సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యా గౌడ్, దాసోజ్ శ్రవణ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు మరో కీలక నేత తిరిగి టీఆర్‌ఎస్‌లో గూటికి చేరారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్‌గా కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. బండి సంజయ్‌కు ఈ మేరకు రాజీనామా లేఖను పంపారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే దాసోజు శ్రవణ్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించడం లేదని, అది తనకు బాధ కల్గించిందని స్వామిగౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా బీసీల పట్ల ఆ పార్టీ తీరు ఆక్షేపణీయమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్న స్వామిగౌడ్.. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే 2020లో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక రెండేళ్లకే బయటకు వచ్చారు.
చదవండి: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్‌ఎస్‌లోకి తిరిగి వలసలు
Comments
Please login to add a commentAdd a comment