Boora Narsaiah Goud
-
ప్రగతి పేరుతో భూసేకరణ.. పేద రైతులే టార్గెట్!
ఈమధ్య దక్షిణ కొరియాకు చెందిన షూ ఆల్స్ కంపెనీ తాము ఇక్కడ 300 కోట్లతో షూ కంపెనీ పెడతామనీ, అందుకు కావలసిన 750 ఎకరాల భూమి ఇస్తే 87 వేల మందికి ఉపాధి కల్పిస్తామనీ ప్రగల్బాలు పలికింది. తెలంగాణలో ఎకరం కోటి రూపాయలనుకున్నా 300 కోట్ల పెట్టుబడికి 750 కోట్ల విలువైన భూమి అడిగారన్నమాట. అదే విధంగా ఒక స్మార్ట్ హెల్త్ సిటీ పెట్టడానికి 5,000 ఎకరాలు కావాలని అర్జీ పెట్టింది ఇదే కంపెనీ. దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ కేవలం 5–10 ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. ఇది ‘చారణా కోడికి బారణా మసాలా’ అన్నట్లు ఉంది. ఇక ఈ మధ్య ప్రగతి పేరుతో భూసేకరణ చేయడం పేద, మధ్య తరగతి రైతుల పట్ల ఉరితాడులా పరిణమించింది.భూమి ధరలు పెరగటంతో చిన్న, సన్న కారు రైతులు ధనవంతులు అయ్యే సమయానికి, ప్రభుత్వమే భూ దోపిడీకి పాల్పడి ప్రజలను దారిద్య్రంలోకి నెడుతోంది. ఉన్నోడికి రవ్వంత పోయినా కొండంత లాభం వస్తే, లేనోడు రోడ్డున పడుతున్నాడు. ప్రభుత్వం ఎకరాకు ఇచ్చే పరిహారం, కనీసం గుంట ప్లాట్ కొనుక్కోవడానికి సరిపోవడం లేదు. ప్రగతి వలన భూముల విలువ పెరిగి వందల, వేల ఎకరాలు ఉన్న వారు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతున్నారు. ఒకసారి మార్కెట్ విలువ, ప్రభుత్వ పరిహారం విశ్లేషిస్తే... చౌటుప్పల్ దగ్గర ఎకరం 2 కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 10 లక్షలు; జహీరాబాద్ దగ్గర 1.5 నుండి 2 కోట్లు ఎకరానికి ధర ఉంటే 7–10 లక్షలు మాత్రమే ఇస్తోంది. ప్రభుత్వం భూస్వామిగా కాకుండా, ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టం చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) సేకరించిన భూమి ఎంత, అందులో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాటి వలన ఎంతమందికి ఉపాధి కల్గుతుంది వంటి వివరాలతో ఒక శ్వేతపత్రం (వైట్ పేపర్) విడు దల చేయాలి. కొత్తగా సేకరించే భూమి... పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల కొరకా లేదా పూర్తిగా ప్రజా అవసరాల కొరకా అనేది స్పష్టం చేయాలి. గతంలో ప్రభుత్వం వివిధ సంస్థలకు ఇచ్చిన భూమిలో ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం తేల్చాలి. ఇప్పటికే వివిధ సంస్థలు, వ్యక్తులు లేదా ట్రస్టులకు వివిధ ఉద్దేశాలతో కేటాయించిన భూమిలో వేరే వ్యాపారాలు, సంస్థలు నెలకొన్నా యేమో చూడాలి. భూములు సేకరించే ముందు, నిర్వాసితులు అవుతున్న ప్రజల, రైతుల ప్రయోజనాలనే ముఖ్యంగా ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి. ఆ భూముల వలన వచ్చే ప్రయోజనాలలో నిర్వాసితులకు సింహభాగం దక్కాలి. ఒక ప్రాజెక్ట్ లేదా రోడ్డు వచ్చినప్పుడు పరిసర ప్రాంతాలలో భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి, నిర్వాసితులకు కూడా ఆ లాభం దక్కేలా చూడాలి.ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని మొదట ఉపయోగించిన తర్వాత, కొత్త భూ సేకరణకు శ్రీకారం చుట్టాలి. అలాగే ఒక ప్రాజెక్టులో కేవలం ఎకరం, రెండు ఎకరాల భూమి ఉన్న రైతు సర్వం కోల్పోతే వారు రోడ్డున పడతారని గమనించాలి. అదే ఎక్కువ భూమి ఉన్నవారు కొంత పోయినా, మిగతా భూమి విలువ పెరగటం వలన వారికి లాభం కలుగుతుంది. అందువల్ల భూమిని కోల్పోయేవారు ఒక్కొక్కరు ఎంతెంత శాతం భూమిని కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలి. ఆ ప్రాతిపదికన పరిహార చెల్లింపు ఉండాలి.ప్రాజెక్టులలో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం నిర్మాణ వ్యయం రూ. 6,690 కోట్లు. ఇందులో రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమి 5,500 ఎకరాలు. రైతులకు చెల్లించిన మొత్తం కేవలం రూ. 250 కోట్లు మాత్రమే. రోడ్డుకు అటు, ఇటు ఉన్న రైతుల భూముల విలువ లక్షల కోట్లకు పెరిగింది. కాంట్రాక్టర్ లాభపడ్డాడు. ప్రభుత్వం 7,300 కోట్లకు అంటే ఏడాదికి 240 కోట్లకు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై సంవత్సరానికి రూ. 550 కోట్ల రాబడి ఉంది. మున్ముందు అది ఏడాదికి రూ. 1,000 కోట్లు దాటే అవకాశం ఉంది. అదే రిజిస్ట్రేషన్ విలువ ఇచ్చి, మార్కెట్ విలువ ప్రకారం ఆ కంపెనీలో నిర్వాసితులకు షేర్ ఇచ్చి ఉంటే, వచ్చే 30 సంవత్సరాలు నిర్వాసిత రైతులకు నెలకు కొంత పరిహారం అందేది. అలానే పారిశ్రామిక వాడలు, కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు నిర్వాసిత రైతులకు భూమి మార్కెట్ విలువ ప్రకారం షేర్ ఇవ్వడం వలన వారు కూడా ఆ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది.వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంకు ఉన్న కంపెనీల దగ్గర నుండి భూమిని సేకరించి వివిధ ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి ప్రత్యేకించి చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వడం వలన ఎవ్వరికీ నష్టం లేకుండా ప్రగతి సాగుతుంది. అలానే వారికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ లే ఔట్లలో ప్లాట్ కేటాయిస్తే న్యాయం జరుగుతుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక వెసులుబాట్లు, స్వయం ఉపాధికి లోన్లు... అవీ వడ్డీ రహిత రుణాలు అందించడం; ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత కోటా కేటాయించడం... ఇలా పలు విధాలుగా భూ నిర్వాసితులకు ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉంది. చదవండి: మంచి పనిని కించపరుస్తారా?బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులు (టీడీఆర్) లాంటివి ఇవ్వడం వలన వారికి అధికంగా ఆర్థిక సుస్థిరత కలుగుతుంది. జీహెచ్ఎమ్సీ పరిధిలో ప్రభుత్వం భూ సేకరణ చేసినప్పుడు, టీడీఆర్ ఇవ్వడం తెలిసిందే. అదే విధంగా భూ నిర్వాసిత కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువను కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా టీడీఆర్ ఇవ్వడం వలన వారికి లబ్ధి జరుగుతుంది. ఉదారణకు ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) కొరకు దాదాపు 9,000 ఎకరాలు కావాలి. ప్రస్తుతం ఏరియాను బట్టి మార్కెట్ విలువ ఎకరం రూ. 50 లక్షల నుండి రూ. 3 కోట్ల వరకు ఉంది. కానీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వేల్యూ మీదనే పరిహారం చెల్లిస్తుంది. దీని వలన రైతులు, ముఖ్యంగా సర్వం కోల్పోయే చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్ట పోతారు. వారికి పరిహారమే కాకుండా, టీడీఆర్ కూడా ఇస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది.చదవండి: కులరహిత వ్యవస్థకు తొలి అడుగుచాలా సందర్భాలలో చిన్న, సన్న కారు రైతులు, ముఖ్యంగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులే ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్నారు. వివిధ కంపెనీల పేరు మీద వేలాది ఎకరాలు ఉన్నాయి. వాటిలో పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదు. కేవలం పేద రైతులే టార్గెట్ కావడం బాధకారం. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.- డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి మాజీ ఎంపీ -
బీఆర్ఎస్, కాంగ్రెస్ పై బూర నర్సయ్య ఫైర్
-
అప్పు, సిప్పు, డప్పు తెలంగాణ మోడలా?: బూర
సాక్షి, హైదరాబాద్: అసలు తెలంగాణ మోడల్ అంటే ఏ మిటో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్‌చేశారు. ఈ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవి నీతా? లేదా అప్పు, సిప్పు, డప్పుకొట్టడమా? అని ఎద్దేవాచేశారు. మంగళవారం పార్టీ నేత హరిశంకర్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా అసలు తెలంగాణ తల్లి ఎక్కడ? ఏం చేశారు? తెలంగాణ తల్లి ఉన్నట్లా? లేనట్లా? కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ ముఖంలో గాంభీర్యం లేదని గాబరా కనిపిస్తోందన్నారు. కేంద్రంలో కేసీఆర్ లాంటి వారు అధికారంలోకి వస్తే దేశంలో ‘అబ్ కీ బార్ భ్రష్టచార్ సర్కార్’ ఏర్పడుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆయనకు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ బూర నర్సయ్యకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్, ఈటెల రాజేందర్, రాంచందర్ రావు పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ విజయం ఖాయం అన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌దే అధికారమని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరిన అనంతరం బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్' నినాదం తనను ఆకర్షించిందని చెప్పారు. అందుకే కమలం గూటికి వచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కేవలం ఒక్కరిది కాదని అందరిదీ అని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయడమే తన లక్ష్యం అన్నారు. చదవండి: కార్మిక సంఘం నాయకుడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. ఖర్గే ప్రస్థానం.. -
అందుకే టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్ బయటికి..
టీఆర్ఎస్ నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బయటికి రావడం ఆత్మగౌరవ ప్రకటనగా భావించాలి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర సాధారణమైంది కాదు. హైదరాబాదులో లాప్రోస్కోపిక్ సర్జన్‌గా మంచి పేరున్న ఆయన ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూనే... మరోవైపు డాక్టర్స్ సంఘ అధ్యక్షులుగా, తెలంగాణ జేఏసీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దాదాపుగా 200 మంది డాక్టర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఏర్పాడడానికి కారకులలో ఆయన ఒకరయ్యారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తరువాత జరిగిన ఎన్నికలలో బోనగిరి నుండి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి మేలు జరిగే పనులు చేశారు. అంతే కాకుండా యాదాద్రి గుడి పునఃనిర్మాణంలో ఆయన పాత్రను తక్కువగా అంచనా వేయలేము. గౌడ సామాజిక వర్గానికి కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించి, భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే గీతన్నలు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుండి కిందపడి చనిపోతే గతంలో ఉన్న రూ. 50,000 నష్టపరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచేలా చేసి బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో రెండవసారి జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ అగ్రకుల నాయకుల కుట్రల వ్యూహాలతో ఓడిపోయారు. ఆ తర్వాత నర్సయ్యకు టీఆర్ఎస్లో తగిన గౌరవం, ప్రాధాన్యం లభించలేదు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన టికెట్ ఆశించినా ఫలితం లేకపోయింది. ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో ఉన్న అణచివేత ధోరణిని నిరసిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది ముమ్మాటికీ సమర్థనీయమైన చర్య. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు) – డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్, హైదరాబాద్ -
బీజేపీలోకి ‘బూర’తో పాటు మరో ముగ్గురు?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల సమక్షంలో బుధవారం మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో పాటు మరికొందరు ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ (మాజీ ఎమ్మెల్యే నారాయణ్‌రావు సోదరుడు) కుమారుడు నరేశ్ ముదిరాజ్తో పాటు మహబూబ్‌నగర్‌కు చెందిన మరో నేత చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఇతర నేతలు హాజరు కానున్నారు. -
మునుగోడు సమస్యే కాదు.. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చా’
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదని, పార్టీ తనను వద్దనుకుంటుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం దొరకలేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు. మునుగోడు తనకు సమస్యే కాదని స్పష్టం చేశారు. హంపిలాంటి కుట్రదారుడిని తాను కాదని తెలిపారు. కేసీఆర్‌పై అభిమానంతో ఇప్పటి వరకు పార్టీలో ఉన్నానని.. అభిమానానికి, బానిసత్వానికి తేడా ఉంటుందని అన్నారు. కేటీఆర్ , హరీష్ రావు చేతుల్లో ఏమీ లేదని, వాళ్ల మనసులో కూడా అనేక బాధలు ఉన్నాయన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. టీఆర్ఎస్కు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఎంతో బాధతో టీఆర్ఎస్పార్టీకి రాజీనామా చేశానని... ఏ రోజు కూడా పదవి అడగలేదని తెలిపారు. ఎంపీగా ఉన్న సమయంలో అనేక పనులు చేశానని, పార్టీ పదవులు ఎలాంటివి తనకు అక్కర్లేదని, ప్రజల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. బూర నర్సయ్య గౌడ్ అవమానాన్ని భరిస్తాడు కానీ... ప్రజల సమస్యలను ఎత్తడంలో ఎప్పుడు కూడా వెనక్కి పోలేదని స్పష్టం చేశారు. చదవండి: అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లే: మంత్రి కేటీఆర్ -
టీఆర్ఎస్కు బూర రాజీనామా.. కేసీఆర్‌కు ఘాటుగా లేఖ
సాక్షి, హైదరాబాద్: భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ.. శనివారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2009 నుంచీ తెలంగాణ ఉద్యమంలో కొనసాగిన విషయాన్ని గుర్తు చేశారు. 2014లో భువనగిరి ఎంపీగా గెలిచినా.. 2019లో తన ఓటమికి పార్టీలో అంతర్గత కుట్రలు కూడా కారణమని ఆరోపించారు. తనను ఎంతగానో అవమానించినా ఇన్నాళ్లూ భరించానని, రాజకీయంగా వెట్టిచాకిరీ చేయలేకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తాను పైరవీలు చేసే వ్యక్తిని కాదని.. ప్రజల సమస్యలను వివరించే అవకాశం కూడా తనకు కల్పించలేదని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల సమస్యలను ప్రస్తావించిన తనపై అసహనం వ్యక్తం చేయడం ఓ ఉద్యమకారుడిగా ఎంతో బాధించిందన్నారు. లేఖలోని అంశాలు బూర నర్సయ్యగౌడ్ మాటల్లోనే.. బీసీలు వివక్షకు గురికావడం బాధాకరం ‘‘మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ అయిన నన్ను ఒక్కసారి కూడా సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలకు సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగాను. మునుగోడు టికెట్ బీసీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని అడగటం కూడా నేరమేనా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం. మీరంటే అభిమానంతో, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతతో ఎన్నో అవమానాలు భరించి పార్టీలో కొనసాగాను. కానీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. నాకు వ్యక్తిగతంగా అవకాశాలు రాకున్నా ఫర్వాలేదు. కానీ అట్టడుగు వర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చే అవకాశమే లేనప్పుడు పార్టీలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టిచాకిరీని ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. ఒక్క నిమిషం కలిసే అవకాశం ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమంలో రోజులు, నెలలు, ఏళ్లు గడిపిన సహచర ఉద్యమకారులు ఇప్పుడు కనీసం ఒక నిమిషం కేసీఆర్‌ను కలవాలన్నా.. తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రభుత్వం తరఫున పెట్టకపోవడం అందరినీ బాధిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర ప్రాంతాల వాళ్లు ఇక్కడ రొయ్యలు అమ్ముకోవచ్చు. కర్రీ పాయింట్స్ పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో, సచివాలయంలో మాత్రం తెలంగాణ ప్రజలే ఉంటారని అప్పట్లో ప్రజల చప్పట్ల మధ్య చెప్పాం. కానీ ఇప్పుడు తెలంగాణ కాంట్రాక్టర్ల ఏడాది టర్నోవర్ కలిపినా.. ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల టీడీఎస్ అంత కూడా ఉండడం లేదు.’’అని నర్సయ్యగౌడ్ లేఖలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: బీజేపీలోకి టీఆర్ఎస్ కీలక నేత -
Munugode Bypoll: నామినేషన్ టైమ్‌లో వెంటుండి.. అంతలోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీలోకి?
బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్! నేడు లేదా రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకి అవకాశం మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ బూర నర్సయ్యగౌడ్ పార్టీ ప్రచార కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని అసంతృప్తి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో విభేదాలూ కారణమంటున్న పార్టీ వర్గాలు... సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికలో టికెట్ ఆశించినా పార్టీ పట్టించుకోకపోవడం, పైగా ప్రచా ర కార్యక్రమాలకు దూరంగా పెట్టడంతో నర్సయ్యగౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే ఆయన టీఆర్ఎస్ ముఖ్యనాయకులకు ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లారని.. ఆ యన బీజేపీలో చేరడం లాంఛనమేనని రాజ కీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. శనివారంగానీ, ఆదివారంగానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో బూర నర్సయ్యగౌడ్ భేటీ అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే ఆయన చేరిక ఉంటుందని అంటున్నాయి. టికెట్ నిరాశ.. పట్టించుకోలేదనే అసంతృప్తి తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్స్ జేఏసీ కన్వీనర్‌గా బూర నర్సయ్యగౌడ్ కీలకపాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున భువనగిరి ఎంపీగా గెలిచారు. 2019లోనూ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత మునుగోడు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. వచ్చేసారి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మునుగోడులో బీసీ సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటం.. కాంగ్రెస్, బీజేపీల తరఫున రెడ్డి వర్గం అభ్యర్థులే బరిలో దిగడంతో టికెట్ తనకే దక్కుతుందని ఆశించారు. కానీ టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వడంతో తీవ్రంగా అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమ వివరాలను తనకు ఏమాత్రం చెప్పడం లేదంటూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిపైనే బహిరంగంగానే విమర్శలు చేశారు. బూర నర్సయ్యగౌడ్ అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్ పెద్దలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 7న తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ అయిన బూర నర్సయ్యగౌడ్.. కూసుకుంట్ల తీరుపై ఫిర్యాదులు చేశారు. సొంతపార్టీ నేతలను రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందిపెట్టారని వివరించారు. రెండు రోజుల్లో ఆయా అంశాలపై సర్దుబాటు నిర్ణయాలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు కూడా. దీనితో బూర నర్సయ్యగౌడ్ మెత్తబడినట్టు కనిపించారు. ఈ నెల 13న కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్‌తో కలిసి హాజరయ్యారు. నామినేషన్ తర్వాత నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ నిలబడ్డ వాహనంపైకి బూర నర్సయ్యగౌడ్‌ను పిలవకపోవడంతో మళ్లీ అసంతృప్తికి గురయ్యారని సమాచారం. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో ఏర్పడిన విభేదాలు, జిల్లా పార్టీలో అవమానాలు కూడా ఆయన పార్టీ వీడటానికి కారణంగా చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లడంతో.. బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం ఉదయం నుంచి టీఆర్ఎస్ నేతలెవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఇదే సమయంలో ఆయన ఢిల్లీకి వెళ్లడంతో బీజేపీలో చేరుతున్నారని వార్తలు వెలువడ్డాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌ను, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. శనివారంగానీ, ఆదివారంగానీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీ పెద్దలను కలిసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్లో ప్రవహించేది కాషాయ రక్తమే.. -
ప్రగతిభవన్‌కు మునుగోడు పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గరపడినా ఆ పార్టీలో అసంతృప్తి సద్దుమణగడం లేదు. ఉపఎన్నిక సంకేతాలు వెలువడింది మొదలుకుని కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ గళం విప్పిన నేతలు నామినేషన్ల స్వీకరణ మొదలైనా పట్టు వీడటం లేదు. కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన అసంతృప్త నేతలతో శనివారం ప్రగతిభవన్‌లో కీలక భేటీ జరిగింది. కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ అసంతృప్త నేతలను వెంట బెట్టుకుని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. నారాయణపూర్ ఎంపీపీ, మునుగోడు వైస్ ఎంపీపీ, పలువురు సర్పంచులు సహా సుమారు 70 మంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బంది పెట్టిన తీరును ఏకరువు పెట్టారు. తమపై కేసులు నమోదు చేయించడం, ఆర్థికంగా దెబ్బతీయడం వంటివీ చేశారని వివరించారు. ఉప ఎన్నిక వాతావరణం ప్రారంభమైనా తమకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నుంచి చేరికలకు ఒత్తిడి, ప్రలోభాలు వస్తున్నా టీఆర్ఎస్పై అభిమానంతో కొనసాగుతున్నామని.. పార్టీ ఇన్చార్జులుగా నియమితులైన నేతలు కూడా తమను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తాం మునుగోడు టీఆర్ఎస్ అసంతృప్త నేతల అభిప్రాయాలు విన్న కేటీఆర్, హరీశ్‌రావు రెండు, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసంతృప్త నేతలను కలుపుకొని వెళ్లాలని ప్రస్తుతం యూనిట్ ఇన్‌చార్జీ్జలుగా నియమితులైన నేతలకు సూచించినట్టు సమాచారం. అయితే అసంతృప్త నేతలు కేటీఆర్, హరీశ్‌లతో జరిగిన భేటీపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే సొంత దారి చూసుకుంటామనే సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. -
‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’!
సాక్షి, నల్గొండ: పార్టీకి నమ్మకస్తుడిగా పేరున్న బూర నర్సయ్య అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరుగా పేరుంది. అయితే ఇప్పుడు ఆ డాక్టరే పార్టీకి తలనొప్పిగా మారాడన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా ఖాళీగా ఉంటోన్న మాజీ ఎంపీ చూపు ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ సీటు మీద పడిందా? సౌమ్ముడిగా పేరున్న ఈ నేత పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఎందుకు మారాడు? చదవండి: కేసీఆర్ సర్కార్‌ను గవర్నర్ ఇరుకున పెట్టారా? మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిగా మారింది. నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేనంత మంది ఆశావాహులు మునుగోడులోనే ఉన్నారు. అందరినీ ఒప్పించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకే పార్టీ నాయకత్వానికి తలబొప్పి కట్టింది. అంతా సర్దుకుందని అనుకుంటున్న తరుణంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. పార్టీ నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటానంటూనే పార్టీ ఇబ్బందుల్లో పడేలా ఆయన వ్యవహార శైలి ఉందంటున్నారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికే మెజార్టీ ఓటు బ్యాంకు ఉందని.. ఆ వర్గాల నుంచి తాను టికెట్ అడగడంలో తప్పేంటని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. నెల క్రితం చౌటుప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మునుగోడులో ఎప్పుడూ రెడ్లు, వెలమలే ఎమ్మెల్యేలు కావాలా.. బీసీలకు అవకాశం ఇవ్వరా అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత సైలెంట్ అయినట్లు కనిపించినా మరోసారి మునుగోడు నియోజకవర్గంలోనే ప్రెస్ మీట్ పెట్టీ మరి తన మనసులో మాట బయట పెట్టారు. టికెట్ అడగడంతో పాటు ఏకంగా పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేయడంతో ఒక్కసారిగా కాకరేగింది. ఈ వ్యాఖ్యలు జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డిని ఉద్దేశించే అన్నారని చర్చ కూడా జరుగుతోంది. తనను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం లేదని... ఇలా ఎందుకు జరుగుతుందో జిల్లా మంత్రే వివరించాలనడాన్ని బట్టి చూస్తే ఓ ప్రణాళిక ప్రకారమే ఆయన పార్టీపై అసంతృఫ్తిని వెళ్లగక్కినట్లుందని టీఆర్ఎస్లోనే చర్చ సాగుతోంది. భువనగిరి ఎంపీగా 2014లో గెలిచిన బూర గత ఎన్నికల్లో ఓటమి చెందారు. మూడేళ్ళుగా ఖాళీగా ఉన్న ఆయన చూపు ఇప్పుడు అసెంబ్లీ మీద పడింది. అందుకే తన సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న సొంత నియోజకవర్గం మునుగోడులో పోటీచేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్లకే ఇస్తున్నారన్న వార్తలు బయటకు రావడంతో నెల రోజుల క్రితం కూసుకుంట్ల వ్యతిరేకులంతా చౌటుప్పల్‌లో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం వెనుక అసలు సూత్రధారి నర్సయ్యేననే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బూరతో మంతనాలు సాగించినట్లు జోరుగా ప్రచారం సాగింది. పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామనే హామీ కూడా ఇచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. ఆయనతో పాటు కర్నె ప్రభాకర్ తో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపినట్లు టీఆర్ఎస్ వర్గాలే మాట్లాడుకున్నాయి. అయితే కాంగ్రెస్‌లో చేరితే గెలుస్తామో లేదో అనే సందేహంతోనే టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు బూర నర్సయ్య చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బూర నర్సయ్య వ్యవహారం మునుగోడు టీఆర్ఎస్లో మరింత హీట్‌ను పెంచినట్లైంది. ఇదే సమయంలో పార్టీలో ఉన్న బీసీ నేతలు కూడా బూర నర్సయ్య వ్యాఖ్యలను తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. -
మునుగోడులో అందర్నీ కలుపుకొనిపోతాం
సాక్షి, నల్లగొండ: మును గోడు ఉపఎన్నికలో చిన్నా పెద్దాఅనే తేడా లేకుండా కార్యకర్తలు, నాయకులను కలుపుకొనిముందుకు పోతామని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తనను మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో సమావేశాలకు పిలవడం లేదంటూ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. మంత్రి పైవిధంగా సమాధానం చెప్పారు. సమాచార లోపాలను సరిచేసుకుంటామని, నర్సయ్యగౌడ్‌ను కూడా కలుపుకొని ముందుకుపోతామని చెప్పారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్! -
జగదీశ్వర్‌రెడ్డి అందరినీ కలుపుకొనిపోవడం లేదు
మునుగోడు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక విషయంలో జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నాయకులందరినీ కలుపుకొనిపోవడంలేదని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పక్క నియోజకవర్గాల నాయకులను పిలిపించుకొని నెలరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. వీటి సమాచారాన్ని మాకు ఇవ్వడంలేదు. ఎందుకు అలా చేస్తున్నారో మంత్రి సమాధానం చెప్పాలి’అని అన్నారు. నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం బలంగా ఉందని, అందుకే టీఆర్ఎస్ పార్టీలో ఎంతోకాలంగా పనిచేస్తున్న బీసీ నాయకులం ఈ ఉపఎన్నికలో బీసీలకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే బాగుండని భావిస్తున్నామన్నారు. అది సీఎం కేసీఆర్ నిర్ణయమని, తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం, మునుగోడు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ఇప్పట్లో ప్రకటించరని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాతే సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికతోనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని, అందువల్ల అందరం ఐక్యంగా పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 33 మహిళా కళాశాలల్లో ఒకదానిని మునుగోడులో ఏర్పాటు చేయాలని నర్సయ్యగౌడ్ కోరారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చలువతోనే ఈ నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయించామని, రానున్న రోజుల్లో రీజినల్ రింగ్‌రోడ్డు కూడా మునుగోడు నుంచి వెళ్తుందని, దీంతో ఊహించని రీతిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. -
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కీలక వ్యాఖ్యలు
-
గులాబీ నేతలకు కామన్ సెన్స్ లేదు.. టీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్
సాక్షి, నల్గొండ: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొందరు టీఆర్ఎస్ నేతలకు కామన్ సెన్స్ లేదని మండిపడ్డారు. మునుగోడులో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడంలేదన్నారు. బీసీ అనే కాకుండా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు నర్సయ్య గౌడ్ చెప్పారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉందని, ఆ ఈక్వేషన్స్‌తోనే టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. బలమైన బీసీ నేతనని తెలిసినా తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారని, ఎందుకు సమాచారం ఇవ్వడం లేదో ఆయన్నే అడగాలని పేర్కొన్నారు. ఎవరికి టికెట్ వచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తాన్నారు.మునుగోడుఎన్నికపై దేశం మొత్తం చర్చ జరగుతోందని, సర్వేలపరంగా టీఆర్ఎసే గెలుస్తుందని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖ చిత్రం మీదే ఈ ఎన్నిక ఉండబోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో లాభియింగ్ నడవదని, ముఖ్యమంత్రి నిర్ణయమే తుది నిర్ణయని వెల్లడించారు. 'మునుగోడు పేరులొనే గోడు ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మునుగోడును కేసీఆర్ దత్తత తీసుకునే అవకాశం ఉంది.రాష్ట్రంలో కొత్తగా 33 గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. మునుగోడు కు జూనియర్ కళాశాల లేదు. గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవాలి. మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. నాకు పదవులు ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. ఎవరు చెప్పిన చెప్పకున్నా ముఖ్యమంత్రి దిశానిర్దేశంతోనే పని చేస్తా' అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. చదవండి: ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల -
Covid 19: మృతదేహాల ద్వారా కోవిడ్ వ్యాప్తి తక్కువే!
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కొద్దీ మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఆ మృతదేహాలకు అంత్యక్రియల విషయంలో ఆందోళన కనిపిస్తోంది. మృతదేహాల దగ్గరికి వచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా సాహసించడం లేదు. కొందరు ఆస్పత్రుల్లోనే మృతదేహాలను వదిలేసి వెళుతున్నారు. అలాంటి వాటికి మున్సిపాలిటీలే అనాథ శవాల జాబితాలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాయి. ఇక మృతదేహాలను తీసుకెళ్లిన వారు కూడా సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించడం లేదు. కరోనా భయం నేపథ్యంలో పాడె మోయడానికీ ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ట్రాక్టర్ ట్రాలీ/ జేసీబీలతో శ్మశానాలకు తీసుకెళ్తున్నారు. కడసారి చూడటానికి కూడా దగ్గరికి రాకపోవడం, మృతదేహాలను నేరుగా చితిమీదికి చేర్చడమో, గుంతలో పడేయడమో చేస్తుండటం హృదయాలను ద్రవింపజేస్తోంది. నిజానికి కోవిడ్ మృతదేహాల విషయంలో ఇంత భయం అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు. లక్షణాలు లేని వారి నుంచే.. ప్రాణం పోయిన తర్వాత శరీరంలో వైరస్ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పటికే బాడీలోని ప్లూయిడ్స్‌లో వైరస్ ఉన్నా.. దానికది ఇతర ప్రదేశాలకు వ్యాపించలేదు. ఆ మృతదేహాన్ని నేరుగా తాకడం, పైన పడి ఏడవడం, చనిపోయినవారి తల, ఇతర శరీర భాగాలను ఒళ్లో పెట్టుకుని ఏడవడం వంటివాటి వల్ల మాత్రమే వైరస్ విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా మృతదేహాన్ని ఉంచిన జిప్‌బ్యాగ్‌ను తెరవకుండా ఉంటే వైరస్ సోకే అవకాశం లేనట్టేనని అంటున్నారు. మృతదేహాల నుంచి ఇతరులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని.. అప్పటికే వైరస్ సోకి, లక్షణాలు లేనివారు గుంపుగా ఉన్న జనంలో కలిసి దహన సంస్కారాల్లో పాల్గొనడం వల్లే వైరస్ విస్తరిస్తోందని చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో ఒకేచోట గుమిగూడటం, తమవారు చనిపోయిన బాధలో ఒకరిపై మరొకరు పడి ఏడవడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటివి చేస్తుండటంతో.. ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా మిగతా వారికి అంటుకుంటోందని స్పష్టం చేస్తున్నారు. భయంతో మానవత్వాన్ని వదిలేయొద్దు ఎవరైనా కోవిడ్ రోగి చనిపోతే వైద్యులు ఆస్పత్రిలోనే మృతదేహాన్ని సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేసి, శానిటైజర్లో తడిపిన వస్త్రాన్ని చుట్టి బంధువులకు అప్పగిస్తున్నారు. ప్లూయిడ్స్ బయటికి రాకుండా మృతదేహాన్ని జిప్‌లాక్ బ్యాగ్‌లో కేవలం ముఖం మాత్రమే కనిపించేలా ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇలాంటి మృతదేహాలకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయవచ్చు. కానీ చాలా మంది వైరస్‌కు భయపడి మృతదేహం దగ్గరికే రావడం లేదు. ఆస్పత్రుల్లోనే అనాథ శవాల్లా వదిలివెళ్లిపోతున్నారు. తీసుకెళ్లినా మరణించిన వారి ఆత్మ ఘోషించేలా వ్యవహరిస్తున్నారు. కనీస మానవత్వం కూడా లేకుండా ట్రాక్టర్/ జేసీబీతో మృతదేహాన్ని తీసుకెళ్లి గుంతలో పడేస్తున్నారు. ఇంత ఆందోళన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలు. – డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ జిప్‌లాక్ బ్యాగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దహన సంస్కారాలు చేయవచ్చు. సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్‌తో మృతదేహాన్ని శుభ్రం చేయాలి. జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి జాగ్రత్తగా తరలించాలి. కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌవ్స్ ధరించి పాడె మోయవచ్చు. జిప్‌లాక్ బ్యాగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు. చనిపోయినవారి నోట్లో పాలు పోయడం, అన్నం పెట్టడం, పగడం పెట్టడం వంటివి చేస్తుంటారు. అవి వద్దు. దహన సంస్కారాల్లో 20 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదు. మృతదేహానికి మూడు నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉండి నివాళి అర్పించవచ్చు. శుభకార్యాలకు వెళ్లినా, వెళ్లక పోయినా నష్టం లేదు కానీ కోవిడ్ బాధితులను కనీసం ఫోన్లోనైనా పరామర్శించండి. – డాక్టర్ శ్రీహర్ష, సర్వైలెన్స్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా శరీరాన్ని నేరుగా తాకొద్దు.. కోవిడ్ పేషెంట్లకు చికిత్సలో భాగంగా రక్తం గడ్డకట్టకుండా మందులు ఇస్తున్నాం. చనిపోయిన తర్వాత కూడా రక్తం గడ్డకట్టకపోవడంతో ముక్కు, చెవులు, ఇతర రంధ్రాల నుంచి రక్తం బయటికి కారుతుంది. సోడియం హైపోక్లోరైడ్‌తో మృతదేహాన్ని శుభ్రపర్చినా.. తర్వాత శరీరంలోని ఫ్లూయిడ్స్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మృతదేహాన్ని నేరుగా తాకవద్దు. మృతదేహాన్ని ప్యాక్ చేసిన బ్యాగ్‌ను తెరవొద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించవచ్చు. మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి, ఊరేగింపులు జరపకుండా.. ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేయడం మంచిది. అంతేగాక ఈ సమయంలో ఎక్కువ మంది గుమిగూడవద్దు. అలా చేస్తే ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్, గాంధీ కోవిడ్ సెంటర్ చదవండి: Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..! -
నిత్యావసర సరుకులు పంపిణీ
కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ నేపథ్యంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’లోని 100 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ‘‘గతంలో కొంత మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మళ్లీ ఈరోజు మరో వందమందికి పంపిణీ చేయడం అభినందనీయం’’ అన్నారు బూర నర్సయ్య గౌడ్. ‘‘పది కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందించాం. త్వరలో మరికొంత మందికి అందిస్తాం’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ కార్యదర్శి కాచం సత్యనారాయణ, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
వైద్యానికి కావాలి చికిత్స
చరిత్రలోకి పోతే హైదరాబాద్ స్టేట్‌లో భారతదేశంలో కంటే అద్భుతమైన వైద్య సదుపాయాలు ఉండేవి. ఉస్మానియా మెడికల్ కాలేజీ, యునానీ హాస్పిటల్, టీబీ హాస్పిటల్, వికారాబాద్‌లో టీబీ శానిటోరియం, ఫీవర్ హాస్పిటల్, బొక్కల దవాఖాన ఇలా అప్పటి ఇతర ప్రాంతాల్లో కన్నా ఇక్కడ మెరుగ్గా ఉండేవి. కానీ కాలక్రమేణా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ హాస్పిటల్స్ రోజురోజుకు దిగజారి, 60 ఏండ్ల ఉమ్మడి ఏపీలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత చాలావరకు పరిస్థితి మెరుగయ్యింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే సిద్దిపేట, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు, అలానే కేంద్ర ఎయిమ్స్ భువనగిరిలో రావడం జరిగింది. మొత్తం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నవి. ప్రైవేట్ రంగంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నవి. కొత్తవి వస్తున్నవి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత హెల్త్ బడ్జెట్ పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ కలిపి దాదాపు ఐదువేల కోట్ల బడ్జెట్ మన రాష్ట్రం ఖర్చు చేస్తున్నది. దీంతోపాటు కేసీఆర్ కిట్, ఉద్యోగుల ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, కేంద్ర ప్రభుత్వ సీజీహెచ్ఎస్, ఈఎస్ఐ, సింగరేణి ఇలా ఎన్నో ఆరోగ్య పథకాలు ఉన్నవి. ప్రభుత్వం ఇన్ని చేసినా ప్రజల్లో ప్రభుత్వ వైద్యశాలల మీద ఇంకా అనుకున్నంత నమ్మకం కలగడం లేదు. దీనికి ప్రధాన కారణం డబ్బే కాదు, ఉన్న వసతులను, నైపుణ్యాన్ని సరిగ్గా ఉపయోగించడంలో కొంత లోపం ఉన్నది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలను ఇంకా వైద్యరంగంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పది ప్రభుత్వ, పదిహేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ అనుబంధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఆరు జిల్లా స్థాయి హాస్పిటల్స్, 37 ఏరియా హాస్పిటల్స్, 99 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 8 మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, 636 పీహెచ్ సీలు, 249 యూపీహెచ్ సీలు, 4797 సబ్ సెంటర్లు, 106 బస్తీ దవాఖానాలు, మొత్తం కలిపితే దాదాపు 5961 హెల్త్ ఫెసిలిటీలు తెలంగాణ రాష్ట్ర అధీనంలో ఉన్నవి. ఇవి కాకుండా ఈఎస్ఐ దవాఖానాలు, సింగేరి, ఆర్ టీíసీ, ఆర్మీ, సీజీహెచ్ఎస్, రైల్వేస్ హాస్పిటల్స్ ఉంటవి. ఇక ప్రైవేట్ రంగంలో దాదాపు 2860 హాస్పిటల్స్, 40 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నవి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య దాదాపు 80 వేల మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న వసతులు, సిబ్బందిని శాస్త్రీయ పద్ధతులలో ఉపయోగించుకుంటే ప్రస్తుతం కంటే దాదాపు 20 శాతం అధిక సేవలు అందించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటవి. రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కోట్లు, ప్రభుత్వం వెయ్యి కోట్లు, ప్రజలు సొంతంగా 8 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే సగటున దాదాపు ప్రతి కుటుంబం 14 వేల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి ఖర్చు పెడుతోంది. మనం ఈ ధనాన్ని ప్రణాళికాబద్ధంగా వాడితే భారత దేశంలోనే ఒక మోడల్ హెల్త్ స్టేట్‌ని మనం నిర్మాణం చేయవచ్చు. కోటి కుటుంబాల వైద్యానికి ఒక కాంట్రిబ్యూటరీ విధానం ద్వారా యూనివర్సల్ హెల్త్ కేర్ ఏర్పాటు చేసుకోవచ్చు. కావలసింది ఒక దృఢ సంకల్పమే. ఉదాహరణకు ఒక పేద కుటుంబానికి నెలకు రెండు వేలు పెన్షన్. అంటే సంవత్సరానికి 24 వేలు పెన్సన్ ఇచ్చినా ఒక రెండు రోజులు జ్వరంతో ఆ ఇంట్లో వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయితే కనీసం 20 వేలు హాస్పిటల్ బిల్లు అవుతుంది. దానికోసం మందుల బిల్లు తక్కువ చేయగలిగితే సంపద సృష్టించినట్టే. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటది. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలను ఆదరించినప్పుడు వారికి ఈ ఫలాలు ఎక్కువగా దొరుకుతాయి. లేదా ఎన్నికల రోజు పంచే నోట్లు, క్వార్టర్ బాటిల్స్ మీద ప్రజాస్వామ్యం నడిస్తే చట్ట సభల్లో ఎక్కువ శాతం విద్య, వైద్య రంగలకు చెందిన వ్యాపారవేత్తలే ఉంటారు. వారి నిర్ణయాలు కూడా వారి వారి ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటవి. ఒకప్పుడు వైద్యో నారాయణో హరి అనువారు, కానీ ఇప్పుడు అది వైద్యో వ్యాపార హరి అని కాకుండా ఉండాలంటే అంతిమంగా ప్రజలే పాలన నిర్ణేతలు. డా. బూర నర్సయ్య గౌడ్ వ్యాసకర్త మాజీ పార్లమెంట్ సభ్యులు (భువనగిరి) -
కోమటిరెడ్డి ఎదురుపడటంతో.. కలిశానంతే!
సాక్షి, భువనగిరి: భువనగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నరసయ్య ఓడిపోవడం చాలా బాధాకరమని ఆ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బూర ఓటమికి తానే కారణమంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బూర నరసయ్య ఓడిపోతారని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ అంశంపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోడ్డురోలర్ గుర్తువల్లే భువనగిరి లోక్‌సభ స్థానంలో తాము ఓడిపోయాం తప్ప వేరే కారణం లేదన్నారు. ‘బూర ఓటమికి నేనే కారణమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని చూస్తే చాలా బాధేస్తోంది’ అని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక హోటల్లో టాయిలెట్‌కు వచ్చిన సందర్భంలో ఎదురుపడ్డారని, అక్కడే ఉండటంతో తనను కాకతాళీయంగా కలిశారని అన్నారు. ఇది రహస్యంగా జరిగింది కాదని, అక్కడ అందరూ ఉన్నారని, ఇదంతా కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే జరిగిందని వివరించారు. తమ మధ్య ఎలాంటి ఇతర సంభాషణ జరగలేదని, ఇలా కలిసి అలా వెళ్లిపోయామని పేర్కొన్నారు. బొమ్మల రామరం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాటల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఈ సంభాషణను వైరల్ చేసిన సైకోను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తానెంటో భువనగిరి ప్రజలకు తెలుసని, ఎంపీ బూర గెలుపుకోసం అందరమూ కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనమీద ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భువనగిరిలో వందశాతం ఎగిరేది గులాబీ జెండాయేనని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలు రక్షసానందం పొందుతున్నాయన్నారు. ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్న వ్యక్తులైన బాలనర్సింహ యాదవ్, మల్లారెడ్డి కూడా ఈ ప్రెస్మీట్లో మాట్లాడారు. జన సమీకరణ కోసమే మల్లారెడ్డితో తాను ఫోన్లో మాట్లాడానని, సన్నిహిత సంబంధాలు కారణంగా తాము సరదాగా మాట్లాడుకున్నామని బాలనర్సింహ యాదవ్ పేర్కొన్నారు. తాము మాట్లాడుకున్న దానిని సోషల్ మీడియాలో ఇలా వక్రీకరించి వైరల్ చేయడం బాధాకరమని, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై తాము మాట్లాడుకున్నామని, భువనగిరి నియోజకవర్గానికి ఈ సంభాషణ విషయంలో ఎలాంటి సంబంధం లేదన్నారు. -
కేసీఆర్‌ను పెద్ద కొడుకులా చూస్తున్నారు
సాక్షి, భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ ఇంటి మనిషిగా, పెద్ద కొడుకులా చూస్తూ మరోసారి గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారని టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సాక్షితో ఆయన మాట్లాడారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలుతోనే ఓట్లు పడతాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 40 నుంచి 60 వేల లబ్ధిదారులు ఆసరా పింఛన్ పొందుతున్నారు. వారంతా కేసీఆర్‌ను ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నత పదవిలో చూడాలని చూస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళితే రాష్ట్రానికి అధిక బడ్జెట్ తీసుకువస్తారని వారి నమ్మకం. గడిచిన ఐదేళ్లల్లో ఏ ఎంపీ చేయనంత పని చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు సాధించడంలో ముందున్నాను. రెండోసారి అభ్యర్థిగా రంగంలోకి దిగిన తనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రకుల పేదల మద్దతు కూడా లభిస్తోంది. 9 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 9లక్షల ఎకరాలకు సాగునీరందించే మహోత్తర కార్యక్రమం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లు, మూసీ కాల్వల అభివృద్ధి, నక్కలగండి, రుద్రమ్మ రిజర్వాయర్, శ్రీరాంసాగర్ ఎత్తిపోత పథకాలతో రుద్రమ్మ రిజర్వాయర్‌తో త్రివేణి సంగమంలా జిల్లాకు సాగునీరందిస్తాం. ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులన్నీ నింపుతాం. యాదాద్రి దేవాలయాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. పారిశ్రామిక క్లస్టర్లు పూర్తి చేయించి 40 నుంచి 50వేల మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామిక వేత్తలకు మరింత ఉపాధి పెంచుతాం. జనగామలో మరో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తాం. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 20 సంవత్సరాల్లో చేసిన పని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు అడ్డగించారు. కమీషన్ల కోసం బ్రాహ్మణవెల్లంను పూర్తి చేయలేదు. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తా..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి గోదావరి జలాలు తీసుకొచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని ససశ్యామలం చేస్తానని టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంతో పాటు వంగపల్లిలో రోడ్ షోతో పాటు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. బీబీనగర్‌లో నిమ్స్‌ను రూ.1,028కోట్లతో ఏయిమ్స్‌గా మార్చానని, కేంద్రీయ విద్యాలయానికి రూ.18కోట్లు, దండుమల్కాపుర్‌లో రూ.1,000 కోట్లతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, ఇబ్రహీం పట్నంలలో రూ.500కోట్లతో మెడికల్ కాలేజీలు, చిట్యాలలో డ్రైపోర్టుకు రూ.1,000కోట్లు, పెంబర్తి, మోత్కూరు, పోచంపల్లిలో కులవృత్తులు, తాటి పరిశోధన కేంద్రాలలను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించానని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉండి తమ ప్రాంతాలను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందని, 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజ లంతా ముందుకొస్తున్నారని.. దేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్యగౌడ్, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఎంపీటీసీ సీస కృష్ణగౌడ్, మధర్‌డైరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, వంగపల్లి ఉపసర్పంచ్ రేపాక స్వామి, మాజీ సర్పంచ్ చంద్రగాని నిరోష జహంగీర్, బూడిద స్వామి, కైరంకొండ శ్రీదేవి, నాయకులు అంకం నర్సింహ, నువ్వుల రమేష్, కాంటేకార్ పవన్‌కుమార్, చిత్తర్ల బాలయ్య, గోపగాని ప్రసాద్, సయ్యద్ సలీం, మిట్ట అనిల్‌గౌడ్, మిట అరుణ్గౌడ్, కోల వెంకటేష్‌గౌడ్, సయ్యద్ బాబా, గునగంటి బాబురావుగౌడ్ తదితరులున్నారు. -
సీసీఎంబీ ప్రాజెక్టుపై నీలి నీడలు
సాక్షి, యాదాద్రి: అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏడాదిన్నర క్రితం ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైనా పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఈ పరిశోధనా కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సంబంధిత కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు సీసీఎంబీ కేంద్రాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో బీబీనగర్ పక్కనే గల రంగాపురంలోని 180 ఎకరాల్లో సీసీఎంబీని ఏర్పాటు చేయడానికి 11వ ప్రణాళిక కాలంలో కేంద్రం అనుమతినిచ్చింది. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నారు. ఈ నిధులకు జాతీయ ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం ఆమోదం కూడా లభించింది. అయితే స్థలం విషయంలో ఏర్పడిన వివాదంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా భువనగిరి మండలం పగిడిపల్లి వద్ద మరో స్థలాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ప్రాజెక్టు స్వరూపం... 180 ఎకరాల స్థలం, రూ.1,200 కోట్ల వ్యయం.. మానవ మూలకణాలతోపాటు పలు అంశాలపై నిరంతర పరిశోధనలు చేసే అవకాశం.. వందలాది మందికి ఉపాధి కల్పన.. ఇదీ సీసీఎంబీ పరిశోధన కేంద్రం స్వరూపం. అయితే స్థలాన్ని ఎంపిక చేయడంలో జరిగిన జాప్యం వల్ల మొత్తం నిధుల్లో రూ. 300 కోట్లను పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి మళ్లించారు. సీసీఎంబీలో ఏం చేస్తారంటే.. మానవుల మూల కణాలపై పరిశోధనలు చేస్తారు. మనుషుల్లో వచ్చే రుగ్మతలు, ప్రధానంగా కేన్సర్ వ్యాధి గురించి ముందే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనల కోసమే సీసీఎంబీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. తార్నాకలోని ప్రాజెక్టు కేంద్ర కార్యాలయానికి చేరువలో ఉండటం, జాతీయ రహదారి 163తో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటంతో ఇక్కడ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
డాక్టర్.. ఎంపీ
నకిరేకల్: తాను అటుగా వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ప్రథమ చికిత్స చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములు గ్రామం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మియాపూర్ నుంచి ద్విచక్రవాహనంపై నాగమణి, వెంకటేశ్వర్లు, నాగరాజు కలసి వారి స్వగ్రామమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇనుపాముల శివారులో జాతీయ రహదారిపై తమ ముందు ఉన్న వాహనాన్ని వారి బైక్ ఢీకొనడంతో కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నాగమణికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన కారును ఆపి గాయపడ్డ నాగమణికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆయన 108ను పిలిపించి నకిరేకల్ ఆసుపత్రికి ఆమెను పంపించారు. దీంతో స్థానికులు ఎంపీపై ప్రశంసలు కురిపించారు. -
హనీమూన్‌కి వచ్చినట్టు వచ్చారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్‌కి వెళ్లినట్టు తెలంగాణకు వచ్చారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందో లేదో కానీ కుదరాల్సినవి చాలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య విమర్శించారు. రాహుల్‌గాంధీ ఓసీడీ వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి ఉన్నవారు చేసినవి మర్చిపోతారని, చేసిందే మళ్లీ చేస్తుంటారని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ ఎన్నికలు చూస్తుంటే రాష్ట్ర ఎన్నికలా జాతీయ ఎన్నికలా అన్నది అర్థం కావడంలేదు. ఇక అంతర్జాతీయ నాయకులు రావడమే మిగిలింది’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను రాహుల్ తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అనడంకన్నా హాస్యాస్పదం మరొకటి లేదు. రాహుల్ పేరులో ఆర్ సోనియా పేరులో ఎస్ ఉందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని మేము అనొచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు సైంధవుడిలా అడ్డుపడ్డారు. అలాంటి చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆత్మగౌరవం లేకుండా తెలంగాణకు తెచ్చారు. గతంలో భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్‌కు అంబీ సహకరించినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు సహకరిస్తున్నారు. చంద్రబాబు, రాహుల్ చేసేది కచ్చితంగా తెలంగాణపై దండయాత్రే. ఎవరెన్ని దండయాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారు’ అని బూర నర్సయ్య అన్నారు. కేసీఆర్ 18 గంటలు కష్టపడతారు: ఎమ్మెల్సీ సలీం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలగా చేసిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్సీ సలీం అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు ప్రజలెప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావుతో కలిసి సలీం గురువారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ తెచ్చామని ఇప్పుడు కొందరు మాటలు చెబుతున్నారు. తెలంగాణకు ఏం కావాలో తెలంగాణ బిడ్డగా కేసీఆర్‌కు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలంగాణను ఎండ బెట్టారు. కేసీఆర్ రోజూ 18 గంటలు కష్టపడతారు. ప్రజాకూటమికి ప్రజల్లో బలంలేదు. మళ్ళీ కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. టీఆర్ఎస్ గెలవకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’అని సలీం అన్నారు. -
హనీమూన్‌కి వచ్చినట్టు వచ్చారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్‌కి వెళ్లినట్టు తెలంగాణకు వచ్చారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందో లేదో కానీ కుదరాల్సినవి చాలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య విమర్శించారు. రాహుల్‌గాంధీ ఓసీడీ వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి ఉన్నవారు చేసినవి మర్చిపోతారని, చేసిందే మళ్లీ చేస్తుంటారని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ ఎన్నికలు చూస్తుంటే రాష్ట్ర ఎన్నికలా జాతీయ ఎన్నికలా అన్నది అర్థం కావడంలేదు. ఇక అంతర్జాతీయ నాయకులు రావడమే మిగిలింది’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను రాహుల్ తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అనడంకన్నా హాస్యాస్పదం మరొకటి లేదు. రాహుల్ పేరులో ఆర్ సోనియా పేరులో ఎస్ ఉందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని మేము అనొచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు సైంధవుడిలా అడ్డుపడ్డారు. అలాంటి చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆత్మగౌరవం లేకుండా తెలంగాణకు తెచ్చారు. గతంలో భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్‌కు అంబీ సహకరించినట్టుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు సహకరిస్తున్నారు. చంద్రబాబు, రాహుల్ చేసేది కచ్చితంగా తెలంగాణపై దండయాత్రే. ఎవరెన్ని దండయాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారు’ అని బూర నర్సయ్య అన్నారు. కేసీఆర్ 18 గంటలు కష్టపడతారు: ఎమ్మెల్సీ సలీం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలగా చేసిన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్సీ సలీం అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు ప్రజలెప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావుతో కలిసి సలీం గురువారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ తెచ్చామని ఇప్పుడు కొందరు మాటలు చెబుతున్నారు. తెలంగాణకు ఏం కావాలో తెలంగాణ బిడ్డగా కేసీఆర్‌కు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలంగాణను ఎండ బెట్టారు. కేసీఆర్ రోజూ 18 గంటలు కష్టపడతారు. ప్రజాకూటమికి ప్రజల్లో బలంలేదు. మళ్ళీ కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. టీఆర్ఎస్ గెలవకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’అని సలీం అన్నారు. -
‘రేవంత్ ఇంట్లో ఐటీ దాడి.. కాంగ్రెస్ ఖుష్’
సాక్షి, నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 4న జిల్లాలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంతాన్ని ఎంపీ బుర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభకు నాలుగు లక్షల మందికి తగ్గకుండా ప్రజల వస్తారని.. కేసీఆర్‌ను చూడాలని ప్రజలంతా ఎందో ఆత్రుతతో ఎదురుచుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సభ ద్వారా జిల్లా ప్రజలు తమ అభిష్టాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు.. రేవంత్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని టీఆర్ఎస్ ఎంపీ బుర్రా నర్సయ్య గౌడ్ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని,దీనిలో తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. రేవంత్ జైలుకు పోతా.. జైల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని అంటే శిక్ష పడుతుందని రేవంత్‌కు తెలుసని వ్యాఖ్యానించారు. రేవంత్‌పై దాడులతో కాంగ్రెస్ నాయకులే కొంతమంది లోలోపల సంతోషంగా ఉన్నారని... ఆ పార్టీలో ఓ సీఎం అభ్యర్థి పీడ పోయిందని తెలిపారు. రేవంత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి... రేవంత్ రెడ్డి లాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు దేశానికి చాలా ప్రమాదకరమని ఆ పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా గతంలో ఈడీ దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈడీ సంస్థ కేంద్ర పరిదిలోనిదని... టీఆర్ఎస్ పార్టీకి దాడులతో ఎలాంటి సంబందం లేదని ఆయన తెల్చి చెప్పారు. -
ముందస్తుపై చర్చ నిజమే
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికలపై చర్చ నిజమేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే ఇందుకు ఎలాంటి ముహూర్తాలు పెట్టలేద ని, కేవలం మీడియాలోనే కల్పిస్తున్నారని పేర్కొ న్నారు. అసెంబ్లీ రద్దయితే ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని అన్నారు. అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇది స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో బూర నర్సయ్యగౌడ్‌తో కలసి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుగుతున్న మాట నిజమే. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ ఆలోచించి అసెంబ్లీని రద్దుచేయాలనుకుంటే చేయొచ్చు.. కానీ ఎన్నికలను ఎప్పుడు పెట్టుకోవాలన్న నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్‌దే. మేం ప్రధానమంత్రిని కలసినా, హోం మంత్రిని కలసినా, ఇంకెవరిని కలసినా తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన మాత్రమే కలుస్తున్నాం. నాలుగేళ్లుగా ఇదే చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 28 గడువు వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు ఉంటాయా? లేక అంతకుముందే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు వినోద్ సమాధానమిస్తూ ‘‘తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ఆరు నెలల గడువు ఈ సెప్టెంబర్ 28తో ముగుస్తుంది. ఆ లోపు శాసనసభ సమావేశం జరపాలి. లేదా అంతకుముందుగానే అసెంబ్లీ రద్దు కు కేబినెట్ నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీ రద్దవుతుంది’’అని వివరించారు. . 6 నెలల్లోపు ఎన్నికలు జరపాల్సిందే అసెంబ్లీ రద్దు చేసినా ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనేదీ లేదని.. అసెంబ్లీ గడువు ఉన్నంత వరకూ ఎన్నికలను పొడిగించవచ్చన్న అభి ప్రాయంపై వినోద్ స్పందిస్తూ ‘‘తప్పనిసరిగా అసెంబ్లీ రద్దయిన 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి. ఇది గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయం. అసెంబ్లీ రద్దయినప్పుడు అప్పటివరకు మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగించాలని కరుణానిధి కేసులో సుప్రీం చెప్పింది. వాటిపై మాకు స్పష్టత ఉంది’’అని వివరించారు. ఈసీ ప్రతిపాదనకు టీఆర్ఎస్ ఓకే: వినోద్ పార్టీ పరంగా ఏర్పాటు చేసే వివిధ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనను టీఆర్ఎస్ పార్టీ సమ్మతిస్తుందని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల సం ఘం సోమవారం ఢిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు ప్రతిపాదనలపై ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది. దీనిపై ఆదివారం ఢిల్లీలో వినోద్ మాట్లాడుతూ.. పార్టీలో మహిళలకు తగిన ప్రా« దాన్యం కల్పించాలని ఈసీ చేసిన ప్రతిపాదనను టీఆర్ఎస్ సమ్మతిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులపై పరిమితులున్నాయని, అయితే ఎమ్మెల్సీ అభ్యర్థు లకు పరిమితులు లేని నేపథ్యంలో వీటిపై కూడా పరిమితులు విధించే అంశమై ఈసీ అభిప్రాయం కోరిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపైనే కాకుండా రాజకీయ పార్టీల ఖర్చులపై కూడా పరిమితి విధించే ప్రతిపాదన చేసిం దని వెల్లడించారు. అలాగే ఓటర్ల నమోదును నిర్దిష్ట కాలంలోనే కాకుండా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిరంతరాయంగా నమోదు ప్రక్రియ జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండంపై అభిప్రాయం కోరిందన్నారు. వీటన్నింటిపై సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
సర్వాయి పాపన్న అందరివాడు
హైదరాబాద్: బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న అందరివాడని, కొన్ని వర్గాలకే పరిమితం చేస్తే ఆయన స్ఫూర్తి దెబ్బతింటుందని ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం చిక్కడపల్లిలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, మన తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 368 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బూర మాట్లాడుతూ.. గెరిల్లా తరహాలో యుద్ధం చేసి 12 కోటలను కైవసం చేసుకున్న గొప్ప వీరుడు పాపన్న అని పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటుకు, పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు. గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ ఈడ శేషగిరి రావుగౌడ్, కన్వీనర్ వెంకన్నగౌడ్, వర్కింగ్ చైర్మన్ నారాయణగౌడ్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సేవలు తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. దీంతో నిమ్స్ కోసం ఏర్పాటు చేసిన భవణాల్లోనే ఎయిమ్స్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భవణాలు సిద్దంగా ఉన్నందున వైద్య సేవలు అతిత్వరలోనే ప్రారంభం చేస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. బీబీనగర్‌లో మరో 49 ఎకరాల స్థలంతో పాటు, రోడ్లు, విద్యుత్ వంటి పలు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పోరాడి సాధించాం.. భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటును పోరాడి సాధించామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు స్థల రూపంలో తొలి అడుగుపడడం సంతోషంగా ఉందని.. ఏడాది లోపు ప్రిలిమినరీ సేవలు ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ తెలిపారు. కేంద్రానికి ధన్యవాదాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే ఎయిమ్స్ ఏర్పాటు జరగనుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతిష్టాత్మక వైద్య సేవలు రావడానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా సుప్రీం తీర్పు: ఎంపీ బూర
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించేందుకు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయం జరిగినట్లైందని అభిప్రాయపడ్డారు. మరోవైపు లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్ అండ్ సర్వీసెస్ టు ది ఫార్మర్స్ ప్రైవేటు బిల్లును చర్చకు తీసుకుంటున్నట్టు లేఖ అందిందని చెప్పారు. వచ్చే సమావేశాల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, బిల్లు వల్ల పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో రైతేరాజుగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. -
శ్రీకాంతాచారి తల్లి తీవ్ర ఆవేదన
-
శ్రీకాంతాచారి తల్లి తీవ్ర మనోవేదన
సాక్షి, భువనగిరి : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో మొదట తనకు తాను నిప్పటించుకొని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు ఆయన.. కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ శనివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా తనను మొదట వేదిక మీదకు పిలువకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర నాలుగోవ ఆవిర్భావ వేడుకల్లో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో తనను వేదికపైకి మొదట పిలువకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మరిచిపోయి.. తన కొడుకును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జోక్యం చేసుకుని.. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపై తనను సన్మానించిన వెంటనే.. ఆవేదనతో అక్కడి నుంచి శంకరమ్మ వెళ్లిపోయారు. -
మత్స్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేలా రాష్ట్రంలో ఇన్లాండ్ ఫిష్ ఫార్మింగ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవ సాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. గురువారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన బూర నర్సయ్య, తెలంగాణలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న చేయూతను వివరించారు. రైతులకు ఉచితంగా 40 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా అవకాశాలు కల్పించే ఇన్లాండ్ ఫిష్ ఫార్మింగ్ పరిశోధనా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన కోరారు. అలాగే కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్‌ను కలసి జనగాంలో వీవర్స్‌కాలనీ వద్ద అండర్‌పాస్ బ్రిడ్జ్‌ని ఏర్పాటు చేయాలని కోరారు. -
ఎయిమ్స్‌కు నిధులివ్వండి
కేంద్ర మంత్రికి బూర నర్సయ్యగౌడ్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఇక్కడ మంత్రిని కలసిన ఆయన వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి సంబంధిత ఫైలును ఆర్థిక శాఖకు పంపామని, త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే భువనగిరి పరిధిలో రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఎంపీ బూర లేఖ రాశారు. -
'జీఎస్టీ భారం తగ్గించాలని ఒత్తిడి తెస్తాం'
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. ఆదివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎన్డీయే తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లుకు టీఆర్ఎస్ బేషరతుగా మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. జీఎస్టీ బిల్లు పాసయ్యేదాకా బీజేపీ ఒక మాట, బిల్లు నెగ్గిన తర్వాత మరో మాట అన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారని, ఇప్పుడేమో తెలంగాణకు సంబంధించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం బుల్డోజ్ చేస్తోందని నర్సయ్యగౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాలపై పెద్ద ఎత్తున జీఎస్టీ భారం పడుతోందన్నారు. ఇవేవీ అంబానీ, ఆదానీ కంపెనీలు కావని, ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు అని అన్నారు. వీటిపై జీఎస్టీ భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి మూడేళ్ల నుంచి అన్ని అంశాల్లో మద్దతును ఇస్తున్నామని, ఇప్పటికైనా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సహకరించాలని నర్సయ్యగౌడ్ కోరారు. రాష్ట్రానికి ఎయిమ్స్ ఇవ్వలేదని, నియోజకవర్గాల పెంపు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిందన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై స్పందన లేదన్నారు. కనీసం జీఎస్టీ భారాన్ని తగ్గించాలని కోరారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే నిరంతర ఒత్తిడి తెస్తామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఒత్తిడి తెచ్చి హక్కులను సాధించుకోవటం టీఆర్ఎస్కు కొత్తకాదన్నారు. -
తెలంగాణ ఎయిమ్స్‌కు నిధులివ్వండి: బూర
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థాపించే ఎయిమ్స్ ఆస్పత్రికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గణనీయమైన స్థాయిలో నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. మంగళవారం లోక్‌సభలో హెచ్ఐవీ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హెచ్ఐవీ బాధితులకు అవసరమైన సేవలు అందించేందుకు నిరాకరించే వారిని శిక్షించడం, పెళ్లికి ముందు హెచ్ఐవీ ఉన్నప్పటికీ భాగస్వామి కుటుంబానికి ఆ విషయాన్ని వెల్లడించని వారిపై తగిన చర్యలను తీసుకోవడం వంటి పలు అంశాలు ఈ బిల్లులో పొందుపరచడం స్వాగతించదగ్గ విషయమని ఆయన చెప్పారు. -
ముగ్గురు ఎంపీల పనితీరు అంతంతే: కేసీఆర్
-
ముగ్గురు ఎంపీల పనితీరు అంతంతే: కేసీఆర్
హైదరాబాద్: తాను చేయించిన సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆందోళన అక్కర్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా ఎంపీల పనితీరుపై ఆయన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. అనంతరం నేతల పనితీరుపై సర్వే వివరాలను వెల్లడించారు. ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సీతారామ్ నాయక్‌ల పనితీరు అశించిన స్థాయిలో లేదని సర్వే రిపోర్టులో వెల్లడైందన్నారు. పనితీరు బాగాలేదని ఆందోళన చెందవద్దని, భవిష్యత్తులో పనితీరు మెరుగు పరుచుకోవాలని ఆయా నేతలకు కేసీఆర్ సూచించారు. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో ప్లీనరీ సమావేశం, 27న వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ 15లోపు మండల, జిల్లాల కమిటీలను వేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
'నరసింహస్వామికి కోపమొస్తే కష్టం'
హైదరాబాద్ సిటీ: ఆగమన శాస్త్ర నిబంధనలు, చిన్నజీయర్ స్వామి సలహాల మేరకే యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. ఆలయాన్ని శాశ్వతంగా మూసివేస్తారన్న అర్థం వచ్చే విధంగా ఓ పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లక్ష్మీ నరసింహా స్వామికి కోపం వస్తే కష్టం అని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణలోని ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ఈ ఆలయాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. రూ.500 కోట్లతో యాదాద్రి ఆలయాభివృద్ధికి పనులు చేపట్టామన్నారు. ఈ క్రమంలో తాత్కాలికంగా విగ్రహాలను బాలాలయంలో పెట్టి పూజలు నిర్వహిస్తున్నారన్నారు. ఆగమన శాస్త్రం, చినజీయర్ స్వామి సలహాల మేరకే బాలాలయం ఏర్పాటైందన్నారు. భక్తులు బాలాలయానికి వచ్చి పూజలు చేసుకోవచ్చని తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తైతే అక్కడి దుకాణదారుల ఆదాయం మూడు రేట్లు పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దుకాణదారులతో మాట్లాడి వారికి స్థలాలు ఇస్తారని పేర్కొన్నారు. దుకాణదారులను తరలిస్తారన్న ఆందోళన అవసరం లేదని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. -
'చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నల్గొండ జిల్లా భువనగిరి లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం హైదరాబాద్‌లో విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్నారని నర్సయ్య గౌడ్ ఆరోపించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి తీసుకోవాలని కూడా తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుపై ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. -
రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎంపీ
భువనగిరి : పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఎంఆర్ఆర్, సీఆర్ఆర్, పీఎంజీఎస్‌వై, నాబార్డు రోడ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడాఉతూ ప్రభుత్వం గ్రామీణరోడ్ల అభివృద్ధికి నిధులను కేటాయించిందని వాటిని సకాలంలో ఖర్చు చేసిన నాణ్యతకు లోటు రాకుండా పూర్తి చేయాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఈఈలు వెంకటరమణ, డీఈలు పాల్గొన్నారు. -
'కేసీఆర్ సూచనలకు ప్రధాని అధిక ప్రాధాన్యత'
హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు భువనగరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ రాసినట్లు గౌడ్ శనివారం హైదరాబాద్‌లో తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో జరిగే కామన్ మెడికల్ ఎగ్జామ్‌లో చేరాలని సూచించారు. కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఘర్షణ లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ గుర్తు చేశారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎంపీ బూర నర్సయ్య గౌడ్
-
ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచాలి
* టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు వెన్నెముకగా ఉన్న ఆశ కార్యకర్తలకు గౌరవ వేతనం పెంచడానికి కమిటీని నియమించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్‌కు టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ బుధవారం వినతి పత్రం ఇచ్చారు. గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి ఒక ఆశ కార్యకర్త వైద్య సేవల సమాచారాన్ని అందిస్తున్నారని, వారికిచ్చే ప్రతిఫలం నెలకు రూ.600 నుంచి రూ.800 మాత్రమే ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ఆశ కార్యకర్తకు రోజుకు రూ.26 మాత్రమే అందుతున్నాయని, దీనితో కుటుంబపోషణ అసాధ్యమని చెప్పారు. కనీసం అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న గౌరవ వేతనం తరహాలో ఆశ కార్యకర్తలకు ఇచ్చేందుకు సాధ్యమైన కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. -
చంద్రబాబు ఇంటి ఎదుట ధర్నా చేయండి
భువనగిరి : విద్యుత్ సమస్యతో అల్లాడుతున్న తెలంగాణ రైతులపై టీడీపీ నాయకులకు ప్రేమ ఉంటే విద్యుత్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ధర్నా చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగినా తెలంగాణకు 54 శాతం ఇవ్వాలన్న నిబంధనను చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారన్నారు. వెంకయ్య నాయుడు ఏపీ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు తప్ప కేంద్రమంత్రిగా పనిచేయడం లేదన్నారు. భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి భువనగిరి ప్రాంతానికి సాగు నీరందించాలన్నారు. ప్రతి మండలానికి 20 చెరువు చొప్పున అభివృద్ధి చేయడానికి సీఎం నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు జడల అమరేందర్, ఎడ్లసత్తిరెడ్డి, నాగారం అంజయ్య,గాదె నరేందర్‌రెడ్డి, కొలుపుల అమరేందర్, మారగోని రాముగౌడ్, సిద్దుల పద్మలు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా భువనగిరి
భువనగిరి :ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రంగా త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్థానిక ఖిలా వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి, యాదగిరిగుట్ట, కొలనుపాకలను కలుపుతూ పర్యాటక సర్కిల్‌గా తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. భువనగిరి ఖిలాను అభివృద్ధి చేయడంలో భాగంగా ముందుగా రోప్‌వే నిర్మాణంతోపాటు ఖిలాపై పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ప్రాంతం హైదరాబాద్‌కు చేరువలో ఉన్నందున పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రోజూ వెయ్యిమంది పర్యాటకులు వస్తారని చె ప్పారు. భువనగిరి డివిజన్లో పర్యాటక రంగం అభివృద్ధికి కలెక్టర్ చిరంజీవులు ప్రత్యేక చొరవ చూపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు ఆదాయం పెరుగుతుందన్నారు. మన దేశ జాతీయాదాయంలో 7 శాతం పర్యాటక రంగం నుంచి వస్తుందన్నారు. వచ్చే పర్యాటక దినోత్సవం నాటికి రోప్‌వే పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని చెప్పా రు. ఆర్డీఓ నూతి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుర్వి లావణ్య, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు వేముల భాగ్యవతి, ఎండీ నా సర్, పడమటి జగన్మోహన్రెడ్డి, పీఎస్. మంజుల, లతాశ్రీ ఉన్నారు. కాగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. -
అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుంటాం
భూదాన్‌పోచంపల్లి : భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చిత్తశుద్ధి నిరూపించుకుం టామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి వేదిక వద్ద ఏర్పాటు చేసిన అభినందన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలి పారు. నవ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, ఆయన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్దాలు చెప్పారని, వాస్తవానికి రూ.4కోట్లు కూడా లే వని అన్నారు. నిమ్స్, నియోజకవర్గంలోని బునాదిగాని, పిలాయిపల్లి కాలువలను వెంటనే పూర్తిచేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చేనేత రుణమాఫీతోపాటు, బ్యాంకుల ద్వారా కొత్తరుణాలు ఇప్పించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. బీబీనగర్ నిమ్స్‌ను ఆది వారం ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య సందర్శించనున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరిన టీడీపీ సర్పంచ్‌లు... దంతూర్, ఇంద్రియాల, గౌస్‌కొండ, జూలూరు, దోతిగూడెం గ్రామాల టీడీపీ సర్పంచ్‌లు బత్తుల శ్రీశైలం, బండి కృష్ణ, రమావత్ లక్ష్మయ్య, గోదాసు విజయలక్ష్మిపాండు, బాలెం మల్లేష్లతోపాటు ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే పోచంపల్లి2, జూలూరు స్వతంత్ర ఎంపీటీసీలు కర్నాటి రవీందర్, బండారు లలిత కూడా టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కార్యాలయం ప్రారంభం..... మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డితో కలిసి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. అనంతరం మార్కేండేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేనేత సహకార సంఘం ఆవరణలో ఉన్న దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్ కళాబృందంచే నిర్వహించిన తెలంగాణ ధూం.. ధాం అలరించింది. కళాకారులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే సైతం డ్యాన్స్ చేసి ఆక ర్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోట మల్లారెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, చంద్రం, భిక్షపతి, రామాంజనేయులు, కందాడి రఘుమారెడ్డి, పొనమోని శ్రీశైలం, ఐలయ్య, సిలువేరు బాలు, ఆర్ల వెంకటేశం, ఎంపీటీసీలు పాల్గొన్నారు.