Viral Video: స్టేజ్‌పై నుంచి కిందపడ్డ బీజేపీ కార్యకర్త | Viral Video:Local BJP Leader Falls Off Stage In Madhya Pradesh Over CM Yatra | Sakshi
Sakshi News home page

Viral Video: స్టేజ్‌పై నుంచి కిందపడ్డ బీజేపీ కార్యకర్త

Published Wed, Sep 29 2021 5:19 PM | Last Updated on Wed, Sep 29 2021 5:28 PM

Viral Video:Local BJP Leader Falls Off Stage In Madhya Pradesh Over CM Yatra - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత సోమవారం ‘జన దర్శన్‌ యాత్ర’ చేపట్టారు. దీంతో ఖార్గోన్ జిల్లాలోని స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ స్టేజ్‌ మీద నుంచి ఓ కార్యకర్త కిందపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం శివరాజ్‌ సింగ్‌ ‘జన దర్శన్‌ యాత్ర’లో భాగంగా ఖార్గోన్‌ జిల్లాలో పర్యటించారు. ఖార్గోన్ జిల్లాలోని జిరన్య ప్రాంతం నుంచి భికంగావ్‌ ప్రాంతం వరకు ఈ యాత్ర కొనసాగింది.

అయితే యాత్ర మధ్యలో ఏర్పాటు చేసిన స్థానిక బీజేపీ కార్యకర్తల కార్యక్రమంలో సీఎం శివరాజ్‌ సింగ్‌ పాల్గొన్నారు. సీఎం శివరాజ్‌ సింగ్‌ స్టేజ్‌మీదకు ప్రవేశించి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అయితే ఆ బీజేపీ కార్యకర్త సీఎంకు ప్రజలంతా తిరిగి అభివాదం చేయాలంటూ మైక్‌లో మాట్లాడుతూ.. ఒక్కసారిగా స్టేజ్‌పై నుంచి కిందపడిపోయాడు. బీజేపీ కార్యకర్త స్టేజ్‌పై నుంచి కిందపడ్డ సమయంలో సీఎం శివరాజ్‌ స్టేజ్‌ మీద అభివాదం చేస్తూ కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement