కేసీఆర్‌కు టీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్: ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు కేటాయించిన భూమి నుంచి దాదాపు 700 ప్లాట్లను సీమాంధ్ర ఉద్యోగులకు అమ్ముకున్న ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇవ్వవద్దని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె,చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం అందజేసినట్టు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. శుక్రవారం కేసీఆర్‌ను కలిసిన అనంతరం వెంకటేశ్వర్లు విలేకరులతో వూట్లాడారు. ప్రభుత్వం గచ్చిబౌలిలో తెలంగాణ ఉద్యోగులకు 160 ఎకరాలు, సీమాంధ్ర ఉద్యోగులకు 190 ఎకరాలు కేటాయిస్తే స్వామిగౌడ్.. హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా భూముల కేటాయింపులో అవకతవకలకు పాల్పడి కోట్లు దండుకున్నారని ఆరోపించారు
స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇవ్వొద్దు
Published Sat, May 31 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement