సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆయనకు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ బూర నర్సయ్యకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ డా.లక్ష‍్మణ్, ఈటెల రాజేందర్, రాంచందర్ రావు పాల్గొన్నారు.
అనంతరం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ విజయం ఖాయం అన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌దే అధికారమని జోస్యం చెప్పారు.
బీజేపీలో చేరిన అనంతరం బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్' నినాదం తనను ఆకర్షించిందని చెప్పారు. అందుకే కమలం గూటికి వచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కేవలం ఒక్కరిది కాదని అందరిదీ అని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయడమే తన లక్ష్యం అన్నారు.
చదవండి: కార్మిక సంఘం నాయకుడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. ఖర్గే ప్రస్థానం..
Comments
Please login to add a commentAdd a comment