్ల, జీవరాహిత్యం వల్ల. స్త్రీలోని అద్భుతం ఆమె క్రియాశీలత లో కనిపిస్తుంది. పడిపోతున్నా, పైకి లేవడానికి ఆమె చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది. ఆమెలోని అద్భుతాలు లెక్కలేనన్ని. ప్రపంచంలో జరుగుతున్న పనిలో 66 శాతం ఆమెదే. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 50 శాతం ఆమె చేస్తున్నదే. కానీ ఆమె పొందుతున్న ప్రతిఫలం 10 శాతం మాత్రమే. ఆమె పేరున ఉన్న సంపద 1 శాతం మాత్రమే. ఇలాంటి శాతాలు చాలానే ఉన్నాయి. శ్రమ ఎక్కువ. గుర్తింపు తక్కువ. అయినా నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లోనూ మహిళ ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అదీ అద్భుతం! సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా నెలకు లక్ష రూపాయల జీతాన్ని తెచ్చుకునే హడావుడిలో కూడా ఇంట్లో పూలకుండీకి నీళ్లు పోయందే క్యాబ్ ఎక్కని అద్భుతం మిహ ళ! తరగని ఇంటిపనిలో చెరగని చిరునవ్వుతో ‘గృహిణి’గా జీవితాంతం పనిచేసే అన్ పెయిడ్ అద్భుతం మహిళ! ఎందుకు అంత అద్భుతం అంటే... మగాళ్లం మనం అలా చేయలేం. ఎందుకని చేయలేం అంటే ఏమో చెప్పలేం. ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అని చెప్పడమంత తేలిక కాదేమో... మనకు మనం ఒక క్యారెక్టరైజేషన్‌ను ఇచ్చుకోవడం. -
అత్యాచారాలపై నిరసనలు
లండన్, కొచ్చిల్లో మహిళాసంఘాల ధర్నాలు లండన్/న్యూఢిల్లీ/కొచ్చి/షిల్లాంగ్: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పలు హత్యాచార ఘటనలపై విమర్శలు, నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై భారతదేశవ్యాప్తంగా పెరుగుతన్న నేరాలు, అత్యాచార ఘటనలకు నిరసనగా దక్షిణాసియా మహిళాహక్కుల సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు గురువారం లండన్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బదౌన్(యూపీ)- భగానా(హర్యానా)ల్లో జరిగిన ఘటనలు పునరావృతం కావద్దంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు. యూపీలో మహిళలపై కొనసాగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా కేరళలోని కొచ్చిలో హైకోర్టు ముందు ఐదుగురు మహిళలు అర్థనగ్నంగా నిరసన తెలిపారు. ‘స్త్రీ కూటైమ’ సంస్థకు చెందిన ఆ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై పెరుగుతున్న నేరాలు అత్యంత ముఖ్యమైన, సున్నితమైన సామాజికాంశాలని, వాటిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ గురువారం పేర్కొన్నారు. బదౌన్ సహా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అత్యాచార ఘటనలపై అఖిలేశ్, ఆయన తండ్రి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో డింపుల్ పై విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా, మహిళలపై అత్యాచారాలకు, ఇతర నేరాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలుంటాయని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు. అలాగే, విధుల నిర్వహణలో విఫలమైన అధికారులు, పోలీసులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఐటం నెంబర్ పాటల వల్లే.. భోపాల్: దేశంలో మహిళలపై అత్యాచారాలతో పాటు, వాటికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్, ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ల సరసన మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ కూడా చేరారు. ‘ఏ ప్రభుత్వమూ అత్యాచారాల్ని నిరోధించలేదు. ఆ ఘటన జరిగిన తరువాతే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. రేప్ అనేది ఒక సామాజిక నేరం. అది స్త్రీ, పురుషులపై ఆధారపడి ఉంటుంది. రేప్ అనేది ఒక్కోసారి తప్పు అవుతుంది. ఒక్కోసారి ఒప్పు అవుతుంది. ఫిర్యాదు వస్తే తప్ప ఏం చేయలేం. మహిళలు కరాటే, జూడో లాంటి స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలి. సినిమాల్లోని ఐటం నెంబర్ పాటల వల్ల కూడా వతావరణం పాడవుతోంది’ అంటూ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గౌర్ మరో దుమారానికి తెర లేపారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. -
అఖిలేష్ దంపతులకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వాళ్లు వెళ్తున్న హెలికాప్టర్‌ను ఓ పక్షి ఢీకొంది. కనౌజ్ ఎంపీ అయిన తన భార్య డింపుల్ యాదవ్, ప్రజాపనుల శాఖ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ తదితరులతో కలిసి అఖిలేష్ హెలికాప్టర్లో వెళ్తున్నారు. తన సమీప బంధువు రతన్ సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భూమికి 3వేల అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా, లక్నోకు మరో 12 కిలోమీటర్ల దూరం ఉందనగా ఒక గద్ద వచ్చి హెలికాప్టర్ ముందు అద్దాన్ని ఢీకొంది. అయితే పైలట్లు ఎలాగోలా చాపర్‌ను సురక్షితంగా విమానావ్రయంలో ల్యాండ్ చేయగలిగారు. ముందుగానే విషయం తెలియడంతో పలు అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలతో అధికారులు విమానాశ్రయానికి వచ్చారు. గతవారంలో యూపీ మాజీ సీఎం మాయావతి ప్రపయాణిస్తున్న ప్రైవేటు విమానం వెనక చక్రం ల్యాండింగ్ సమయంలో ఇరుక్కుపోయి పెద్ద ప్రమాదం కొద్దిలో తప్పింది. -
భయ్యా.. భాబీ జిందాబాద్
ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ లోక్‌సభ నియోజకవర్గం ‘భయ్యా.. భాబీ జిందాబాద్’ నినాదాలతో హోరెత్తుతోంది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్(35) ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో భార్యాభర్తలిద్దరూ కలిసి జంటగా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కలిసే రోడ్ షోలలో, ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ‘అఖిలేశ్ జిందాబాద్’ అనే నినాదాలు ఎక్కువైతే.. ‘మీ భయ్యా గురించే కాదు.. నా గురించి కూడా నినాదాలు చేయండి.. మీ అభ్యర్థిని నేనే’ అంటూ నవ్వుతూ చురకలేస్తున్నారు డింపుల్‌యాదవ్. అయితే, అఖిలేశ్ యాదవ్ తన భార్య విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయంటున్నారు. ‘మీ భార్యపై ప్రేమతో ప్రచారానికొచ్చారా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ తరఫున వచ్చారా?’ అని ప్రశ్నిస్తే.. కాస్త సిగ్గుపడుతూ.. ‘భార్య కోసం ప్రచారం చేయడంలో తప్పేముంది’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. -
సోనియా, రాహుల్ లపై పోటీ పెట్టం: అఖిలేష్ యాదవ్
లక్నో: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (రాయ్ బరేలి), రాహుల్ గాంధీ (అమేథి) పోటి చేయనున్న నియోజకవర్గాల్లో పోటి పెట్టబోమని సమాజ్ వాదీ పార్టీ మంగళవారం ప్రకటించింది. సోనియా, రాహుల్ లపై పోటి వద్దని సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. గతంలో ములాయం సింగ్ యాదవ్ పై, కనూజ్ లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పై కాంగ్రెస్ పోటి పెట్టని విషయం తెలిపిందే. రాయ్ బరేలిలో సోనియా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోనియాగాంధీపై రాయ్ బరేలి నియోజకవర్గంలో సుప్రీం కోర్టు న్యాయవాది అజయ్ అగర్వాల్ ను బీజేపీ బరిలోకి దించింది.