రంగస్థలం .. మెరిసి మురిసే రోజు | drama festival begins aug 1st | Sakshi
Sakshi News home page

రంగస్థలం .. మెరిసి మురిసే రోజు

Published Thu, Jul 28 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

రంగస్థలం .. మెరిసి మురిసే రోజు

రంగస్థలం .. మెరిసి మురిసే రోజు

  • –విశాఖలో అపూర్వ ఘట్టం ఆవిష్కరణ
  • –ఆగస్టు1నlనిరంతరాయంగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు
  • –కళాభారతిలో రంగసాయి థియేటర్‌ ఫెస్టివల్‌–2016
  • రంగస్థలం పరవశించే రోజు అది.. ఎనిమిది విభిన్న కళా అంశాలను ఒకే వేదికపై పలువురు కళాకారులు ప్రదర్శించే అద్భుత దశ్యాన్ని వీక్షించే అరుదైన అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. దాదాపు ఆరున్నర గంటలపాటు నిర్విరామంగా ఎనిమిది రంగస్థల అంశాలను ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ఏకపాక్రాభినయం, కామెడీస్కిట్, విచిత్ర వేషధారణ, లఘునాటిక, ప్రహసనం, మిమిక్రీ, నాటిక, మూకాభినయం, సాంఘిక నాటకం.. విభాగాలలో ఆగస్టు1న కళాకారులు స్టేజీని పండించనున్నారు.l
    –డాబాగార్డెన్స్‌ 
     రంగసాయి థియేటర్‌ ఫెస్టివల్‌–2016ను ఆగస్టు 1న కళాభారతి ఆడిటోరియం వేదికగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖ ఆర్థిక సాయంతో నిర్వహించే ఈ బహత్‌కార్యక్రమం కళాభిమానులను కనువిందు చేయనుంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించనున్నార. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మునుపెన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు. ఆ రోజు ప్రదర్శితమయ్యే కళా అంశాల సంక్షిప్త పరిచయమిది..
    85ఏళ్ల వయసులోనూ ..‘చాణక్యు’నిగా రాణింపు  
    ప్రదర్శన సమయం..మధ్యాహ్నం..3.30 గంటల 3.50 వరకూ..
    తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ఆంధ్రశ్రీ, అపర చాణక్యుడు చల్లా పాపారావు ‘చాణక్య’ పేరిట ఏకపాత్రాభినయం నిర్వహించనున్నారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఏకపాత్రాభినం నిర్వహిస్తూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 450కి పైగా ప్రదర్శనలిచ్చారు. ముంబయి, బెంగళూరుతో పాటు దేశం నలుమూలల పలు ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకున్నారు. 2012 తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల్లో పాపారావు ఏకపాత్రాభినయానికి ప్రభుత్వం రూ.15వేలు అందజేసి సత్కరించింది. ‘చాణక్య’ ఏకపాత్రాభినయం మధ్యాహ్నాం 3.30 నుంచి 3.50 గంటల వరకు జరగనుంది.
     
    అదిగో.. ‘ప్లాస్టిక్‌ భూతం’ 
    ప్రదర్శన సమయం మధ్యాహ్నం 3.50 గంటలకు..
    కోరుకొండ రంగారావుæ విశాఖవాసులకు చిరపరిచితులు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ లాఫ్టర్స్‌ ఫన్‌క్లబ్‌లో ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. 2005లో ఐదుగురు సభ్యులతో లాఫ్టర్స్‌ ఫన్‌క్లబ్‌ను స్థాపించి ఇప్పటి వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో 2 వేలకు పైగా వినోద కార్యక్రమాలు (కామెడీ స్కిట్స్‌) నిర్వహించారు. 2011 మే నెలలో 35 గంటల 15 నిమిషాల పాటు జోక్స్‌ చెప్పి లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డ్సులో స్థానం సాధించారు. 2013 సెప్టెంబర్‌లో గంటలో 654 జోకులు చెప్పి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు.2008లో శ్రీకష్ణదేవరాయ కల్చరల్‌ ట్రస్ట్‌ ద్వారా అప్పటి ఎయూ రిజిస్ట్రార్‌ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా ‘వికటకవి పురస్కారం’అందుకున్నారు. అనగనగా ఓ ధీరుడు, ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న ‘కత్రిన కరీనా మధ్యలో కమల్‌ హాసన్‌’ సినిమాలో నటించారు. ప్లాస్టిక్‌ భూతం పేరిట విచిత్ర వేషధారణ ద్వారా ఆయన కనువిందు చేయనున్నారు.
    నటులున్నారు జాగ్రత్త (లఘు నాటిక) 
    ప్రదర్శన సమయం: సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు..
    నవరస థియేటర్స్‌ ఆర్ట్స్, ఎండాడ మండల ప్రజాపరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో ‘నటులున్నారు జాగ్రత్త’ లఘునాటిక ప్రదర్శన నిర్వహించనున్నారు. రచన బళ్లా షణ్ముఖరావు, దర్శకత్వం పి.వి.ఆర్‌.మూర్తి. లఘు నాటిక విశేషమేమిటంటే..నాటకమంటే తెలియని పిల్లలు ప్రదర్శన ఇవ్వటం.  
    ‘కన్యాశుల్కం’(ప్రహసనం)..
    రచన..కందుకూరి వీరేశలింగం, దర్శకత్వం..చలసాని కష్ణప్రసాద్‌
    ప్రదర్శన సమయం సాయంత్రం 4.30 గంటల నుంచి..
    19వ శతాబ్ద తొలిరోజుల్లోని సంఘటనల సమాహారం. ఆడపిల్లలు రజస్వల కాకముందు అంగట్లో అమ్ముకునే రోజులవి.  ఆ రోజుల్లో ఆడపిల్లలే పంట. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అగ్రహారాల్లో జరుగుతున్న ఈ దురాచారాలను రూపుమాపేందుకు నవయుగ వైతాళికుడు కందుకూరి విరేశలింగం ప్రహసనం రచించారు. 15 నిమిషాల నిడివిలో నిర్వహించనున్న ప్రహసనంలో అమ్ముకునేవాడు..కొనుగోలు చేసేవాడు..కందుకూరి పాత్రలో మరొకరు ముగ్గురు క్యారెక్టర్లతో ప్రదర్శన ఉంటుంది. మధురవాడ సుదర్శన కల్చరల్‌ అసోసియేషన్‌ కళాకారులు దీనిని ప్రదర్శిస్తారు.l
    ధ్వన్యనుకరణ (మిమిక్రీ)..
    సమయం..సాయంత్రం 4.50 గంటల నుంచి..
    నగరానికి చెందిన సీనియర్‌ మిమిక్రీ కళాకారుడు వై.కె.రాజు ధ్వన్యనుకరణ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 1800కు పైగాప్రదర్శనలిచ్చారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ పథకాలపై ప్రచార రూపంలో మిమిక్రీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సినీ, రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతల వాయిస్‌..డ్యాన్స్‌ రూపంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. జోక్స్‌..ప్రకటనలు..సన్నివేశాలను మిమిక్రీ ద్వారా తెలియజేయనున్నారు. పేరడీ పాటలు, మిమిక్రీతో డ్యాన్స్‌లు కూడా చేయనున్నారు. 
    స్వాగతం నాటిక ప్రదర్శనl
    సమయం సాయంత్రం 5 గంటలకు..
    కె.వి.మెమోరియల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాగతం నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన బి. రామకష్ణ, దర్శకత్వం పి.శివప్రసాద్‌. కళల కోసమే స్వాగతం నాటిక ప్రేక్షకులను అలరిస్తుంది.
     
    మూకాభినయం..
    సమయం సాయంత్రం 6.45 గంటల నుంచి..
    విజయనగరానికి చెందిన ఆదయ్య మాస్టారు ముకాభినయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో ఫేమస్‌. చిన్నదాని సింగారం, వెయిట్‌ లిఫ్టింగ్‌ అంశాలపై మైమ్‌ ప్రదర్శన. 
    65 మంది కళాకారుల ‘అశ్శరభ శరభ’ 
    విజయవాడ మహేశ్వరి ప్రసాద్‌ యంగ్‌ «థియేటర్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన 65 మంది కళాకారులతో రెండున్నర గంటల పాటు ‘అశ్శరభ శరభ’ సాంఘిక నాటకం ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా ఆరు నంది అవార్డులు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక కళాపరిషత్‌లో ఏడు అవార్డులు పొందిన సాంఘిక నాటకం. రచన ఎన్‌.ఎస్‌. నారాయణబాబు, దర్శకత్వం వాసు, సారథ్యం రాంపిళ్ల మోహనకష్ణ. ఇది ఓ పాపాయి కథ. కన్నె కథ. ఓ కూతురు..ఓ అక్క..ఓ భార్య..ఓ తల్లి కథ. మొత్తంమీద ఒక మహిళా/స్త్రీమూర్తి కథ. స్త్రీ శక్తిని దుర్నిరీక్ష్యంగా వెలిగించే తూర్పు కోసం..స్త్రీ మూర్తిని సాటి మనిషిగా పరిగణించే మార్పు కోసమే. స్త్రీ మూర్తిని మహోన్నతంగా దర్శించి, ఆవిష్కరించిన మహిళా నాటకం. మహిళా లోకాన్ని ఆదుకునే మహాద్భుత తరానికి ఆవాహనగా నిలవనుంది. 
    నాటకం సారాంశం 
    లక్ష్మి అనే వివాహిత కోమాలో పడి ఉంది. అమె ఒంటికి నిప్పంటించుకొని చావబోయిందని పోలీసులు ధ్రువీకరిస్తారు. అయితే ఆమెను భర్తే చంపబోయాడని లక్ష్మి తండ్రి, తమ్ముడు గ్రహిస్తారు. ఆశక్తుడైన తండ్రి నిలదీయలేకపోతాడు. స్వార్థపరుడైన తమ్ముడు మిన్నకుండిపోతాడు. ఆస్పత్రి బర్న్స్‌ వార్డులో దయనీయంగా ఉన్న లక్ష్మి శరీరం నుంచి ఆత్మ వెలుపలికి వచ్చి కాలిపోయిన తన శరీరాన్ని చూసుకొని ప్రస్తుత తన నిస్సహాయతను తెలుసుకుని ఏడుస్తుంది. ఆమెకు తన జీవితంలో కొన్ని సంఘటనలు, స్మతులు, తలపుకొస్తాయి. ఆ తలపుల్లో ఆమె జీవితం ఆవిష్కతమవుతుంది. లక్ష్మిది ఆత్మహత్యా ప్రయత్నంగా చిత్రీకరించి భర్త రాజు జనాన్ని నమ్మిస్తాడు. ఇంకా చావదేమిటన్న అసహనంతో ఏ క్షణంలోనైనా చస్తుందన్న నమ్మకంతో దొంగ ఏడ్పులు, విచారం నటిస్తూ హాస్పటల్‌కు వస్తుంటాడు. చివరకు లక్ష్మి చనిపోతుంది. అమె భర్త, హంతకుడైన రాజు నిశ్చితంగా ఉంటాడు. గతంలోనూ..ఇప్పుడూ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తున్న అభాగ్య వనితలకు న్యాయం చేయలేకపోతున్న సమాజం నుంచి వచ్చే కొత్త తరం కోసమే ఈ నాటకం. 
    రంగస్థలమే నా ప్రాణం
    నాటకం మంచిని బోధిస్తుంది. విశ్రాంతిని కలిగిస్తుంది. కష్టాన్ని మరిపిస్తుంది. వినోదాన్నిస్తుంది. సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తుంది. ‘రంగస్థలమే నా ప్రాణం. రంగస్థలమే నా ఊపిరి. రంగస్థల కళాకారులగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇప్పటి వరకు 500కు పైగా వివిధ సంస్థలతో విభిన్న సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాం.  వీలైనంతగా నాటక రంగానికి సేవలందించటమే రంగసాయి నాటక సంఘం లక్ష్యం.
    – బాదంగీర్‌ సాయి, రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement