సర్వాయి పాపన్న అందరివాడు | Boora Narsaiah Goud comments on Sarvai Papanna | Sakshi
Sakshi News home page

సర్వాయి పాపన్న అందరివాడు

Published Sun, Aug 19 2018 2:18 AM | Last Updated on Sun, Aug 19 2018 2:18 AM

Boora Narsaiah Goud comments on Sarvai Papanna - Sakshi

పాపన్న విగ్రహానికి నివాళులర్పిస్తున్న బూర

హైదరాబాద్‌: బహుజన విప్లవకారుడు సర్దార్‌ సర్వాయి పాపన్న అందరివాడని, కొన్ని వర్గాలకే పరిమితం చేస్తే ఆయన స్ఫూర్తి దెబ్బతింటుందని ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. శనివారం చిక్కడపల్లిలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, మన తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 368 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బూర మాట్లాడుతూ..  గెరిల్లా తరహాలో యుద్ధం చేసి 12 కోటలను కైవసం చేసుకున్న గొప్ప వీరుడు పాపన్న అని పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ..  ట్యాంక్‌ బండ్‌పై  పాపన్న విగ్రహం ఏర్పాటుకు, పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు. గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ బాలగోని బాలరాజుగౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్‌ ఈడ శేషగిరి రావుగౌడ్, కన్వీనర్‌ వెంకన్నగౌడ్, వర్కింగ్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement