దేశంలోని అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన నాసిక్(మహారాష్ట్ర)లోని లాసల్‌గావ్‌లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. గురువారం అక్కడ క్వింటాలు ఉల్లి ధర రూ.4,900 పలికింది. జాతీయ ఉద్యానవన పరిశోధన, అభివృద్ధి ఫౌండేషన్(ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్) లెక్కలను అనుసరించి.. లాసల్‌గావ్ మార్కెట్‌లో క్వింటాలు ధర నిన్నటి వరకు రూ.4,500 పలుకుతుండగా.. గురువారం ఒక్కరోజే క్వింటాలుకు రూ.400 మేరకు అమాంతం పెరిగిపోయింది. గడిచిన రెండేళ్లలో లాసల్‌గావ్ మార్కెట్‌లో ఉల్లిపాయలకు పలికిన అత్యధిక ధర ఇదే. ఢిల్లీలో కిలో ధర రూ.80కి చేరింది