నిజామాబాద్ నగరంలో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎంపీ కవిత
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : గీత కార్మికుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం వినాయక్‌నగర్‌లో విజయలక్ష్మిగార్డెన్‌లో గీత కార్మికులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గౌడ కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో కల్లు దుకాణాలను తెరిపించుకుందామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారన్నారు. తెలంగాణ ఏర్పడగానే 767 జీవోను రద్దు చేశారని ఎంపీ పేర్కొన్నారు. ఇది సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రమాదవశాత్తు గీత కార్మికుడు చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారని, అంతేకాకుండా 2014 నాటికి రూ.9కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలు కూడా చెల్లించామన్నారు.
గౌడ సొసైటీల ఐదేళ్ల రెన్యూవల్‌ను 10 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 35 లక్షల మేర గీత కార్మికులకు ప్రయోజనం చేకూరిందన్నారు. హైదరాబాద్‌లో ఐదు ఎకరాల్లో గౌడ భవనం నిర్మానానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందేనన్నారు. గ్రామాల్లో మూడేళ్లలో 5 కోట్ల ఈతచెట్లను నాటారన్నారు. గీతవనాల దగ్గర మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు బోర్లు, డ్రిఫ్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించారని, గౌడ కులస్తులు కోరారని ఎంపీ నిధుల కింద కేటాయిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ.75 లక్షలు, రెండవ గౌడ సంఘం భవనంకు రూ.25 లక్షలు, గౌడ సంఘం కళ్యాణ మండప నిణ్మానికి రూ.కోటి50లక్షల ఎంపీ కవిత మంజూరు చేశారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన గౌడ కులస్తులు
ఎంపీ సమక్షంలో గౌడ కులస్తులు టీఆర్‌ఎస్‌లో చే రారు. నిజామాబాద్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షు డు జగన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయ ణగౌడ్, ఉపాధ్యక్షులు రమేశ్‌గౌడ్, గోవర్ధన్‌గౌడ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్ పట్టణంలోని 24 తర్పాలు, సంఘాల కార్యవర్గలు, సభ్యులు మొత్తం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమెకు బోనాలతో స్వాగతం పలికారు. ఎంపీ బోనం ఎత్తకుని నడిచా రు. మదర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వి.జి.గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్ ఆకుల సుజాత, ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల అధినేత మారయ్యగౌడ్, లక్ష్మన్‌గౌడ్, టిఆర్‌ఎస్‌వి జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేటర్లు సూదం లక్ష్మి పాల్గొన్నారు.
రూ.4 వేల కోట్లతో మత్స్యపరిశ్రమ అభివృద్ధి
నిజామాబాద్ నాగారం: రాష్ట్రంలో రూ.4వేల కోట్ల మత్స్యపరిశ్రమ అభివృద్ధికి పనిచేస్తున్నామని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవనంలో గంగపుత్రుల నగర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాల్గొని మాట్లాడారు. గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం వెన్నంటే ఉంందన్నారు. ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. ఉచితంగా చేపపిల్లలను అందించడం జరిగిందని ఇది గంగపుత్రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. చేపపిల్లల ఉçత్పత్తి కేంద్రాలు జిల్లాలో ఉన్నాయని రాష్ట్రానికే జిల్లా ఆదర్శంగా ఉందన్నారు.
అంతేకాక గంగపుత్రులకు చేపలు విక్రయించేందుకు మార్కెట్‌లు ఏర్పాటు చేస్తామని, రూ.30, రూ.40లక్షల వరకు కేటాయించి భవనాలు నిర్మిస్తామన్నారు. చేపలు విక్రయించేందుకు ఐయిస్‌బాక్సులతో కూడిన వాహనాలు అందిస్తామన్నారు. మహిళ మత్స్యకార సొసైటీల్లో మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న పన్నులు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రమాద బీమాను త్వరగా అందించేవిధంగా చూస్తామన్నారు. జీవో నం.98ని ప్రక్షాళన చేసి జీవో నం.6ను రద్దు చేస్తు జీవో నం.74ను అ మలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మహారాష్ట్ర లోని నిజామాబాద్ జిల్లాలో గంగపుత్రులు అత్యధికంగా జనాభా ఉందన్నారు. గురుకులాల్లో, క ళాశాలల్లో చేపలు పోషకారహారంగా అందించేం దుకు కృషి చేస్తామన్నారు. వరంగల్‌లో ఉన్న మ త్స్యశాఖ శిక్షణ కేంద్రం మాదిరిగానే నిజామాబాద్‌లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, మేయర్ ఆకుల సుజాత, గంగపుత్ర సం ఘం జి ల్లా ప్రతినిధులు మాడవేటి వినోద్‌కుమార్, నగర అధ్యక్షుడు అన్నయ్య, ప్రధానకార్యదర్శి రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment