Madhya Pradesh Minister Collapses On Stage During Independence Day - Sakshi
Sakshi News home page

వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి

Published Tue, Aug 15 2023 2:56 PM | Last Updated on Tue, Aug 15 2023 3:30 PM

Madhya Pradesh Minister Collapses On Stage During Independence Day - Sakshi

భోపాల్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్‌ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు. 

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'హర్ గర్‌ తిరంగ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. 

నేడు రాష్ట్ర ప్రజలందరికి మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. తివర్ణ జెండాను ఎగురవేసి, చురుకుగా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు.. స్పీకర్ గిరీష్ గౌతమ్‌ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.    

ఇదీ చదవండి: వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement