Swami goud
-
బీజేపీకి మరో షాక్.. స్వామిగౌడ్ రాజీనామా.. టీఆర్ఎస్లో చేరిక
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యా గౌడ్, దాసోజ్ శ్రవణ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు మరో కీలక నేత తిరిగి టీఆర్ఎస్లో గూటికి చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్‌గా కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. బండి సంజయ్‌కు ఈ మేరకు రాజీనామా లేఖను పంపారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే దాసోజు శ్రవణ్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించడం లేదని, అది తనకు బాధ కల్గించిందని స్వామిగౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా బీసీల పట్ల ఆ పార్టీ తీరు ఆక్షేపణీయమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్న స్వామిగౌడ్.. 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014లో జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే 2020లో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక రెండేళ్లకే బయటకు వచ్చారు. చదవండి: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు -
‘నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ తిలోదకాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతకు మూలమైన నీళ్లు–నిధులు–నియామకాల విషయంలో తీవ్ర అన్యా యం జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకో వడం లేదని శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ ధ్వజమెత్తారు. కమీషన్ల పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని, గడీల పాలన తో కుటుంబపాలనకే పరిమితమైందని మండిపడ్డారు. ఈ అంశాలన్నీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకే ఈ నెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నారని వివరించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్ డా.జి.మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్‌తో కలిసి స్వామిగౌడ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్‌ల విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు నెలకొన్నాయని డీకే అరుణ విమర్శించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉండగా, తక్కువ నీటి వాటాకు కేసీఆర్ ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు. ‘ఉద్యమ నిర్మాణాల్లో కీలకభూమిక పోషించాలి’ సాక్షి, హైదరాబాద్: ప్రజాఉద్యమాల నిర్మాణం, సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక భూమిక పోషించాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. సామాన్యులు, కష్టజీవులకు అండగా నిలుస్తూ సమస్యలపై తీవ్రస్థాయి ఉద్యమాలు చేపట్టి పార్టీపట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచాలని సూచించారు. మంగళవారం ఆయన నగరానికి వచ్చిన సందర్భంగా మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉద్యమకార్యాచరణ, విస్తరణపై చర్చించారు. ప్రధాని మోదీ రైతు, కారి్మక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక నల్లచట్టాలను తీసుకొచ్చారని రాజా ధ్వజమెత్తారు. ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది: చాడ తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగిందని చాడ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోలేదని, పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడంలేదని అన్నారు. నగరంలోని సీఆర్ ఫౌండేషన్‌ను డి.రాజా, ఆయన సతీమణి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా సందర్శించారు. -
ఉద్యోగులకు అన్యాయం జరగదు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరగదని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆది వారం ఇక్కడి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఉద్యమనేత, సీఎం కేసీఆర్ వెంట ఉద్యమించిన అంశాలను ప్రస్తావించారు. స్వరాష్ట్రంలో ఉద్యోగులకు అన్యాయం జరగదని, ఉద్యోగుల సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండటం అదృష్టమన్నారు. ఇటీవలే డీఏ పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల కోసం ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటివారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో అర్హులైన వాటాదారులందరికీ ఇళ్ల స్థలా లు వస్తాయన్నారు. కేసీఆర్ కడుపులో తలపెట్టైనా, కాళ్లు పట్టుకునైనా ఇండ్లస్థలాలు ఇప్పిస్తామని భరో సా కల్పించారు. గతంలో విలువైన ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇండ్లస్థలాలు ఇప్పించామని, ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కోట్ల ధర పలుకుతోందని గుర్తుచేశారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి భూమి ఇచ్చినప్పటికీ, ఏపీ ఎన్జీవోల రాజకీయాలకు ఉద్యోగులు బలయ్యారన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేటాయించిన భూమి అన్యాక్రాంతం కాకుండా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిందన్నారు. కార్యక్ర మంలో టీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, బి.రేచల్, రామినేని శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
చేవెళ్ల టికెట్ ఎవరికో..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. రాజకీయ ఉద్ధండులు ఈ స్థానం నుంచి పోటీకి సై అంటున్నారు. హాట్‌సీట్‌గా మారిన ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీచేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇస్తే కదనరంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధంచేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు కూడా చేవెళ్ల టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గులాబీ ఖాతాలో ఉండడంతో ముఖ్యనేతలు ఈ సీటుపై దృష్టిసారించారు. మొన్నటి వరకు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అని విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి తెర మీదకు రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ నేత, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అవకాశమిస్తే చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నించినా ఆయనకు దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు ఆ స్థానాన్ని ఖరారు చేయడంతో స్వామిగౌడ్ వెనక్కితగ్గారు. ఈ సమయంలో ‘భవిష్యత్‌లో చూద్దాం’ అని స్వామిగౌడ్‌కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే ధీమాతో చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పట్నం’కు దక్కేనా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ స్థానం తనకేనని సంకేతాలిస్తున్న ఆయన.. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క గులాబీ గూటి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొండా కూడా బలమైన నేత కావడంతో టీఆర్ఎస్ నుంచి పటిష్ట క్యాడర్ ఉన్న మహేందర్‌రెడ్డినే బరిలోకి దించాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో స్వామిగౌడ్ పేరు తెరమీదకు రావడంతో టికెట్ కోసం పోటీ తప్పేలా లేదు. టికెట్ కేటాయింపుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతకు హామీ ఇచ్చినట్లు మహేందర్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద చేవెళ్ల టికెట్ అధికార పార్టీ నుంచి ఎవరికి దక్కుతుందో అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. -
మండలి ఎన్నికలకు కొత్త జాబితా
సాక్షి, హైదరాబాద్ : శాసనమండలి ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా రూపొందించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జాబితాపై సెప్టెంబర్ 2016లోనే రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. దీంతో పాత ఓటర్ల జాబితా పూర్తిగా రద్దయింది. మరో 6 నెలల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎన్నిౖMðన ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతుండటం, ఆలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సిన నేపథ్యంలో వచ్చే నెలలో ఓటర్ల న మోదుకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలోనే ప్రక్రియ పూర్తి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిౖMðన శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ పదవీకాలం వచ్చే ఏడాది పూర్తవనుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి.. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా రిటైర్‌అవుతున్నారు. ఈ స్థానాలకు జనవరి లేదా ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కొత్తగా నమోదు చేసుకుంటేనే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కొత్తగా నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కు ఉంటుంది. ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేళ్లు దాటిన వారు ఓటు నమోదు చేసుకోవాలి. కొత్తగా ఓటర్ల నమోదు చేసుకోవా లని వచ్చే నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరులో ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. స్వామిగౌడ్ అనాసక్తి! వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ పోటీచేయడానికి అనాసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన తాను ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తానని ఆయన విశ్వాసంతో ఉన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు చంద్రశేఖర్‌గౌడ్ సన్నిహితులు చెబుతున్నారు. కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేషన్ చైర్మన్ చిరుమిళ్ల రాకేశ్‌కుమార్ పేర్లు కూడా టీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ పేరూ టీఆర్ఎస్ పరిశీలించే అవకాశం లేకపోలేదు. -
నేడు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోస్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం జిల్లా యంత్రాంగం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేస్తారు. మంత్రి మహేందర్‌రెడ్డి శుభాకాంక్షలు.. జిల్లా ప్రజలకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేదల దరికి చేర్చాలని పిలుపునిచ్చారు. -
బీసీ నోట్‌బుక్.. బహుజనులకు దిక్సూచి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని సామాజిక న్యాయాంశాలను, వివిధ బీసీ కమిషన్ల వివరాలను విశ్లేషిస్తూ పుస్తకాన్ని ప్రచురించడంపట్ల స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలంగాణ బీసీ కమిషన్‌ను అభినందించారు. శనివారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ‘బీసీ నోట్‌బుక్’పుస్తకాన్ని ఆవిష్కరించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ప్రయోజనాలపై బీసీ కమిషన్ చక్కని విశ్లేషణలతో తీసుకొచ్చిన ‘బీసీ నోట్‌బుక్’ బహుజన సామాజిక వర్గాలకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం ఆంగ్ల భాషలో ఉండటం వల్ల ఇన్నాళ్లుగా బహుజన సామాజిక వర్గాలకు అందుబాటులో లేదన్నారు. జాతీయ, రాష్ట్రాల బీసీ కమిషన్ల వివరాలు, నివేదికలను అర్థమయ్యే విధంగా ప్రచురించడం వల్ల బహుజన సామాజిక వర్గాలు చైతన్యం కావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీసీ నోట్‌బుక్‌ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు, పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు అందజేయాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ బీసీలకు ఈ పుస్తకం ఒక కరదీపికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు, ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. -
సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ్యత్వం రద్దుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం తాలూకు మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీని 22న సీల్డ్ కవర్లో అందజేయాలని గతంలో అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. దీనిపై గురువారం విచారణ జరుగగా, వీడియోలు ఇంకా సిద్ధం కాలేదని, మరికొంత సమయం కావాలని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ నెల 27వ తేదీన ఈ కేసుకు సంబంధించిన సీడీలను సమర్పించి కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, అలంపూర్ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లుగా పేర్కొంటూ రాష్ట్ర న్యాయ, శాసన వ్యవహారాల శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ విషయంగా ఆరు వారాల పాటు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
స్వామిగౌడ్ డ్రామాలు ఆడుతున్నారు
సాక్షి, వనపర్తి: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ డ్రామా లాడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో 11 మంది కాంగ్రెస్ సభ్యులపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ జాబితాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా ఉండగా ఆయన మంగళవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర అని ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజూ గొడవ చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విషయాన్ని సీఎం గుర్తించాలని సూచించారు. కేసీఆర్ సర్కారుకు ఇదే చివరి బడ్జెట్ అని ఈ బడ్జెట్ లో జరిగిన లోపాలపై కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు. -
మద్యం తాగలేదు.. చైర్మన్‌కు గాయం కాలేదు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్టు అయింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో గవర్నర్ లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెడ్‌ఫోన్ విసిరేయడం.. అదికాస్తా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలి కంటికి స్వల్పగాయం కావడం.. తీవ్ర దుమారం రేపింది. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు తమ సభ్యులపై వచ్చిన ఆరోపణలను, అధికార పార్టీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. శాసనసభలో ప్రతిపక్ష నేత, పీసీసీ సీనియర్ నేత జానారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. కాంగ్రెస్ సభ్యులెవరూ మద్యం తాగి.. అసెంబ్లీకి రాలేదని, మద్యం తాగి సభకు వచ్చారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన ఖండించారు. సభలో తమ ఎమ్మెల్యేల పట్ల మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, తాము ప్రజాస్వామికంగానే సభలో నిరసన తెలిపామని ఆయన చెప్పారు. మరో సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభలో అసలు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు గాయమే కాలేదని అన్నారు. ఆయన బయటకు రాగానే గాయమైనట్టు చెప్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసునని అన్నారు. కనీసం పోడియం వద్దకు ప్రతిపక్ష సభ్యులను అనుమతించకపోవడం దారుణమని అన్నారు. స్పీకర్ వద్ద ఉండాల్సిన మార్షల్స్ తమ వద్దకు ఎందుకు వచ్చారని భట్టి ప్రశ్నించారు. -
అసెంబ్లీలో హెడ్సెట్ విసిరిన కోమటిరెడ్డి
-
క్షతగాత్రుడిని ఆదుకున్న మండలి చైర్మన్
- రోడ్డుపై పడిపోయిన బాధితుడు - ఆస్పత్రికి తరలించిన స్వామిగౌడ్ రాజేంద్రనగర్: రోడ్డు దాటుతున్న ఓ దినసరి కూలీని వేగంగా దూసుకువచ్చిన ఓ కారు ఢీకొట్టి ముందుకు వెళ్లింది. అదే దారిలో వెళ్తున్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వెంటనే స్పందించి తన కాన్వాయ్‌ని ఆపారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహదేవ్ (55) బతుకుదెరువు కోసం బండ్లగూడ ప్రాంతానికి వలస వచ్చాడు. దినసరి కూలీ గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో హైదర్షాకోట్ బృందావన్ బార్ సమీపంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానికంగా వాహనదారులు అటూ ఇటూ వెళ్తున్నారు తప్ప గాయపడ్డ మహదేవ్‌ను ఆస్పత్రికి తరలించలేదు. అదే సమయంలో ఈ రోడ్డులో వెళ్తు న్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఘట న చూసి తన కాన్వాయ్‌ని ఆపారు. ఢీకొట్టి వెళ్తున్న వాహనాన్ని ఆపాలంటూ ఆయన సెక్యూరిటీకి తెలపడంతో వారు ఎస్కార్ట్ వాహనంలో వెళ్లి కారును వెంబడించి ఆపా రు. గాయపడ్డ మహదేవ్‌ను స్వయంగా స్వామిగౌడ్ ఆటోలో బండ్లగూడలోని షాదన్ ఆస్పత్రికి తరలించారు. మహదేవ్ కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. -
సర్దార్ సర్వాయి పాపన్న త్యాగమూర్తి
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ హైదరాబాద్: బహుజనవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహరాజ్ అసమాన త్యాగమూర్తి అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఈ నెల 18న హైదరాబాద్ కిస్మత్పూర్లో వైభవోపేతంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ గౌడ సంఘం ప్రధానకార్యదర్శి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రారంభమైన పాపన్నగౌడ్ మహారాజ్ 366వ జయంతి వారోత్సవాలకు స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమగీతాల సీడీని, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వీరోచిత సంక్షిప్తచరిత్ర(1650-1709) పుస్తకం, గడప గడపకు జైగౌడ్ ఉద్యమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్కన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకుల్లో సర్వాయి పాపన్నది రెండోస్థానమని కొనియాడారు. పాపన్న కేవలం గౌడ కులస్తుల హక్కుల కోసమే కాకుండా బహుజనులందరి అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గురించి మాట్లాడుకోవడమేకాకుండా, ఆయన నుంచి స్ఫూర్తిని కూడా పొందాలని అన్నారు. పాపన్న చరిత్ర గౌడ కులస్తులకే తెలియనప్పుడు ఆయన విగ్రహాన్ని గోల్కొండ కోటపై ఏర్పాటు చేయాలని, ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఎలా అడుగుతామని ప్రశ్నించారు. కులం పేరును రుబాబుగా తన పేరు చివరన పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికవృత్తిని కాపాడుకోవాలని, దీనిలో భాగంగా హరితహారంలో పెద్దఎత్తున ఈత, తాటి చెట్లను గ్రామగ్రామాన నాటాలని సూచించారు. తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు రాజకీయంగా ముందుండాలని పిలుపునిచ్చారు. నిరుపేద గౌడ విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ సంస్థను నెలకొల్పనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మనరూప రియల్ ఎస్టేట్స్ అధినేత మద్దెల రమేష్‌బాబుగౌడ్, తెలంగాణ గౌడ సంఘం గౌరవాధ్యక్షుడు బండి నర్సాగౌడ్, అధ్యక్షుడు ఈడ శేషగిరిరావు, ఉపాధ్యక్షులు కాశీనాథ్‌గౌడ్, గౌడ ప్రముఖులు రఘునందన్ గౌడ్, ఉపేందర్‌గౌడ్ పాల్గొన్నారు. -
వెంకటేశ్వరస్వామి ఆలయంలో మండలి చైర్మన్ పూజలు
నల్లగొండ జిల్లా హాలియా మండలం నారపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు నోముల నర్సింహయ్య తదితరులు ఉన్నారు. -
'ఫిబ్రవరి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల చేత గురువారం ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్య పరిపూర్ణం అయిందని తెలిపారు. ఇప్పుడు మండలిలో 40 మంది ఎమ్మెల్సిలు ఉన్నారని తెలిపారు. -
టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్సీల ప్రమాణం
హైదరాబాద్: ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నూతన ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. పురాణం సతీష్, భూపతి రెడ్డి, భాను ప్రసాద్, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కొండా మురళి, లక్ష్మినారాయణ ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. -
మండలిలోనూ అదే తీరు
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ అంశంపై శాసనమండలిలోనూ గందరగోళం చెలరేగింది. దీంతో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఒక బీజేపీ ఎమ్మెల్సీని ప్రస్తుత సమావేశాల కాలానికి సస్పెండ్ చేశారు. సోమవారం మండలి ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, ఆకుల లలిత పోడియం వద్ద నిరసనలు చేపట్టారు. రైతులను ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విపక్ష నేత షబ్బీర్ అలీ, బీజేపీ సభ్యుడు రామచంద్రరావు తమ స్థానాల నుంచే ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని, సభలో ప్లకార్డులను ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని చైర్మన్ స్వామిగౌడ్ కోరారు. రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర ్యలు తీసుకుంటోందని, కానీ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు మరింతగా నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో సభను చైర్మన్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. విరామం అనంతరం కొంతసేపు ప్రశ్నోత్తరాలు సజావుగానే సాగాయి. అంతకుముందు మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన విపక్ష సభ్యులు తిరిగి సభలోకి వచ్చి... నిరసనలు మొదలుపెట్టారు. కూర్చోవాలని చైర్మన్ సూచించినా... వారు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయా సభ్యుల సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాలన్న చైర్మన్ సూచన మేరకు మంత్రి తుమ్మల... ఐదుగురు కాంగ్రెస్, ఒక బీజేపీ సభ్యుడి పేర్లతో తీర్మానం పెట్టారు. దానిని ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
పట్టభద్ర ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన ఇద్దరు ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్ఎస్), రామచందర్‌రావు (బీజేపీ) సోమవారం ప్రమాణ స్వీకారంచేశారు. శాసనమండలి జూబ్లీహాలులో మండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తొలుత గన్‌పార్కులోని అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మండలికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రెడ్డితో స్వామిగౌడ్,ఉదయం 11.33 గం టలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ‘టీఆర్ఎస్ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై, ఐనె తిక పొత్తులతో ప్రయత్నించాయి. కానీ, పట్టభద్రు లు టీఆర్ఎస్పై నమ్మకంతో నన్ను గెలిపిం చారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..’ అని రాజేశ్వర్‌రెడ్డి ఆ తర్వాత మీడియాతో అన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పల్లా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, ఎంపీ జితేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అనంతరం బంజారాహిల్స్‌లోని కళిం గ భవన్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సన్మానించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రామచందర్‌రావు వెంట బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వచ్చారు. రామచందర్‌రావు ఉద యం 10.45 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ‘నన్ను గెలిపించినవారి రుణం తీర్చుకుంటా. నిరుద్యోగుల అంశాలను మండలిలో ప్రస్తావిస్తా. ప్రజలపక్షాన పోరాడుతా..’ అని పేర్కొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలసి గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. -
'స్పీకర్ ప్రతిపక్షాన్ని ఆదరించాల్సిందే'
ప్రతిపక్షం లేకుండా చట్టసభను నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. స్పీకర్ దృష్టి ఎల్లప్పుడూ ప్రతిపక్షం వైపే ఉండాలని, వారు లేవనెత్తే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం రాజేంద్రనగర్‌లోని పోలింగ్ కేంద్రంలో స్వామిగౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ శాసన సభలో అధికార పక్షంవారే ప్రశ్నించి, మళ్లీ అధికార పక్షం వారే సమాధానాలు చెప్పడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగదని ఆయన వ్యాఖ్యానించారు. -
బంగారు తెలంగాణకు అందరూ సహకరించాలి: స్వామిగౌడ్
హిమాయత్‌నగర్: బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో పాత్రికేయులు కూడా కీలక పాత్రే పోషించారన్నారు. శనివారం హిమాయత్‌నగర్‌లో ‘లిబర్టీ మీడియా సెంటర్’ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సగటు మనిషి ఆశలు, ఆలోచనలకు వారధిగా...లిబర్టీ మీడియా సెంటర్ ఉండాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్రోద్యమం సమయంలో సమాచారం బార్బర్ షాపుల్లో దొరికేదని, వార్తల కోసమే బార్బర్ షాపులకు వెళ్లేవారని గుర్తుచేస్తూ...సామాన్యుడి గళాన్ని, ఆవేదన వ్యక్తీకరణకు ఇలాంటి మీడియా సెంటర్లు కృషి చేయాలని సూచించారు. ప్రతి సమస్యపై లోతైన చర్చ జరగాలని, ఆ చర్చ సారాన్ని బంగారు తెలంగాణ సాకారానికి కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం దగ్గరకు తీసుకుపోవాల్సిన బాధ్యతకూడా మీడియా సంస్థలపై ఉందని గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్ ఉన్నట్లే ఓసీల్లో అత్యంత దుర్భర జీవితాలను అనుభవించేవారూ ఉన్నారని, అలాంటి వారిని గుర్తించాల్సిన బాధ్యత పభుత్వాలతోపాటు మీడియా పైనా ఉందన్నారు. అవసరమైతే 10 సంవత్సరాలు వయోపరిమితి సడలించి నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారని, నెల రోజుల్లో నోటిపికేషన్ విడుదల చేస్తామంటున్న టీపీఎస్సీ..ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని స్వామిగౌడ్ సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సి.విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మీడియా రోల్ చాలా గొప్పదన్నారు. ఒక సామాజిక కోణంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేసిన లిబర్టీ మీడియా సెంటర్ నిర్వాహకులు అభినందనీయులన్నారు. ‘స్వేచ్ఛ’ అవసరం: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సాధారణ పౌరుని నుంచి ఉన్నతస్థాయి వ్యక్తి వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైందని, ఆ భావ వ్యక్తీకరణకు మీడియాది ప్రముఖమైన భూమిక అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మీడియా అన్నివేళలా ప్రజల పక్షాన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు, బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షులు జి.రామన్‌గౌడ్, సంఘ సేవకులు రెడ్డి వెంకటేశ్వరెడ్డి, బీజేపీ నగర నాయకులు కేశబోయిన శ్రీధర్, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి: స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. శనివారం బంజారా భేరి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీలు, లంబాడీలు, చెంచులు.. అంత రించి పోయే దశలో ఉన్న అవూయుక గిరిజన జాతుల అభివృద్ధి కోసం కంకణబద్ధులై పని చేస్తామన్నారు. గిరిజన గ్రామాలను పంచాయతీలను చేసి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీ జాతుల్లోని అన్ని తెగలవారం ఒక్కటి కాకపోతే జాతి క్షమించదని, ఏదీ సాధించలేమని అన్నారు. ప్రపంచంలో పన్నెండున్నర కోట్ల మంది మాట్లాడే భాష ఒక్క బంజారా భాషేనని చెప్పారు. హైదరాబాద్ పాలనాధికారాలు గవర్నర్‌కు కట్టబెట్టే ప్రయత్నాలు తిప్పికొడదామన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వం, పాలకుల కుట్రలో భాగమే పోలవరం అని చెప్పారు. 400 గూడేల జీవనం పోలవరంతో విచ్ఛిన్నం అవుతుందన్నారు. టీఆర్ఎస్ నేత నోముల నరసింహయ్య మాట్లాడుతూ మేధోమథనం ద్వారా అణగారిన వర్గాల వారికి సహాయం చేద్దామన్నారు. బంజారా జాతికి చెందిన ఆచార్యులందరికీ సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, గిరిజన విద్యార్థి నేతలు కృష్ణా నాయక్ పాల్గొన్నారు. -
దేశ చరిత్రను మార్చే శక్తి బీసీలకు ఉంది
అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి హైదరాబాద్: ఓబీసీలందరూ సంఘటితమై సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారమిక్కడి పద్మశాలి భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. బలమైన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, దీనికి ఓబీసీలు ముందుకు రావాలన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రను మార్చే శక్తి ఓబీసీలకు ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కుల కోసం తెగించి పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి, స్వామిగౌడ్, ఆర్.కృష్ణయ్యలను ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. -
2న మండలి చైర్మన్ ఎన్నిక
స్వామిగౌడ్ పేరు దాదాపు ఖరారు హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 1న నామినేషన్లు స్వీకరించి.. 2వ తేదీన చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. మండలికి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ను ఎన్నుకోవడం దాదాపు ఖాయమైపోయింది. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మె ల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్, టీడీపీలు కోరుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా మండలి చైర్మన్ ఎన్నికను పూర్తి చేయాలనే ఆలో చనలో ఉన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అనంతరం రాత్రికే చైర్మన్ ఎన్నికకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభంకానున్న శాసన మండలి సమావేశాల తొలిరోజునే చైర్మన్‌ను ఎన్నుకోను న్నారు. కాగా తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా టీఆర్ఎస్ నేత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ శాసనమండలి సమావేశాలు వచ్చేనెల 2న ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ సుమారు అరగంటపాటు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుచేయనున్న ప్రణాళికా, అభివృద్ధి సలహా బోర్డులపై చర్చించినట్టు తెలిసింది. -
మండలి డిప్యూటీ చైర్మన్‌గా స్వామిగౌడ్!
పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా స్వామిగౌడ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రివర్గంలోకి స్వామిగౌడ్‌కు మలిదశ మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందనుకుంటున్న తరుణంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్కు మండలిలో స్వామిగౌడ్‌తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పి.సుధాకర్ రెడ్డి, పి.నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి తదితరులు టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ కూడా సాంకేతికంగా టీఆర్ఎస్ సభ్యుడే. గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీలు త్వరలోనే టీఆర్ఎస్ కోటాలో చేరనున్నాయి. ఏప్రిల్ నాటికి స్థానిక సంస్థలు, పట్టభద్రుల నియోజకవర్గాలు 12 ఖాళీ అవుతున్నాయి. వీటిని ఉపయోగించుకుని శాసన మండలిపైనా పట్టు బిగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మండలిలో టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఉన్న స్వామిగౌడ్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీ పదవీ కాలం 2015 మార్చికి పూర్తి కానుంది. దీని ప్రకారం వచ్చే సంవత్సరం మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌కు అవకాశం కల్పించాలనే ముందుచూపుతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, చీఫ్‌విప్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఏనుగు రవీందర్ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావులో ఒకరిని చీఫ్‌విప్‌గా నియమించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
అన్నా.. పచ్చ కండువా కప్పుకో!
ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, స్వామిగౌడ్‌లకు అరికెల ఆఫర్ హైదరాబాద్: ‘ఏ రంగైతే ఏందన్నా... మా పార్టీ రంగు కండువా కప్పుకో’ అన్నట్టుగా శాసనమండలిలో టీడీపీ పక్ష నాయకుడు అరికెల నర్సారెడ్డి సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఆఫర్లు ఇచ్చి ఆకట్టుకున్నారు. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఎన్నికల ముందు కారెక్కిన పి.నరేందర్ రెడ్డి మండలిలో ప్రమాణం చేసి వెళ్తుండగా... చివరి వరుసలో కూర్చొన్న అరికెల నర్సారెడ్డి నవ్వుతూ తన మెడలోని పచ్చజెండా తీసి తీసుకోమన్నట్టుగా సైగలు చేశారు. దీంతో నరేందర్‌రెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు. అలాగే చివరలో మరో ఎమ్మెల్సీ స్వామి గౌడ్‌ను ప్రమాణం చేయాల్సిందిగా చైర్మన్ విద్యాసాగర్ పిలిచినప్పుడు.. ఆయన మెడలో టీఆర్ఎస్ కండువా లేదు. దాంతో కండువా ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డిని అడిగారు. ఇది గమనించిన అరికెల పచ్చ కండువా తీసి స్వామిగౌడ్‌కు ఆఫర్ చేశారు. అప్పటికే సుధాకర్‌రెడ్డి స్వామిగౌడ్‌కు కండువా ఇవ్వడంతో అది తీసుకొని ప్రమాణం చేశారు.