రాజకీయ నేతల ప్రచారాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుండటం సహజమే. అయితే ఇటువంటివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. వీటిని చూసిన జనాలు నవ్వుకుంటుంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఉదంతమొకటి చోటుచేసుకుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. సియోని జిల్లాలోని లఖ్‌నాడన్ అసెంబ్లీలోని ధనోరా గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. రాహుల్ రాకకు స్థానిక నేతలు వేదికతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతలో చోటుచేసుకున్న ఒక పొరపాటు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది.
రాహుల్ గాంధీ సభకు ఒకరోజు ముందు వేదికపై మెయిన్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌లో కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ నేతల ఫొటోలను ముద్రించారు. ఇక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగింది. కాంగ్రెస్ నేతలతో కూడిన ఆ బ్యానర్‌లో బీజేపీ కేంద్ర మంత్రి, పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి ఫగ్గన్ సింగ్ కులస్తే ఫొటో ముద్రితమయ్యింది. కొద్దిగా ఆలస్యంగా దీనిని గుర్తించిన స్థానిక కాంగ్రెస్ నేతలు.. ఫగ్గన్ సింగ్ కులస్తే ఫొటోపై మరో కాంగ్రెస్ నేత ఫొటో అతికించి, ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment