gouda sangam
-
కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ!
మల్కాజ్గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు గౌడ న్యాయవాదులు హాజరయ్యారు. స్వామి వివేకానందుడి పిలుపునిచ్చిన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యత, గౌడ కుల అభివృద్ధి, యువజన ప్రగతి గురించి కూలంకుషంగా చర్చించారు. న్యాయవాదులే నడుం కట్టాలి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్టే.. బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం కూడా గౌడ లాయర్లు ముందుకు రావాలని సమావేశంలో పిలుపునిచ్చారు. పలువురు గౌడ న్యాయవాదులు హాజరయిన ఈ సమావేశంలో.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీలు బీసీలేనని, అయినా వారికి ఎలాంటి పదవులు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొందరు బీసీ నేతలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కుట్రల వల్ల ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా భారీగా ఉన్న బీసీలు ఏకీకృతం కావాలని, గౌడ ప్రజలు ఎక్కువ ఉన్న చోట నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. చారిత్రక ఆధారాలతో క్యాలండర్ గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని గౌడ జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన కౌండిన్య క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పురాణాల్లో కౌండిన్య ప్రస్తావన, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట, నాయకత్వ పటిమ, ప్రస్తుత పరిస్థితులను క్యాలెండర్లో వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమాన్ని గులారి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించగా.. అతిథులుగా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు గులారి మల్లేశం గౌడ్, దేవరాజ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణ సభ్యులు నవీన్ గౌడ్, గిరిధర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివ గౌడు, ఇంకా సీనియర్ న్యాయవాదులు అరుణ్ గౌడ్, నరేష్ బాబు గౌడ్, సుధీర్ బాబు గౌడ్, గౌడ హాస్టల్ మెంబర్ పాండాల శివ గౌడ్, కెనరా బాంక్ సీనియర్ లీగల్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రఘుపతి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా -
ఆత్మగౌరవంతోపాటు ఆర్థికాభివృద్ధి..
లక్డీకాపూల్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషి పొరుగు రాష్ట్రాలకు సైతం స్ఫూర్తిదాయకంగా ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ సంపదను పెంచి పేదలకు పంచడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో శనివారం సాయంత్రం తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. కులవృత్తితో జీవనం సాగించే వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు, ఆర్థిక పురోభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వం, కార్యదక్షత, పటిష్టమైన శాంతిభద్రతలను అమలు చేయడం వల్లనే తెలంగాణ పురోగమిస్తుందన్నారు. కేసీఆర్ కార్యదక్షతను ఏపీ సీఎం వై.ఎస్ జగన్ అసెంబ్లీలో మెచ్చుకుని అభినందించిన విషయాన్ని ప్రస్తావించారు. గీత కార్మికులకు 200 ఉన్న íపింఛన్‌ను 2000కు పెంచినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను పెంచినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం సర్వాయి పాపన్న అస్తిత్వాన్ని కాపాడుతుందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతోనే నీరా పాలసీని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నీరాను రుచి చూశారు. తాను నీరా సేవించడం తొలిసారి అని, ఇప్పట్నుంచే దానికి అభిమానిని అయ్యానని కేటీఆర్ చెప్పారు. నీరాకు అంతర్జాతీయంగా ప్రాచు ర్యం కల్పిస్తామన్నారు. కల్లుగీత కార్మికులకు త్వరలో లూనాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్లోనే దీన్ని ప్రతిపాదిస్తామన్నారు. గౌడ్ల కోసం ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నీరా గౌడ జాతికి అంకితం రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నీరాను గౌడ జాతికే ఇవ్వాలని జీవో తేవడంలో కేటీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. దేవతల కాలంలోనూ సురాపానాన్ని అమృతం అనే వారని, వైద్యులు లేని రోజుల్లో కల్లు, నీరా తాగితే 15 జబ్బుల దాకా తగ్గేవని చెప్పారు. గీత కార్మికులు వందల ఏళ్ల నుంచి చనిపోతున్నా అదే వృత్తి చేస్తున్నారని చెప్పారు. గత పాలకులు కుట్రతో కల్లును విషపూరితమైనది చిత్రీకరించారన్నారు. వ్యాపార లాభాపేక్షతో గౌడేతరులు కల్తీ చేయడం వల్లే కల్లు పట్ల అపోహలు నెలకొన్నాయన్నారు. కల్లు వృత్తి అని చెప్పుకునేందుకు సిగ్గు పడిన తీరు నుంచి ఇప్పుడు తమది నీరా వృత్తి అని గౌరవంగా చెప్పుకునేలా సీఎం కేసీఆర్ చేశారన్నారు. వృత్తిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన వారికి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. గౌడల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3.70 కోట్ల చెట్లను నాటించామన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్..గీతకార్మికులకు సంబంధించి పలు విన్నపాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీరా ప్రాజెక్ట్ తేవడం పట్ల కేటీఆర్‌కు రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ రాజేశం గౌడ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర గౌడ్, గంగాధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ గౌడ్, వివేకానంద గౌడ్, జగదీశ్ గౌడ్ పాల్గొన్నారు. -
మీ దీవెనలే.. గెలిపిస్తున్నాయి
సాక్షి, తాండూరు టౌన్: అన్నివర్గాల ప్రజల నుంచి అందుతున్న దీవెనలే ఇన్నేళ్లుగా తనను విజయ తీరాలకు చేరుస్తున్నాయని, తాండూరు ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ఆశయమని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో ఆదివారం గౌడ, ఈడిగ, గీత కార్మికుల ఆధ్వర్యంలో మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, గౌడ కులానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ధ్యేయమని తెలిపారు. నాలుగేళ్ల తమ పాలనలో అన్ని మతాలు, కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. గీత కార్మికులకు పింఛన్ల మంజూరు, కల్లు దుకాణాల లైసెన్స్‌ల జారీ, సొసైటీ ఏర్పాటులో అండగా నిలిచిందని చెప్పారు. గౌడ కులస్తులను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తాండూరులో గౌడ్ల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గాను గతంలోనే 2 ఎకరాల భూమి ఇచ్చామన్నారు. భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశామని స్పష్టంచేశారు. ఈ నిధులు సరిపోకపోతే జెడ్పీ, ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు పింఛను, చెట్టు పన్ను మాఫీ తదితర సహకారాలు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. ప్రజల దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ నేత విశ్వనాథ్‌గౌడ్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో గౌడ కులస్తులకు ఏనాడూ కాంగ్రెస్ పార్టీ గజం స్థలం ఇవ్వలేదని, ఆర్థికంగా ఆదుకున్న దాఖలాలు కూడా లేవని విమర్శించారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్ మాట్లాడుతూ.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే గౌడ్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి చేయూతనివ్వాలని కోరారు. అలాగే ఎక్సైజ్ దాడులను, బెల్టు షాపులను అరికట్టాలన్నారు. అంతకు ముందు పట్టణంలో గౌడ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యాద కృష్ణమూర్తి, కరణం పురుషోత్తంరావు, నారాయణరెడ్డి, రాందాసు, రవిగౌడ్, సాయిలుగౌడ్, హరిగౌడ్, నారాయణగౌడ్, సంతోష్‌గౌడ్, వరప్రసాద్‌గౌడ్, రాకేష్‌గౌడ్ పాల్గొన్నారు. -
సర్వాయి పాపన్న అందరివాడు
హైదరాబాద్: బహుజన విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న అందరివాడని, కొన్ని వర్గాలకే పరిమితం చేస్తే ఆయన స్ఫూర్తి దెబ్బతింటుందని ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం చిక్కడపల్లిలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, మన తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న 368 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బూర మాట్లాడుతూ.. గెరిల్లా తరహాలో యుద్ధం చేసి 12 కోటలను కైవసం చేసుకున్న గొప్ప వీరుడు పాపన్న అని పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటుకు, పాపన్న చరిత్రను పాఠ్యాంశంలో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు. గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ ఈడ శేషగిరి రావుగౌడ్, కన్వీనర్ వెంకన్నగౌడ్, వర్కింగ్ చైర్మన్ నారాయణగౌడ్ పాల్గొన్నారు. -
గీత కార్మికుల అభివృద్ధికి కృషి : ఎంపీ కవిత
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : గీత కార్మికుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం వినాయక్‌నగర్‌లో విజయలక్ష్మిగార్డెన్లో గీత కార్మికులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కల్లు దుకాణాలను తెరిపించుకుందామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారన్నారు. తెలంగాణ ఏర్పడగానే 767 జీవోను రద్దు చేశారని ఎంపీ పేర్కొన్నారు. ఇది సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రమాదవశాత్తు గీత కార్మికుడు చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారని, అంతేకాకుండా 2014 నాటికి రూ.9కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలు కూడా చెల్లించామన్నారు. గౌడ సొసైటీల ఐదేళ్ల రెన్యూవల్‌ను 10 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 35 లక్షల మేర గీత కార్మికులకు ప్రయోజనం చేకూరిందన్నారు. హైదరాబాద్‌లో ఐదు ఎకరాల్లో గౌడ భవనం నిర్మానానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందేనన్నారు. గ్రామాల్లో మూడేళ్లలో 5 కోట్ల ఈతచెట్లను నాటారన్నారు. గీతవనాల దగ్గర మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు బోర్లు, డ్రిఫ్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించారని, గౌడ కులస్తులు కోరారని ఎంపీ నిధుల కింద కేటాయిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.75 లక్షలు, రెండవ గౌడ సంఘం భవనంకు రూ.25 లక్షలు, గౌడ సంఘం కళ్యాణ మండప నిణ్మానికి రూ.కోటి50లక్షల ఎంపీ కవిత మంజూరు చేశారు. టీఆర్ఎస్లో చేరిన గౌడ కులస్తులు ఎంపీ సమక్షంలో గౌడ కులస్తులు టీఆర్ఎస్లో చే రారు. నిజామాబాద్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షు డు జగన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయ ణగౌడ్, ఉపాధ్యక్షులు రమేశ్‌గౌడ్, గోవర్ధన్గౌడ్లు టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ పట్టణంలోని 24 తర్పాలు, సంఘాల కార్యవర్గలు, సభ్యులు మొత్తం టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు బోనాలతో స్వాగతం పలికారు. ఎంపీ బోనం ఎత్తకుని నడిచా రు. మదర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్ ఆకుల సుజాత, ఎస్ఎస్ఆర్ కళాశాల అధినేత మారయ్యగౌడ్, లక్ష్మన్‌గౌడ్, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేటర్లు సూదం లక్ష్మి పాల్గొన్నారు. రూ.4 వేల కోట్లతో మత్స్యపరిశ్రమ అభివృద్ధి నిజామాబాద్ నాగారం: రాష్ట్రంలో రూ.4వేల కోట్ల మత్స్యపరిశ్రమ అభివృద్ధికి పనిచేస్తున్నామని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవనంలో గంగపుత్రుల నగర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాల్గొని మాట్లాడారు. గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం వెన్నంటే ఉంందన్నారు. ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. ఉచితంగా చేపపిల్లలను అందించడం జరిగిందని ఇది గంగపుత్రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. చేపపిల్లల ఉçత్పత్తి కేంద్రాలు జిల్లాలో ఉన్నాయని రాష్ట్రానికే జిల్లా ఆదర్శంగా ఉందన్నారు. అంతేకాక గంగపుత్రులకు చేపలు విక్రయించేందుకు మార్కెట్లు ఏర్పాటు చేస్తామని, రూ.30, రూ.40లక్షల వరకు కేటాయించి భవనాలు నిర్మిస్తామన్నారు. చేపలు విక్రయించేందుకు ఐయిస్బాక్సులతో కూడిన వాహనాలు అందిస్తామన్నారు. మహిళ మత్స్యకార సొసైటీల్లో మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న పన్నులు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రమాద బీమాను త్వరగా అందించేవిధంగా చూస్తామన్నారు. జీవో నం.98ని ప్రక్షాళన చేసి జీవో నం.6ను రద్దు చేస్తు జీవో నం.74ను అ మలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మహారాష్ట్ర లోని నిజామాబాద్ జిల్లాలో గంగపుత్రులు అత్యధికంగా జనాభా ఉందన్నారు. గురుకులాల్లో, క ళాశాలల్లో చేపలు పోషకారహారంగా అందించేం దుకు కృషి చేస్తామన్నారు. వరంగల్‌లో ఉన్న మ త్స్యశాఖ శిక్షణ కేంద్రం మాదిరిగానే నిజామాబాద్‌లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాత, గంగపుత్ర సం ఘం జి ల్లా ప్రతినిధులు మాడవేటి వినోద్‌కుమార్, నగర అధ్యక్షుడు అన్నయ్య, ప్రధానకార్యదర్శి రవి పాల్గొన్నారు. -
ఖాదీ బోర్డులోకి కల్లుగీత
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి తప్పించి ఖాదీబోర్డుకు అప్పగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణ గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావుగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన సభలో ఉత్తమ్ మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందిస్తామన్నారు. గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి గ్రామీణ ఖాదీ బోర్డు పరిధిలోకి మారుస్తామన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు బడ్జెట్లలో సుమారు రూ.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. అయితే బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికలు సమీపించిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బీసీలపై కపటప్రేమ చూపిస్తున్నా రని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని, సీఎం కుర్చీ నుంచి కేసీఆర్ దిగే సమయం కూడా వచ్చిందని, ఈ తరుణంలో బీసీ సబ్‌ప్లాన్ గురించి మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి.. బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో 50 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ–ఈలో ఉన్న ముస్లింలకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మిగిలిన బీసీ వర్గాల డిమాండును ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. బీసీల్లోని ఏబీసీడీ వర్గాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీనవర్గాలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకి అని ఆయన ఆరోపించారు. గీత కార్మికుల వృత్తి సమస్యలపై సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి సంపూర్ణ అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో గౌడ కులస్తులు, గీత కార్మికుల సమస్యలను పెడతామని, వాటి పరిష్కారానికి అధికారంలోకి వచ్చిన వెంటనే కృషిచేస్తామని హామీ ఇచ్చారు. గీత సహకార సంఘాలను ప్రోత్సహించడానికి వనాలను పెంచుతామని, వాటికోసం భూమిని కేటాయిస్తామని చెప్పారు. అలాగే లైసెన్సుల కాల పరిమితిని పెంచుతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 10 ఎకరాల భూమిని, 20 వేల కోట్ల నిధులను కేటాయిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. గీత పారిశ్రామిక ఆర్థిక సంక్షేమ సంస్థకు నిధులు ఇవ్వకుండా, పాలకవర్గాన్ని నియమించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించి, గీత కార్మికులకు ఆధునిక యంత్రాలను సమకూరుస్తామని అన్నారు. గౌడ విద్యార్థుల హాస్టల్ కోసం 10 ఎకరాలు కేటాయిస్తామన్నారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ లేదా హైదరాబాద్‌లో మరేదైనా ప్రసిద్ధమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నారు. కల్లుగీత కార్మికులకు రాజకీయంగా కూడా అవకాశాలను ఇస్తామన్నారు. గౌడ కులస్తులు ఆదినుంచీ కాంగ్రెస్‌తోనే: షబ్బీర్ అలీ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ గౌడ కులస్తులు మొదటినుంచీ కాంగ్రెస్‌పార్టీతోనే ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ అలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ నేత మధు యాష్కీ మాట్లాడుతూ రాజకీయంగా తనకు అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. దీనికోసం అంతా అంకితభావంతో పనిచేయాలన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కులస్తులకు ఎంతోమందికి రాజకీయంగా అవకాశం కాంగ్రెస్ పార్టీతోనే వచ్చిందన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా కాంగ్రెస్‌పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్లమెంటు, శాసనసభకు పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా అవకాశాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బండి నర్సాగౌడ్, బూడిద భిక్షమయ్యగౌడ్, రామారావుగౌడ్, ఇందిరా శోభన్ తదితరులు పాల్గొన్నారు. -
18న పాపన్న జయంతి
రామాయంపేట: అన్ని గ్రామాల్లో ఈనెల 18న సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని గౌడ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిష్టాగౌడ్, జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి మధునాల స్వామీగౌడ్, మండలశాఖ ప్రతినిధులు మధునాల సిద్దరాంలుగౌడ్, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ , శంకర్‌గౌడ్ తదితరులు మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.18న రామాయంపేటలోని ఎల్లమ్మ ఆలయంవద్ద ప్రతిష్టించిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాంవద్ద వివిధ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామాలవారీగా జయంతివేడుకలు జరుపుకోవాలని, ఇందుకుగాను గ్రామాల్లోఉన్న సంఘం యువత, మహిళా విభాగం, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు సూచించారు.