ఒకే వేదికపై ప్రియాంకా గాంధీ, డింపుల్‌ యాదవ్‌? | Dimple Yadav And Priyanka Gandhi Will Be Seen On A Stage In Varanasi Will Hold A Public Meeting | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై ప్రియాంకా గాంధీ, డింపుల్‌ యాదవ్‌?

Published Wed, May 22 2024 8:39 AM | Last Updated on Wed, May 22 2024 10:07 AM

Dimple Yadav and Priyanka Gandhi will be Seen on a Stage

యూపీలో వివిధ రాజకీయ పార్టీల లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియా కూటమి అభ్యర్థి అజయ్ రాయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వారణాసిలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు.

దీనికి సంబంధించి ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే సభ జరిగే వేదికను, తేదీని ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్ రాయ్ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌ మహానగర అధ్యక్షుడు రాఘవేంద్ర చౌబే, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌ పటేల్‌ మాట్లాడుతూ ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు.

కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి అధికారులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా వారణాసిలో జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌కు మద్దతుగా మే 28 లేదా 29న ఈ ఇద్దరు నేతలూ వారణాసిలో రోడ్‌ షో నిర్వహిస్తారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement