stage
-
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
ఒకే వేదికపై ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్?
యూపీలో వివిధ రాజకీయ పార్టీల లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియా కూటమి అభ్యర్థి అజయ్ రాయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ వారణాసిలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు.దీనికి సంబంధించి ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే సభ జరిగే వేదికను, తేదీని ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ మహానగర అధ్యక్షుడు రాఘవేంద్ర చౌబే, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ పటేల్ మాట్లాడుతూ ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి అధికారులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని సమాచారం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా వారణాసిలో జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్‌కు మద్దతుగా మే 28 లేదా 29న ఈ ఇద్దరు నేతలూ వారణాసిలో రోడ్ షో నిర్వహిస్తారని సమాచారం. -
కాంగ్రెస్ బ్యానర్‌పై బీజేపీ అభ్యర్థి ఫొటో..!!
రాజకీయ నేతల ప్రచారాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుండటం సహజమే. అయితే ఇటువంటివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. వీటిని చూసిన జనాలు నవ్వుకుంటుంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఉదంతమొకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. సియోని జిల్లాలోని లఖ్నాడన్ అసెంబ్లీలోని ధనోరా గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. రాహుల్ రాకకు స్థానిక నేతలు వేదికతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతలో చోటుచేసుకున్న ఒక పొరపాటు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. రాహుల్ గాంధీ సభకు ఒకరోజు ముందు వేదికపై మెయిన్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ నేతల ఫొటోలను ముద్రించారు. ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగింది. కాంగ్రెస్ నేతలతో కూడిన ఆ బ్యానర్లో బీజేపీ కేంద్ర మంత్రి, పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి ఫగ్గన్ సింగ్ కులస్తే ఫొటో ముద్రితమయ్యింది. కొద్దిగా ఆలస్యంగా దీనిని గుర్తించిన స్థానిక కాంగ్రెస్ నేతలు.. ఫగ్గన్ సింగ్ కులస్తే ఫొటోపై మరో కాంగ్రెస్ నేత ఫొటో అతికించి, ఊపిరిపీల్చుకున్నారు. -
జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి
భోపాల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు. एमपी विधानसभा के अध्यक्ष गिरीश गौतम को मऊगंज में स्पीच देते हुए आया चक्कर, सुरक्षाकर्मियों ने संभाला @NavbharatTimes #NBTMP #MPNews pic.twitter.com/4VGlyux9Nc — NBTMadhyapradesh (@NBTMP) August 15, 2023 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'హర్ గర్ తిరంగ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. నేడు రాష్ట్ర ప్రజలందరికి మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. తివర్ణ జెండాను ఎగురవేసి, చురుకుగా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు.. స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. रायसेन में परेड सलामी के दौरान चक्कर खा कर गिरे MP के स्वास्थ्य मंत्री Dr. Prabhuram Choudhary। #PrabhuramChoudhary #IndependenceDay2023 #IndependenceDay #raisen #Madhyapradesh #flaghosting @DrPRChoudhary pic.twitter.com/jsLsVYACfk — New India Live (खबर सातों पहर) (@Newindialive24) August 15, 2023 ఇదీ చదవండి: వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే.. -
అత్యంత అందమైన టాప్ 10 రోమన్ యాంఫీథియేటర్స్
-
వైరల్ వీడియో: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు
-
మహేష్ వారసుడు మేకోవర్ స్టార్ట్.. అచ్చం నాన్నలానే
-
COP27: వేదికను వీడిన రిషి సునాక్.. అంతా షాక్
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్. ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న ఆయన.. పర్యావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించబోయే సాయం, భావితరాల సంక్షేమం గురించి కూడా ప్రసంగించారు. అయితే ఓ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో హడావిడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. కాప్27 సదస్సులో సోమవారం ఓ నాటకీయ పరిణామం జరిగింది. సదస్సు కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఆ హాల్ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు అక్కడ ఉన్నవాళ్లంతా. COP27 సదస్సులో భాగంగా.. ఫారెస్ట్స్ పార్ట్నర్షిప్ ప్రారంభం అయిన కాసేపటికే ఓ సహాయకుడు వచ్చి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిమిషంపాటు చెవిలో ఏదో చెప్పాడు. అయినా సునాక్ అలాగే స్టేజ్ మీద కూర్చుని ఉండిపోయారు. ఈ లోపే మరో వ్యక్తి వచ్చి ఆయనతో ఏదో చెప్పగా.. హడావిడిగా సునాక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్సైట్ నిర్వాహకుడు లియో హిక్‌మ్యాన్ తెలిపారు. UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX — Leo Hickman (@LeoHickman) November 7, 2022 సహాయకులు ఏం చెప్పారు? ఆయన ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఆయనింకా అక్కడే ఉన్నారా? బ్రిటన్‌కు వెళ్లారా? దానిపై డౌనింగ్ స్ట్రీట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఐరాస నిర్వహించే పర్యావరణ మార్పుల సదస్సును ‘కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్’(COP27)గా వ్యవహరిస్తుంటారు. ఈజిప్ట్‌లో రిసార్టుల వనంగా పేరున్న షెర్మ్–ఎల్–షేక్‌లో ఈ సదస్సు ఆదివారం నుంచి మొదలైంది. ఇదిలాఉంటే.. 42 ఏళ్ల రిషి సునాక్‌కు ప్రధాని హోదాలో ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఇదీ చదవండి: రిషి సునాక్‌పై విమర్శల పర్వం! -
స్టేజ్‌పై లవర్‌కు లిప్‌లాక్ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్..
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్d. తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్‌లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్‌తో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ కొంతకాలంగా పంజాబి నటుడు, గాయకుడు సౌరభ్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేది. అతనిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం సంకోచించదు పాయల్. తాజాగా మరోసారి తన లవర్ సౌరభ్‌తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది పాయల్ రాజ్‌పుత్. ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో సౌరభ్‌తో కలిసి పాయల్ డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ తర్వాత సౌరభ్‌కు లిప్ కిస్ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అంతేకాకుండా యాంకర్ అడిగే ప్రశ్నలకు సిగ్గుతో తబ్బిబ్బయింది. హైదరాబాద్‌లో ఫ్లాట్ తీసుకున్న పాయల్ రాజ్‌పుత్ సౌరభ్‌తో సహాజీవనం చేస్తోంది. ఇక్కడి నుంచే తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కిరాతక, తీస్మార్ఖాన్ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్ -
Viral Video: స్టేజ్‌పై నుంచి కిందపడ్డ బీజేపీ కార్యకర్త
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత సోమవారం ‘జన దర్శన్ యాత్ర’ చేపట్టారు. దీంతో ఖార్గోన్ జిల్లాలోని స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ స్టేజ్ మీద నుంచి ఓ కార్యకర్త కిందపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం శివరాజ్ సింగ్ ‘జన దర్శన్ యాత్ర’లో భాగంగా ఖార్గోన్ జిల్లాలో పర్యటించారు. ఖార్గోన్ జిల్లాలోని జిరన్య ప్రాంతం నుంచి భికంగావ్ ప్రాంతం వరకు ఈ యాత్ర కొనసాగింది. అయితే యాత్ర మధ్యలో ఏర్పాటు చేసిన స్థానిక బీజేపీ కార్యకర్తల కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ పాల్గొన్నారు. సీఎం శివరాజ్ సింగ్ స్టేజ్‌మీదకు ప్రవేశించి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అయితే ఆ బీజేపీ కార్యకర్త సీఎంకు ప్రజలంతా తిరిగి అభివాదం చేయాలంటూ మైక్‌లో మాట్లాడుతూ.. ఒక్కసారిగా స్టేజ్‌పై నుంచి కిందపడిపోయాడు. బీజేపీ కార్యకర్త స్టేజ్‌పై నుంచి కిందపడ్డ సమయంలో సీఎం శివరాజ్ స్టేజ్ మీద అభివాదం చేస్తూ కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. #WATCH | Madhya Pradesh: A local BJP leader falls off the stage of an event which was organised for CM Shivraj Singh Chouhan in Khargone, following his 'Jandarshan yatra' from Jhiranya to Bhikangaon in Khargone district. CM Chouhan was also present on the stage. (27.09.2021) pic.twitter.com/GXQYNciWjC — ANI (@ANI) September 29, 2021 -
ఐనవోలులో కూలిన టీఆర్ఎస్ సభ స్టేజ్
-
‘సీతారామ’కు తొలి దశ అనుమతి
సాక్షి, హైదరాబాద్ : సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు తొలి దశ (స్టేజ్–1) అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పరిధిలో 1,531 హెక్టార్ల (3,827.5 ఎకరాలు) అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులను కేంద్ర అటవీ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం మంజూరు చేసింది. శుక్రవారం చెన్నైలో జరిగిన అటవీ, పర్యావరణ సాధికార కమిటీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డాక్టర్ ఎం.ఆర్.జి.రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ.. సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించి కేంద్రానికి సానుకూలంగా సిఫారసు చేసింది. దీంతో అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు కేంద్రానికి అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం సిఫార్సు చేస్తుంది. ప్రాజెక్టులోని పైపులైన్లు, గ్రావిటీ కాల్వలు, వాటిపై నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూటరీలు, టన్నెళ్లు నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమవు తున్నాయి. 175 ఎకరాలు తగ్గింపు.. సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యత ప్రాజెక్టుగా పరిగణి స్తోంది. ఈ కాలువ నిర్మాణం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో 114 కిలోమీటర్ల మేర అటవీ భూముల నుంచి వెళ్తోంది. ఇందుకోసం 1,602 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టుకు బదలాయిం చాలని సాగునీటి పారుదల శాఖ తొలుత కోరింది. దీనిపై అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి శోభతో పాటు అధికారుల బృందం ఇటీవల వారంపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. 9 అటవీ డివిజన్ల పరిధిలో భూములు, ప్రాజెక్టు కాలువ అలైన్మెంట్, వన్య ప్రాణు లు సంచరించే ప్రాంతాలు, అటవీ సంపదపై ప్రభావాల్ని పరిశీలించింది. అలైన్మెంట్, టన్నెళ్ల ప్రకారం లెక్కలు వేసిన అధికారులు బదలాయించే అటవీ భూమిని 1,531 హెక్టార్లుగా నిర్ధారించారు. ఫలితంగా బదలాయించే అటవీ భూమి 71 హెక్టార్లు (175 ఎకరాలు) తగ్గింది. పనులు వేగిరం: హరీశ్ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లభించడంపై ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో దశ అనుమ తుల ప్రక్రియకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎకో సెన్సి టివ్ జోన్‌లోని 275 హెక్టార్లకు (688 ఎకరాలు) కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమ తి కోసం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రా ణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరగాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4,050 ఎకరాలను కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో గుర్తించామని, ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ అటవీ భూముల్లో అడవులు పెంచేందుకు అవసరమయ్యే నిధులను అంచనా వేసి ఇరిగేషన్ శాఖకు వెంటనే సమర్పించాలని అటవీ శాఖను కోరారు. -
అజాన్ సంప్రదాయం ఏర్పడిందిలా!
ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలన్నా, ఎటువంటి ప్రకటన చెయ్యాలన్నా ప్రవక్త మహనీయులు మసీదునే వేదికగా చేసుకునేవారు. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ప్రసంగ వేదిక (మింబర్ ) మొదటి మెట్టుపై నిలబడి ప్రసంగించేవారు. సంభాషణ అయితే ’మింబర్ ’ రెండవ మెట్టుపై కూర్చుని మాట్లాడేవారు. ప్రారంభంలో ఎవరికివారు నమాజు వేళకు మస్జిదుకు చేరి ప్రార్థన చేసేవారు. కాని అందరూ ఫలానా సమయానికి మస్జిదుకు రావాలని పిలిచే పద్ధతేదీ లేదు. అందుకని ప్రవక్తమహనీయులు సహచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దూరాన ఉన్నవారికి తెలియడం కోసం ఏదో ఒకవిధానం రూపొందించాలన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. కొందరు బాకా ఊదడం గాని, గంట మోగించడం గాని చేద్దామన్నారు. మరికొందరు శంఖం పూరిస్తే బాగుంటుందన్నారు. ఈవిషయంపై ఏకీభావం కుదరగానే శంఖాన్ని ఏర్పాటు చేయమని ప్రవక్తవారు హజ్రత్ ఉమర్ గారికి పురమాయించారు. ఇవే ఆలోచనలతో ఇంటికి వెళ్ళిన ఉమర్ ఆ రాత్రి ఒక కలగన్నారు. ’గంటలు, బాకాలు కాదు ‘అజాన్ ’ పలకండి’ అని ఆ కల సారాంశం. ఈ ‘అజాన్ ’ ఏమిటీ? తెల్లవారిన తరువాత ఈ విషయం ప్రవక్తకు తెలియజేద్దామని, అసలు ‘అజాన్ ’ అంటే ఏమిటీ అని ఆలోచిస్తూ మసీదువైపు బయలుదేరారు. అంతలో మసీదు పక్కనే ఓ ఇంటికప్పుపై హజ్రత్ బిలాల్ నిలబడి ’అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్ హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్...’ అని పలుకుతున్న మధురవచనాలు చెవిన పడ్డాయి. అజాన్ అంటే ఇదేనేమో... మరి బిలాల్‌కు ఎవరు చెప్పారీ పలుకులు అనుకుంటూ వడివడిగా అడుగులేశారు. అప్పటికే అక్కడ కొంతమంది విశ్వాసులు ఈ విచిత్ర పలుకుల్ని వింటున్నారు. అక్కడికి చేరుకున్న ఉమర్ , బిలాల్ నుద్దేశించి, ‘ఎవరు చెప్పారు ఇలా చదవమని?’ అంటూ ప్రశ్నించారు సంభ్రమాశ్చర్యాలతో.. ఇప్పుడే హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ వచ్చి, తనకు ఎవరో కలలో కనిపించి, అజాన్ ఇలా పలకాలని చెప్పినట్లు తనకు చెప్పారన్నారు బిలాల్. అక్కడినుండి హజ్రత్ ఉమర్ నేరుగా ప్రవక్త వారి వద్ద కెళ్ళి, ’దైవప్రవక్తా! రాత్రి నాకు, అబ్దుల్లాబిన్ జైద్ ఇద్దరికీ ఒకేలాంటి కల వచ్చింది’ అని అంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇదంతా విన్న దైవప్రవక్త, ‘ఉమర్! ఇది అల్లాహ్ మహదానుగ్రహం. నా వద్దకు కూడా ఇలాంటి సందేశమే వచ్చింది’. అన్నారు సంతోషంగా. ఈ విధంగా ప్రార్థన (నమాజ్ ) కోసం మసీదుకు రమ్మని పిలిచే సంప్రదాయం ఏర్పడింది. అప్పటినుండి మసీదు పక్కనే ఉన్న ఇంటికప్పుపై నిలబడి హజ్రత్ బిలాల్ (ర) అజాన్ పలికేవారు. అదేవిధానం యావత్ ప్రపంచంలో కొనసాగుతోంది. ప్రళయకాలం వరకూ ఇన్షా అల్లాహ్ ఇదే పద్ధతి కొనసాగుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం) -
తమిళనాడులో DMK రైల్‌రోకో ఆందోళన
-
తెలంగాణ బీజేపీ నేతల ధర్నా
-
రేషన్‌షాపుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం : రేషన్ షాపుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. జీవో నెం.35 ప్రకారం ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన ఈ జీవోను అనుసరించే రేషన్ షాపులను కార్డుల సంఖ్యకనుగుణంగా క్రమబద్ధీకరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆధార్, ఐరిష్ అనుసంధానం చేసిన రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా ఈ క్రమబద్ధీరణ చేయనున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోషాపు పరిధిలో 400 నుంచి 450 బీపీఎల్, 50 పింక్ కార్డులకు మించి ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కోషాపు పరిధిలో 500 నుంచి 550 బీపీఎల్, 250 గులాబీ కార్డులకు మించి ఉండకూడదు. కార్పొరేషన్ పరిధిలో అయితే 600 నుంచి 650 బీపీఎల్, 400 గులాబీ కార్డులకు మించి ఉండకూదని జీవో పేర్కొంది. ప్రస్తుతం జిల్లాలో 2018 రేషన్ షాపులుండగా వాటి పరిధిలో 10.87 లక్షల రేషన్ కార్డులున్నాయి. 1500 నుంచి 2 వేలకు పైగా కార్డులున్న దుకాణాలు 10 వరకు ఉంటే, వెయ్యినుంచి 1500కుపైగా కార్డులున్న దుకాణాలు 20కుపైగా ఉన్నాయి. అలాగే 500 నుంచి వెయ్యి లోపు కార్డులు కలిగిన దుకాణాలు 200కుపైగా ఉంటాయని అంచనా. కార్డుల సంఖ్య ఆధారంగా రేషన్‌షాపులను క్రమబద్ధీకరిస్తే ప్రస్తుతం ఉన్న రేషన్ షాపుల సంఖ్యకు అదనంగా మరో రెండు మూడొందలు పెరిగే అవకాశం ఉందని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా జిల్లా స్థాయిలో గైడ్‌లైన్స్ రూపొందించుకొని క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కళాభారతిలో రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016
విశాఖలో అపూర్వ ఘట్టం ఆవిష్కరణ ఆగస్టు1నlనిరంతరాయంగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు రంగస్థలం పరవశించే రోజు అది.. ఎనిమిది విభిన్న కళా అంశాలను ఒకే వేదికపై పలువురు కళాకారులు ప్రదర్శించే అద్భుత దశ్యాన్ని వీక్షించే అరుదైన అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. దాదాపు ఆరున్నర గంటలపాటు నిర్విరామంగా ఎనిమిది రంగస్థల అంశాలను ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ఏకపాక్రాభినయం, కామెడీస్కిట్, విచిత్ర వేషధారణ, లఘునాటిక, ప్రహసనం, మిమిక్రీ, నాటిక, మూకాభినయం, సాంఘిక నాటకం.. విభాగాలలో ఆగస్టు1న కళాకారులు స్టేజీని పండించనున్నారు.l –డాబాగార్డెన్స్ రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016ను ఆగస్టు 1న కళాభారతి ఆడిటోరియం వేదికగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖ ఆర్థిక సాయంతో నిర్వహించే ఈ బహత్కార్యక్రమం కళాభిమానులను కనువిందు చేయనుంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించనున్నార. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మునుపెన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు. ఆ రోజు ప్రదర్శితమయ్యే కళా అంశాల సంక్షిప్త పరిచయమిది.. 85ఏళ్ల వయసులోనూ ..‘చాణక్యు’నిగా రాణింపు ప్రదర్శన సమయం..మధ్యాహ్నం..3.30 గంటల 3.50 వరకూ.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ఆంధ్రశ్రీ, అపర చాణక్యుడు చల్లా పాపారావు ‘చాణక్య’ పేరిట ఏకపాత్రాభినయం నిర్వహించనున్నారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఏకపాత్రాభినం నిర్వహిస్తూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 450కి పైగా ప్రదర్శనలిచ్చారు. ముంబయి, బెంగళూరుతో పాటు దేశం నలుమూలల పలు ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకున్నారు. 2012 తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల్లో పాపారావు ఏకపాత్రాభినయానికి ప్రభుత్వం రూ.15వేలు అందజేసి సత్కరించింది. ‘చాణక్య’ ఏకపాత్రాభినయం మధ్యాహ్నాం 3.30 నుంచి 3.50 గంటల వరకు జరగనుంది. అదిగో.. ‘ప్లాస్టిక్ భూతం’ ప్రదర్శన సమయం మధ్యాహ్నం 3.50 గంటలకు.. కోరుకొండ రంగారావుæ విశాఖవాసులకు చిరపరిచితులు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ లాఫ్టర్స్ ఫన్క్లబ్లో ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. 2005లో ఐదుగురు సభ్యులతో లాఫ్టర్స్ ఫన్క్లబ్ను స్థాపించి ఇప్పటి వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో 2 వేలకు పైగా వినోద కార్యక్రమాలు (కామెడీ స్కిట్స్) నిర్వహించారు. 2011 మే నెలలో 35 గంటల 15 నిమిషాల పాటు జోక్స్ చెప్పి లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్సులో స్థానం సాధించారు. 2013 సెప్టెంబర్‌లో గంటలో 654 జోకులు చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.2008లో శ్రీకష్ణదేవరాయ కల్చరల్ ట్రస్ట్ ద్వారా అప్పటి ఎయూ రిజిస్ట్రార్ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా ‘వికటకవి పురస్కారం’అందుకున్నారు. అనగనగా ఓ ధీరుడు, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘కత్రిన కరీనా మధ్యలో కమల్ హాసన్’ సినిమాలో నటించారు. ప్లాస్టిక్ భూతం పేరిట విచిత్ర వేషధారణ ద్వారా ఆయన కనువిందు చేయనున్నారు. నటులున్నారు జాగ్రత్త (లఘు నాటిక) ప్రదర్శన సమయం: సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు.. నవరస థియేటర్స్ ఆర్ట్స్, ఎండాడ మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో ‘నటులున్నారు జాగ్రత్త’ లఘునాటిక ప్రదర్శన నిర్వహించనున్నారు. రచన బళ్లా షణ్ముఖరావు, దర్శకత్వం పి.వి.ఆర్.మూర్తి. లఘు నాటిక విశేషమేమిటంటే..నాటకమంటే తెలియని పిల్లలు ప్రదర్శన ఇవ్వటం. ‘కన్యాశుల్కం’(ప్రహసనం).. రచన..కందుకూరి వీరేశలింగం, దర్శకత్వం..చలసాని కష్ణప్రసాద్ ప్రదర్శన సమయం సాయంత్రం 4.30 గంటల నుంచి.. 19వ శతాబ్ద తొలిరోజుల్లోని సంఘటనల సమాహారం. ఆడపిల్లలు రజస్వల కాకముందు అంగట్లో అమ్ముకునే రోజులవి. ఆ రోజుల్లో ఆడపిల్లలే పంట. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అగ్రహారాల్లో జరుగుతున్న ఈ దురాచారాలను రూపుమాపేందుకు నవయుగ వైతాళికుడు కందుకూరి విరేశలింగం ప్రహసనం రచించారు. 15 నిమిషాల నిడివిలో నిర్వహించనున్న ప్రహసనంలో అమ్ముకునేవాడు..కొనుగోలు చేసేవాడు..కందుకూరి పాత్రలో మరొకరు ముగ్గురు క్యారెక్టర్లతో ప్రదర్శన ఉంటుంది. మధురవాడ సుదర్శన కల్చరల్ అసోసియేషన్ కళాకారులు దీనిని ప్రదర్శిస్తారు.l ధ్వన్యనుకరణ (మిమిక్రీ).. సమయం..సాయంత్రం 4.50 గంటల నుంచి.. నగరానికి చెందిన సీనియర్ మిమిక్రీ కళాకారుడు వై.కె.రాజు ధ్వన్యనుకరణ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 1800కు పైగాప్రదర్శనలిచ్చారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ పథకాలపై ప్రచార రూపంలో మిమిక్రీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సినీ, రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతల వాయిస్..డ్యాన్స్ రూపంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. జోక్స్..ప్రకటనలు..సన్నివేశాలను మిమిక్రీ ద్వారా తెలియజేయనున్నారు. పేరడీ పాటలు, మిమిక్రీతో డ్యాన్స్‌లు కూడా చేయనున్నారు. స్వాగతం నాటిక ప్రదర్శనl సమయం సాయంత్రం 5 గంటలకు.. కె.వి.మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన బి. రామకష్ణ, దర్శకత్వం పి.శివప్రసాద్. కళల కోసమే స్వాగతం నాటిక ప్రేక్షకులను అలరిస్తుంది. మూకాభినయం.. సమయం సాయంత్రం 6.45 గంటల నుంచి.. విజయనగరానికి చెందిన ఆదయ్య మాస్టారు ముకాభినయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో ఫేమస్. చిన్నదాని సింగారం, వెయిట్ లిఫ్టింగ్ అంశాలపై మైమ్ ప్రదర్శన. 65 మంది కళాకారుల ‘అశ్శరభ శరభ’ విజయవాడ మహేశ్వరి ప్రసాద్ యంగ్ «థియేటర్ ఆర్గనైజేషన్‌కు చెందిన 65 మంది కళాకారులతో రెండున్నర గంటల పాటు ‘అశ్శరభ శరభ’ సాంఘిక నాటకం ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆరు నంది అవార్డులు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక కళాపరిషత్‌లో ఏడు అవార్డులు పొందిన సాంఘిక నాటకం. రచన ఎన్.ఎస్. నారాయణబాబు, దర్శకత్వం వాసు, సారథ్యం రాంపిళ్ల మోహనకష్ణ. ఇది ఓ పాపాయి కథ. కన్నె కథ. ఓ కూతురు..ఓ అక్క..ఓ భార్య..ఓ తల్లి కథ. మొత్తంమీద ఒక మహిళా/స్త్రీమూర్తి కథ. స్త్రీ శక్తిని దుర్నిరీక్ష్యంగా వెలిగించే తూర్పు కోసం..స్త్రీ మూర్తిని సాటి మనిషిగా పరిగణించే మార్పు కోసమే. స్త్రీ మూర్తిని మహోన్నతంగా దర్శించి, ఆవిష్కరించిన మహిళా నాటకం. మహిళా లోకాన్ని ఆదుకునే మహాద్భుత తరానికి ఆవాహనగా నిలవనుంది. నాటకం సారాంశం లక్ష్మి అనే వివాహిత కోమాలో పడి ఉంది. అమె ఒంటికి నిప్పంటించుకొని చావబోయిందని పోలీసులు ధ్రువీకరిస్తారు. అయితే ఆమెను భర్తే చంపబోయాడని లక్ష్మి తండ్రి, తమ్ముడు గ్రహిస్తారు. ఆశక్తుడైన తండ్రి నిలదీయలేకపోతాడు. స్వార్థపరుడైన తమ్ముడు మిన్నకుండిపోతాడు. ఆస్పత్రి బర్న్స్ వార్డులో దయనీయంగా ఉన్న లక్ష్మి శరీరం నుంచి ఆత్మ వెలుపలికి వచ్చి కాలిపోయిన తన శరీరాన్ని చూసుకొని ప్రస్తుత తన నిస్సహాయతను తెలుసుకుని ఏడుస్తుంది. ఆమెకు తన జీవితంలో కొన్ని సంఘటనలు, స్మతులు, తలపుకొస్తాయి. ఆ తలపుల్లో ఆమె జీవితం ఆవిష్కతమవుతుంది. లక్ష్మిది ఆత్మహత్యా ప్రయత్నంగా చిత్రీకరించి భర్త రాజు జనాన్ని నమ్మిస్తాడు. ఇంకా చావదేమిటన్న అసహనంతో ఏ క్షణంలోనైనా చస్తుందన్న నమ్మకంతో దొంగ ఏడ్పులు, విచారం నటిస్తూ హాస్పటల్‌కు వస్తుంటాడు. చివరకు లక్ష్మి చనిపోతుంది. అమె భర్త, హంతకుడైన రాజు నిశ్చితంగా ఉంటాడు. గతంలోనూ..ఇప్పుడూ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తున్న అభాగ్య వనితలకు న్యాయం చేయలేకపోతున్న సమాజం నుంచి వచ్చే కొత్త తరం కోసమే ఈ నాటకం. రంగస్థలమే నా ప్రాణం నాటకం మంచిని బోధిస్తుంది. విశ్రాంతిని కలిగిస్తుంది. కష్టాన్ని మరిపిస్తుంది. వినోదాన్నిస్తుంది. సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తుంది. ‘రంగస్థలమే నా ప్రాణం. రంగస్థలమే నా ఊపిరి. రంగస్థల కళాకారులగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇప్పటి వరకు 500కు పైగా వివిధ సంస్థలతో విభిన్న సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాం. వీలైనంతగా నాటక రంగానికి సేవలందించటమే రంగసాయి నాటక సంఘం లక్ష్యం. ∙– బాదంగీర్ సాయి, రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకుడు -
రంగస్థలం .. మెరిసి మురిసే రోజు
–విశాఖలో అపూర్వ ఘట్టం ఆవిష్కరణ –ఆగస్టు1నlనిరంతరాయంగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు –కళాభారతిలో రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016 రంగస్థలం పరవశించే రోజు అది.. ఎనిమిది విభిన్న కళా అంశాలను ఒకే వేదికపై పలువురు కళాకారులు ప్రదర్శించే అద్భుత దశ్యాన్ని వీక్షించే అరుదైన అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. దాదాపు ఆరున్నర గంటలపాటు నిర్విరామంగా ఎనిమిది రంగస్థల అంశాలను ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ఏకపాక్రాభినయం, కామెడీస్కిట్, విచిత్ర వేషధారణ, లఘునాటిక, ప్రహసనం, మిమిక్రీ, నాటిక, మూకాభినయం, సాంఘిక నాటకం.. విభాగాలలో ఆగస్టు1న కళాకారులు స్టేజీని పండించనున్నారు.l –డాబాగార్డెన్స్ రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016ను ఆగస్టు 1న కళాభారతి ఆడిటోరియం వేదికగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖ ఆర్థిక సాయంతో నిర్వహించే ఈ బహత్కార్యక్రమం కళాభిమానులను కనువిందు చేయనుంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించనున్నార. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మునుపెన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు. ఆ రోజు ప్రదర్శితమయ్యే కళా అంశాల సంక్షిప్త పరిచయమిది.. 85ఏళ్ల వయసులోనూ ..‘చాణక్యు’నిగా రాణింపు ప్రదర్శన సమయం..మధ్యాహ్నం..3.30 గంటల 3.50 వరకూ.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ఆంధ్రశ్రీ, అపర చాణక్యుడు చల్లా పాపారావు ‘చాణక్య’ పేరిట ఏకపాత్రాభినయం నిర్వహించనున్నారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఏకపాత్రాభినం నిర్వహిస్తూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 450కి పైగా ప్రదర్శనలిచ్చారు. ముంబయి, బెంగళూరుతో పాటు దేశం నలుమూలల పలు ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకున్నారు. 2012 తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల్లో పాపారావు ఏకపాత్రాభినయానికి ప్రభుత్వం రూ.15వేలు అందజేసి సత్కరించింది. ‘చాణక్య’ ఏకపాత్రాభినయం మధ్యాహ్నాం 3.30 నుంచి 3.50 గంటల వరకు జరగనుంది. అదిగో.. ‘ప్లాస్టిక్ భూతం’ ప్రదర్శన సమయం మధ్యాహ్నం 3.50 గంటలకు.. కోరుకొండ రంగారావుæ విశాఖవాసులకు చిరపరిచితులు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ లాఫ్టర్స్ ఫన్క్లబ్లో ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. 2005లో ఐదుగురు సభ్యులతో లాఫ్టర్స్ ఫన్క్లబ్ను స్థాపించి ఇప్పటి వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో 2 వేలకు పైగా వినోద కార్యక్రమాలు (కామెడీ స్కిట్స్) నిర్వహించారు. 2011 మే నెలలో 35 గంటల 15 నిమిషాల పాటు జోక్స్ చెప్పి లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్సులో స్థానం సాధించారు. 2013 సెప్టెంబర్‌లో గంటలో 654 జోకులు చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.2008లో శ్రీకష్ణదేవరాయ కల్చరల్ ట్రస్ట్ ద్వారా అప్పటి ఎయూ రిజిస్ట్రార్ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా ‘వికటకవి పురస్కారం’అందుకున్నారు. అనగనగా ఓ ధీరుడు, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘కత్రిన కరీనా మధ్యలో కమల్ హాసన్’ సినిమాలో నటించారు. ప్లాస్టిక్ భూతం పేరిట విచిత్ర వేషధారణ ద్వారా ఆయన కనువిందు చేయనున్నారు. నటులున్నారు జాగ్రత్త (లఘు నాటిక) ప్రదర్శన సమయం: సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు.. నవరస థియేటర్స్ ఆర్ట్స్, ఎండాడ మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో ‘నటులున్నారు జాగ్రత్త’ లఘునాటిక ప్రదర్శన నిర్వహించనున్నారు. రచన బళ్లా షణ్ముఖరావు, దర్శకత్వం పి.వి.ఆర్.మూర్తి. లఘు నాటిక విశేషమేమిటంటే..నాటకమంటే తెలియని పిల్లలు ప్రదర్శన ఇవ్వటం. ‘కన్యాశుల్కం’(ప్రహసనం).. రచన..కందుకూరి వీరేశలింగం, దర్శకత్వం..చలసాని కష్ణప్రసాద్ ప్రదర్శన సమయం సాయంత్రం 4.30 గంటల నుంచి.. 19వ శతాబ్ద తొలిరోజుల్లోని సంఘటనల సమాహారం. ఆడపిల్లలు రజస్వల కాకముందు అంగట్లో అమ్ముకునే రోజులవి. ఆ రోజుల్లో ఆడపిల్లలే పంట. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అగ్రహారాల్లో జరుగుతున్న ఈ దురాచారాలను రూపుమాపేందుకు నవయుగ వైతాళికుడు కందుకూరి విరేశలింగం ప్రహసనం రచించారు. 15 నిమిషాల నిడివిలో నిర్వహించనున్న ప్రహసనంలో అమ్ముకునేవాడు..కొనుగోలు చేసేవాడు..కందుకూరి పాత్రలో మరొకరు ముగ్గురు క్యారెక్టర్లతో ప్రదర్శన ఉంటుంది. మధురవాడ సుదర్శన కల్చరల్ అసోసియేషన్ కళాకారులు దీనిని ప్రదర్శిస్తారు.l ధ్వన్యనుకరణ (మిమిక్రీ).. సమయం..సాయంత్రం 4.50 గంటల నుంచి.. నగరానికి చెందిన సీనియర్ మిమిక్రీ కళాకారుడు వై.కె.రాజు ధ్వన్యనుకరణ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 1800కు పైగాప్రదర్శనలిచ్చారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ పథకాలపై ప్రచార రూపంలో మిమిక్రీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సినీ, రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతల వాయిస్..డ్యాన్స్ రూపంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. జోక్స్..ప్రకటనలు..సన్నివేశాలను మిమిక్రీ ద్వారా తెలియజేయనున్నారు. పేరడీ పాటలు, మిమిక్రీతో డ్యాన్స్‌లు కూడా చేయనున్నారు. స్వాగతం నాటిక ప్రదర్శనl సమయం సాయంత్రం 5 గంటలకు.. కె.వి.మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన బి. రామకష్ణ, దర్శకత్వం పి.శివప్రసాద్. కళల కోసమే స్వాగతం నాటిక ప్రేక్షకులను అలరిస్తుంది. మూకాభినయం.. సమయం సాయంత్రం 6.45 గంటల నుంచి.. విజయనగరానికి చెందిన ఆదయ్య మాస్టారు ముకాభినయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో ఫేమస్. చిన్నదాని సింగారం, వెయిట్ లిఫ్టింగ్ అంశాలపై మైమ్ ప్రదర్శన. 65 మంది కళాకారుల ‘అశ్శరభ శరభ’ విజయవాడ మహేశ్వరి ప్రసాద్ యంగ్ «థియేటర్ ఆర్గనైజేషన్‌కు చెందిన 65 మంది కళాకారులతో రెండున్నర గంటల పాటు ‘అశ్శరభ శరభ’ సాంఘిక నాటకం ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆరు నంది అవార్డులు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక కళాపరిషత్‌లో ఏడు అవార్డులు పొందిన సాంఘిక నాటకం. రచన ఎన్.ఎస్. నారాయణబాబు, దర్శకత్వం వాసు, సారథ్యం రాంపిళ్ల మోహనకష్ణ. ఇది ఓ పాపాయి కథ. కన్నె కథ. ఓ కూతురు..ఓ అక్క..ఓ భార్య..ఓ తల్లి కథ. మొత్తంమీద ఒక మహిళా/స్త్రీమూర్తి కథ. స్త్రీ శక్తిని దుర్నిరీక్ష్యంగా వెలిగించే తూర్పు కోసం..స్త్రీ మూర్తిని సాటి మనిషిగా పరిగణించే మార్పు కోసమే. స్త్రీ మూర్తిని మహోన్నతంగా దర్శించి, ఆవిష్కరించిన మహిళా నాటకం. మహిళా లోకాన్ని ఆదుకునే మహాద్భుత తరానికి ఆవాహనగా నిలవనుంది. నాటకం సారాంశం లక్ష్మి అనే వివాహిత కోమాలో పడి ఉంది. అమె ఒంటికి నిప్పంటించుకొని చావబోయిందని పోలీసులు ధ్రువీకరిస్తారు. అయితే ఆమెను భర్తే చంపబోయాడని లక్ష్మి తండ్రి, తమ్ముడు గ్రహిస్తారు. ఆశక్తుడైన తండ్రి నిలదీయలేకపోతాడు. స్వార్థపరుడైన తమ్ముడు మిన్నకుండిపోతాడు. ఆస్పత్రి బర్న్స్ వార్డులో దయనీయంగా ఉన్న లక్ష్మి శరీరం నుంచి ఆత్మ వెలుపలికి వచ్చి కాలిపోయిన తన శరీరాన్ని చూసుకొని ప్రస్తుత తన నిస్సహాయతను తెలుసుకుని ఏడుస్తుంది. ఆమెకు తన జీవితంలో కొన్ని సంఘటనలు, స్మతులు, తలపుకొస్తాయి. ఆ తలపుల్లో ఆమె జీవితం ఆవిష్కతమవుతుంది. లక్ష్మిది ఆత్మహత్యా ప్రయత్నంగా చిత్రీకరించి భర్త రాజు జనాన్ని నమ్మిస్తాడు. ఇంకా చావదేమిటన్న అసహనంతో ఏ క్షణంలోనైనా చస్తుందన్న నమ్మకంతో దొంగ ఏడ్పులు, విచారం నటిస్తూ హాస్పటల్‌కు వస్తుంటాడు. చివరకు లక్ష్మి చనిపోతుంది. అమె భర్త, హంతకుడైన రాజు నిశ్చితంగా ఉంటాడు. గతంలోనూ..ఇప్పుడూ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తున్న అభాగ్య వనితలకు న్యాయం చేయలేకపోతున్న సమాజం నుంచి వచ్చే కొత్త తరం కోసమే ఈ నాటకం. రంగస్థలమే నా ప్రాణం నాటకం మంచిని బోధిస్తుంది. విశ్రాంతిని కలిగిస్తుంది. కష్టాన్ని మరిపిస్తుంది. వినోదాన్నిస్తుంది. సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తుంది. ‘రంగస్థలమే నా ప్రాణం. రంగస్థలమే నా ఊపిరి. రంగస్థల కళాకారులగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇప్పటి వరకు 500కు పైగా వివిధ సంస్థలతో విభిన్న సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాం. వీలైనంతగా నాటక రంగానికి సేవలందించటమే రంగసాయి నాటక సంఘం లక్ష్యం. ∙– బాదంగీర్ సాయి, రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకుడు -
'పఠాన్‌కోట్ దాడి భారత్ ఆడిన నాటకం'
ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు విషయంలో పాకిస్థాన్ మీడియా విషం చిమ్ముతున్నది. ఉగ్రదాడి ఘటన భారత్ ఆడిన నాటకమని పాకిస్థాన్ దర్యాప్తు బృందం చెప్పిందంటూ బరితెగింపు రాతలు రాసింది. ఆ అడ్డగోలు రాతలకు ఆధారమంటూ యూపీలో ఎన్ఐఏ అధికారి హత్యను బూచిగా చూపెట్టే ప్రయత్నం చేసింది. 'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి భారత్ ఆడిన భారీ నాటకం. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేందుకు పన్నిన కుట్ర' అని ఇటీవలే భారత్ లో పర్యటించిన సంయుక్త దర్యాప్తు బృందం(జిట్) అధికారి తమకు చెప్పాడని 'పాకిస్థాన్ టుడే' పత్రిక సోమవారం ఒక కథనాన్ని రాసింది. 'ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే సాయుధులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయని, అయితే ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించేందుకే మూడురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించినట్లు బిల్డప్ ఇచ్చింది. ఇదంతా పాకిస్థాన్ ను బదనామ్ చేయడానికే' అని కూడా సదరు అధికారి పేర్కొన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఎన్ఐఏ అధికారి హత్యపై కట్టుకథ ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యోదంతాన్ని పాక్ మీడియా తన కట్టుకథలకు ఆధారంగా చూపెట్టే ప్రయత్నం చేసింది. భారత అధికారులు ఆడిన నాటకం బయటపడకుండా ఉండేందుకే ముస్లిం అయిన తంజిల్ అహ్మద్ ను హత్యచేయించారని కట్టుకథ అల్లింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో తమను తిప్పితిప్పి విసిగించారేతప్ప సరైన ఆధారాలు చూపకపోవడం కూడా నాటకంలో భాగమేనని జిట్ అధికారులు అన్నట్లు మీడియా పేర్కొంది. జనవరి 2న గుజరాత్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రమూక జరిపిన దాడిలో ఏడుగురు జవానులు అమరులవ్వగా, ఆరుగురు ముష్కరులు హతమైన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రవాదులు మసూద్ అజార్ జైషే సంస్థకు చెందినవారని, వచ్చింది పాకిస్థాన్ నుంచే ననే ఆధారాలను భారత అధికారులు ఇదివరకే పాకిస్థాన్ కు సమర్పించారు. ఆ ఆధారాలను బట్టి పాక్ దర్యాప్తు బృందం(జిట్) పఠాన్ కోట్ ను సందర్శించింది కూడా. ఒకటి రెండు రోజుల్లో పాక్ బృందం తన నివేదికను ప్రధాని నవాజ్ షరీఫ్ కు అందించనుంది. ఈ లోపే నిజానిజాలను వక్రీకరించే ప్రయత్నం తలకెత్తుకుంది పాకిస్థాన్ మీడియా. -
మండపంలో వధువు మాయం!
ఓ మెజీషియన్ వధువు... తన పెళ్ళి వేడుక అతిథులందరికీ జీవితాంతం గుర్తుండిపోవాలనుకుంది. అందుకే ఏదైనా భిన్నంగా చేయాలని నిర్ణయించుకుంది. మండపంలో పెళ్ళి సందడి మొదలైంది. బంధువులంతా పీటల మీదకు పెళ్ళికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె మాయమైపోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు కూడ సిద్ధమైపోయారు. ఇంతలో బంగారు రంగు దుస్తులతో దట్టమైన పొగ మధ్య మండపంలో ప్రత్యక్షమైన వధువును చూసి ఖిన్నులైపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఎంతో అద్భుతంగా ఫీలయ్యారు. కేరళ అలప్పూజ ప్రాంతంలోని ఆనంద్, అమ్ముల వివాహంలో జరిగిన ఈ అద్భుత సన్నివేశం అందరినీ ఆకట్టుకోవడంతోపాటు... స్థానికంగా వార్తలకెక్కింది. అలాగే ఆమె రిసెప్షన్ కార్యక్రమం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈసారి అమ్ము తన ఇంద్రజాల ప్రతిభతో పిల్లగాలిలో మెల్లగా కలసిపోయి... రిసెప్షన్ కు ఏర్పాటు చేసిన ఓ పెద్ద కమలం నుంచీ ప్రత్యక్షమైంది. అతిథులు, బంధువుల చప్పట్ల మధ్య కల్యాణ మండపం మారుమోగింది. వివాహ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వచ్చిన ప్రముఖ మెజీషియన్ సమరాజ్... డైరెక్టర్ బాలచంద్రన్ తో పాటు మరో ఇద్దరు ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించి... వేడుకకు గ్లామర్ టచ్ తెచ్చి పెట్టారు. రచయిత రాజశేఖరన్ ముత్తుకులమ్, శ్రీలతల ఏకైక సంతానం అమ్ము.. మూడేళ్ళ వయసులోనే ఇంద్రజాలాన్ని ఎంతో ఇష్టపడేది. కళ్ళకు గంతలు కట్టుకొని వాహనాలు నడపడం వంటి అనేక ట్రిక్కులను ఆమె స్వయంగా నేర్చుకుంది. సినిమా అండ్ టెలివిజన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె... మ్యాజిక్ లో అద్భుతాలను ప్రదర్శించి ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకుంది. వివాహ సందర్భంలో ప్రదర్శనకు అమ్మూకు ఆమె దగ్గరి బంధువులు, స్నేహితులు సహకరించారు. తన పెళ్ళి సందర్భంలో ఏదైనా ప్రత్యేకత ఉండాలన్న తన కోర్కెను అమ్మూ ముందుగానే తన తండ్రికి తెలిపింది. ఆయన అంగీకారంతో ప్రదర్శనకు అనువుగా వేదికను డిజైన్ చేయించుకుంది. -
36వ రోజుకు చేరిన VRAల దీక్ష
-
ఏకంగా వెదిక పైనే నిద్రపోయారు!!
-
యువభేరీ సభా వేదిక వద్దకు వైఎస్ జగన్
-
రికార్డు స్థాయికి ఉల్లి ధర
-
నేడు పూరీజగన్నాథుని రథయాత్ర
-
మైకే నా ప్రాణం
కథ చూడ్డానికి చాలా చిత్రంగా కనిపించవచ్చు. కానీ... కబడ్డీ కూతకు వెళ్లే ముందర బరికి మొక్కినట్టుగానే మెట్లకు మొక్కి మరీ వేదిక మీదికెక్కాడు మా రాంబాబు. మేక మెడకు మోకున్నట్లుగా, కార్పొరేట్ సంస్థలో పనిచేసేవారి మెడల్లో ఐడీకార్డులాగా వాడి మెడలోనూ ఓ తాడుంది. ఆ తాడుకు వేలాడుతూ మైకుంది. వెనక వేదిక బ్యాక్‌డ్రాప్‌గా ఓ ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ ముందర తన విశ్వరూపవిన్యాస ప్రదర్శన చేస్తున్న అపర అవతారమూర్తిలా మా రాంబాబు. ‘సభానిర్వహణ’ అనేది గుణాల గురించి రాసినంత ఈజీ కాదు. అదో కళ. అన్ని కళల కంటే క్లిష్టమైన, ఉన్నతమైన కళ. ఆ కళ ఎలా అబ్బిందో మా రాంబాబుకు అబ్బింది. ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఒక రోజంతా గుక్క తిప్పుకోకుండా మాట్లాడగల మొనగాడు. పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకతలు వస్తాయన్న వాదాన్ని నేను నమ్మను గాని, అనుకరణ, కృషి ద్వారా ఉద్దండులైన చాలామంది ఉపన్యాసకుల్లో లేని ప్రత్యేకత ఏదో రాంబాబులో ఉంది. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనే సిద్ధాంతం మీద మా రాంబాబుకు అపార నమ్మకం. తన ఉపన్యాస కళను ప్రజలకు పంచడం కోసం ‘పరదా’అనే సాంస్కృతిక సంస్థను స్థాపించాడు. ‘పరదా’ కోసం తన జీవితాన్నే ధారపోశాడు. గత రెండు దశాబ్దాలుగా ‘పరదా’ను విజయవంతంగా నడుపుతున్నాడు. ‘పరదా’ నిర్వహించే కార్యక్రమాలకి జనం తండోపతండాలుగా వస్తారు. వచ్చినవారికి పరదా వెనుక తలా ఒక బిర్యానీ పొట్లం ఇస్తారు అన్నంత ఇదిగా వస్తారు. జనాన్ని కడుపుబ్బ నవ్వించడమే ‘పర దా’కు సరదా. ప్రతి సంవత్సరం ఓ ఘటికుణ్ని దొరకబుచ్చుకొని ‘పర్సన్ ఆఫ్ ద పరదా’ అనే అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరిస్తుంది. ఈనాడు అలాంటి ఓ బ్రహ్మాండమైన సభకు మనం వెళుతున్నాం. విశాలమైన ఆడిటోరియం జనాలతో నిండిపోయింది. మైకబ్బాయి చివరిసారిగా మైకును సరిచేసుకున్నాడు. అసలు మైకు లేకున్నా సభ చివర మూలన కూచున్న ముసలమ్మకు కూడా వినపడేంత ఘాటుగా ఉంటుంది రాంబాబు మాట. సభ అంటే మైకే కాబట్టి మైకును పెట్టక తప్పలేదు. సభాసదులందరూ వచ్చిన తరువాత ‘పరదా’ కార్యదర్శి వేదిక మీదకొచ్చి ‘పరదా’ సంస్థకి రెండు జీవితకాలాల అధ్యక్షుడు, ఈనాటి సభాధ్యక్షుడు, అనితర సాధ్యుడు, డు, డు, డు, డూ... లాంటివి అనేకం చెప్పి, రాంబాబును వేదిక మీదికి ఆహ్వానించి సభను నిర్వహించాలని వేదిక దిగిపోయాడు. రాంబాబు తన వెంట తెచ్చుకున్న కార్డులెస్ మైకును స్టేజీమీద మెల్లగా... గుడ్డును బల్లమీద పెట్టినంత జాగ్రత్తగా పెట్టాడు. తన ఎడమ జేబులో ఉన్న బొట్టు డబ్బా తీసి మైకుకు కుంకుమ బొట్టు పెట్టాడు. ప్యాంటు కుడి జేబులో నుండి అగరుబత్తులు తీసి వెలిగించాడు. ‘పరదా’ సభ్యుడు పరుగెత్తుకుంటూ తెచ్చిన కొబ్బరికాయను కొట్టి, నీళ్లు తలమీద చల్లుకొని, తనను తాను దీవించుకున్నాడు. స్టేజీమీద సాష్టాంగపడి మైకుకు మొక్కి, లేచి నిలబడి మైకును తీసి కళ్లకు అద్దుకొని, ఉఫ్ ఉఫ్ అని ఊదాడు. చాలా గంభీరంగా ఉపన్యాసం మొదలుపెట్టాడు. సభాసదులందరికీ ధన్యవాదాలు అన్నాడు. దీనికంతటికీ కారణం మీరే అని ధ్వనించేలాగా. ముందుగా రంగయ్యగారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం, వారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రమణయ్యను కోరుతున్నాను అనగానే ఈలలు, చప్పట్లు మారుమోగిపోయాయి. బొకే తీసుకున్న రంగయ్య నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇచ్చి, రాంబాబుతో కరచాలనం చేశాడు. జనం వైపు తిరిగి పాప్ సింగర్లాగ రెండు చేతులూ ఎత్తి కుడికీ ఎడమకీ బాగా వంగి వంగి ఐదారుసార్లు చేతులు వూపి తన సీటులో ఆసీనుడయ్యాడు. తరువాత సాయికుమార్, రమణమూర్తి, బ్రహ్మానందు, వేలుమాధవ్, సుశీల్, కోవై సరిత కూడా తమకు ఇచ్చిన బొకేను తీసుకొని, ఫొటోకు ఫోజు ఇచ్చి, తమ తమ సీట్లలో ఆసీనులు అయ్యారు. రాంబాబు కొనసాగించాడు. ఈ కార్యక్రమ విశిష్టత ఏంటో మీకు తెలుసు. ‘తాటిచెట్టును మోకు లేకుండా ఎక్కి పక్కనే ఉన్న ఈతచెట్టు మీద నుండి దిగడం’ అనే సాహసోపేతమైన త్యాగ చర్యను చేసిన రంగయ్యకు ఈ సంవత్సరం ‘పర్సన్ ఆఫ్ ది పరదా’ అవార్డుతో గౌరవించడం చంద్రునికో కాదు, కాదు, దుప్పటికో నూలు పోగు లాంటిది. ‘తాడును ఎక్కి ఈదును దిగడం’ అనే చర్యను సాధించడానికి వారు పడిన తపన, ఆవేదన, కష్టం, నష్టం వర్ణనాతీతం. ‘‘గతంలో ఎవరైనా తాటిచెట్టు ఎక్కితే తాటిచెట్టు మీది నుంచే దిగారు. ఈతచెట్టు మీదుగా దిగడం అనే దుస్సాహసానికి ఎవరూ ఒడిగట్టలేదు. అలాంటి త్యాగమూర్తి, ఆదర్శమూర్తిని సన్మానించుకోవడం మనందరి అదృష్టం. మన గడ్డమీద ఉన్న గట్టోణ్ణి మనం గట్టిగానే సన్మానించుకుందాం. మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి’’ అని రంగయ్యను సింహాసనం మీద కూర్చుండబెట్టి గజమాల వేసి, శాలువా కప్పి, వేదిక మీదున్న ఆహ్వానితులు ఫొటోలో సరిగా పడేలాగా సర్దుకొని, గ్రూపు ఫొటో దిగారు. మేం సన్మానించకపోతే రంగయ్యకు దిక్కూ దివాణం లేదు అన్న ఫీలింగు వేదిక మీదున్న అందరి మొహాల్లో ప్రతిఫలించింది. బ్రేకింగ్ న్యూస్ కోసం విలేకరులు ఆ ఫొటో తీసుకొని తమ పత్రికలకు, చానళ్లకు పంపారు. రాంబాబు నాలుగు అడుగుల పొడవున్న ఫొటోని తీసుకొని సభాసదులకు చూపిస్తూ, ‘‘ఈ సన్మాన పత్రాన్ని నేను స్వయంగా రాశాను. అక్షరాలను గుదిగుచ్చి రాసిన ఈ సన్మాన పత్రం నేను చదివితేనే మీకు అర్థం అవుతుంది. సమయాభావం వల్ల, ఈ సన్మాన పత్రం అంతా చదవలేను. కాని, కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రం మీ ముందుంచే ప్రయత్నం చేస్తానని’’ అబద్ధం చెప్పి, ఆ సన్మాన పత్రం ఆసాంతం చదవడమే గాక, ప్రతి లైను కవితాత్మకంగా రెండు రెండుసార్లు చదివి, రంగయ్యగారి మీదున్న అపార గౌరవాన్ని మరోమారు చాటుకున్నాడు. సన్మానం తరువాత వేదిక మీద ముఖ్యులంతా వెనక్కి వెళ్లి, తమ సీట్లలో సర్దుకొని కూర్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు రంగయ్య గురించి లయాత్మకంగా మాట్లాడటం కోసం తయారుచేసుకున్న ఉపన్యాసాన్ని నెమరువేసుకుంటున్నారు. పక్కన ఉన్నవాళ్లతో గుసగుసగా మాట్లాడి రంగయ్య గురించి కొత్త సమాచారం సేకరించి తమ ఉపన్యాస పాఠంలో జోడిస్తున్నారు. చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యం గుర్తొస్తే కలిగే ఫీలింగు వాళ్ల ముఖాల్లో ప్రతిఫలిస్తోంది. సభాధ్యక్షులు రాంబాబు వేదిక మధ్యకు వచ్చి ఐ.డి. కార్డులాగా మెడలో వేలాడుతున్న మైకు అందుకొని, ‘‘రంగయ్యగారి గొప్పతనం ఏమిటో ఈపాటికే మీకు తెలిసి ఉంటుంది’’. ఈనాటి ముఖ్య అతిథి, సాయికుమార్‌గారు రంగయ్య గురించి, పనిలో పనిగా నా గురించి ఏం మాట్లాడతారో మీకు తెలుసా? తెలీదు. నాకు తెలుసు. ‘ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా తాటిచెట్టును ఎక్కి, ఈతచెట్టు మీదుగా దిగే సాహసానికి ఒడిగట్టిన రంగయ్యకు భారత ప్రభుత్వం శౌర్య పథకాన్ని ప్రదానం చేయాల’ని గట్టిగా డిమాండు చేస్తాడు. ఎన్నో రంగాల్లో రికార్డు సృష్టించిన మొనగాళ్లు ఉండగా, తాటిచెట్టు రంగాన్నే ఎంచుకున్నాడంటే, రాంబాబుకు కల్లు అంటే ఇష్టమని, కార్మిక పక్షపాతి అని అర్థం అవుతుంది’ అని అంటాడు. ఇక నటుడు, దర్శకుడు, రచయిత, విప్లవకారుడు రమణమూర్తిగారి అభిప్రాయం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘‘రంగయ్యగారు ఒక కీర్తి కిరీటం. ఈ జిల్లా మణిదీపం. ప్రభుత్వం ‘తాటి అకాడమీని స్థాపించి, దానికి రంగయ్యగారిని చైర్మన్ చేయాల’ని డిమాండ్ చేయదలుచుకున్నారు. ఇక బ్రహ్మానందుగారు రంగయ్య గురించి చెప్పే ఒక్కటే మాట ఏంటంటే, ‘రంగయ్యగారు విదూషకత్వానికి వారసుడని, సినిమాల్లోకొస్తే నా స్థానం ఊడుతుంద’ని అంటాడు. యస్... అందులో ఎలాంటి అనుమానం, అతిశయోక్తి లేవు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇక వేలుమాధవ్గారు రంగయ్యగారి పట్ల చాలా ఉత్కృష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ‘రంగయ్యగారు ఒక గంధర్వుడని, ఒక జ్ఞాని’ అని వారు గాఢంగా నమ్ముతున్నారు అని వేలుమాధవ్ వైపు చూడగా, వేలుమాధవ్ అవునన్నట్లుగా చిరునవ్వుతో తల ఊపాడు. ఇక సుశీల్ అభిప్రాయం ప్రకారం ‘‘రంగయ్యగారు రాజకీయాల్లోకి వస్తే మాత్రం, ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అనేది వారి అభిప్రాయం. ఇక ప్రముఖ సంఘ సేవిక కోవై సరిత అభిప్రాయం ప్రకారం, ‘‘బిడ్డడు ఎంతో కష్టపడ్డాడని, ఏమైనా డేక్కుపోయిన గాయాలుంటే ప్రభుత్వ ఖర్చులతో రంగయ్యగారికి చికిత్స చేయించాల’ని డిమాండ్ చేయాలనుకుంటుంది. అంతే కదా మరి. ఆవిడ తల్లి మనసుతో ఆలోచించింది. నేను బహుముఖ ప్రజ్ఞాశాలిని అని మీకు తెలుసు. అసలు వక్తలు వారే స్వయంగా మాట్లాడినా ఇంత అర్థవంతంగా చెప్పలేరు అని నాకు తెలుసు, మీకూ తెలుసు. వేదిక మీదున్న గొప్ప వ్యక్తుల మీద ఉన్న గౌరవం కొద్దీ వారి అభిప్రాయాన్ని నేనే చెప్పినందున, ఇక వారు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు సన్మాన గ్రహీత రంగయ్యగారి అభిప్రాయం ప్రకారం, ‘ఎంతో శ్రమ, ఖర్చును భరించి ఈ సమావేశం ఏర్పాటు చేసి, వారిని సన్మానించడం వారు జీవితంలో మర్చిపోలేరు. ఈ మట్టికి రుణపడి ఉంటారు, నేను ఏం చెబితే అది రంగయ్యగారు చేస్తారు. తన కృతజ్ఞత తెలియజేస్తూ, కన్నీటి పర్యంతం అవుతారు. అంతే. ఈ సభ ఇంతటితో ముగిసింది’ అన్నాడు రాంబాబు. వెంటనే ‘‘ఆ... ఆ... ఆ...గు రాంబాబూ...’’ అని ఆవేశంగా అరుస్తూ వేలుమాధవ్ లేచి, సభాసదులనుద్దేశించి, ‘‘ఏం... మేం చేతగానివాళ్లమా? రంగయ్య గురించి వారం రోజులుగా ఇంటర్నెట్లో సమాచారం సేకరించి, ఇంట్లో అద్దం ముందు ఉపన్యాసం ప్రాక్టీసు చేసి వస్తే, మీరు మాకిచ్చే మర్యాద ఇదా అధ్యక్షా. వచ్చే ఏడాది మీటింగుకి మా మైకులు మేమే తెచ్చుకొని వీరంగం ఆడిస్తాం’’ అని మీసాలు మెలేసి, ‘‘ఆ... న...’’ అని చేయి ముందుకు చాపాడు. మిగతా అతిథులు కూడా మీసాలు ఉన్నా లేకున్నా మెలేసి, ‘‘ఆ... న...’’ అని చేతులు ముందుకు చాపి, ప్రమాణం చేయగానే కరెంటు పోయింది. సభా ప్రాంగణం అంతా చీకటిమయం అయింది. కొంత విరామం తరువాత కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు వచ్చింది. భగవద్గీతలో కృష్ణుడి అవతారంతో మన రాంబాబు వేదిక మీద ప్రత్యక్షమయ్యాడు. కుడిచేతితో చక్రాన్ని సరసరా తిప్పుతూ, ఎడమ చేతితో మైకు అందుకొని, ఉఫ్ ఉఫ్ అని ఊదాడు. జనం అంతా హాహాకారాలు చేస్తూ, ఎక్కడివారు అక్కడ సాష్టాంగపడి, ‘రాంబాబూ... నీకు దండంరా బాబూ’ అన్నారు. పరదా జారింది. సభ ముగిసింది. -
జీవితమే సఫలము...
ఇన్ని దశాబ్దాల ప్రస్థానాన్ని చూసుకుంటే, జీవితం పట్ల నాకు తృప్తి ఉంది. ఇంకా ఏదో చేయలేకపోయానన్న దిగులు లేదు. కలసి నడిచి, నటించిన మా ఆవిడ లేదన్న దిగులొక్కటే ఉంది. అయినా, తన ఇష్టమైన నటన, రచన చేయగలుగుతున్నాననే సంతోషం ఉంది. ఏ మనిషి జీవిత సాఫల్యమైనా సంతృప్తే కదా! ఆయన పెరిగింది రంగస్థలంలో! ఎదిగింది సినీ రంగంలో... పత్రికా రచనలో! వేదిక మీద నుంచి వెండితెర వెనక్కి సహాయ దర్శకుడిగా గెంతి, సినీ నటనకు మారి, ఏకకాలంలో జర్నలిస్టుగా, నటుడిగా, కాలమిస్టుగా బహుపాత్ర పోషణ చేసిన, ఇప్పటికీ చేస్తున్న వ్యక్తి అంటే - రావి కొండలరావు పేరే గుర్తుకొస్తుంది. తెలుగు సినిమాకు తోటివాడైన రావి కొండలరావు ఈ 83వ ఏట కూడా నటన, రచన అంటే కుర్రాడైపోతారు. నలుగురూ చేరితే... ప్రసిద్ధ ‘తెలుగు మాస్టారు’ పాత్ర తో నవ్వులు పూయిస్తారు. సతీమణి రాధాకుమారితో కలసి నూటికి పైగా సినిమాల్లో జోడీ కట్టిన రికార్డు ఆయనది. ఇవాళ ప్రతిష్ఠాత్మక ‘అ.జో-వి.భొ, కందాళం ఫౌండేషన్’ వారి జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న ఈ కృషీవలుడి కొండంత డైరీ నుంచి కొన్ని ముచ్చట్లు... తెలుగు సినిమా పుట్టిందీ, నేను పుట్టిందీ ఒకే ఏడాది. 1932 ఫిబ్రవరి 6న తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలైతే, 11న సామర్లకోటలో నేను పుట్టా. అంటే... నా వయసూ, తెలుగు సినిమా వయసూ ఒకటే! ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, చాలా జ్ఞాపకాలు. రంగస్థల నటుడిగా, నాటక రచయితగా మొదలై ఆ పైన సినీ నటుడిగా, జర్నలిస్టుగా, చిత్ర నిర్మాణ సంచాలకుడిగా, ఇప్పుడు కాలమిస్టుగా... ఇలా ఎన్ని పాత్రలు పోషించినా ఇప్పటికీ నా మనసుకు దగ్గరైంది - నాటకమే. మా అన్నయ్య ఆర్.కె. రావు ప్రోత్సాహంతో చిన్నతనంలోనే రంగస్థలంపై కృషి చేయడం మొదలుపెట్టా. అప్పటి నుంచి ఇప్పటి దాకా రంగస్థలాన్ని వదలలేదు. ఇప్పుడూ ఒక నాటిక రాస్తున్నా. వాళ్ళను చూస్తే భయం వేసేది..! ఇన్ని దశాబ్దాల రంగస్థల ప్రయాణంలో నాకు సంతృప్తినిచ్చిన ఘటనలు అనేకం. నేను రాసి, టైటిల్ పాత్ర పోషించిన వినోదప్రధాన నాటకాల్లో ఒకటి - ‘ప్రొఫెసర్ పరబ్రహ్మం’. దేశమంతా ఆ నాటకం కొన్ని పదులసార్లు ప్రదర్శనలిచ్చాం. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో హైదరాబాద్ దూరదర్శన్ వారు దాన్ని రికార్డు చేసి, పదే పదే ప్రసారం చేశారు. ఢిల్లీలోని మౌలంకర్ ఆడిటోరియమ్‌లో జనం బాగా రావడంతో, సినిమాలా ఒకే రోజున మధ్యలో అరగంట విరామంతో రెండు షోలు వేశాం. హాలు నిండా జనం ఉన్నారు. అదో మరపురాని అనుభూతి. అయితే, ఇదే నాటకం మాకు విషాదమూ మిగిల్చింది. ఒకసారి ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో నాటకం వేసి, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి, మద్రాసుకు వచ్చేస్తున్నాం. నాగపూర్ దగ్గర రైలు ఘోర ప్రమాదానికి గురైంది. ఇద్దరు చనిపోయారు. మా నాటకానికి సంగీతం అందించిన హనుమంతాచారి అందులో ఒకరు. చాలా మందికి గాయాలయ్యాయి. ఆ విషాదం తరువాత ఇక ఆ నాటికను మళ్ళీ మేము ప్రదర్శించలేదు. మద్రాసు మహానగరంలో నేను, నా బృందం నాటకం వేసినప్పుడల్లా దర్శకులు బి.ఎన్.రెడ్డి, కె.వి. రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, పి. పుల్లయ్య - శాంతకుమారి దంపతులు లాంటి మహామహులు వచ్చి చూస్తుంటే నాకు గొప్ప థ్రిల్ అనిపించేది. అది ఎంత గొప్ప గౌరవమో ఇవాళ్టికీ తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి పెద్దల ముందు సరిగ్గా, వేస్తామా లేదా అని మనసులో కొద్దిగా భయం వేసినా, ఆ వెంటనే బాగా వేయాలని ధైర్యం తెచ్చుకొని చేసేవాళ్ళం. ఇన్నేళ్ళ కెరీర్లో ఎప్పుడూ ఫలానా పాత్రను చెడగొట్టాడనిపించుకోలేదు. నా పాత్ర, ప్రైజుల కన్నా నాటకం బాగా వేశారని చెబితే... ఇంకేం కావాలి! గురువే వచ్చి పొగుడుతున్నట్లుండేది..! అసలు నాటక రచయితగా నాకు స్ఫూర్తి - నాటక, సినీ రచయిత డి.వి. నరసరాజు గారు. ఆయన నాటకాలు చూసి, చదివి స్ఫూర్తి పొందా. ఆయన సర్వసాధారణమైన నాటక ఫక్కీలో, ఆ భాషలో మాటలు రాసేవారు కాదు. మామూలుగా మాట్లాడుకుంటున్నట్లు, సులభంగా ఉండేవి. నేనూ అదే పద్ధతి పాటించా. నన్ను సినిమాల్లో పెట్టింది కూడా ఆయనే. నేను ఆరాధించే ఆయన కూడా నా నాటకాలు చూసి, నా దగ్గరకు వచ్చి మెచ్చుకున్నారు. దాంతో, గురువే వచ్చి శిష్యుణ్ణి పొగుడుతున్నట్లుండేది. అది మరో జీవన సాఫల్యం. ఆ దెబ్బతో బుద్ధొచ్చింది..! నాటక రచన నుంచి సినిమాల్లోకి సహాయ దర్శకుడిగా వచ్చి, ఆపైన నటుడిగా మారాక నాకున్న అనుభవం చూసి, నన్ను సినీ రచయితగా కూడా పరిశ్రమ వినియోగించుకుంది. నేను రచన చేసిన తొలి సినిమా ‘చల్లని నీడ’. కానీ, సినిమా రచయితకు ఆఫీస్ బాయ్ నుంచి హీరో దాకా ప్రతివాడూ రచయితకు సలహాలు చెప్పేవాడే. దాంతో, బుద్ధొచ్చింది. సినీ రచన చేయకూడదనుకున్నా. అయితే, ఆపద్ధర్మంగా అనేక చిత్రాలకు పేరు లేకపోయినా తెర వెనుకే ఉండి రచన చేశా. ఎక్కువగా కామెడీ సన్నివేశాలు రాసేవాణ్ణి. కొంత కాలం తరువాత దర్శకుడు వేజెళ్ళ సత్యనారాయణ నా ‘నాలుగిళ్ళ చావడి’ నాటకం ఆధారంగా, నాతోనే రచన చేయించి, కొన్ని అదనపు సన్నివేశాలు కూడా కల్పించి, ‘ఓటుకి విలువివ్వండి’ అనే సినిమా తీశారు. ఆ చిత్రం ఆడకపోవడంతో చాలా రోజులు సినీ రచనకు దూరంగా ఉన్నా. ఆ సినిమా కోసం... రమణ గారి చుట్టూ తిరిగా..! కొన్నాళ్ళకు బాపు- రమణల ‘పెళ్ళి పుస్తకం’ (1991) చిత్రానికి కథ అందించా. ఆ తరువాత మళ్ళీ మా నాగిరెడ్డి గారి పిల్లలు ‘చందమామ - విజయ కంబైన్స్’ పతాకంపై చిత్ర నిర్మాణంలోకి దిగడంతో రాజేంద్రప్రసాద్ నటించిన ‘బృందావనం’ (’92)లో మళ్ళీ కలానికి పని చెప్పా. ఆ సినిమాకు స్క్రిప్టు నరసరాజు గారు. అంతా కలసి ఆఫీసులో కూర్చొని కథ అల్లుకొన్నాం. నేను నరసరాజు గారికి చేదోడు వాదోడు. అందులో, నాకూ, మా ఆవిడ రాధాకుమారికీ వేషాలున్నాయి. ‘నువ్వు - నీ శ్రీమతి ఉన్న సీన్లు నువ్వే రాసేసెయ్’ అని, ఆ బాధ్యత నాకు వదిలేశారాయన. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తరువాత ‘భైరవద్వీపం’ (’94). దర్శకులు సింగీతం శ్రీనివాసరావుతో కలసి ఆ చిత్రానికి కథ ఒక లైన్ అనుకొని, పాత్రలు వగైరా డెవలప్ చేస్తూ వచ్చా. నిజానికి, ఆ జానపద చిత్రానికి రచన చేయండంటూ ముళ్ళపూడి వెంకట రమణ గారి చుట్టూ తిరిగా. ఆయన తీరిక లేదన్నారు. తరువాత మరో ఇద్దరు, ముగ్గురు రచయితలను కూడా పెట్టాం. కానీ, వాళ్ళు మా ‘విజయ’ వారి క్రమశిక్షణకు తగ్గట్లుండేవారు కాదు. దాంతో, సన్నివేశాలు, పాత్రలకు రూపకల్పన చేసిన నన్నే రచన కూడా చేయమని దర్శక, నిర్మాతలు కోరారు. వాళ్ళ ప్రోద్బలంతో రాశా. ఆ చిత్రం విజయం సాధించి, నాకు అందరిలో పేరు తెచ్చింది. అదొక సాఫల్యం. ఏది రాసినా అడ్డుచెప్పేవారు కాదు! జర్నలిజవ్ు సంగతికొస్తే, బాపు - రమణలు ‘జ్యోతి’ మాసపత్రిక నడిపిన రోజుల నుంచి నా పత్రికా రచన మరింత విస్తృతమైంది. ఆ పైన ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు లాంటి పెద్దల ప్రోత్సాహంతో, ‘నాగిరెడ్డి - చక్రపాణి’ జంట దగ్గర ‘విజయచిత్ర’ సినీ మాసపత్రికలో చేరడం, ఆ సంస్థలో కొన్ని దశాబ్దాలు పనిచేయడం మరో తీపి జ్ఞాపకం. 1966 జూలైలో ‘విజయచిత్ర’ తొలి సంచిక వచ్చింది. ఆ సంచిక తీసుకొని ఇతర పెద్దలతో కలసి నేను, మా ఆవిడ తిరుమల వెంకన్న పాదాల దగ్గర పూజ చేయించుకు వచ్చిన సంగతులు ఇవాళ్టికీ గుర్తే! అప్పటి నుంచి 1992 వరకు ‘విజయచిత్ర’కు సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించాను. నేనేది చేయాలనుకున్నా, రాయాలనుకున్నా అభ్యంతరం చెప్పని యాజమాన్యం నాకు దక్కిన వరం. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే, మరో పక్క ఉదయం షూటింగ్‌లకు వెళుతూనో, రాత్రి షూటింగ్‌లు అయ్యాకో ఆఫీసుకు వెళ్ళి, వ్యాసాలు రాసేవాణ్ణి. ప్రూఫ్‌లు చూసేవాణ్ణి. నా నోట మాట రాలేదు! అలాగే, ‘విజయచిత్ర’కు అడిగిందే తడవుగా బి.ఎన్. రెడ్డి, ఆరుద్ర, ఆత్రేయ లాంటి పెద్దవాళ్ళు ప్రత్యేక వ్యాసాలు రాసేవారు. పంచారామాల్లో ఒకటైన పాలకొల్లులోని ‘క్షీరారామ లింగేశ్వర స్వామి’ గుడికి వారం క్రితం వెళ్ళినప్పుడు, అక్కడి ప్రధానార్చకుడు నన్ను వెంటబెట్టుకొని తీసుకువెళ్ళారు. ‘మీ విజయచిత్ర మొదటి సంచిక నుంచి ఆఖరు సంచిక వరకు ఇప్పటికీ నా వద్ద భద్రంగా ఉన్నాయి’ అని చెబుతుంటే, నోట మాట రాలేదు. అప్పట్లో ఊహించలేదు కానీ, ఇవాళ చూసుకుంటే అందులో పని చేయడం నా అదృష్టం. 1992 కల్లా షూటింగులన్నీ మద్రాసులోని స్టూడియోలు వదిలేసి, ఔట్డోర్కు వచ్చేశాయి. దాంతో, నటుడిగా నేను ఔట్డోర్కు వెళుతూ, మద్రాసులో పత్రిక బాధ్యతలకు పూర్తి న్యాయం చేయలేనని చెప్పి, పక్కకు తప్పుకున్నా. ఉద్యోగ విరమణ సందర్భంగా ఏ పత్రికా సంపాదకుడూ, యజమానీ రాయని విధంగా ‘నేను మీ లాంటి వారి సాహచర్యంలో, మీ దగ్గర ఎంతో నేర్చుకున్నా’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఉత్తరం రాసి ఇచ్చారు. అంతటి సంస్కారం ఆ యజమానులది. ఆ తరువాత కాలమిస్టుగా ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో రాసిన ‘బ్లాక్ అండ్ వైట్’ వ్యాసాల గ్రంథానికి ఉత్తమ సినీరచనగా ‘నంది’ అవార్డు రావడం లాంటివన్నీ పత్రికా రచయితగా నాకు తృప్తినిచ్చాయి. ఇప్పటికీ, నటిస్తున్నా, రాస్తున్నా. ఇంతకన్నా ఇంకేం కావాలి! చిత్తూరు నాగయ్య గారు చితికిపోయాక, ఆయన ‘స్వీయచరిత్ర’ను ‘విజయచిత్ర’లో రాశా. లైమ్‌లైట్‌లో లేని నాగయ్య కథెందుకు, మా హీరోది వెయ్యమంటూ ఒక అగ్ర హీరో అభిమానులు దండెత్తారు. కానీ, జీవితంలో ఎన్నో ఒడుదొడుకులున్న నాగయ్య గారి కథే బాగుంటుందని చెబితే, అభిమానుల ఒత్తిడికి తలొగ్గకుండా మా ఎడిటర్ విశ్వనాథరెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆ ‘స్వీయచరిత్ర’కు ఎంతో ఆదరణ లభించింది. రంగస్థలంపై రచన, దర్శకత్వం చేస్తున్నప్పుడు చాలా మంది అంతా తమ పాత్ర చుట్టూ తిరిగేలా, పరిషత్తుల్లో ప్రైజులు వచ్చేలా రచన చేసుకుంటారు. నేనెప్పుడూ అలా నా పాత్ర కోసం డైలాగ్ మీద డైలాగ్ రాసుకోవడం లాంటివి చేయలేదు. నా పాత్రకు ఏ పరిధి మేరకు ప్రాధాన్యం ఇవ్వాలో అంత వరకే ఇస్తూ, రాసుకున్నాను. అందుకే, ఎన్నో రంగస్థల పోటీల్లో నాటకాలు వేసినప్పటికీ, నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ రాలేదు. -
అంతటి ఔన్నత్యాన్ని భరించలేకపోయాను!
వేదిక మాది చాలా పెద్ద ఇల్లు. మాకొక పాలేరు ఉండేవాడు. అతని కూతురు భవాని. తనూ, నేనూ చిన్నప్పట్నుంచీ కలసి ఉండేవాళ్లం. అయితే అమ్మానాన్నలు భవానిని నాతో సమానంగా చూడడం, తనకీ నాతో సమానంగా బట్టలు కొనడం, నాతోపాటు స్కూల్లో చదివించడం నచ్చేది కాదు. భవాని పుష్పవతి అయినప్పుడు అమ్మ బంగారు గాజులు ఇవ్వడంతో నా అసూయ హద్దులు దాటింది. భవాని మీద అనిష్టం పెరిగిపోయింది. చివరికి... చాలా దారుణమైన పని చేశాను. ఆ ఏడు అమ్మ నా పుట్టినరోజుకి ఒక ఉంగరం చేయించింది. నేను దాన్ని స్కూలుకు తీసుకెళ్లి, కావాలని భవాని బ్యాగులో వేశాను. ఆ విషయం తనకి తెలియదు. ఉంగరం కోసం అమ్మ ఇల్లంతా వెతుకుతుంటే చెప్పాను... భవాని గదిలోకి వచ్చిందని, ఏదో తీసుకుని గబగబా వెళ్లిపోవడం చూశానని! అమ్మ నమ్మలేదు. కానీ నేను గోల చేయడంతో భవాని వాళ్ల నాన్నకి బాధ కలిగింది. కావాలంటే ఇల్లంతా సోదా చేసుకోమన్నారు. నేనే వెళ్లి, సోదా చేసినట్టు నటించి, భవాని బ్యాగులోంచి ఉంగరం తీసిచ్చాను. దాంతో నాన్న అరిచారు. ‘నమ్మితే ఇలా మోసగిస్తున్నారా.. ఇంకెన్ని కాజేశారో’ అన్నారు. ఆ అవమానం తట్టుకోలేక భవానీ వాళ్ల నాన్న పని మానేసి, భవానిని తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత వాళ్లు ఎక్కడున్నారో కూడా మాకు తెలియలేదు. ఇది జరిగిన రెండేళ్లకు నాన్న హఠాత్తుగా చనిపోయారు. తర్వాత మా జీవితాలు తల్లకిందులయ్యాయి. ఎవరెవరో వచ్చి, నాన్న తమ దగ్గర అప్పులు చేశాడన్నారు. సాక్ష్యాలు చూపించారు. ఆస్తులు లాక్కున్నారు. అమ్మ, నేను రోడ్డున పడ్డాం. అమ్మ ఎలాగో కష్టపడి నన్ను పెంచింది. డిగ్రీ వరకూ చదివించింది. ఇక చదివే స్తోమత లేకపోవడంతో ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టాను. ఎంతో కష్టపడి ఓ ప్రభుత్వాఫీసులో క్లర్క్ పోస్టు సంపాదించాను. అక్కడ నేను ఊహించని ఆశ్చర్యం ఒకటి ఎదురయ్యింది. భవాని అక్కడ పెద్ద అధికారి. తన కిందే నేను పని చేయాల్సింది. షాకైపోయాను. నేను ఫలానా అని చెప్పడానికి కూడా నోరు రాలేదు. కానీ తను నన్ను గుర్తు పట్టింది. ప్రేమగా పలకరించింది. నాన్న చనిపోయారని తెలిసి బాధపడింది. అంతటి ఔన్నత్యాన్ని భరించలేకపోయాను. కన్నీళ్లతో నేను తనకి చేసిన ద్రోహం చెప్పేశాను. కానీ, ఆమె పట్టించుకోనేలేదు. అవన్నీ మర్చిపొమ్మంది. సొంత సోదరిలా ఆదరించింది. చదువుకోవడానికి సాయం చేసింది. ఈ రోజు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఓ పెద్ద ఆఫీసులో మంచి హోదాలో ఉన్నానంటే దానికి కారణం భవానీయే! అర్థం లేని అసూయతో తనని, తన తండ్రిని అవమానించాను. నిలువ నీడ లేకుండా చేశాను. కానీ చివరికి ఏమైంది? ఆమె ఎత్తుకు ఎదిగింది. నేను ఎదగడానికి పెద్ద మనసుతో సాయం చేసింది. ఇంతకన్నా పెద్ద గుణపాఠం ఏం కావాలి! - వత్సల, నరసాపురం -
ఆదమరచి నిద్రించిన కాంగ్రెస్ సీనియర్లు
-
ఆ హక్కు మాకులేదా!
వేదిక ‘ఇద్దరూ ఆడపిల్లలే.... రేపొద్దున మిమ్మల్ని ఎవరు చూస్తారు?’ అని అడిగినవారికి అమ్మ చెప్పిన సమాధానం...‘ఆడపిల్లలయితే ఏంటి, మగ పిల్లలయితే ఏంటి? మూడో బిడ్డని పోషించే స్థోమత లేదు మాకు’ అని చెప్పేదట. ఏడాది కిందటే మా అమ్మ చనిపోయింది. నాన్న ఒంటరి అయిపోయారు. నాకు పెళ్లయి పదేళ్లయింది. నా పెళ్లయిన రెండేళ్లకు చెల్లి పెళ్లయింది. చెల్లి గుజరాత్లో ఉంటోంది. నేను విజయవాడలో ఉంటున్నాను. నాన్న హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్నారు. నాన్న ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే! మొన్నామధ్య చూడ్డానికి వెళ్లినపుడు చాలా నీరసంగా ఉన్నారు. అమ్మానాన్నలకు పెద్ద వయసు కాదు. గుండెపోటు వల్ల యాభై ఏళ్లు కూడా నిండకుండా కన్నుమూసింది అమ్మ. నాన్న పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బెంగగా ఉంది. ఇక లాభం లేదని...మావారితో నా మనసులోని మాట చెప్పాను. ‘‘ఇద్దరం ఆడపిల్లలం అవడం వల్ల ఈ రోజు నాన్న ఒంటరిగా బతకాల్సి వస్తోంది కదండీ! అమ్మను అందరూ మగపిల్లాడి కోసం చూడమని చెబితే ‘ఎవరైతే ఏంటి?’ అనేదట. కానీ నేను ఆడపిల్లను కావడం వల్లే కదా! నాన్న పరిస్థితి చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను. అదే మగపిల్లాడినైతే నా ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టి పోషించుకునేదాన్ని’’ అన్నాను. ‘‘ఇప్పుడు మాత్రం ఎవరు కాదన్నారు. నీ జీతంలో కొంత డబ్బు మీ నాన్నగారికి పంపు’’ అన్నారు. ‘‘డబ్బు ఆయన దగ్గర కూడా ఉంది కదండీ!’’ అన్నాను. ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. నాకు మా నాన్నగారిని మా ఇంటికి తీసుకురావాలని ఉంది. మా వారికి పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. కానీ మా అత్తమామలు ఏమనుకుంటారోనని సందేహిస్తున్నారు. ఆయనకిష్టం లేకుండా నాన్నని తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనని నా భయం. మగపిల్లలు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే...జేజేలు కొట్టే ఈ సమాజం ఆ హక్కునూ, బాధ్యతనూ ఆడపిల్లలకు ఎందుకు ఇవ్వదో నాకు అర్థం కావడం లేదు. - అనుపమ, విజయవాడ -
తప్పు చేశాం!
వేదిక మా అబ్బాయికి పెళ్లయి ఏడాది దాటింది. ఒక్కగానొక్క కొడుకు. మిగతావాళ్లతో పోలిస్తే కొంచెం గారాబంగానే పెంచాం. నా భర్త గవర్నమెంటు ఉద్యోగి. మా అబ్బాయిని పెద్ద చదువులు చదివించి విదేశాలకు పంపాలనుకునేవాళ్లం. వాడికి మాత్రం ఎలాంటి ఆశలు, ఆశయాలు ఉండేవి కావు. మా గోలపడలేక... పల్టీలు కొడుతూ కష్టపడి డిగ్రీ పూర్తిచేశాడు. తీరిక దొరికితే చాలు క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లడం తప్ప ఉపయోగపడే ఆలోచనేదీ చేసేవాడు కాదు. వాళ్లనాన్నగారు తనకు తెలిసిన చోట ఉద్యోగంలో పెట్టించారు. ఓ మూడునెలల పనిచేసి ‘నాకు నచ్చలేదు... నాకిష్టమైన ఉద్యోగాన్ని నేను వెతుక్కుంటాను’ అని ఉద్యోగం వేటలో పడి ఓ ఏడాది గడిపేశాడు. మధ్యలో వ్యాపారం చేస్తానంటూ... ఏవో రెండు మూడు ప్రయోగాలు చేసి ఊరుకున్నాడు. ఆ వంకతో నా దగ్గర చాలా డబ్బు తీసుకుని వృథా చేశాడు. పెళ్లి చేస్తే... వాడే దారిలో పడతాడని పెళ్లి చేద్దామనుకున్నాం. ముందు మంచి ఉద్యోగంలో పెట్టి తర్వాత పెళ్లి చేయడం మంచిది కదా అని తెలిసినవారి దగ్గర ఉద్యోగంలో చేర్పించాం. అదే నెలలో ఏదో మంచి సంబంధం వస్తే వెంటనే పెళ్లి చేసేశాం. పెళ్లయిన రెండో నెలలో ఉద్యోగం మానేశాడు. తోటి ఉద్యోగితో ఏదో గొడవ కారణంగా కంపెనీవాళ్లే వీణ్ణి ఉద్యోగంలో నుంచి తీసేశారని తర్వాత తెలిసింది. ఉద్యోగం పోయి ఏడాది కావస్తోంది. గట్టిగా మాట్లాడితే వేరు కాపురం అంటాడేమోనని భయం. పోనీ వాడిష్టం అనుకుని ఊరుకుందామంటే కోడలి తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. ‘మీ అబ్బాయి గురించి మీకు ముందే తెలుసు కదా! అత్తయ్యా... రూపాయి సంపాదన లేకుండా ఇలా ఖాళీగా తిరుగుతుంటే రేపు నా భవిష్యత్తు ఏంటి’ అని మొన్నామధ్య నా కోడలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. ‘వాడే మారతాడమ్మా’ అన్నాను. ‘మారాకనే పెళ్లి చేయకపోయారా...? అంటూ నిలదీసింది. ఆ అమ్మాయి అడిగినదాంట్లో నిజం ఉంది. డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఆ మాత్రం మాట్లాడ్డం తప్పుకాదు. మేం చేసిందే తప్పు. - విజయలక్ష్మి, గుంటూరు -
ఏడు నిమిషాలకు.. రూ. 6 కోట్లు!
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : పలానా హీరోయిన్ పారితోషికం కోటిన్నర, రెండు కోట్లు అన్నవార్త వినగానే అమ్మో అని ఆశ్చర్యపోతుంటాం. ఈ పారితోషికానికి ఆ హీరోయిన్లు 20 నుంచి 30 రోజులు కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుంది. అయితే కేవలం ఏడు నిమిషాల స్టేజీ డాన్స్ కోసం ఆరు కోట్లు పారితోషికం తీసుకుంటున్న నటి గురించి వింటే విస్తుపోవాల్సిందే! అలాంటి క్రేజీ నటి బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా. హిందీ హీరోయిన్ గురించి మనకెందుకంటారా? ఎందుకంటే ఈ బ్యూటీ చిందేస్తుంది చెన్నైలో కాబట్టి. నూతన సంవత్సరం వస్తుందంటే క్రేజీ హీరోయిన్లకు కాసుల వర్షమే. నక్షత్ర హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో నిర్వహించే పార్టీల్లో ఈ ముద్దు గుమ్మల చిందులకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో డాన్స్ వేయడానికి అంగీకరించింది. ఏడు నిమిషాల పాటు ఆడే ఆ డాన్స్ ఖరీదు అక్షరాలా ఆరు కోట్లు అట. ప్రియాంకా చోప్రానా మజాకా. -
ఒకే వేదికపై మన్మోహన్, మోడీ
-
రేపు జంతర్‌మంతర్‌లో ధర్నా