సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించేందుకు అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయం జరిగినట్లైందని అభిప్రాయపడ్డారు. మరోవైపు లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పోస్ట్ అండ్ సర్వీసెస్ టు ది ఫార్మర్స్ ప్రైవేటు బిల్లును చర్చకు తీసుకుంటున్నట్టు లేఖ అందిందని చెప్పారు. వచ్చే సమావేశాల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, బిల్లు వల్ల పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో రైతేరాజుగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment