Minister Berth
-
మోదీ నూతన క్యాబినెట్లో అనుప్రియ పటేల్
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నేడు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్నాదళ్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్ మోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ అనుప్రియా పటేల్ ఎవరు?అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 1981 ఏప్రిల్ 28న జన్మించారు. ‘అప్నా దళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనుప్రియ తన విద్యను లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఈసారి టికెట్ ఇచ్చింది. అనుప్రియ పటేల్ 37,810 ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి రమేష్ చంద్ బింద్‌పై విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పటేల్ వరుసగా మూడోసారి ఇక్కడ నుంచి విజయం సాధించారు. గతంలో అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలుపొందారు.వెనుకబడిన కుర్మీ వర్గానికి చెందిన ప్రముఖ నేత, అప్నా దళ్ వ్యవస్థాపకుడు, దివంగత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్. ఈ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల తర్వాత మూడవ అతిపెద్ద పార్టీ. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆమె ‘అప్నాదళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబయి: దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు కాకరేపుతున్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది. ఉల్లి ధరను కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ఉల్లికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనలేనివారు కొన్నాళ్లు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని అన్నారు. 'రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే సమస్య ఏమీ ఉండదు. కొనలేనివారు ఓ నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక్కసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుంది. మరికొన్నిసార్లు రూ.2000 వరకు పెరుగుతుంది. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.' అని చెప్పారు. కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్‌సెల్ మార్కెట్‌తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు! -
యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..!
బెంగళూరు: భారత్‌లో యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ డిజిటల్, ట్రాన్స్‌పోర్టు మంత్రి విస్సింగ్ ప్రశంసలు కురిపించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ పేమెంట్స్ వాడటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతటి సులభతర విధానాన్ని భారతీయులందరూ వాడుతున్నారని పేర్కొంటూ జర్మన్ ఎంబసీ తన ట్వీట్టర్(ఎక్స్ )లో పేర్కొంది. మిస్సింగ్ కూరగాయలు కొని, పేమెంట్స్ చేస్తున్న వీడియోను పంచుకుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ గణవిజయం సాధించిందని మిస్సింగ్ అన్నారు. సెకన్ల కాలంలోనే చెల్లింపులు చేసుకునే విధానంపై ఆయన ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. సులభతరంగా చెల్లింపులు చేసుకునే యూపీఐ పేమెంట్స్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించారు. One of India’s success story is digital infrastructure. UPI enables everybody to make transactions in seconds. Millions of Indians use it. Federal Minister for Digital and Transport @Wissing was able to experience the simplicity of UPI payments first hand and is very fascinated! pic.twitter.com/I57P8snF0C — German Embassy India (@GermanyinIndia) August 20, 2023 జర్మన్ ఎంబసీ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందించారు. యూపీఐ పేమెంట్స్‌లో భాగం అయినందుకు మిస్సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత డిజిటల్ విప్లవంపై స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు. యూపీఐ ప్రపంచవ్యాప్తంగా మారింది.. ఇందులో జర్మనీ ఎప్పుడు చేరుతుందని ప్రశ్నించారు. యూపీఐ అనేది భారత్‌లో వేగవంతంగా చెల్లింపులు చేసుకునే డిజిటల్ విధానం. ఇందులో శ్రీలంక, సింగపూర్, ఫ్రాన్స్ భాగం అయ్యాయి. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి
భోపాల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు. एमपी विधानसभा के अध्यक्ष गिरीश गौतम को मऊगंज में स्पीच देते हुए आया चक्कर, सुरक्षाकर्मियों ने संभाला @NavbharatTimes #NBTMP #MPNews pic.twitter.com/4VGlyux9Nc — NBTMadhyapradesh (@NBTMP) August 15, 2023 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'హర్ గర్ తిరంగ అభియాన్' కార్యక్రమంలో భాగంగా సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. నేడు రాష్ట్ర ప్రజలందరికి మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. తివర్ణ జెండాను ఎగురవేసి, చురుకుగా వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు.. స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. रायसेन में परेड सलामी के दौरान चक्कर खा कर गिरे MP के स्वास्थ्य मंत्री Dr. Prabhuram Choudhary। #PrabhuramChoudhary #IndependenceDay2023 #IndependenceDay #raisen #Madhyapradesh #flaghosting @DrPRChoudhary pic.twitter.com/jsLsVYACfk — New India Live (खबर सातों पहर) (@Newindialive24) August 15, 2023 ఇదీ చదవండి: వారి వాహనాలపైనే త్రివర్ణ పతాకం రెపరెపలు.. కాదని మరొకరు ఈ పనిచేస్తే.. -
‘కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు’
సాక్షి, జనగామ: ‘పార్టీలో పదవులు రాలేదని చీటికిమాటికి కొట్లాటలు వద్దు. ఉద్యమ సమయం నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన. అయినా నిన్నకాక మొన్న టీఆర్ఎస్లో చేరిన వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీనికి నేనేమైనా కొట్లాట చేశానా? అన్నింటికీ అధినేత సీఎం కేసీఆర్ ఉన్నారనే భరోసా ఉంది’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట, పాలకుర్తి, ఉప్పల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్‌ను నమ్ము కోవడంతో జనగామ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. మనకు మనం మనస్పర్థలకు వెళ్లి, పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని హితవు పలికారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పినోళ్లకే పథకాలు వస్తాయని, కండువా కప్పుకుంటేనే డబుల్ బెడ్రూం ఇల్లు దక్కు తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు. -
స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇవ్వొద్దు
కేసీఆర్‌కు టీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ వినతి హైదరాబాద్: ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు కేటాయించిన భూమి నుంచి దాదాపు 700 ప్లాట్లను సీమాంధ్ర ఉద్యోగులకు అమ్ముకున్న ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇవ్వవద్దని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె,చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం అందజేసినట్టు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. శుక్రవారం కేసీఆర్‌ను కలిసిన అనంతరం వెంకటేశ్వర్లు విలేకరులతో వూట్లాడారు. ప్రభుత్వం గచ్చిబౌలిలో తెలంగాణ ఉద్యోగులకు 160 ఎకరాలు, సీమాంధ్ర ఉద్యోగులకు 190 ఎకరాలు కేటాయిస్తే స్వామిగౌడ్.. హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా భూముల కేటాయింపులో అవకతవకలకు పాల్పడి కోట్లు దండుకున్నారని ఆరోపించారు